హ్యాపీకార్తీకఏకాదశి+ఇందిరాగాంధీ  బర్త్ డే+ఇంటర్నేషనల్  మెన్స్ డే + ఇంటర్నేషనల్ టాయిలెట్ డే >>> అన్నీ ఇవాళే(ట)


ఇవాళ ఇంటర్నేషనల్ మెన్స్ డే అని వ్వాట్సప్ లో మెసేజులు స్వైరవిహారం చేస్తుంటే ఇదేంటా అని వికీపీడియా చూశా. నిజమే 1991 నుంచీ జరుపు తున్నారు(ట). ఎందుకో తెలుసుకునే ఆసక్తీ, అవసరం రెండూ లేవు. సో, తెలుసుకోలేదు. కానీ దాని పక్కనే ఇవాళే ఇంటర్నేషనల్ టాయిలెట్ డే అని కూడా ఉండడంతో అదేంటా అని చూశా. అది మన స్వచ్ఛ భారత్ ప్రాజెక్టుకి ఇంచుమించు సరిసాటి(ట) ఇంటర్నేషనల్ లెవెల్లో. ఓహో! అలాగా అనుకుంటుండగా గుర్తొచ్చింది, ఇవాళ ఇందిరాగాంధీ పుట్టినరోజు కూడానని. ఇంట్రెస్టింగ్ !! అనుకున్నా. అనుకున్నవన్నీ వాట్సాప్ లోకి ఎక్కించేశా . ఇంతలో వ్వాట్సాప్ లోనే ఓ మహాత్ముడు పెట్టిన పవిత్ర పుణ్య సందేశం – హ్యాపీ కార్తీక ఏకాదశి అని. ఇంకా హ్యాపీ శని త్రయోదశి , హ్యాపీ పోలాల అమావాస్య, హ్యాపీ మహాలయ పక్షమ్స్ , మెనీ హ్యాపీ రిటర్న్స్ అఫ్ తద్దినం …. వగైరా కూడా వస్తాయేమో అనుకోబోతూ లటుక్కున ఆ ఆలోచన ఆపేశాను, ఎందుకొచ్చిన గొడవ అని.
కానీ మంకీ మైండ్ ఊరికే ఉండదు కదా!! తెలుసుకున్న విషయాలన్నీ కలిపి చూడ్డం మొదలెట్టింది.
ఇంటర్నేషనల్ మెన్స్ డేని ప్రారంభించిన పెద్దమనిషి, జెరోమ్ తీలక్సింగ్**, అన్నాయన ఈ రోజు ప్రాముఖ్యతని ఇలా చెప్పాడు (ట ) – “the day ‘s activitees strive for gender equality and patiently attempt to remove the negative images and the stigma associated with men in our society.”

ఆయన మేల్-షావినిజానికి వ్యతిరేకి అనిపించేలా వున్నాయి కదూ ఆ మాటలు!?!

(** పేరు స్పెల్లింగుని బట్టీ ఈయనెవరో ఇండియన్ ఆరిజిన్ పెద్ద మనిషిలా వున్నాడు)

నేను తృప్తి దేశాయ్ సపోర్టర్ని కాదంటే కాదు. కానీ మనదేశంలో జెండర్ ఈక్వాలిటీ ఉందంటే మాత్రం నమ్మలేను. కాబట్టి ఈ డేని బాగా జరుపుకోవడం అవసరం అనిపించింది.

నెక్స్ట్, ఇందిరాగాంధీ బర్త్ డే. ఒకప్పుడు ఒకాయనెవరో – వాజ్-పాయా🤔? ఏమో గుర్తులేదు – “కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒకే ఒక్క మగాడు , ఇందిరాగాంధీ,” అన్నాట్ట. అందులో పెద్ద సందేహం లేదని చాలామంది నిస్సందేహంగా చెప్పడం విన్నాను. అంచేత ఇంటర్నేషనల్ మెన్స్ డే రోజు భారతీయ మగమహారాజులు ఇందిరాగాంధీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని నొక్కి చెప్తోంది ఈ నవంబర్ 19 అనిపించింది. అసలు జయలలిత కూడా ఈ రోజునే పుట్టి ఉంటే ఇంకా బావుండేదని మరీ మరీ అనుకున్నా. అనుకోకుండా ఎలా వుంటాం? మగ అరవ పొలిటీషియన్లు అరవడం మర్చిపోయి ఆవిడకి పొర్లుదండాలు పెట్టే సీన్లు చూశాక?

