నిన్న X.B.I, నేడుY.B.I, రేపుZ.B.I, ఎకార్డింగ్ టు🔍మరమరాలజీ🔎 ….


మొన్న డి.బి.ఐ.లో లుకలుకలు

నిన్న టి.బి.ఐ.లో గడబిడలు

రేపు ఇంకేదో …

ఎక్స్.బి.ఐ.

వై.బి.ఐ.

జడ్.బి.ఐ.

ఎట్సెట్రా, ఎట్సెట్రాల్లో

ఏవో డబడబలు

రూలింగ్ పార్టీ, గవర్న్‌మెంటునీ, సంస్థలని, దేశాన్నీ నాశనం చేసేస్తోందంటాయి ఎగస్పార్టీలు,

కరెక్టేనేమో అనిపిస్తుంది.

ఎగస్పార్టీలకేం తెలుసు, మేం చేసే ఘనకార్యాలు చూసి ఏడవడం తప్ప అంటుంది రూలింగ్ పార్టీ.

అదీ నిజమే కదా! అనిపిస్తుంది మనకి.

కానీ ఇద్దర్లో ఎవరు రైటు? ఎవరు తప్పు? అది తెలిస్తే మనం సామాన్యులం ఎందుకౌతాం? అవ్వం. పోనీ అందర్లోనూ తప్పొప్పులు రెండూ వుంటాయి అనుకున్నా ఎవరిలో ఏది ఎంత శాతం వుందో కూడా ఎస్టిమేట్ చెయ్యలేనంత సామాన్యులం మనం.

అందువల్ల ఎవరు ఎక్కువ రైటో తెలుసుకుందామని

పేపరు ఓపెన్ చేస్తే –

టీవీ డిబేట్ పెడితే –

యూ ట్యూబ్ ఉపన్యాసాలు వింటే –

ఏమౌతుందంటే, మా గురూజీ, మార్క్ ట్వైన్ పేర చెలామణీలో వున్న ఒక కోట్ –

If you don’t read news paper you are uninformed, if you do read news paper you are misinformed

– అన్నది గుర్తు రాక మానదు. న్యూస్ పేపరు బదులు టీవీ డిబేట్, యూ ట్యూబ్ అని మాటలు మార్చేసినా అర్ధం మారిపోకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది ఫోర్త్ ఎస్టేట్. (మార్క్ ట్వైన్ ఆ మాటొక వందేళ్ళ క్రితం చెప్పి వుంటాడు. ఒక శతాబ్దంపాటు అంత ”గొప్ప విలువలు” పాటించిన మీడియాని చూస్తే ఎంత ముచ్చటగా వుంటుందో అసలు.)

పోనీ నిఖార్సైన మేధావుల అభిప్రాయాలు విందామంటే వాళ్ళంతా విదేశీశక్తులకి అమ్ముడుపోయా(ర్ట!). నిజంగా అమ్ముడు పోయారో లేదో తెలుసుకుందామంటే ఆ దర్యాప్తుకి దశాబ్దాలే పడుతుందో, శతాబ్దాలే పడుతుందో ఈ లోపులో దర్యాప్తు సంస్థలకి ఎంతమంది డైరెక్టర్లు మారతారో, ఏంటో తెలీట్లేదు.

అంచేత, ఈజీయెస్ట్ అండ్ మోస్ట్ రిలయబుల్ వే ఏంటంటే ఆస్ట్రాలజిస్టులనో, న్యూమరాలజిస్టులనో, మరమరాలజిస్టు**లనో సంప్రదించడం. (**ఫ్యూచర్ ప్రొఫెషన్!! మరమరాల ద్వారా ఫ్యూచర్ తెలుసుకోవడం)

ఫరెగ్జాంపుల్ మరమరాలజిస్టుని అడిగామనుకోండి – ఫర్ సపోజ్ అనుకోండి – ఆయన ఇట్టే విషయం కనిపెట్టేస్తాడు. కనిపెట్టేసి – “ఎక్స్.బి.ఐ., వై.బి.ఐ., జడ్.బి.ఐ….. ఈ సంస్థలన్నిటి పేర్లలోనూ బి & ఐ అనే అక్షరాలు కామన్ గా వున్నాయీ, అదీ కాక B ఫర్ భారత్, I ఫర్ ఇండియా;

