ఇవాళ, ఆదివారం చాలా లేటుగా మెలుకువొచ్చింది. ఎంత లేటంటే అది లంచ్ టైముకి తక్కువ, బ్రేక్ ఫాస్ట్ కి ఎక్కువా. అసలే చిరాగ్గా వుంది. టిఫిన్ ఏంటా అని చూస్తే అస్సలిష్టంలేని అటుకుల ఉప్మా !! తప్పక తిని, ఆ తిన్న పాపాన్ని నాలిక మీంచి కడిగేసుకుందామని మంచి కాఫీ ఒకటి కలుపుకుని దాన్ని పుచ్చుకుంటూ (పవిత్రమైన ద్రవాలని తాగకూడదు, పుచ్చుకోవాలని పెద్దలు చెప్పిన మాట!) వాట్సప్ ఓపెన్ చేశాను.
ముందు అన్నీ రొటీన్ ఫార్వార్డెడ్ మెసేజులు, పాటించలేక ఫార్వార్డ్ చేసేసిన అరిగిపోయిన సూక్తులు, దేవుళ్ళ బొమ్మలు వుండే గ్రూపులన్నీ దాటుకుని మా కాలేజీ గ్రూప్ కి చేరుకున్నాను. మా ఈ గ్రూపుకి క్రియేటివ్ అనే సఫిక్స్ ఒకటి పెట్టుకున్నాం. అంచేత ఇక్కడ సూక్తులు, ఫార్వార్డ్స్ బాగా తక్కువ.
మొట్టమొదట – యూ.ఎస్. నుంచి సేద్యం, సాహితీసేద్యం రెండిటి రుచీ తెలిసిన క్లాస్-మేట్ పెట్టిన పోస్ట్ పలకరించింది. ఆకుపచ్చటి తీగల నేపధ్యంలో గోల్డెన్-ఆరెంజ్ కలర్ లో మెరుస్తున్న దోసకాయలు, తన పెరటిలో పండినవి – ఆ ఫోటో పెట్టాడు.
చూస్తుంటే దోసకాయ ముక్కల పచ్చడితో మొదలుపెట్టి –
- దోసకాయ కాల్చిన పచ్చడి
- దోసకాయ పప్పు
- దోసకాయ కూర
- దోసకాయ ఆవ పెట్టిన కూర
- దోసకాయ సాంబారు
- లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, దోసావకాయ.
ఇలా దోస అవతారాలన్నీ గుర్తొచ్చి నోరూరించాయి. అటుకుల ఉప్మా తిన్న దోషం, దోసకాయ మహాత్మ్యం తలుచుకోవడంతో ఎగిరిపోయింది. కాఫీ మరీ రుచిగా అనిపించింది. ఇంక ఆనందం పట్టలేక నా స్పందనని ఇలా ఇచ్చాను.
దోసకాయ, a simple but great, spritually-loaded vegetable.
Its greatness spans from human taste buds to Vedas.
To understand that you will have to taste దోసావకాయ and explore the simple meaning of the vedic chant Maha Mrutyumjaya mantram.
It is easy to see that dosakaya is capable of subjecting man (& woman) to Attachment in the form of దోసావకాయ and also to liberate all in the form of Mrutyumjaya mantram by its own example. (Tells how easily a ripe dosa kaya detaches from its creeper)
ఇది నచ్చిన అమేరికా ఫ్రెండు అప్పుడే తరిగిన దోసముక్కల ఫొటో పెట్టాడు.
గ్రూపులో అందరికీ అమ్మమ్మలు దోసకాయ చేదుగా వుందో లేదో రుచి చూసి చెప్పమన్న చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి.
ఇంతలో మరో ఫ్రెండు అన్నాడు –
“పండినవీ, ఎండినవీ ఏవైనా బంధాలు తెంచుకోక తప్పదుగా,” అని.
“అవును బ్రదరూ ! ఆ సంగతి దోసకాయకి తెలుసు కానీ, మనిషికి తెలీదు. తెలుసుకోడు.
