ముళ్ళపూడి వెంకటరమణగారి అప్పుల అప్పారావు చెప్పిన ఫేమస్ డైలాగుల్లో ఒకటి – “సూర్యుడెందుకు ఉదయిస్తాడు? నదులెందుకు ప్రవహిస్తాయి? వెన్నెలెందుకు కాస్తుంది? అందుకే అప్పారావు అప్పులు చేస్తాడు,” అనేది. రాజబాబు నోటఎంచక్కా పలికిన యూనివర్సల్ ఫాక్ట్ .
అప్పులు చెయ్యడం అనేది ప్రకృతి సహజధర్మాల్లో ఒకటని అర్ధం చేసుకోడానికి ఇంతకంటే సహజమైన సులభమైన వివరణ ఎక్కడా లేదేమో? కానీ ప్రకృతి ఒడిలో మైమరిచిపోయే క్షణాల్లో మనిషికి, అందులోనూ తెలుగు మనిషికి ‘కలాపోసన’ ఆటోమేటిగ్గా వచ్చేసే అసంకల్పిత ప్రతీకార చర్య. అప్పారావుకి అప్పులు చెయ్యడం ఎంత సహజమో అంత సహజమైన విషయం అది. ఆ కలాపోసనలో భాగంగా భలే భలే అందాలూ సృష్టించావూ, ఇలా మురిపించావూ అంటూ దేవుణ్ణి గుర్తు చేసుకుంటాం, అసలెందుకు ఇవన్నీ ఇలా ఇంతందంగా… అంటూ భావావేశం ప్రకటించుకుంటాం. దాంతోపాటు కాస్త భావకవిత్వం ప్రవహించే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇంచుమించు అలాంటి అసంకల్పిత ప్రతీకార చర్యల్ని ప్రేరేపించినా కొన్ని దృశ్యాలు నిన్న చూశాను, మా Sungei Buloh mangroves
(మడ అడవి) లో. ఆ చూడ్డంలో సూర్యుణ్ణి రోజూ ఉదయించమని తొందరపెట్టే అర్జెంట్లూ వారెంట్లూ ఏంటో తెలిసిందనిపించింది.
అప్పారావు అప్పులకి, నదులు ప్రవహించడానికీ, వెన్నెల కాయడానికీ ,… కూడా ఇలాంటివే ఏవో కారణాలుండచ్చు. అవేంటో తర్వాత చూద్దాం. ముందు పెత్యక్ష నారాయుడి పొద్దు పొడుపు హడావిడి ఏంటో, ఎందుకో చూద్దాం.
ప్రభాత కిరణాలతో అలల ని స్పృశించాలనే ఆరాటంతో …
ఇబిరిత (Hornbill) పక్షి రెక్కల అంచుల గుండా ప్రసరించి కొత్త కాంతులు సంతరించుకోవాలనీ ...రంగు రంగుల తూనీగల రెక్కలపై నర్తించలే ని వెలుగులు వెలుగులా ? అనీ ... అలలపైనా , గాలి తెరలపైనా జరిగే తెల్ల కొంగల బాలె (ballet)కి తొలికిరణాల వేదిక నిర్మించాలనీ ….
ప్రభాత కిరణాలతో అలల ని స్పృశించాలనే ఆరాటంతో …
ఇబిరిత (Hornbill) పక్షి రెక్కల అంచుల గుండా ప్రసరించి కొత్త కాంతులు సంతరించుకోవాలనీ ...
రంగు రంగుల తూనీగల రెక్కలపై నర్తించలే ని వెలుగులు వెలుగులా ? అనీ ...
అలలపైనా , గాలి తెరలపైనా జరిగే తెల్ల కొంగల బాలె (ballet)కి తొలికిరణాల వేదిక నిర్మించాలనీ ….
ప్రత్యక్ష నారాయుడు ప్రతిరోజూ పరిగెత్తుకొస్తాడనిపించింది.
