ఒక ఉదయం వాక్‌లో కనిపించిన ఆ దృశ్యం నా కెమెరాకి పని చెప్పింది. ఆ పైన నా స్మార్ట్-ఫోనుకీ పని చెప్పి – “గడ్డి పరకలు నేలతో స్నేహాన్ని కోరుకుంటే చెట్టు ఏకాంతం కోసం ఆకాశంలో వెతుకుతుందిట,” – అనే ఆ రెండు వాక్యాలూ రాయించింది.
సొంతకవిత్వం కాదు. టాగోర్ తన ఆలోచనల్ని హైకూల్లాంటి చిన్న చిన్న పద్యాలుగా కూర్చి పేర్చిన పుస్తకం, స్ట్రే బర్డ్స్ నుంచి తీసుకున్నా. తీసుకుని, ఆ ఫోటోకి అతికించి మా కాలేజ్ గ్రూపులో గుడ్మాణింగ్ మెసేజిగా పోస్ట్ చేశా, నిన్న. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల ఆకులు నీలాకాశాన్ని స్పృశిస్తూ టాగోర్ మనసులో వున్నది నిజం అంటున్నట్టున్నాయి కదా!!
వెంటనే ఒక ఫ్రెండు రెస్పాన్స్ వచ్చేసింది – “అంటే, నువ్వు పెద్దవాడివైపోయాకా ఏకాంతం కోరుకుంటావా?,” అంటూ. “ఏదో కోట్ బావుంది కదా అని వాడేశాను, గురూ! ఈ ప్రశ్నతో ఇప్పుడు పెద్దపనే పెట్టావ్!,” అ(నుకు)న్నా. అన్నానే కానీ ఆలోచించకుండా ఆగగలనా? అం’తరంగాలు’ 🌊ఎగయకుండా🌊 ఆపగలనా? అసలీ ఆలోచన విశ్వకవికి ఎందుకు, ఏ సందర్భంలో మెదిలి ఉంటుందో ఊహించడం మొదలెట్టా. Here👇are my thoughts🤗 —
On a lighter note,
In Tagore’s view grass must be feminine and the tree masculine. That’s why he referred to grass and tree as ‘her’ and ‘his’ respectively. Not because Tagore wants to prove man’s superiority over woman. A man of Tagore’s stature can never think, speak, write or act that way. He saw woman’s gregarious nature in grass and in the tree, he saw man’s aloofness.
On a heavier note,
the attributes of both grass and tree can actually be found within one personality irrespective of the person’s gender. During youth one needs to be worldly and socialize; as the mind keeps maturing, the solitude becomes automatic. One can be in the middle of action with the mind completely detached from the results.
వాటిని అలాగే గ్రూపులో పోస్ట్ చేసేశా .
దీనికి ఒక స్పందన ఇలా వచ్చింది –
“ఒక గడ్డి పరక తుఫాన్లనీ, వరదల్నీ ఎదుర్కొని తిరిగి కోలుకుంటుంది. అదే ఒక చెట్టుకి సాధ్యం కాదు. తుఫానుని తట్టుకుని నిలబడనైనా నిలబడుతుంది లేదా కూలిపోతుంది. కూలకుండా నిలబడినా ఎంతో కొంత దెబ్బ తినకుండా ఉండదు. అహంకారం చూపించడం తెలియని గడ్డి పరక వరద ఉధృతికి వినయంగా తలవంచి, వరద తగ్గగానే తిరిగి నిలబడుతుంది. నేను మహావృక్షాన్ని, నేను తలవంచడమేమిటి అన్న అహంకారం ప్రదర్శించే చెట్టు కూలిపోయే ప్రమాదానికి గురౌతుంది. గడ్డిపరకకీ, చెట్టుకీ ఉన్న ఇదే వైరుధ్యం స్త్రీ పురుష స్వభావాల్లోనూ కనిపిస్తుంది. జీవిత సంక్షోభాలని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు, అనివార్య పరిస్థితులతో రాజీపడి, అనుకూల దృక్పధంతో ముందుకు సాగే సామర్ధ్యం స్త్రీలో ఉన్నంతగా పురుషుడిలో ఉండదు. ఆమెలో సహజంగానే ఎక్కువగా వుండే క్షమాగుణం, సహనం, వినయం, అహంకార రాహిత్యం ఆమెకి అనుకూలించి సహకరిస్తాయి.”