మృత్యుంజయ మంత్రం అంటే మరణాన్ని ఆపేది అనుకుంటాడు కానీ దాన్ని తృణప్రాయంగా తీసుకుని దోసకాయ తన తీగ నుంచి విడిపోయినట్టు ప్రపంచం నుంచి విడిపోగలడా? ఇహలోకంలో ఇన్ష్యూరెన్సుల నుంచీ పరలోకంలో రంభ పక్కన బెర్తు వరకూ ఎన్ని వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి పాపం!!, ” అని రిప్లై ఇచ్చా.
ఇంతలో ఇంకో మెసేజ్ వచ్చింది. ‘ఠంగ్’మంటూ. ఏం లేదు, సింపుల్ గా “దోసావకాయ!! ఐ లవ్ ఇట్😋😋😋😋!!” అని వుంది.
అవును, ఎటాచ్-మెంటుకైనా, డిటాచ్-మెంటుకైనా దోసకాయ ఇచ్చినంత ఎఫెక్టివ్ మెసేజ్ ఏ గురువులూ, స్వాములూ ఇవ్వలేదే(రే)మో అనిపించింది.
దోసకాయాయ విద్మహే దోషరహితాయ ధీమహి
తన్నో దోసావకాయ ప్రచోదయాత్
ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః
బై4నౌ🙏😋
దోసాయ గుండ్ర రూపాయ దోసావకాయాయ దోసవే
నమో కర్కటి నామధేయాయ నక్కదోసాయ నమో నమః!
LikeLiked by 1 person
లలితగారూ, శ్లోకం లా జవాబ్. ఈ వారంలో మీ ఇల్లు దోస రెసిపీలతో ఘుమఘుమలాడే సూచనలు కనిపిస్తున్నాయి.😊
LikeLike
వంకాయ వంటి కూరయు
దోసావకాయ వంటి పచ్చడియును
“జిలేబి” వంటి మధురము
వైవీయార్ వంటి కాఫీగత ప్రాణియును గలరే ॥
🙂
https://polldaddy.com/js/rating/rating.js
LikeLiked by 1 person
ఆహా ! యంతభిమానము !
స్నేహానికి కూడ యింత చేవలు గలవా !
సాహో ! ‘ జిలేబి మధురిమ ‘ !
ఁఊహూ ! వంకాయ దోస లొప్పవు ‘ తన ‘ తో .
LikeLike
వీఎన్నార్ సర్! మీ పద్యంతో ఎటాచ్ – మెంట్లూ, భవబంధాలు మరీ మధురమై పోతున్నాయి.😋😊
LikeLike
పసిమి మిసిమి చూడ పసిడికి సరితూగు
నాల్క మీద రుచులు నాట్యమాడు
పప్పులోకి గాని పచ్చడిలో గాని
పులుసు లోకి దోస ముదము గూర్చు .
LikeLiked by 1 person
మాస్టారూ నమోన్నమహ🙏 దీన్ని ఎటాచ్-మెంట్ దోసకాయ అనొచ్చు😋.
LikeLike
దోసాభిమానము నాకు గలదని ఒట్టిమాటలు చెప్పబోకోయ్
పూని యేదైనను పప్పుగాని పచ్చడి గాని చేసి రుచి చూపించు మోయ్ 🙂
జిలేబి
LikeLiked by 1 person
Super paraphrasing “జిలేబి” గారూ 👌 🙂.
LikeLike
జిలేబిగారు, రుచి చూపించటానికి మేము రెడీ, ఒక్క మెయిలు కొట్టి మా వూళ్ళో అయ్యరు-సమేతులై వాలిపోండి. అయ్యరుగారికి డిగ్రీ-కాఫీ కూడా ఇస్తాము. 😊
LikeLike
హైదరాబాద్ లో దోసకాయలు కొని, వండుకుని తిని చూడండి. వెధవ దోసకాయలు ఒక రుచీ పాడూ ఉండదు. పులుపు లేని దోసకాయలు చూసి జీవితం (వంట)మీద విరక్తి వచ్చేసింది.ఎవడిమీదయినా కోపం ఉంటే దోసకాయ సాంబార్ చేసి కోపం తీర్చుకోవాల్సిందే !