His own mornings are new surprises to God అంటాడు విశ్వకవి Stray Birds అనే పద్య సంకలనంలో. అవును కదా? ఈ చరాచర సృష్టి అంతటినీ సృష్టించడానికి సృష్టికర్తకి ఇంతకంటే కారణం కావాలా? జరామరణ చక్రాన్నీ, అందులో పడి కొట్టుమిట్టాడడా నికి మనుషుల్నీ సృష్టించి ప్రతిక్షణం చూసిన సినిమానే చూడ్డానికి దేవుడేమన్నా తెలుగు సినిమా మేకరా?
శ్రీకృష్ణుడు భగవద్గీతలో జరగబోయేదీ నాకు తెలుసు జరిగేదీ నాకు తెలుసు అంటాడు. జరగబోయేది ఆయనకి ఎలా తెలుసా అని చాలా రోజులు ఆలోచించాను. సృష్టిలో ఎవరు పుట్టినా వారి వారి పుట్టిన సమయం,ప్రాంతం,తేదీ ప్రకారం కొన్ని లక్షణాలు కలిగి ఉన్న ఒక అల్గారిధం కనిపెట్టారేమో అనిపిస్తుంది. ఆ ధీసెస్ మనకి అర్ధం అయితే మనం కూడా చుట్టూ ఉన్నవారి జీవితాలను చూసి బోర్ కొట్టకుండా చూసి ఆనందించవచ్చు.అందరం చేసే పనులు ఒకటే కానీ జీవితాలు ఒకటి కావు.మీరు సూర్యోదయాలని ఎంచక్కా ఆశ్వాదిస్తున్నారు.మేము మీ ఫోటోలు ఆశ్వాదిస్తున్నాము.సూర్యుడు మాత్రం భలే ఫోజులిస్తున్నాడు.
LikeLike
నీహారికా మేడమ్ , చాలా రోజుల కిందట ఒక మిమిక్రీ ఐటం ఉండేది. అందులో శ్రీదేవి పడవలోంచి పడిపోతే సూపర్ స్టార్ కృష్ణ నీళ్ళలో దూకి ఆవిణ్ణి రక్షించేస్తారు. ఆ సాహసానికి రావు గోపాలరావు, నూతన్ ప్రసాద్ అందరూ తెగ మెచ్చేసుకుంటారు. అప్పుడు కృష్ణ గారు, “సాహసం లేదు, పాడూ లేదు ముందు నీళ్ళల్లోకి తొహ్సేసిందెవరో ఛెహ్ప్ఫల్ఢి,” అని తన “సాహసం” వెనక నిజం చెప్పకనే చెప్పేస్తారు. చాలామంది “ఆనందం”గా కనిపించేవాళ్ళు, I am one of them😀, ఫాలో అయ్యేది ఇలాంటి అల్గారిధమే !! హ!హ్హా !హ్హా ! !
Thank you so much for enjoying my photos. Cheers!!
LikeLike
“సృష్టిలో ఎవరు పుట్టినా వారి వారి పుట్టిన సమయం,ప్రాంతం,తేదీ ప్రకారం కొన్ని లక్షణాలు కలిగి ఉన్న ఒక అల్గారిధం కనిపెట్టారేమో అనిపిస్తుంది. ఆ ధీసెస్ మనకి అర్ధం అయితే మనం కూడా చుట్టూ ఉన్నవారి జీవితాలను చూసి బోర్ కొట్టకుండా చూసి ఆనందించవచ్చు”
మీ ఈ మాటలు నాకు భలే నచ్చాయండి, నీహారికా! – Thought provoking!
LikeLike
మీరు హైదరాబాద్ వచ్చి కూడా ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయినందుకు మీతో మాట్లాడదలుచుకోలేదు. ఏదో పొగిడారు కదా అని వ్రతభంగం చేస్తున్నా 😋
ధన్యవాదాలు !
