రైతుని పట్టిన 🐊రుణమకరాన్ని🐊 వదిలించవే మకర సంక్రాంతీ!!🙏🙏
అందరికీ
సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా రైతన్నలకీ, నేతన్నలకీ. రైతుల పంటలకి మంచి ధరలు పలికి, జనం (మనం) కొనుక్కునే బట్టల్లో ఓ 25% చేనేత బట్టలే కొనుక్కునీ వాళ్ళ సంక్రాంతిలో కొత్త కాంతి నింపాలని కోరుకుంటూ … వాళ్ళ ఋణాలు
(పార్టీలకి అతీతంగా) 100% మాఫీ అయిపోయి మళ్ళీ వాళ్ళు అప్పులు చెయ్యాల్సిన అవసరం రాకూడదని ఆశ (దురాశా?) పడుతూ …


🐄🐂🐃 🌾🌾🌴🌴🌳🌳🌿🌿🎋🎋🐄🐂🐃

7 thoughts on “రైతుని పట్టిన 🐊రుణమకరాన్ని🐊 వదిలించవే మకర సంక్రాంతీ!!🙏🙏

 1. నీహారిక

  నందితాదాస్, స్మితాపాటిల్ లాంటి హీరోయిన్ లు కట్టుకున్న చీరలు చూసి అటువంటి చేనేతలే కొనుక్కోవాలి అనుకుంటాను మామూలు చీరలే వేలల్లో ఉంటాయండీ ! వాళ్ళు వేసుకోబట్టి ఆ చీరలు అందంగా ఉంటాయా లేక చేనేతే అందంగా ఉంటుందో చెప్పడం కష్టం కానీ ధరలు మాత్రం మాకు అందుబాటులో ఉండవు. బయట మార్కెట్ లో అమ్మే ధరకీ, తయారీదారుకిచ్చే కూలీకీ సమన్యాయం జరిగేవరకూ కొత్తగా కాంతులేవీ ఉండవు.

  భోగి శుభాకాంక్షలు !

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   నీహారికగారూ! ఈ పోస్టుకి మొదటగా మీ స్పందనే వస్తుందనుకున్నా. గ్రేట్!
   మీ పాయింటు కరెక్టు. అసలు సమస్య దళారీ వ్యవస్థ అని విన్నాను.

   Like

   Reply
 2. విన్నకోట నరసింహారావు

  దళారీల వ్యవస్ధ గురించి మీకు తెలిసినదేగా. మరి అటువంటప్పుడు మీది … దురాశే … సందేహమేముంది? అయినప్పటికీ భారతదేశ రాజకీయాల పట్ల సడలని మీ ఆశావాదం మెచ్చుకోదినది 🙏.
  // “కొనుక్కునే బట్టల్లో ఓ 25% చేనేత బట్టలే కొనుక్కునీ ….” //. ప్రశస్తమైన ఆలోచన 👌. అయితే నీహారిక గారన్నట్లు ధరలు మాబోంట్లకు ఏమాత్రం అందుబాటులో ఉంటాయన్నది ప్రశ్న. ఒకప్పుడు ఖాదీ గురించి నేను ఇలాగే ఫీలయిపోయి ఖాదీ షాపులోకి వెళ్ళాను. ఆ ధరలు చూసి మతిపోయింది (మరీ ముతకఖద్దరు కాదు, ఓపాటి సన్నబట్ట గురించి నేననేది). సరే, ఖాదీకు రాజకీయనాయకులు మహారాజ పోషకులు కదా, కాబట్టి మనకు అందుబాటులో ఉండవులే అనుకున్నాను. కానీ ఈమధ్య కాలంలో ఆ ఆదరణ కూడా తగ్గుతున్నట్లుంది, రాజకీయ నాయకులు కూడా సూట్లు బూట్లు వేసుకుని తిరుగుతున్నారుగా … కార్పొరేట్ కల్చర్ దేశాన్ని ఆవహించిన తరవాత. సర్లెండి, పండగ పూట కూడా ఎందుకు నాకీ కంఠశోష.
  సంక్రాంతి శుభాకాంక్షలు 🌾.

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   వీఎన్నార్ సార్, మీరు నీహారిక గారు చెప్పిన పాయింట్ల మీద ఇంకో టపా వెయ్యచ్చేమో , అప్పుడు డిస్కస్ చేద్దాము. మీరన్నట్టు పండగ పూట ఘంట✍శోష / కీ-బోర్డు శోష ఎందుకులెండి.
   మీ అందరికీ శుభాకాంక్షలు 😊

   Like

   Reply
 3. అన్యగామి

  మిత్రులు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.

  Like

  Reply

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s