LikeLike
నీహారిగ్గారూ, ఖచ్చితంగా అవి మూసీనది నీళ్ళు తాగి పెరిగిన దోసకాయలయ్యుంటాయ్. వీటిని డిటాచ్-మెంట్ దోసకాయలుగా క్లాసిఫై చేద్దాం.
ఓం త్రయంబకం యజామహే…. ఉర్వారుక మివ…..😁😁😁
LikeLike
నీహారిక గారూ, హైదరాబాద్ దోసకాయల గురించి వైవీయార్ గారు చెప్పింది కరక్టేననిపిస్తోంది.
అవునూ అదేమిటి, మీరుంటున్నది శ్రీకాకుళ ప్రాంతంలోననుకున్నానే (కృష్ణాజిల్లా) 🤔. కాదా?
హైదరాబాదులోనా? పోన్లెండి ఇంతకీ ఎప్పుడైనా పులిగడ్డ వారధి, హంసలదీవి చూశారా?
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
మాది కృష్ణా జిల్లా శ్రీకాకుళమే ఉద్యోగరిత్యా నివాసం హైదరాబాద్ !
దోసకాయే కాదు వంకాయది కూడా దరిద్రపు బ్రతుకే అసలు నీరు ఉండదు.
ఇక్కడ స్వేదం కూడా కరువే కాబట్టి కూరగాయల నుండి ఏదీ ఆశించలేం
పులిగడ్డ వారధి మా తాతగారు కట్టించినదే అది పాతది అవడంతో ఇపుడు కొత్తది కట్టారు.
LikeLike
Oh I see. Nice to know about your grandfather.
LikeLike
పులిగడ్డ నే బిడ్డ, అడ్డెడ్డె అద్గదీ మా తాతదా అడ్డా.
తెలియరే ఓ బిడ్డా ! అడ్డుకత గాదిది, రొడ్డుగ జెప్ప
పులి బిడ్డ నాకేది అడ్డు, తెడ్డు ఒడ్డగ బట్టి
తెలిపెదా దొడ్డగా, అడ్డొచ్చె నెవరేని వాని పిడక బెడ్డన గొట్టి !
(గురుశ్రీ శ్రీ లక్కాకుల వారి ఆశీస్సులతో …)
(నీహారిక గారు జస్ట్ ఫన్ అండీ) 🙂
LikeLike
ఇక్కడంతా దోస దోసగా – గోస గోసగా ఉందేంటబ్బా … !
ఓ ప్రక్క మైక్ లో …
“దోసగొట్టండోయ్ బాబూ దో’సావ’ (కాయ) ‘బెట్టండోయ్” … ఆ(క్రో)వేశం …
ఇంకో ప్రక్కన భక్త బృందం భజన …
“శ్రీరంగ రంగ రంగా మీకు దోసావకాయ పైన బెంగా
సాంబారు కూర పప్పు పచ్చడీ చెయ్యరే దోస తేంగా / సుబ్బరంగా” … పరవశం.
ఇంకొకాయన హై పిచ్‌లో అసహనంగా …
“ఎన్నాళ్ళో కాసిన దోసా నోట బెడితే చేదవుతుందా
రుబ్బి రుబ్బి పచ్చడి చేస్తే టేష్టంత పాడవుతుందా” … అనుమానం.
ఇంకొకావిడ …
“దోసా దోసా తూచ్ … పచ్చడి పెడతానోచ్” … ఇల్లాలి అచ్చటముచ్చట.
ఆ ప్రక్కన పందిట్లో …
దోస కోసే విధము తెలియండీ … దోసావకాయ నోట మూసే విధము తెలియండోయ్” … ఉపదేశం.
నేను …
వీఎన్నారు గానీ వైవీయారు గానీ
దోస ఆశ పెట్టగానే లొంగి/పొంగి/పోదురోయ్ … దోసహోయ్ … దాసహోయ్ … ప్యాసహోయ్ … స్నేహభావం.
అందరూ …
దోసావ సమేత … యార్ వైవీయార్ … యూ సర్టిఫికెట్.
ఒక దోస – పలు రసాలు.