LikeLike
“సృష్టిలో ఎవరు పుట్టినా వారి వారి పుట్టిన సమయం,ప్రాంతం,తేదీ ప్రకారం కొన్ని లక్షణాలు కలిగి ఉన్న ఒక అల్గారిధం కనిపెట్టారేమో అనిపిస్తుంది. ఆ ధీసెస్ మనకి అర్ధం అయితే మనం కూడా చుట్టూ ఉన్నవారి జీవితాలను చూసి బోర్ కొట్టకుండా చూసి ఆనందించవచ్చు”
మీ ఈ మాటలు నాకు భలే నచ్చాయండి, నీహారికా! – Thought provoking!
LikeLike
ఈ పులుగు లిన్నింటి కింతటి వెలుగు చూపి
మీనులను పురుగులను చంపి తినుటకు
కర్మ సాక్షి సాక్షి యగుట ఘనత , యకట !
ధర్మ మీరీతి తగలడె తలకొక విధి .
LikeLike
పద్యం చివరి పాదంతో – ప్రకృతికి సంబంధించినంత వరకూ – ఏకీభవించలేకపోతున్నాను మాస్టారూ!!😊🙏
LikeLike
ప్రకృతిని చిత్రించు కరములు కరములు 👏
(కెమేరా పట్టుకునే మీ చేతుల గురించే చెప్పేది 🙂)
LikeLike
VNR Sir!! నెనరులు.
పద్యానికి మొదటి పాదం మాత్రం ఇచ్చారు. తక్కిన మూడూ పూరించడానికి జిలేబిగారు బిజీగా వున్నారో, బీ లేజీ అనుకుని బ్రేక్ తీసుకున్నారో తెలియట్లేదు. ఇప్పుడెలా?
LikeLike
పద్యం ప్రారంభం అదిరింది . ఇక అల్లుక పోవడమే తరువాయి . విన్నకోటి వారు విబుధులు కదా ! …..
LikeLike
ధన్యవాదాలు 🙏. మీ అభిమానం మీచేత అలా పలికించింది కానీ నాలో లేని గొప్పతనాన్ని నాకు ఆపాదించకండి మాస్టారూ.
పద్యాన్ని మీరు పూర్తి చేశారు, బాగుంది. పూర్తి పద్యం కోసం వైవీఆర్ గారు కోరిన కోరికా తీరింది 👏.
LikeLike
మనకు (అంటే నాకు ) అంతకు మించి టాలెంట్ లేదే.
“జిలేబి” గారు “బి లేజీ” అనుకోవడమా …. తమిళుల ఊతపదం వాడాలంటే … ఛాన్సే లేదు. మరి కొన్ని రోజులు చూద్దాం
LikeLike
ప్రకృతిన్ చిత్రించు వరములు కరములు
చేసేత కేమెరా చెలగు కతన
తనర ప్రకృతి మీద తలపులు తలపులు
చిత్తమందాసక్తి చెలగు కతన
కడు హృద్యముగ జెప్పు కథనమ్ము కథనమ్ము
తెలుగుపై పట్టున్న ధిషణ కతన
వ్యంగాస్త్రముల్ విడుచు విఙ్ఞత విఙ్ఞత
హ్యూమరు దండిగా నుండు కతన
ఇటుల గడిదేరి వైవిరామ్ పటుల చటుల
నిటల ఘటనా ఘటన వినిర్ఘటన ఘటిత
పోష్టులు వెలార్చు , పాఠకుల్ మగుడ మగుడ
వొగడ , బొగడొందు నెంతయు నగడితముగ .