నెక్స్ట్ –

ఇంటర్నేషనల్ టాయిలెట్ డే. స్వచ్ఛ్ భారత్ కి ఇంటర్నేషనల్ వెర్షన్ అన్నాను కదా! మోడీ మేష్టారి కలలకి ప్రతీక అయినటువంటి ప్రాజెక్టుకి ఇంచుమించు సరిసాటి. కనక ఇదీ ముఖ్యమైన రోజే. జెండర్ ఈక్వాలిటీ మీద మోడీ మేష్టారి అభిప్రాయం ఏంటో బేటీ బచావో! బేటీ పడావో!! అనే ఒక్క స్లోగన్ తో చెప్పేహారు కదా! ఇప్పుడింక స్విస్ బ్యాంకుల్నించి ఒక్కొక్కళ్ళ అకౌంట్లో 15 లక్షలు పడగానే ఇంక దేశంలో బేటీలందర్నీ బచాయించడం, పడాయించడం షురూ అయిపోతుంది. ఏం భయం లేదు!!

ఇప్పుడింక (హ్యాపీ) కార్తీక ఏకాదశి గురించి. శివుడిని మించి జెండర్ ఈక్వాలిటీ పాటించేవాళ్ళు దేవుళ్ళల్లోనూ లేరు. అంచేత నవంబరు 19న వచ్చిన ఈ కార్తీక ఏకాదశి అర్ధనారీశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదని దేశంలో తెలిసికానీ, తెలీకుండా కానీ పురుషాహంకారం ప్రదర్శించే వాళ్లంతా గ్రహించవలసిన పుణ్యదినం. మళ్ళీ ఎన్నో ఏళ్ళక్కానీ రాదు.
కనుక-
డియర్ ఇండియన్ మెన్!!
ఈ రోజు శివపార్వతుల్ని పూజించి ఉపవాసం చేసి ఇందిరాగాంధీ అపరదుర్గ అయిన విధాన్ని తెలుసుకొని ఆపైన మీ గృహమున గల టాయిలెట్లను సవినయముగా, అహంకార రహితులై శుభ్రపరచుడు. అంతట తరతరాలుగా మీలో పేరుకుపోయిన పురుషాహంకారము నశించి, జన ధన్లు, స్లోగన్లు లేకపోయినా బేటీ బచావో, బేటీ పడావో సాకారమగును.

అన్నట్టు మరిచిపోయాను, ఈ సూచనలు తెలిసికానీ, తెలీకుండా కానీ పురుషాహంకారం వదిలేసిన వాళ్ళకి నాట్ అప్లికబుల్!!

అరే! ఇంకో ఇంపార్టెంట్ క్లూ ఇవ్వడం మర్చిపోయా! మనలో పురుషాహంకారం వుందో లేదో తెలిసేదెలా? తెలుసుకోడం చాలా ఈజీ!

ఈ టపా చదువుతుంటే నవ్వొస్తే పురుషాహంకారం లేనట్టు,

ఒళ్ళు మండిపోయి, జంధ్యాల సినిమాలో సుత్తి వీరభద్రరావుల్లా ఫీలైతే……

ఫిల్ ఇన్ ది బ్లాంక్ 😉😁

ఓకే! బై4నౌ🖐😎

************************

36 thoughts on “హ్యాపీకార్తీకఏకాదశి+ఇందిరాగాంధీ  బర్త్ డే+ఇంటర్నేషనల్  మెన్స్ డే + ఇంటర్నేషనల్ టాయిలెట్ డే >>> అన్నీ ఇవాళే(ట)”

 1. హ్హ హ్హ హ్హ, బాగుందండి 😀.

  // “….. హ్యాపీ మహాలయ పక్షమ్స్ , మెనీ హ్యాపీ రిటర్న్స్ అఫ్ తద్దినం ….వగైరా కూడా వస్తాయేమో అనుకోబోతూ … “ // వస్తాయి వస్తాయి, సందేహింపకుమయ్యా (🙂). ఇప్పటికే … హ్యాపీ గుడ్ ఫ్రైడే … అని ఓ టీవీ ఏంకరిణి టీవీతెర మీద చెప్పిన ఉదంతం జరిగింది. క్రిస్టియన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారనుకోండి. అదే వేరే మతస్థులైతే హింసాత్మక అల్లర్లే చెలరేగుండేవని నా అనుమానం. వ్యాపారసంస్కృతి మాయలో చిక్కుకున్న ఈ తరం వారికి ప్రతిదీ ఒక ఈవెంటే, అది ఏమిటి అనే అవగాహన లేకుండా గ్రీటింగ్స్ చెప్పెయ్యడమే వాళ్ళకి తెలిసింది.

  btw “జన ధన్లు” అనగానేమి?