నిజం కదా !!! ఎంత మంచి స్పందన అనిపించింది.
ఇప్పుడు మరో స్పందన, ఇంకొక గ్రూప్ మెంబర్ నుంచి –
“టాగోర్ స్త్రీ సహజ స్వభావాలైన సున్నితత్వాన్ని, సౌకుమార్యాన్ని గడ్డికి , పురుష సహజాలైన దృఢత్వం, పట్టుదలలని చెట్టుకి ఆపాదించి ఉండచ్చు. కానీ, స్త్రీకానీ, పురుషుడు కానీ అవే స్వభావాలని పట్టుకుని వేళ్లాడాల్సిన పని లేదు. వయసుతో పాటు వైరాగ్యాన్ని పెంచుకోవాలనే రూలేం లేదు. అందరితో కలివిడిగా ఉంటూ వృద్ధాప్యంలో కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటున్న ఆడవాళ్ళని, మగవాళ్ళని కూడా ఎంతోమందిని మనం చూడొచ్చు. ఏకాంతం కోరుకున్నా, నలుగురి సాంగత్యాన్ని కోరుకున్నా అది వ్యక్తిగత ప్రాధాన్యాన్ని బట్టీనే కానీ అది స్త్రీయా, పురుషుడా అనే దానిపై ఆధారపడదు.”
ఇదీ నిజమే. ఈ భావనతోనే మొదట్లో రాసిన నా వ్యాఖ్యానంలో రెండు స్వభావాలనీ ఒకే వ్యక్తిత్వంలో చూడొచ్చని రాసాను. అయితే వివరణని కొంచెం పొడిగించాలనే ఉద్దేశంతో –
“నిజమే, సరళమైన గడ్డి స్త్రీ స్వభావాన్నీ, దృఢమైన చెట్టు పురుష ప్రకృతినీ ప్రతిబింబించి తీరాలని హార్డ్ అండ్ ఫాస్ట్ రూలేం లేదు కానీ టాగోర్ కాలం నాటికీ ఇప్పటికీ స్త్రీపురుష స్వభావాల విషయం ఎలా వున్నా వారి వారి వాక్స్వాతంత్రంలో, భావవ్యక్తీకరణలో చాలా తేడా వుంది. మన తాతల, అమ్మమ్మల కాలంలో కేవలం మగజన్మ ఆడ జన్మ కన్నా ఒక మెట్టు ఎక్కువనే నమ్మకం వల్ల కావచ్చు, కుటుంబ పెద్ద అనే స్టేటస్ వల్ల కావచ్చు లేదా సంస్కృతి-సంస్కారాల ప్రభావంతో అబ్బిన వైరాగ్య భావం వల్ల కావచ్చు మగవాళ్ళు, ముఖ్యంగా తండ్రులు కొంత ముభావంగా, దూరంగా, మితభాషులుగా, ఒక ప్రత్యేక స్థానంలో వుండేవాళ్ళు. మన తల్లితండ్రుల హయాంలో పరిస్థితి మారింది. ఉమ్మడి కుటుంబాలు తగ్గి వ్యష్టి కుటుంబాలు, వాటితోపాటు ఆర్ధిక స్వాతంత్రాలు పెరగడంతో కుటుంబ పెద్దకీ, ఇతర సభ్యులకీ మధ్య దూరం కూడా తగ్గి స్త్రీ-పురుష స్వభావాల్లో అంతరాలు కూడా తగ్గి ఉండచ్చు. మన జెనరేషన్ వచ్చేసరికి ఇంకా మార్పు వచ్చింది,” అన్నాను.
