Kingfisher అనగానే ఆ పేరు పెట్టుకున్న ఒక పక్షి కంటే ముందు పదకొండు వేల కోట్లకి బాంకుల్ని ముంచేసి యూకే చెక్కేసిన ఒక టైకూన్, మూతబడిన ఒక ఎయిర్ లైన్, ఒక బీరు బ్రాండు గుర్తొస్తాయి.
మీడియాని ఫాలో అవ్వదు కానీ ఈ పిట్టకి తన పేరు మీద ఆ కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ ఎన్ని వివాదాలు సృష్టించాడో తెలిస్తే పేరు మార్చేసుకుంటుందేమో.
Kingfisherకి తెలుగులో –
చల్లముద్దపక్షి
చల్లకవ్వపుపిట్ట
పచ్చరేకపిట్ట
మీలపల్లేంక పులుగు
లకుముకి పిట్ట
అని పేర్లున్నాయి, according to ఆంధ్రభారతి.
ఫొటోలో వున్న పిట్టకి ఆ తెలుగు పేర్లలో ఏది కుదురుతుందో కానీ ఇంగ్లీషులో మాత్రం Stork-billed Kingfisher అని పెట్టారు. అంటే కొంగముక్కు లకుముకి అనచ్చేమో.
ఇండియా నుంచి ఆగ్నేయాసియా వరకూ చాలా చోట్ల కనబడుతుంది(ట). నాకు మాత్రం మా వూళ్ళో సంగీబులో వెట్-లాండ్స్ లో కనిపించింది.
మీకు ఎక్కడైనా కనిపిస్తే ఆ సంగతి ఇక్కడ కామెంట్ పెడతారా? ఫ్లీజ్😊🙏
మా దేశంలో ఎక్కడన్నా కనిపిస్తే తప్పక మీకు తెలియజేస్తాం (నెల్లూరు జిల్లాలోని పులికాట్ సరస్సు దగ్గర గానీ, తమిళనాడులోని వేదారణ్యంలో గానీ కనిపించే అవకాశాలున్నాయంటారా? ). ;
ఆ రోజుల్లో చాలామందికి సురాపానానికి అరంగేట్రం చేయించినదే “కింగ్ ఫిషర్” (తప్పితే “గోల్డెన్ ఈగిల్”; అయితే అది ఈ కంపెనీ ఉత్పత్తి కాదు లెండి) అంత తేలికగా మరిచిపోతారా ఎవరైనా?
LikeLike
థాంక్యూ విఎన్నార్ గారు. పులికాట్, వేదారణ్యాల వరకూ అక్కర్లేదేమో, కోనసీమ, కొల్లేరులాంటి చోట్ల కనిపిస్తుందనుకుంటాను.
LikeLike
మా దేశంలో ఎక్కడన్నా కనిపిస్తే తప్పక మీకు తెలియజేస్తాం (పులికాట్ దగ్గర కనిపించే అవకాశాలేమన్నా ఉన్నాయా) ?
ఆ రోజుల్లో చాలామందికి సురాపానానికి అరంగేట్రం చేయించినదే “కింగ్ ఫిషర్” (తప్పితే “గోల్డెన్ ఈగిల్”. కానీ ఈ కంపెనీ కాదనుకోండి ) అంత తేలికగా మరిచిపోతారా ఎవరైనా 🙂?
LikeLike
కింగ్ ఫిషర్ అని టైటిల్ వుంటే ఏమో అనుకుని వచ్చాను దీనిగురించా 🙂
జిలేబి
LikeLike
ఇదే కింగ్ ఫిషర్ బ్రాండ్ జిలేబీ.
డౌట్ లేదు, జిలేబీరు 😃
LikeLike
జిలేబిగారు, మీ కామెంట్ వల్ల కింగ్-ఫిషర్ గురించి పెట్టబోయే నెక్స్ట్ పోస్టుకి మంచి విషయం గుర్తొచ్చింది. మీరు తప్పకుండా ఓ పద్యం రాస్తారు.😃
LikeLike