  Like

 2. హ్యాపీడేసు మహాలయాదివసముల్! హ్యాపీ రిటర్న్సాఫు లి
  వ్వే పిండమ్ముల పెట్టు తద్దినపు నైవేద్యాలకున్! వేయుచున్
  టోపీ ఫారెను సంప్రదాయపు పటాటోపమ్ములన్ జేర్చుచున్,
  తాపీగా మనదేశ నేతలకు చేద్దామోయ్ నివాళుల్ భళా !

  జిలేబి

  Like

   1. మగ బ్లాగర్లు జిలేబీ పద్యాలకు పొర్లుదండాలు పెడితే తప్పులేదు కానీ అరవ పొలిటీషియన్లు పెడితే మాత్రం తప్పాండీ ?

    Like

    1. జిలేబీ పద్యాలు
     భలే! జీ వాద్యాలు …
     ఇక్కడేదో ప్రాస ఊసులాడుతున్నట్లుందే !
     (అయినా నాకెందుకులెండి ..
     ఏదో తోచనయ్య లాగా – దూరకుండలేక .. .)
     jf / 🙂 …

     Like

     1. తోచీ తోచనయ్య తోడళ్ళుడి పుట్టింటికి వెళ్ళాడట 😃

      Like

 3. మరి ఆషాఢ శుధ్ధఏకాదశి నాడు శయనించిన మహావిష్ణువు ఈ కార్తీక శుధ్ధ ఏకాదశి నాడు నిద్ర
  మేల్కొని ఆయన కరుణా కటాక్షాలు మనపై
  బరపే ఉత్థాన ఏకాదశి కూడా ఇదేనట !
  ఈయనా , ఈయన సుపుత్రుడు బ్రహ్మాజీ కూడా
  జెండర్ ఈక్వాలిటీని ఇంకాస్త ఎక్కుడుగా ఒహరేమో
  గుండెల్లో పెట్టుకునీ , ఒహరు నోటిలో – అంటే – అస్సలాయన మాటాడకుండా – ఆమె మాటే తన
  మాటగా – ఇంతకంటే లోకంలో జండర్ ఈక్వాలిటీ
  పాటించేవాళ్ళెవ్వరింక . అందు వల్ల ఈ 19 న వీళ్ళూ
  ప్రాతః స్మరణీయులు . బ్రహ్మ విష్ణురూపాయ శివాయ నమః .

  Like

  1. నిజానికి విష్ణుమూర్తి చూపిన జెండర్ ఈక్వాలిటీ రెండు రెట్లు ఎక్కువ కదా మాస్టారూ! గుండెల్లో శ్రీదేవితోపాటు భూదేవినీ పెట్టుకున్నాడు కదా !😊

   Like

   1. జెండర్ ఈక్వాలిటీయా? దాన్ని బైగమీ అంటారు 🙂.

    Like

      1. “భోగమీ” కు నా 👏👏 కూడా బండివారూ 👌.

       Like

    1. సార్! జెండర్ ఈక్వాలిటీకీ, బైగమీకి పొసగదంటారా? బెైగామస్ శివుడు పార్వతిని లిటరల్లీ బెటర్-హాఫ్ చేసుకుని, గంగని నెత్తి మీద పెట్టుకునీ రెండిటికీ & ఇద్దరికీ న్యాయం చేశాడనుకోవచ్చు కదా !

     Like

     1. శివుడిది మంచుకొండ, అంతా ఈక్వలే.

      అయినా కొంతమంది చాకచక్యంగా పొసిగేట్లు మేనేజ్ చేసుకుంటారు లెండి YVR గారూ … రోజా, సుమలత వంటి వారి కౌన్సిలింగ్ అవసరం రాకుండా 😀😀.

      Like

      1. vnr గారూ …
       అంతా ఈక్వలే … కాదనుకుంటానండి …
       అంతా ఈశ్వరే … అననుకుంటానండి.
       🙂

       Like

   2. గుండె ఏ వేపూ కూడా జారకుండా
    జాగ్రత్త పడ్డం కూడా తప్పేనుటండీ !!
    చోద్యం కాపోతేనూ … మరీ !!
    (కాపాడు హరీ … … )
    🙂

    Like

    1. అడుసు తొక్కనేల …. ఆపై balancing act చెయ్యనేల బండి వారూ ☝️🙂.