ఇక్కడితో డిస్కషన్ ఆగింది. అందరూ ఆఫీసుల్లో, పనుల్లో పడి బిజీ అయిపోవడంతో.
ఏ వందేళ్ల కిందటో విశ్వకవి మదిలో రెక్కలు విప్పిన స్ట్రే-బర్డ్స్ మా స్నేహితుల ఆలోచనల ఆకాశంలో ఇలా విహరించడం, మా అం’తరంగాల్ని’ కదిలించి ఆలోచనల్ని రేకెత్తించడం చక్కటి అనుభూతినిచ్చింది.
Felt like sharing a Haiku I wrote…
“Roots embrace the earth
Branches spread high to the sky
Growth happens quietly ”
Happy New Year!
LikeLike
… and the growth is the invisible bridge between heaven and earth.
థాంక్ యూ లలితగారు.
మీకూ Happy New Year. 😊
LikeLike
నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా చెప్పకుండా మమ్మల్ని వైరాగ్యంలోకి తోసేయాలని ప్రయత్నిస్తున్నారా ? నేనొప్పుకోను.
కుటుంబభారం మోసీ మోసీ అలసిపోతారేమో మగవారెక్కువగా వైరాగ్యం గురించి మాట్లాడుతారండీ !
వృద్ధాప్యంలో కూడా డబ్బు సంపాదించాలనే ఆశ ఉన్న వాళ్ళూ ఉన్నారనుకోండి. ఎంత డబ్బు సంపాదిస్తే స్వర్గంలో సీటు రిజర్వ్ చేసుకోగలరు ?
వైరాగ్యం,సన్యాసం ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ దేనికోసం ? ఏదీ వద్దండీ….మీ దగ్గరకి ఎవరైనా వచ్చి వైవీఆర్ గారూ నాకు ఈ సాయం చేసిపెట్టండి అంటే చేయడం, చేయలేకపోతే చేయలేనని మొహమాటం లేకుండా చెప్పేయడం, మీ చుట్టూ ఉన్న మమ్మల్ని ఎంటర్టైన్ చేయడం, ఎవరికీ ఏ హానీ చేయకుండా ఉండడం చేసారనుకోండి ప్రశాంతంగా ఉంటారు.
మీకూ మీ పక్షులకూ,మీ చుట్టూ ఉన్నవారికీ,మీ కుటుంబ సభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు .
LikeLike
//కుటుంబభారం మోసీ మోసీ అలసిపోతారేమో మగవారెక్కువగా వైరాగ్యం గురించి మాట్లాడుతారండీ !//
అవునండీ, అలిసిపోనప్పుడు వైరాగ్యం గురించి మాట్లాడే వాళ్ళు ఆల్మోస్ట్ నిల్లు.
నిజమైన సన్యాసికి, వైరాగ్యానికీ ఆమడదూరం అనిపిస్తుంది.
మా పక్షులు, ప్రకృతి, ఫామిలీ అందరి తరఫునా మీకూ, అందరు బ్లాగ్బంధువులకూ Happy New Year.
LikeLike
// “అనివార్య పరిస్థితులతో రాజీపడి, అనుకూల దృక్పధంతో ముందుకు సాగే సామర్ధ్యం స్త్రీలో ఉన్నంతగా పురుషుడిలో ఉండదు.” //
గడ్డిమొక్క, మహావృక్షం, తుపాను గురించి ఎన్ని చెప్పినా నిజజీవితంలో ఈ విషయంలో లింగభేదం ఉండదన్నది నా అభిప్రాయం కూడా.
————————-
// “ఆమెలో సహజంగానే ఎక్కువగా వుండే క్షమాగుణం, సహనం, వినయం, అహంకార రాహిత్యం ఆమెకి అనుకూలించి సహకరిస్తాయి.” //.
పాపం, ఇలా భ్రమ పడుతున్న ఆ గ్రూప్ మెంబర్ ఎవరో in for great disappointment in life 😀😀 (just kidding).
