దేవలోకంలో వైరల్‌ న్యూస్ : వినాయకుడు, వెంకటేశ్వరుడు చేతుల మీద గిల్లుకుని, ఇది నిజమే అని ….


దేవుడనేవాడు లేడంటే లేడు, వుంటే చూపించండి??

దేవుడేంటండీ, దేవుడు?? అదంతా నాన్సెన్సండీ!!

నాటి హిరణ్యకశిపుడి**తో మొదలెట్టి నేటి హేతువాదుల వరకూ ఇదే కదా యవ్వారం!! (** ఈయన మొదట విష్ణువుకి ఎసరు పెట్టడంతోనే హేతువాదం మొదలైయ్యుంటుందని ఒక అనుమానం!)

ఇప్పుడింక ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళకి రిటైర్మెంటే!!

దేవుడున్నాడని

బల్లగుద్ది,

కుండబద్దలు కొట్టి,

ఇంకా ఏవైనా సామాన్లుంటే వాటిని

విరక్కొట్టి,

పగలకొట్టి,

చితక్కొట్టి,

కాల్చేసి,

పేల్చేసి,

మరీ చెప్పడానికి తిరుగులేని ఆధారం దొరికేసింది.

దేవుడి ఉనికిని నిరూపించేస్తున్నామంటూ టీవీ చర్చల్లో డిజైనర్ కళ్ళజోళ్ళు పెట్టుకుని, లాప్-టాప్ ఒకటి పెట్టుకొని పాతసోదినే ఇంగ్లీష్ లాంటి తెలుగులో చెప్పేవాళ్ళకి,

వేదాల్లో వున్న సైన్సుని వెలికితీసే పని జర్మనీవాళ్ళకి ఔట్ – సోర్స్ చేహేసి, ఇక్కడ టీవీల్లో, “అన్నీ వేదాల్లో వున్నాయి ………………….

…………………………………

………………………………..

………………………………..ష,” అంటూ గొంతు చింపుకునే వాళ్ళకి

పరిశుథ్దాత్మని సో-కాల్డ్ paganistలు చెప్పిన వేదాల్లోంచి

బైటికి లాక్కొస్తున్న దార్శనికులకి

ఇలాంటి వాళ్ళు చేసే అర్థం, పర్ధం లేని చర్చల మీద డబ్బులు చేసుకుంటున్న ‘ఛా”null’s కి పని లేకుండా చేసేసే బ్రహ్మాండమైన సాక్ష్యం బయట పడిపోయింది.

నిజానికి దేవుడిక్కూడా తన ఉనికి మీద ఎప్పుడైనా డౌట్ , ఫర్ సపోజ్, వచ్చినా దాన్ని పటాపంచలు చేసెయ్యగల తిరుగులేని రిఫరెన్సు ఆయనకీ అందుబాటులోకి వచ్చేహింది.

లోకకళ్యాణం కోసమని ఆ యొక్క ఆధారాన్ని , ఆ మధ్య “ఈనాడు” పేపర్లో దొరికితే కట్ చేసి ఇక్కడ పెడుతున్నా.

ఇంక ప్రజలు ఆయుత యాగాలూ, తమ్మిలేరు, బుడమేరు, పాలేరు, సీలేరు ప్లస్ మూసీనది….. అన్నిటికీ మహాపుష్కరాలు, వగైరాలు కాన్ఫిడెంట్ గా చేసేసుకోవచ్చు.

అదుగో 👇 ఆధారం

(News & Photo courtsey: Eenadu)

ఆయనని చూసి వినాయకుడు, వెంకటేశ్వరుడు ఎవరికీ కనిపించకుండా చేతుల మీద గిల్లుకుని మరీ ఇది నిజం అని నిర్ధారణ చేసుకున్నారని దేవలోకంలో నారదులవారూ, గూగుల్ కలిసి మరీ న్యూస్ వైరల్‌ చేస్తున్నారట. (వివరాలకి త్రిపుర సీఎంని సంప్రదించగలరు.)

సూచన:

హేతువాదులకి దిమ్మ దిరిగే సమాధానం ఎలా చెప్పాలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారా? ఆయనని మీ బదులు చర్చకి పంపండి, చాలు.

హేతువాదుల చేత రామ

సేతువు మీద శ్రీరామకోటి

క్రతువు చేయించకపోతే చూడండి.

సమస్త నాస్తికాఃస్సుఖినో భవంతు

ఇంతేసంగతులు. బై4నౌ😎