ఇంగ్లీషులో B రెండోది, I తొమ్మిదోది. 9 + 2 = 11, 1+1=2. అంటే మళ్ళీ రెండో అక్షరం B అంటే B ఫర్ భారత్ నే సూచిస్తోంది. అందువల్ల ఈ సంస్థల్లో ఏం జరిగినా, అసలేం జరక్కపోయినా దేశం మీద గో..ప్…ప్ఫ ప్రభావం వుంటుందీ, అంచేత ఆ రెండక్షరాలైనా మార్చెయ్యాలి లేదా ఆ సంస్థల్నెైనా పీకి పందిరేసెయ్యాలి. B ఫర్ భారత్, I ఫర్ ఇండియా కాబట్టి అక్షరాలు మార్చే కంటే ఆ సంస్థల్ని పీకి పాకం పట్టడమే మంచి శుభఫలితాల్నిస్తుంద”,ని తేల్చేస్తాడు. మనకీ ఏ విదేశీ హస్తాలూ, స్వ-విదేశీ హస్తాలూ, విదేశీ పెట్టుబడిదారుల భయం కానీ, సాయం కానీ అవసరం లేకుండా – ముఖ్యంగా సొంత బుర్ర వాడాల్సిన అవసరం, అవకాశం రాకుండా – నిజం చవగ్గా తెలిసిపోవడంతో మనసు తేలికపడి హాయిగా వుంటుంది.

ఇంతే సంగతులు 😍🙏

…and…

అందరికీ దీపావళి శుభాకాంక్షలు, ఈ సాయంత్రం ఆఫీస్ నుంచి బయటకి రాగానే తమో-మేఘాలు చీల్చుకు వెలువడిన జ్ఞానదీపంలా కనబడిన పశ్చిమాదిత్యుడి దృశ్యంతో🙏-

🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆

37 thoughts on “నిన్న X.B.I, నేడుY.B.I, రేపుZ.B.I, ఎకార్డింగ్ టు🔍మరమరాలజీ🔎 ….

 1. lalithats

  మరమరాలజిస్టులని మీ ప్రాజెక్టుకి కుదర్చుకోవడానికి ఓ సరఫరాలజిస్టుని సంప్రదించండి మరి 🙂

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   లలితగారు, ముందు సరఫరాలజిస్టు జాతకం యాస్ట్రాలజిస్టు చూసి ముహూర్తం పెట్టాలి.😊

   Like

   Reply
 2. Zilebi

  దరసల్ మరమర ఆమా
  ద్మి! రహస్యమిదియె జిలేబి త్రీథౌజండ్ టూ
  హరువులు గలవమ్మ జనులు
  సరసర తప్పించుకొనగ స్వాతంత్ర్యమునన్

  జిలేబి

  Like

  Reply
    1. విన్నకోట నరసింహారావు

     “దరసలు” పదం మినహా మిగతా పద్యం అర్థమైనదన్నమాట. ఆహా, వైవిఆర్ గారు ఎంత అదృష్టవంతులు 👏.

     Like

     Reply
    2. YVR's అం'తరంగం' Post author

     అవునండి బోనగిరిగారు. జిలేబిగారు బహుభాషా కోవిదులని పొరపాటున మర్చిపోయి పద్యం చదివాను. దరసల్ అంటే తెలిసింది. మళ్ళీ చదువుతాను.

     Like

     Reply
 3. విన్నకోట నరసింహారావు

  గవ్వలనుపయోగించి జోస్యం చెప్పే గవ్వాలజిస్టులుండగా … well, why not మరమరాలజిస్టులు ? మంచి వ్యాపారకిటుకు, వైవిఆర్ గారూ 😀😀.

  మీకందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు (రాత్రి 8 నుండి పది వరకు గల మధ్యకాలంలోనే టపాకాయలు కాల్చుకోవలె ☺… కొత్త నిబంధన. “జిలేబి” గారి ఊతపదంలో చెప్పినట్లు”ఎంజాయ్ మాడి” 👍☺).

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   థాంక్యూ సర్, వీఎన్నార్ గారూ. మా వూళ్ళో కాకరపు వ్వొత్తులు తప్ప కాల్చేవేవీ దొరకవు, దొరకనివ్వరు. పొరపాటున కాల్చినా, పేల్చినా ఎంజాయ్ మాడిపోడం గారంటీ.😊 కావాల్సినన్ని దీపాలు మాత్రం వెలిగించుకోవచ్చు.

   Like

   Reply
 4. Niharika

  అందరికీ దీపావళి శుభాకాంక్షలు, ఈ సాయంత్రం ఆఫీస్ నుంచి బయటకి రాగానే తమో-మేఘాలు చీల్చుకు వెలువడిన జ్ఞానదీపంలా కనబడిన పశ్చిమాదిత్యుడి దృశ్యంతో🙏-
  As usual Pic & Post Super !

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   మాస్టారూ, మువ్వురతివలపతికి, సూర్యవంశానికి రిలేషన్ ఎలా? సూర్యుడు ముగ్గురు సతులతో ఒకసారే ‘వేగు’ తున్నాడు కదా !🤔

   Like

   Reply
   1. నీహారిక

    ముగ్గురతివల పతి అంటే పవన్ కళ్యాణ్ సర్ 🙂

    Like

    Reply
    1. YVR's అం'తరంగం' Post author

     నీహారికగారు అర్థమైందండీ, కానీ ఈయన ముగ్గురితో ఒకేసారి వేగట్లేదు కదా, సూర్యుడిలా!!