(ఓరి నీ ఏసాలో … నా పై మీ -భిప్రాయం …)
ఈ దోస పురాణం విన్నవారు – దోసోహమగుదురు గాక … ఓం దోత్సత్ …
(నా రాతకి నా టైటిల్ : రాద్ధాంతం🤚☝️ఆఫ్ దోస(ఆవ)కాయ😋)
(వైవీ’యార్’ గారో … జస్ట్ ఫన్న సారో …)
🙂
LikeLiked by 1 person
ఱావు సార్! దోసకాయ ఇంత సాహిత్యం సృష్టిస్తుందని, తెలుగు భాషకింత సేవ చేస్తుందని అస్సలనుకోలేదు. వహవ్వా!వహవ్వా!
LikeLike
ఆదాబు ఆదాబు …
మీ జాబు బహు బాగు … 🙂
__/\__ …
LikeLike
నాది కూడా అదే (వైవియార్ గారి) మాటగా వేసుకోండి బండి వారూ 👌.
LikeLike
భలే భలే ..
మీక్కూడా ఆదాబేసుకున్నాను సార్ …
‘విన్నారు’ గా(రూ) !?
🙂
LikeLike
విన్నా విన్నా 🙂.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
రాద్ధాంతం🤚☝️ఆఫ్ దోస(ఆవ)కాయ😋
Super 🤓
LikeLike
సిద్ధాంతులకే గాక రాద్ధాంతులకి కూడా
అభిమానులుంటారా … !! wow …
మంగిడీలు మంగిడీలు … 🙂
LikeLike
రావణాసురుడికి అభిమానులు లేరా? అలాగ ఎవరికుండే అభిమానులు వారికుంటారన్నమాట 😀😀.
jk👍☺
LikeLike
“అటుకుల ఉప్మా” … my nemesis too YVR గారూ 😢.
LikeLike
అటుకుల ఉప్మా దరిద్రానికి తోడు అమ్మ(అయ్య)లక్కలు కొత్తగా కనిపెట్టిన ముదనష్టం పేరు ఓట్స్ ఉప్మా …యాక్ 😭
LikeLike
థాంక్సండీ, oatsని ఓట్స్ అని సరిగ్గా రాసేవాళ్ళని చూసి ఎన్నాళ్ళయ్యిందో అసలు. తెలుగు పేపర్లు మరీ దారుణం Votesని ఓట్స్ అనీ, Oatsని వోట్స్ అనీ రాసి చంపేస్తున్నాయి తెలుగునీ, నన్నూ🤣
LikeLike
ఓట్స్ తో చేసినవన్నీ … యాక్కే 😲.
18వ శతాబ్దపు ప్రసిద్ధ ఆంగ్ల రచయిత Dr.Samuel Johnson గారు (ఇంగ్గాండ్) ఓట్స్ గురించి అన్న మాటలు –> “A grain which in England is generally given to horses, but in Scotland supports the people.”
☺
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
VNRగారు, జాన్సన్ ఏ సందర్భంలో అలా అన్నారు?
LikeLike
YVR గారూ, Samuel Johnson గారు ఆంగ్ల నిఘంటువు dictionary తయారుచేశారు. దాంట్లో ఓట్స్ కి జాన్సన్ గారిచ్చిన అర్థం / నిర్వచనం ఇది.
http://www.bl.uk/learning/langlit/dic/johnson/oats/oats.html
LikeLike
Thankyou, sir. మీరు ఇలాంటి anecdotes వ్రాయడానికైనా ఒక బ్లాగ్ పెట్టాలండి. Of course, ఇలా కూడా బావుంది, బ్లాగ్ లో ఐతే anecdotes లైబ్రరీలా ఇంకా బావుంటుందని నా ఆలోచన.
LikeLike
ఓట్స్ పాయసం ఐదు నిమిషాల్లో తయారవుతుంది.సేమ్యా పాయసం లాగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది అన్నారని వండుతున్నాను. త్వరగా అయిపోతుంది కాబట్టి (పిచ్చుక గూళ్ళు కూడా అలాగే వండుతున్నాను) నాకు నచ్చింది.
LikeLike
పిచుక గూళ్ళు వండడమా? చైనీస్ బర్డ్స్ నెస్ట్ డ్రింకులాగా మనకీ అలాంటివి వున్నాయా?