LikeLike
చిన్నప్పుడు తెలుగు పాఠాల్లో, “ఫలానా కవి శైలీ, పదగుంభనము సరళముగానూ, మధురముగానూ వుండును,” అంటూ వాటి అర్ధాలు తెలీకుండా బట్టీలు వేసేవాళ్ళం. మీ పద్యాలు చదువుతుంటే ఆ అర్ధాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. ఎంత అందంగా నడిచిందో ఈ పద్యం. మీరు నన్ను మెచ్చుకోవడం మీ వాత్సల్యం🙏, నా అదృష్టం🙏. పద్యం మటుకు రసరమ్యం.
LikeLike
నాదేముంది సార్ ,
ఇన్పిరేషన్ మన పెద్దాయన వీ యన్ ఆర్ సారు ,
మరియు తమలోని గొప్పదనమున్నూ . అల్లుక
పోవడమే ఈ సాలీడు పనితనం .
అయినా ,
తమరేమీ అనుకోనంటే ,
‘ పదగుంభనం ‘ సరి కాదనుకుంటా .
‘ పదగుంఫనం ‘ అనాలేమో ,
ఏమో మరి ! పెద్దలు సెలవియ్యాలె .
LikeLike
నాదేముంది సార్ ,
ఇన్పిరేషన్ మన పెద్దాయన వీ యన్ ఆర్ సారు ,
మరియు తమలోని గొప్పదనమున్నూ . అల్లుక
పోవడమే ఈ సాలీడు పనితనం .
అయినా ,
తమరేమీ అనుకోనంటే ,
‘ పదగుంభనం ‘ సరి కాదనుకుంటా .
‘ పదగుంఫనం ‘ అనాలేమో ,
ఏమో మరి ! పెద్దలు సెలవియ్యాలె .
LikeLike
మాస్టారూ! ఒక మొట్టికాయ వేసి మరీ పదగుంఫనము అని నా చేత ఇంపోజిషన్ రాయించగల స్థాయి మీది. అంత మొహమాట పడకండి.🙏😊
LikeLike
లెస్స పలికితిరి YVR గారూ 👌. నిజమే, మాస్టారు గారికి మొగమాటం ఒక పాలు ఎక్కువే అనిపిస్తోంది.
LikeLiked by 1 person
YVR గారూ, ఇవాళ్టి (Fri 21-12-2018) Deccan Chronicle (Hyderabad) వార్తాపత్రిక యొక్క supplement Hyderabad Chronicle మొదటి పేజ్ లో The Bird Whisperers అని ఒక ఫొటో వ్యాసం వచ్చింది. మీరు విహంగ ప్రేమికులు కాబట్టి ఈ వ్యాసం మీకు ఆసక్తికరంగా ఉండవచ్చు 👇. Happy reading 👍.
http://epaper.deccanchronicle.com/articledetailpage.aspx?id=12112603
LikeLike
థాంక్యూ సర్! వీఎన్నార్ గారూ! ప్రకృతిని చూడగానే మీకు నేను గుర్తుకి రావడం నాకెంతో ఆనందం కలిగిస్తోంది.🙏😊
LikeLike
YVR గారూ,
నిన్న మీకొక వ్యాఖ్య పంపించాను …. నిన్నటి అంటే శుక్రవారం 21-12-2018 నాటి Deccan Chronicle (Hyd) వార్తాపత్రిక లోని Hyderabad Chronicle supplement లో మొదటి పేజ్ లో The bird whisperers అని ఒక ఫొటో వ్యాసం కనిపిస్తే మీకు ఆసక్తికరంగా ఉండచ్చని లింక్ జత చేశాను. అందిందా ? నా న్యాఖ్య మీ బ్లాగ్ లో కనపడడం లేదని, అందలేదేమోనని మళ్ళీ లింక్ ఇక్కడ ఇస్తున్నాను 👇.
https://www.deccanchronicle.com/lifestyle/pets-and-environment/211218/the-bird-whisperers.html
LikeLike
YVR garu! The second picture (Hornbill’s) is very beautiful! A feast to the eyes!
LikeLike
లలితగారూ, మెనీ ధాంక్స్🙏😊
LikeLike