     Like

     Reply
  1. YVR's అం'తరంగం' Post author

   నాకు తెలిసి సూర్యుడి భార్యలు ఛాయా, ఉష, పద్మిని. some జ్ఞాదేవి కూడా వున్నట్టు తెలీదు. ఈ లెక్కన సూర్యవంశంలో చేరాలంటే ముగ్గురతివలున్న చాలదేమో🤔

   Like

   Reply
    1. విన్నకోట నరసింహారావు

     అర్జునుడు నలుగురతివల పెనిమిటి కదా మాస్టారూ. (1).ద్రౌపది (2).సుభద్ర (3).ఉలూపి (నాగకన్య) (4). చిత్రాంగద.
     ప్రమీల అని ఐదో భార్య కూడా ఉందని ఒక కథ (ప్రమీలారాజ్యం).

     He has a girl in every port అని ఒక ఆంగ్ల సామెత 🙂.

     అభినవ “ఫల్గుణుడికి” నాలుగో భార్య కూడా రాసిపెట్టుందేమో 🤔🙂.

     Like

     Reply
     1. YVR's అం'తరంగం' Post author

      వీఎన్నార్ సర్!

      సిరిగల సినిమావారికి చెల్లును
      అతివలు ఐదార్గురైన తగ పెండ్లాడన్,
      కోర్టులు డైవోర్సులిచ్చి సపోర్టుగ నిలవగ,
      పోర్టునకొక్క ఇల్లు కుదురును ధరణిన్‌

      Like

      Reply
      1. నీహారిక

       కోర్టులు ఊరికే విడాకులు ఇప్పించవండీ…కోట్లు భరణంగా సమర్పిస్తేనే ఇస్తాయి. ఆయన తీన్ మార్ చేస్తేనే కోట్లు వస్తాయి.సిరిగలవారం మనమే “సిరి”నిచ్చేదీ మనమే !


       https://polldaddy.com/js/rating/rating.js

       Like

      2. YVR's అం'తరంగం' Post author

       నోట్లు సినీటికెట్లగును.
       టికెట్లను జనుల నోట్లు కొనును.
       ఆ నోట్లు వేరొకచోట కోట్లయి చేరును.
       కోట్లు భరణములగును.
       కోర్ట్లు విడాకులిచ్చును.
       అనివార్యమగు ఈ చక్రమును గూర్చి తర్జన భర్జనలు చేయుట నిరుపయోగము.


       https://polldaddy.com/js/rating/rating.js

       Liked by 1 person

      3. Zilebi

       అదురహో వై వి యా రు గారు!

       శంకరాభరణానికి వచ్చేయండి‌ !

       జిలేబి

       Like

      4. వెంకట రాజారావు . లక్కాకుల

       ఔరా ! యేమది ? మమ్ము గూర్చి యిటు హాస్యంబాడి దూషించుటల్ ?
       ఏ రీ మా సరి , ముఖ్య మంత్రి పదవిన్ యింపొంద గూర్చుండ గా
       శ్రీ రాజిల్లెడు నందగాడు , జనముల్ చేయెత్తి దీవింతు , రానాడు మా
       శూరత్వం బులు చూచి నవ్వుదురులే ! శుంభద్యశంబొప్పినన్ .

       Like

 5. వెంకట రాజారావు . లక్కాకుల

  వచ్చెడు వాడు ఫల్గుణు , డవశ్యము గెల్తుమనంగరాదు మీ
  తుఛ్ఛపు రాజనీతి గల దొంగలు , దోపిడిదారు లింక నీ
  రచ్చలు రావిడీల్ నిలిపి , రాగల క్రొత్తదనాన్ని కోరి , వి
  వ్వచ్చుని స్వాగతించుడు వివాదము లేల ‘ పవన్ని ‘ గట్టిగా .


  https://polldaddy.com/js/rating/rating.js

  Like

  Reply
 6. anyagaami

  అందరికి దీపావళి శుభాకాంక్షలు. YVR గారు, ఏ **logists అందుబాటులో లేని వాళ్ళకి మీరే మరో మార్గం చూపెట్టాలి. చక్కటి వ్యాసం. పైకారణాల వల్ల మన చదువులు ఎందుకు పనికిరావని అర్థం అయ్యింది.


  https://polldaddy.com/js/rating/rating.js

  Like

  Reply
 7. విన్నకోట నరసింహారావు

  @ వెంకట రాజారావు గారు
  // “ఔరా ! యేమది ? మమ్ము గూర్చి యిటు హాస్యంబాడి దూషించుటల్ ?” //
  —————
  ఏ జనుల్ మముంపరిహసింపనేమి లాభమో …..
  అంటారా మాస్టారూ, రంగాజమ్మ గారి పద్యంలో లాగా ? 🙂

  Like

  Reply

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s