LikeLike
బ్లాగరోత్తములారా! దోసకాయ చెప్పిన ఎటాచ్ -మెంటు / డిటాచ్-మెంటు వేదాంతంపై కూడా కవితలు, కామెంట్లు పెట్టి కర్కటి జీవితమును ధన్యము చెయ్యరా !?!😊
LikeLike
దోస యటంచు నాల్కపయి తుప్పు వదల్చుక గొప్ప గొప్పగా
జేసి పొగడ్త కెత్తితిరి , చేపలు రొయ్యలు వేపి తింటిరా ,
బాస తెలీని వాళ్ళును శభాషని తెల్గు కవి ప్రవీణులై
దోసను దోషమున్నదని దూరము వెట్టుట తథ్య మన్నలూ !
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
‘దోస’మటంచెరింగియును దుందుడుకొప్పగ జంట కవులుచెప్పినవి,
చేపలని రామాయణమని చెపుతూ భోజరాజుని బుకాయించి కాళిదాసు చెప్పినవి, blasphemous beef తిని మరీ కీట్స్, రాబర్ట్ ఫ్రాస్ట్, ఒమర్ ఖయాం చెప్పినవీ కొంచెంగానే అయినా అన్నీ రుచి చూశాం మాస్టారూ, నో డిస్ప్యూట్ విత్ యూ 🙏😊
LikeLike
అయ్యయ్యొ అయ్యోరు మొదలు పాఠము బెట్ట
రొయ్యేసి, చేపేసి దోస పాకము గట్ట, రుచి జెప్పి రేపెట్ట
అయ్యలమ్మలు గలిసి, అన్న మాటకు మురిసి, మొదలెడ్తు
రా ఏమి, మాయ మాటల మురిసి, తెలుగు ప్రావీణ్యపు దారి బారు గట్టి !
(ఇక అయ్యరు గారి రంగ ప్రవేశమే ఆలీసం …)
LikeLike
బొరుగుల(మరమరాల) తో ఉప్మా (అంటారో మరేమంటారో) కర్నూల్ లో B.ed , చేసేప్పుడు
చూసేను . ఎలా ఉంటుందో , టేస్ట్ చెయ్యలేదు .
బొరుగులతో చేసే ఆ ఫలహారం పెట్టక పోతో ,
ఆ ఇంట్లో పిల్ల నియ్యరట , వాళ్ళను చులకన
చేసి మాటాడతారని అనగా విన్నాను .
LikeLike
అటుకులు, మరమరాలు, పాప్‌కార్న్ లాంటివి కొంచెం వేడి చేసుకుని (సినిమా చూస్తూ) నమలడానికి బాగుంటాయి కానీ ఉప్మా అంటే తినరు వైవీఆర్ గారిలాగా (సన్యాస)వేదాంతం లోకి పోయే ప్రమాదం కూడా ఉంది.
LikeLike
ఏం చెప్పమంటారు ?
మీది (దోసకాయ)వేదాంతం …మాది గుమ్మడికాయ జీవితం 😎
గుమ్మడి తిన్నా.. (ఎత్తి) పగలగొట్టినా (గృహప్రవేశం) శుభం….పంచితే పుణ్యం ! వదిలించుకుందామనుకున్నా వీడని బంధం 👫
LikeLike
పుట్టుటయు నిజము (దోస) పోవుటయు నిజము (దోస) నట్టనడిమి పని నాటకము (గుమ్మడి)
😊😊😊😊😊😊
LikeLike
@YVR
// “పిచుక గూళ్ళు వండడమా?” //
—————–
హ్హ హ్హ హ్హ , నిజం పిచ్చుకగూళ్ళు కాదండి. కోనసీమలో ముస్లింలు తయారుచేసే ఒక స్వీట్. “గరాజీలు” అంటారు. వాటికే మరో పేరు పిచ్ఛుకగూళ్ళు (నీహారిక గారు అన్నది దీన్ని గురించే అనుకుంటున్నాను సుమా).
https://youtu.be/lw6ykj_78bs
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
వీఎన్నార్ సర్, రక్షించారు. దేశంలో పిచుకలు తగ్గిపోవడానికి వాటి గూళ్ళని వండేసుకోవడమే అనుకుని కంగారు పడ్డాను.🤗
LikeLike
హ్హ హ్హ హ్హ. అందులోనూ మీరు పక్షిప్రేమికులు కూడానూ, కాబట్టి కంగారు పడడం సహజమే 🙂👍.
