అం’తరంగా’లు చూస్తున్న చదువుతున్న బ్లాగ్ బంధుమిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలతో –
అణువు నుంచీ ఆకాశం వరకూ
అంతరంగం నుంచీ అంతరిక్షం వరకూ
అంతటా వ్యాపించిన ప్రకృతి (నామ,రూప, పదార్థాల సమాహారం) పురుషులు (జాగృతి = చైతన్యం = జ్ఞానం = ఆత్మ) ఒకరినొకరు గుర్తించి, ఒకరు లేకుండా మరొకరి అస్థిత్వానికి ఆధారం, అర్ధం లేవని తెలుసుకున్న రోజు విజయదశమి,
ఈ తెలుసుకునే ప్రాసెస్ లో ప్రకృతి -పురుషులు పడిన స్ట్రగులే తొమ్మిది రోజుల యుద్ధం.
తమోగుణాన్ని రజోగుణం, రజోగుణాన్ని సత్వగుణం డామినేట్ చెయ్యాల్సిన అవసరాన్ని ఎత్తి చూపడమే దున్నపోతుని చెండాడుతున్న సింహం, ఆ సింహాన్ని అధిరోహించి అదుపులో వుంచిన దుర్గాదేవిల వెనకవున్న సింబాలిజం, అంతరార్ధం.
ఇలా అంటున్నాయి ఇవాళ అంతరంగ తరంగాలు.
సమస్తదేవతాశక్తుల సమన్వయ రూపమైన దుర్గ స్త్రీ రూపంలో ఎందుకుందని అడుగుతున్నాయి ఆలోచనాతరంగాలు.
సమాజం కానీ, సంస్కృతి కానీ, ప్రభుత్వం కానీ ఇవన్నీ జీవ చైతన్యానికి, మానవ బుద్ధి వికాసానికి ప్రతీకలు అనుకుంటే వీటన్నిటిలో పురుష సహజమైన ధృఢత్వం, గాంభీర్యాలకంటే స్త్రీ సహజమైన లాలిత్యం, ప్రేమ, మమకారాలు ఒక్క పిసరు ఎక్కువ మోతాదులో వుండాలని సూచించడమే దుర్గారూపాన్ని దర్శించిన ద్రష్టల ఆంతర్యం అయ్యంటుందని అవి భావిస్తున్నాయి.
ఆ రకంగా పురుషాధిక్య సమాజంలో స్త్రీకి ఇవ్వాల్సిన గౌరవాదరాలు ఏమిటో భవిష్యత్తు (అంటే, ఈనాటి గర్ల్ ఛైల్డ్ పరిస్థితి) చూసిన ఋషులు ఈ విధంగా చెప్పారేమో!?! అనుకుంటున్నాయి హృదయాంతరంగాలు.
ఇలాంటి ఆలోచనలు వదిలేసి మహిషాసుర మర్దనలో కుల రాజకీయాలని చూడ్డం వల్ల, దేవీ పూజలో తాంత్రిక వ్యవహారాలకి పెద్దపీట వెయ్యడం వల్ల జగన్మాతకి మన మీద సదభిప్రాయం కలుగుతుందా? ఏమో? ద్రష్టలైన ఋషులని అడగాల్సిందే అని ముక్తాయిస్తున్నాయి కరుణాంతరంగాలు.
ఇంతే సంగతులు.
బై4నౌ🙏😊
మీకందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు.
LikeLike
అన్యగామి గారూ నెనరులు.
LikeLike
అతడు ఎద్దు మీద , ఆమె సింహము మీద
సగము సగము తనువు సతి పతులకు ,
ప్రకృతి పురుషు లందు పరమాత్మ యెవ్వరో !
అమ్మ యే యొకింత యధిక మేమొ !
LikeLike
ధన్యవాదాలు మాస్టారూ !!
LikeLike
మీరేమో యిక్కడ యిజాల గురించి మాట్లాడుతున్నారు.
లక్కాకుల వారే మో అక్కడ బలిజాలగురించి మాట్లాడతా వుండారు 🙂
ఈ జాలకు యే మై నా అంతరంగాంతరంగ some బంధం ఏమైనా వుందా 🙂
బ్రేవ్
తెలుగు బ్రేవ్ 🙂
జిలేబి
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
హేవిటో, యిజాలు కూడా ట్రెండు ఫాలో అవుతు న్ నాయిా మధ్య. రామూయిజం, పవనిజం, బాహుబలిజం, హిప్-నాటీ -యిజం, etc, etc… కొత్తగా మీరు బలిజాం అంటున్నారు. ఇదేం జిలేబిజం కాదు కదా!!🤔🤔🤔🤔
LikeLike
బలిజను నేను , పుట్టువున పావని గంగకు తమ్ముడన్ , మహా
బలితలకెక్కి త్రొక్కిన శుభంకర విష్ణు పదోద్భవుండ , స్వ
స్థలమది కుల్లురీ పురము , సంపదలందున విద్యలందు భూ
తలమున సాటిలేని ఘనతల్ గల యూరిని బుట్టితిన్ కడున్ .
LikeLike