     Like

 4. విన్నకోట వారికి భార్య పిల్లలు ఉన్నారో లేదో తెలియదు కానీ వారికి పురుషాహంకారం లేదని నేను డిక్లేర్ చేస్తున్నానండీ.

  Like

  1. ఎట్టెట్టా !?

   ఇక్కడేదో .. ఓ .. ఓ ..
   ఓ మెలిక్కొడుతోంది ?
   కనుక్కునేదెట్టా ?

   ఈ లోపల అట్ఠట్ఠా తిరిగొద్దాం …
   (ఈలోపల vnr వారు ఉ’డ’క్కుంటారా … ?
   చూద్దాం !)

   జెఫ్ / 🙂

   Like

   1. కనుక్కోండి చూద్దాం…
    పురుషాహంకారం లేదని ఆడవాళ్ళే చెప్పాలి సుమీ 🙂

    Like

  2. థాంక్యూ, థాంక్యూ నీహారిక గారూ.

   Like

 5. VNR ఎందుకు ఉడుక్కోవడం … అటువంటి కాంప్లిమెంట్ దక్కని వారు ఉడుక్కోవాలి గానీ .. బండి వారూ 😎?

  Like

 6. పోస్ట్ రాసిన YVR గారికి, ఇక్కడ ఇన్ని మంచి ఫన్నీ కమెంట్లు రాసిన బ్లాగ్మిత్రులందరికీ Happy Blogging Day Forever!

  Like

 7. జగదాంబయ? జడదారియ?
  జగత్కిలాడియకొ? రమణి సరస రమణుడో?
  మగరాయుడకొ మగువయకొ?
  భగినియ? భ్రాతయ? జిలేబి వాస్తవ మేదో ?

  🙂

  జిలేబి

  Like

   1. నెగడాయనమః ముడి పడదాయనమః కనబడదాయనమః నమో నమః
    (సరి పడదాయనమః విడి పడదాయనమః గడి విడదాయనమః)

    నాలుగో పాదం మాకు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ క్రింద వదిలేశారేమోనని …
    ఏదో నాకు తోచిన విధంగా ఆ పై నాలుగు పదాలు …
    (బాగోగులు, ఇతరాలు నాకు అప్లై కావు గురువు గారు)
    jf / 🙂

    Like

    1. పేరడీల
     గారడీల
     కెవర్రెడీ,
     రావుగారు!!
     కొత్త పాటకు
     బీ రెడీ!
     కందమొకటి విసరగా
     జిలేబీ భీ రెడీ!!

     ఇదుగో కొత్త పేరడీ పాటకి ఐడియా –
     ఈ కందానికి
     బంధం వేశానొకనాడు
     ఆ కందమె నాకందమైనదీ
     ఈనాడు …. 😁

     Like

     1. వైవీయార్ గారూ …
      విన్నట్టుగానే ఉంది గానీ
      ఓ చిన్నట్టు కొడుతోంది …
      గిట్ట అదేందో చెప్పుండ్రి సారూ … 🙂

      Like

      1. ఎన్నెమ్ రావుగారూ! ఏమీ లేదండి, కందం అనేది జిలేబీ గారికి పర్ యాయ పదమైపోయింది కదా, మీరు మీ శైలిలో ఓ పాట రాస్తే వారూ అమందానంద ‘కంద’ళిత హృదయారవిందులై పద్యాలు విసురుతారని, అంతే!😊😊😊

       Like

 8. మాకందానికి బండివారదురహో మాకందమున్ చేర్చిరే
  మీ కందంబది పారె బండివలె సుమ్మీ రావు గారూ భళా
  రే!కందమ్మున కారవోకెలను హుర్రే యంచుపారించుడీ!
  పాకంబై మన బామ్మగారిని సభాప్రాంగమ్ములోతాకగన్ 🙂

  జిలేబి

  Like

 9. కనబడదసలే ! వుందో
  మన కసలే తెలియదయ్య మహిని జిలేబీ !
  తను తిరుగుచుండు గిరగిర
  మనమున్ భళి తిరుగుచుంటి మయ్య గిరగరన్ 🙂

  జిలేబి

  Like

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s