LikeLike
// “…… Samuel Johnson గారు ఆంగ్ల నిఘంటువు …..” //
——————-
అసలు సంగతి …. జాన్సన్ గారికి స్కాంట్లాండ్ దేశస్ధులంటే చిన్నచూపుట, చులకనట.
LikeLike
థాంక్స్ YVR గారూ. బ్లాగ్ మొదలెట్టడం సంగతి ఆలోచిస్తున్నా …. చిస్తున్నా 🙂.
LikeLike
చించుడీ అతిత్వరలో 🙂
ఆలోచిస్తున్నా నే
నాలో చింతనల బ్లాగు నన్ సమ గూర్చన్
మాలిక గాను జిలేబీ
గోలవలెన్ వేయగనిదిగో త్వరితముగా ! 🙂
జిలేబి
LikeLiked by 1 person
Sir, countdown మొదలైంది. పాఠక సూపర్ స్టార్ కొనసాగిస్తూనే వారానికో టపా వెయ్యచ్చు, ఆలోచించండి.
LikeLike
పాఠక సూపర్స్టారను
నా ఠాణాదారు వృత్తి నాగాడునకో?
లాఠీపట్టుకు తిరుగుచు
కాఠంబుల వేయ కుదరకన్బోవునకో 🙂
నారదా!
***
కొనసాగించండయ్యా
వినరావయ్యా కమింట్ల వేగము తో, మీ
రనుకున్న టపా వార
మ్మునకొక్కటి వేయుచున్ దుముకుడీ బ్లాగ్లోన్ 🙂
జిలేబి
LikeLike
హరిబాబు గారిని పంపేసి నారసింహుడిని రణరంగంలోకి ఆహ్వానిస్తున్నారా ? ఈయన కూడా అలుగుతారండీ !
నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకున్నాక యుద్ధం చేస్తాను అంటే కుదురుతుందా ?
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
సింహానికి సింహమే సాటి!
హరి = సింహం అని డిక్షనరీ మీనింగు. బాబు = నర అని మనం అర్థం తీసుకుందాం. సార్లిద్దరూ ఒప్పుకుంటే😊
ఐనా హరిగారిని నేను పంపెయ్యడమేంటండీ, రామ రామ, నన్నొదిలెయ్యండి ప్లీజ్!!
LikeLike
మీ సింహాలోకనం మహ సెహ’బాసూ’ … (అన్నట్లు
[మీ గురించి మీరే చెప్పుకోవాల్సి వచ్చిందే అని ముందు ముందు సింహావలోకనం చేసుకోవాల్సిన పరిస్థితి ఇలా వచ్చిందేంటబ్బా అనుకోకుండా, కొంచెం పెద్ద మనసు చేసుకుని]
సింహాల్ని ఇట్టే ప(సిగ)ట్టే వారిని ఆంగ్లమున ఏమందురో ఓ ముక్క-లో ఇట్టే చెప్పగలరు).
‘నర”సింహా’ గారిని ‘హరి”సింహా’ గారితో ఒకే లై(బో)న్లో … wow …
🙂
LikeLike
ఎన్నెమ్ సార్! నా గురించి నేను చెప్పుకోవడమా!!🤔🤔
సింహాలు, పులుల అడుగుజాడల బట్టీ వాటిని పసిగట్టే వాళ్ళని ట్రాకర్స్ అంటారని మాత్రమే తెలుసు.
LikeLike
వైవీయార్ సార్ …
తికమకకు కారణమైనందుకు క్షంతవ్యుడిని.