అనివార్య పరిస్ధితులు తలెత్తితే ఇటువంటి లక్షణాలు మగవారిలో కూడా బయటకొస్తాయి. బతకాలి కదా.
————————–
మీ దగ్గర నుండి as usual మరో profound ఆలోచనలతో కూడిన పోస్ట్👌.
నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు (కాస్త “ఆలీసెంగా”) 🌹.
LikeLike
🦁 గారూ ,
మోహనరూపా గోపాలా పాటని మరొక్కసారి వినండి, కృష్ణుడిని ఆరాధించేటపుడు కృష్ణతత్వాన్ని ఆరాధించాలి. కృష్ణుడిని ఆరాధించమన్నాను కదా అని అమ్మాయిలను, ఆంటీలను ఆరాధించడం కాదు అని నొక్కి వక్కాణిస్తున్నాను.
LikeLike
ఆ పాటను నిన్ననే బ్లాగ్ ముఖంగా గుర్తు చేసింది నేనే గానీ, ఇంతకీ ఈ ప్రవచనం వినడానికి నేను “తపమేమి చేసానో” చెప్పండి ? అలాగే మీ ఈ సుద్దులకు భాష్యం కూడా చెప్పండి ప్లీజ్.
🦁
LikeLike
@ 🦁 గారూ,
>>>ఎవరినీ ద్వేషించకుండా ఉండడం అనేది కూడా పై లిస్టుకు కలపాలండి. అప్పుడే పరిపూర్ణత>>>
మీ ఈ భాష్యానికి నా సమాధానమే ఆ పాట !
“వలదని నిన్ను వారించు వారిని
వదలక వెంట తిరిగెదవయ్య
వేణువు నూదుచు వేడుక చేయగ
వేడిన వారికి దరిశన మీయవు”
కృష్ణుడిని ద్వేషించేవారిని వదలనే వదలడు. వెధవలని వదలకూడదు. అవని భారము కృష్ణుడొక్కడే మోయాలేంటి మాలాంటి ఆడవాళ్ళు కూడా మోయవచ్చు 😛
LikeLike
వీఎన్నార్ సర్, మీ అభిప్రాయాలు పంచుకొన్నందుకు నెనరులు.
Happy New Year Sir 🙏
LikeLike
నిజమైన సన్యాసికి, వైరాగ్యానికీ ఆమడదూరం అనిపిస్తుంది.
Please explain more about this.
LikeLike
నీహారిగ్గారూ,
నిజమైన సన్యాసులని, ఏ ఎటాచ్-మెంటూ లేనివాళ్ళనీ చెప్పబడిన వాళ్ళంతా – eg. కృష్ణుడు, బుద్ధుడు, ఆదిశంకరుడు, జీసస్, …. – నిజానికి ప్రపంచానికి సత్యాన్ని, ధర్మాన్ని, మార్గాన్ని చూపించాలనే పెద్ద పని పెట్టుకున్న వాళ్ళే. చిన్న సంసారాన్ని వదిలిపెట్టి, పెద్ద సంసారాన్ని మోసినవాళ్ళే. of course, ఏ టెన్షన్ పడకుండా పన్జేశారనుకోండి.
అందుకని నిజమైన సన్యాసంలో నిష్కామకర్మ వుంటుంది కానీ వైరాగ్యం వుండదని నాకనిపించిందండీ.
LikeLike
నిజంగా సన్యాసాన్ని స్వీకరిస్తే , ఆక్షణంనుండి ఇతరుల కోసం బ్రతకడం ఆరంభిస్తాడు .
వైరాగ్యాన్ని ప్రారంభించిన నాటి నుండీ తన కోసం మాత్రమే బ్రతకడం ఆరంభిస్తాడు . అంటే —–
ఒకటి పరార్థం రెండోది స్వార్థ పూరితాలన్నమాట .
LikeLike
నెనరులు మాస్టారూ! లోకం కోసం పని చెయ్యనివ్వని వైరాగ్యం = ఎస్కేపిజం అన్నమాట.
LikeLike
@ రాజారావు గారు,
>>>నిజంగా సన్యాసాన్ని స్వీకరిస్తే , ఆక్షణంనుండి ఇతరుల కోసం బ్రతకడం ఆరంభిస్తాడు>>>
ఆ రకంగా చూసినా పురుషులు చిన్నతనం నుండే సన్యసించినట్లు అవుతుంది. వైరాగ్యం వచ్చిందంటే తిరోగమనంలోకి వెళుతున్నట్లు కాదా ? ఈ వైరాగ్యం నుండి వసుధైక కుటుంబం గురించి ఆలోచించేదెపుడు ?
LikeLike
. . . వైరాగ్యం వచ్చిందంటే తిరోగమనంలోకి వెళుతున్నట్లు కాదా? .. .
కాదండి. వైరాగ్యం వలన నేను-నాది అనే దృక్కోణం నుండి బయటపడటం జరుగుతుంది. అందువలన విరాగి వసుధైక కుటుంబం గురించి ఆలోచించేవాడు అవుతాడు.
LikeLike
బైరాగి అసమర్థతనుండి పుట్టుకొచ్చిన అవతారం . దాదాపు బైరాగులంతా కుటుంబంనుండి పారిపోయి వచ్చినవాళ్లే . ఫలానా ఆయన కనిపించకుండా పోయాడంటే ,
బైరాగుల్లో కలిసి పోయాడనే సమాధానం . వీడు పెళ్లాం బిడ్డల్నీ , సంసారాన్నీ అవలీలగా వదిలించుకుంటాడు గానీ ,
తన మీద మమకారం వదులుకోడు .
వెరసి , ఈబాపతు వాళ్లంతా రైల్వే ష్టేషన్లలోనో , బస్ షెల్టర్లలోనో గుంపులుగా
తారస పడుతుంటారు .
LikeLike
మీతో ఏకీభవిస్తాను రాజారావు మాస్టారూ.
అందరూ అని కాదు గానీ బైరాగులు అంటే బాధ్యతారాహిత్యానికి ఉదాహరణలు అని మొదటినుండీ నాకు ఉన్న అభిప్రాయం. చాలా మంది YVR గారు అన్నట్లు ఎస్కేపిస్టులు. నమ్ముకున్న కుటుంబాన్ని గాలికొదిలేసి తమ దారి తాము చూసుకునే రకాలు అనిపిస్తుంది. వీళ్ళకుండే విషయపరిజ్ఞానం కూడా పెద్ద ఘనమైనదేమీ కాదు. డంబాలకేమీ తక్కువుండదు. “కన్యాశుల్కం” నాటకంలో బైరాగి లాంటి వారు. శ్యామలరావు గారు చెప్పిన లక్షణాలున్నవారు అరుదు. మీరన్నట్లు గుంపులుగా రైల్వేస్టేషన్లనూ, బస్టాండునూ, సత్రాలనూ ఆశ్రయించి గడుపుతుంటారు. చిలుం పీలుస్తుంటారు. లేదా దేశద్రిమ్మర్లుగా తిరుగుతుంటారు రైళ్ళల్లో … సాధారణంగా టికెట్ లేకుండా … మా చిన్నతనంలో బైరాగి టికెట్ అనేవారు, ఇదేనా? ఏమో గుర్తు లేదు 🙂. వీళ్ళని సర్వసంగపరిత్యాగులు అనాలనిపించదు.
వీళ్ళకి భుక్తి ఎలాగా అనీ, క్రిమినల్ ఏక్టివిటీస్ ఏమన్నా చేస్తుంటారా అనీ నాకు సందేహం వస్తుంటుంది.
LikeLiked by 1 person
నరసింహరావుగారూ ,
ధన్యవాదాలు . చక్కగా విశ్లేషించారు .
మిత్రులు శ్యామలరావుగారు ఈ అంశంలో శాస్త్రీయ విశ్లేషణ చేశారనిపిస్తోంది . కానీ , వాస్తవాని కలా లేదు మరి !
LikeLiked by 1 person
🙏 రాజారావు మాస్టారూ.
LikeLike
// “ఎవరికీ ఏ హానీ చేయకుండా ఉండడం ….” //
ఎవరినీ ద్వేషించకుండా ఉండడం అనేది కూడా పై లిస్టుకు కలపాలండి. అప్పుడే పరిపూర్ణత.
LikeLike
….ను ద్వేషించడం జన్మ హక్కు. విధి రాతను తప్పించలేం. ఖర్మ అనుభవించవలసిందే !
LikeLike
పాపం ఆనాడు “స్వాతంత్ర్యం నా జన్మ హక్కు “ అని తిలక్ గారు, ఈనాడు “ద్వేషించడం జన్మ హక్కు“ అని మీరు 🙁. ఆహా ! 🙏
LikeLike
@నీహారిక గారు
// “మాలాంటి ఆడవాళ్ళు కూడా మోయవచ్చు 😛” //
——————
మోయండి, మోయండి. ఆల్ ది బెస్టూ. May “Krishnudu” give you strength 👍.
🦁
LikeLike
గడ్డిపోచ,బూరుగు వృక్షం కథ భారతంలో ఉన్నది.
ఇక గడ్డిపోచను స్త్రీగాను,వృక్షాన్ని పురుషునిగానూ వర్ణించడమన్నది . హిస్,హెర్ మాటలు భాషా సౌందర్యం కావచ్చునని నా అభిప్రాయం. ఎందుకంటే సంస్కృతంలో పర్వతాన్ని పురుషునిగా వర్ణించడం కలదు. అలాగే నదులను స్త్రీగానూ,సముద్రాన్ని పురుషునిగానూ వర్ణించడం కలదు.
అసలిక్కడ స్త్రీ పురుషభేదం కనరాదు,అవసరమూ లేదు. స్థానికమైన అవసరం,ఆకారం ఆ పరిస్థితులలో తగిన వసతి కలగ జేశాయంతే. చెట్టు ప్రకృతిని ఎదుర్కొంది, పడిపోయింది లేదా నిలిచింది, పోరాడింది. గడ్డిపోచ తలొంచింది, అనువైన సమయంలో తలెత్తింది, అంతే తేడా. ఇక్కడో మాట చెప్పుకోవాలి. భర్తృహరి మాట, లక్ష్మణ కవినోట, ”ఒకచో నేలనుబవ్వళించు,నొకచో నొప్పరు పూ సెజ్జపై………లెక్కకురానీయడు కార్య సాధకుడు సుఖంబున్ దుఃఖంబున్ మదిన్”…..ఇక్కడ చెప్పిన మాట కార్య సాధకుడైన గడ్డిపోచకు వర్తిస్తుంది.
ఇక చెట్టుది ధీర లక్షణం, వీరుడైనవారు చేసేది.
ఇక స్త్రీకి అన్నిటా అన్నీ ఎక్కువే “స్త్రీణా ద్విగుణమాహారం….” అందుచేత స్త్రీకి ఎక్కువ ఓర్పు ఉన్నది అన్నది నిజం, అది ప్రకృతి ప్రసాదించినదే!
ఇది నా అభిప్రాయం, కాదనుకుంటే కామెంట్ తీసేయండి.
LikeLike
గురువుగారూ, ఎప్పటిలాగే మీ శైలిలో మృదుమధురమైన వ్యాఖ్యానం. నెనరులు. తీసేయడమా ? No way 🤗🙏
LikeLiked by 1 person
“ఆలు కాళికైన
కాలు నిల్వదాయె
కాలు నిల్వనోడు
కలిలోన బైరాగి ”
“ఒకచో నేలనుబవ్వళించు,
నొకచో నొప్పరు పూ సెజ్జపై
లెక్కకురానీయడు కార్య సాధకుడు
సుఖంబున్ దుఃఖంబున్ మదిన్”
ఆండాళ్ళూ…..
LikeLike