నా ఉద్దేశ్యం ఏమిటంటే … “సింహానికి సింహమే సాటి! …
అని జోడు సింహాల్ని ‘ట్రేస్ చేసిన మీరే’
మళ్ళీ ‘ట్రేస్ చేసిన వాళ్ళను’ ఏమంటారో
అన్న ప్రశ్నకు జవ్వాబు చెప్పాల్సి వచ్చిందే …
అన్న అర్ధం ప్లస్ సింహావలోకనం పద ప్రయోగం
కూడిన సందర్భంగా కించిత్ జోక్యూలర్ గా వాడబడింది.
seems like i failed to convey the undercurrent properly …
🙂
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
నో ప్రాబ్లమ్ సార్!😀
LikeLike
విను విన్నకోట పలుకుల
గనుడయ్యా వైవి యారు గర్జన నదిగో
మననర సింహా రావుల్
మన ముచ్చటతీర బ్లాగు మడిసి యగుదురౌ 🙂
జిలేబి
LikeLiked by 1 person
ఘను లంభోనిధి నీది నట్లు తెలుగున్ గాలించుచున్ , సంస్కృతీ
వనధిన్ దేలుచు , నాంగ్ల సాహితి మహా వారాశి లంఘించుచున్ ,
వినుతుండై వెలుగొందు శ్రీ నరసరాడ్విఙ్ఞాన జిఙ్ఞాసువుల్
తనకోసం బొక బ్లాగునే తెరువ , నేతద్కార్య మీప్సించెదన్ .
LikeLike
🦁 బ్లాగర్ అయితే “పాఠక సూపర్ స్టార్” పదవి పోతుంది మరి….చించండి!
LikeLike
అదీ పాయింటే కదా నీహారిక గారు 👌. అయితే మరింత ఆలో … చించాలి. దిశానిర్దేశం చేసినందుకు థాంక్సండీ.
LikeLike
నీహారిక గారు నా శ్రేయోభిలాషుల వర్గంలో వ్యక్తి. కాబట్టి బ్లాగ్ విషయంలో ఆ రకంగా ముందుకు పోదాం అని నిర్ణయించుకోవడం జరిగింది 🙂.
LikeLike
డిజప్పాయింటెడ్🙁
LikeLike
Sorry YVR but then life is like that ☝☺.
LikeLike
👍😊
LikeLike
మీ మాటలనుబట్టి మీరు విన్నకోట నరసింహారావు గారు వ్రాసిన జీవితచరిత్ర చదవలేదని నా భావన. వీలుచూసుకుని తీరికగా ఉన్నపుడు అక్షరం అక్షరం శ్రద్ధతో చదవండి. భలే ఆసక్తికరమైన జీవితసత్యాలు మీకు బోధపడతాయి.
http://kinige.com/kbook.php?id=156
LikeLike
ఓహ్! మెనీ ధాంక్స్ నీహారికాజీ! తప్పక చదువుతాను.
LikeLike
మీ పోస్టు చూసాక ఈ రోజు దోసావకాయ పెట్టేద్దామని నిర్ణయించేసుకున్నాను. పోస్టు బావుంది. వ్యాఖ్యలు అంతకంటే బావున్నాయి. 🙂
LikeLike
వెరీగుడ్ చంద్రికగారూ! నీహారిక గారి వ్యాఖ్య చూశారుగా! హైదరాబాద్ దోసకాయలు మాత్రం వాడకండి😄
LikeLike
హైదరాబాద్ వి కాదు లెండి. ఫ్లోరిడా నుంచీ కావచ్చు.
LikeLike
ఇండియా నుండి మంచి మంచి మామిడికాయలూ, రొయ్యలూ, చేపలూ ఎగుమతి చేస్తారు అని తెలుసు.అక్కడ పండే దోసకాయలు ఎలా ఉంటాయో అమెరికాలో ఉండేవాళ్ళు చెప్పాలి.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
అమెరికాలో పుల్లగానే ఉంటాయండీ. అయినా మీరు మా హైదరాబాద్ లో ఉంటూ దోసకాయలు బాలేవు అని చెప్పడం బాలేదండీ 🙂 . హైదరాబాద్ లో ఏది ఎలా ఉన్నా బావుంటుంది 🙂
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
వాష్ రూం లో నీళ్ళకు బదులు పేపర్లు వాడే దేశాల్లో కూడా దోసకాయలు పుల్లగానే ఉన్నాయా ?
మీ నగరానికి ఏమైంది ?
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike