సైకిలు🚴‍♀️, ఫానూ🌀, కారూ🚗, ఒక తామర పువ్వు🏵.


అనగనగా ఒక తామరపువ్వు. అదిగో అదే👇

ఒకసారి దానికి దేశం అంతా తిరగాలనిపించింది. అదెలా సాధ్యం అవుతుందా అని ఆలోచిస్తూ వుండగా దానికో పసుపురంగు సైకిల్‌ కనిపించింది. సైకిల్ ని సలహా అడిగింది తామరపువ్వు. అప్పటికి చక్రాలు సరిగ్గా తిరగక స్లోగా వెళ్తున్న సైకిలుకి బ్రహ్మాండమైన ఐడియా తట్టింది. నా ముందు చక్రం సరిగ్గా తిరగట్లేదు, నువ్వు చక్రంగా వుంటావా? నువ్వూ నేనూ కలిసి దేశం అంతా తిరగొచ్చు అంది. ఇదేదో బానే వుందనుకుని తామర పువ్వు సైకిలుకి ముందుచక్రంగా అమరిపోయింది. “ఆడుతు పాడుతు పంజేస్తుంటే అలుపూ సొలుపే మున్నదీ, ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకూ కొదవేమున్నదీ…. ” అని యుగళగీతాలు పాడుతూ రెండూ కలిసి దేశం చుట్టేస్తున్నాయి.

కొన్నాళ్ళు అలా హనీమూన్ తిరిగాక తామరపువ్వుకి వెనకచక్రం లేకుండా ముందుచక్రం అంగుళం కూడా కదలదని అర్థం అయ్యింది. అయినప్పటినుంచీ, “నేను వెనకచక్రాన్నవుతా,”నని సణుగుడు మొదలుపెట్టింది. సైకిలుకి ఎడం కన్నదిరింది “”👁””. ఒకసారి వెనకకి మారగానే పెడల్ అవుతానంటుంది. ఆపైన సీటెక్కి కూర్చుంటానంటుంది. ఆ తర్వాత అంతే సంగతులు అని గ్రహించేసి, “అమ్మ! తామరపువ్వా!!,” అనుకుంది. అయినా ఓర్పుగా నేర్పుగా చెప్పింది, “సైకిళ్ళకి రెండు చక్రాలూ ఇంపార్టెంటే, ముందుచక్రం ఏ డైరక్షన్ చూయిస్తే వెనకచక్రం అటువైపు తోస్తుంది, అంచేత క్రెడిట్‌ అంతా నీకే దక్కుతుంది,” అంది. “ఠాట్! కుదరదం”ది తామరపువ్వు. “అలా అయితే నీ దారిన నువ్వు పో! అరిగిపోయినా, తిరక్కపోయినా నా పాత ముందుచక్రాన్నే పెట్టుకుని ఆ విధంగా ముందుకు పోవాల్నని డిసైడ్ అయినా, నువ్వు సైడ్ అయి పో!!,” అంది సైకిలు. అంటూనే తామరపూవుని తీసేసి కిర్రుకిర్రుమంటూ పోతోంది. ఎవరైనా ఒక చెయ్యేసి🤚 ముందుకు తొయ్యకపోతారా? అనే ఆశా, ఐడియా లేకపోలేదు.

తీ.తా. – తీసేసిన తాసిల్దారు కాదు, తీసేసిన తామరపువ్వు – ఇటూ అటూ చూసింది. “ఇప్పుడింక పవర్ లేకుండా క్షణం కూడా బతకలేను అదెక్కడ దొరుకుతుందో,”నని దిక్కులు చూసింది.

అప్పుడు దానికి గిరగిర తిరుగుతున్న ఫాన్ ఒకటి కనిపించింది. దాని దగ్గరకెళ్ళి, “నీకున్న మూడు బ్లేడ్లకి నా రేకులు కూడా కలుపుకో, ఇద్దరం కలిసి దేశంలో సుడిగాలి సృష్టించచ్చు,” అంది. “అదెలా?,” అంది ఫాను. “ఇలా👇,” అంది తామర .

“కానీ, ఫాను గాలికి తామరపూల వాసన కలిస్తే కొందరికి నచ్చదేమో,” అని సందేహం వెలిబుచ్చింది ఫాను. “అదీ నిజమే జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం,” అంది తామర.

ఇంతలో అటుగా వెళ్తున్న కారు కనపడింది దానికి. సైకిలూ, ఫానూ కంటే గ్లామరస్ గా, పవర్-ఫుల్‌ గా కనిపించింది. కారుకి కూడా తామరపువ్వు అందంగా, కలర్ ఫుల్‌ గా అనిపించింది. దీన్ని డాష్ – బోర్డు మీదో, బోనెట్ మీదో పెట్టుకుంటే తను ఇంకా గ్లామరస్ గా కనబడచ్చని ఆశ పడింది. కానీ తామర తగ్గదు కదా?

“నేను స్టీరింగ్-వీల్ గా కూడా పనికొస్తా,”నంది. “వీల్‌ + లేదు = వీల్లేదు!,” అంది కారు. స్టీరింగిస్తే డ్రైవింగ్ చేస్తాననే రకం తామరపువ్వని సైకిలు దగ్గరే తేలిపోయింది కదా! తెలిసి తెలిసి అలాంటి ఛాన్స్ ఇవ్వదల్చుకోలేదు కారు. “వీల్‌ + లేదు = వీల్లేదు అనేది ఏ సంధో తెలీదు కానీ, ఖచ్చితంగా ఏదో ఒక సంధి. అది వ్యూహాత్మక మౌనసంధి కూడా కావచ్చు. తరవాత చూద్దాం,” అంటూ వ్యూహాత్మకమౌనం పాటించింది. తామరపువ్వు వెయిటింగ్ లో వుంది. ప్రస్తుతానికి ఫానే కాస్త ఫేవరబుల్ గా కనిపిస్తోంది. కానీ గాలి ఎటు మళ్ళుతుందో చూడాలి. చూద్దాం!

ప్రస్తుతానికి ఇంతే సంగతులు.

బై4నౌ😁

33 thoughts on “సైకిలు🚴‍♀️, ఫానూ🌀, కారూ🚗, ఒక తామర పువ్వు🏵.”

 1. లచ్చిందేవి కుర్చీ తామరపువ్వు కదండీ. తామరపువ్వుకి మహా టెక్కు ఎక్కువ.

  శ్రీ మహా విష్ణువు “హస్తాన్నే” లెక్కజేయడం లేదు. సైకిలూ, ఫానూ,ఏనుగూ,టోపీ,కారూ,కత్తీ సుత్తీ, ఒక లెక్కా ?

  పుష్పక విమానం అయితే కాస్త బెటర్ కదా ? నక్షత్ర దర్శనం తో సహా లోకాలన్నీ చుట్టేసి రావచ్చు.

  Like

  1. మానక్షత్రం మరిసి పొయ్యారేవిటా అనుకున్నా , మా సెల్లెమ్ముందిగా , గుర్తు సేసింది పరాగ్గానైనా , అందునా ,
   కాపుల యెఱ్ఱంచు నక్షత్రం . ధన్యవాదాలు .
   ఈ పాలి ఏ బాబైనా , ఏ లచ్చిమైనా మేము లేకుండా
   ….. కురిసీ యెక్కడం కుదర్దు , కుదర్దంతే .

   Like

   1. మాస్టారూ, సరదాగా “క” గుణింతము అప్పజెప్పెదను, వినుడు 🙏

    కకారకారముల క – కళ్యాణ్
    కకారకారముల క – కన్నా
    కకారకారముల క – కమలం
    కకారాకారముల కా – కా___

    Like

     1. “పవర్” ఫానుకిచ్చి అది తిరిగితే వచ్చేది “పవన”మే కదా!పవరు+ఫాను = పవనం, సమీకరణం సరిపోయింది మాస్టారు.
      కమలం కమిలేనో! కుమిలేనో!!

      Like

   2. పరాగ్గా అనలేదన్నా….ఆలోచించే అన్నా…లోక్ సత్తా కూడా నచ్చత్రమేగా ! సూర్యుడు కూడా నక్షత్రమేగా సూర్యవంశమే కాపాడాలి !

    Like

    1. నీహారికగారూ , మీరు సూర్యవంశం అంటే రాములవారున్నారు మరి. రాబోయే ఎలక్షన్ల తరవాతన్నా (తరవాతే, ముందు కాదు) గుడి కట్టమని రాములవారు అప్పుడే అంటున్నాట్ట కూడా.

     Like

     1. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే !
      కర్ నాటకం!

      Like

    2. లోక్ సత్తాది బులుగు నచ్చత్రం . బ్లాక్ హోల్ లో పడిపోయింది . మాది పవర్ నచ్చత్రం ,
     మా పవర్ అంటి బురదతామర , తుప్పుసైకిల్లకే పవరొచ్చింది . మా పవర్ కు చెయ్యి వణుకు బట్టి ఇంకా సక్కంగా రాలా .
     తుప్పుసైకిల్ని ఆసరా చేసుకుంటోంది . ఈపాలి
     సైకిలూ , సెయ్యీ , తామరా మటాష్ …..
     అద్గదీ పవరంటే …..

     Like

    3. ఇక్ష్వాకుల వంశం… రఘువంశం గా.. ఎలా అయ్యిందో తెలుసు.. మరి ఆ రధువంశం సూర్యవంశం ఎప్పుడయ్యింది?

     Like

  2. నీహారికగారూ, హస్తంలో కమలం పట్టుకుంటాడు కదండీ శ్రీమహావిష్ణువు!! అంతకంటే కాంట్రావర్సీ ఉండదేమో 🤔😱

   Liked by 1 person

 2. ===

  లచ్చిందేవికి కుర్చి తామరకదా ! లావెక్కువేగాద సూ!
  బిచ్చంబెత్తిరి నాడు సైకిలుని, తాపీగాన తూతూ యనన్
  కచ్చల్గట్టి రణంబు జేసిరయ! పంకాతో సమాధానమో ?
  బొచ్చుల్రాలున కారు తోడు పయనంబొప్పారునా మానవా !

  జిలేబి

  Like

  1. //పంకాతో సమాధానమో ?//
   జిలేబిగారండోయ్!! రాఫెల్ బురదలో పడినా, పంకాతో జట్టు కట్టినా “పంక”జానికే చెల్లును.

   Like

   1. జిలేబిగారూ, ‘పంక’జం మీద ఒక పద్యమైనా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. మీరు చూడలేదో, ఏమోనని గుర్తు చేస్తున్నా. 😀

    Like

    1. మా నాన్నే ! మానాన్నే! కోరితే జిలేబుల వేయకుంటే యెలాగు 🙂

     పంకిల గాము మేమనుచు భారత దేశము మాది‌ యంచు మీ
     కింక వి కాస మేయనుచు కింకరు లంచు జిలేబు లౌచు మీ
     చంకన లంకెబిందెలని చట్టన మార్పిక తధ్యమంచు ఓ
     వంక నయోధ్య మందిరపు వాదకులై మన నేతలయ్యిరే 🙂

     నారదా!
     జిలేబి

     Like

      1. మీరు ఒకటి అడిగితే ఆవిడ రెండు వడ్డించింది.ఇంకానా ? అక్కడ విన్నకోట వారు గిల గిలా కొట్టుకుంటున్నారు.టౌను ప్రక్కకి వెళ్ళొద్దూ అంటే వింటేనా ?

       Like

 3. మానక్షత్రము కాపు చిహ్నమును భామా! చామ! నీహారిక
  మ్మీనాడిచ్చట త్రోసి పుచ్చిరకొ సుమ్మీ యంచువచ్చా ను! లే!
  మా నాణ్యంబగు సూర్య వంశమును వాహ్ మల్లాడి కాపాడిరే!
  యీనాడే భళి జేర్తు మీకు వరదాయీయంచు పేరున్ వెసన్ 🙂

  లక్కాకుల వారి ఫర్మానా 🙂
  జిలేబి

  Like

   1. ఇది ఉర్దూలో వ్రాయవలె ☝️

    Like


 4. రావే లక్ష్మి జిలేబి పంకజముఖీ రాస్తా దిఖావో హమే‌ !
  నీవేనమ్మరొ దిక్కు మాకు లలనా నీహారికా సుందరీ !
  భావావేశము తోడు రమ్మ నుతుకన్ భాజ్పాను బండ్రాయిపై
  తావుల్దప్పన నేతలెల్ల సుదతీ దారెంబడిన్ కాల్బడన్!
  జిలేబి


  https://polldaddy.com/js/rating/rating.js

  Like

 5. మీరు భలే వ్రాస్తారండీ 🙂 బొమ్మల గురించి ఇక చెప్పనక్కరలేదు. నేను regular గా చూసే బ్లాగుల్లో మీ బ్లాగు ఒకటి. వ్యాఖ్యలు చేయడానికి కుదరటం లేదు.


  https://polldaddy.com/js/rating/rating.js

  Like

  1. థాంక్యూ చంద్రికగారూ. నా రాతలు, గీతలకు మీ ప్రోత్సాహానికి ఎన్నెన్నో 🙏 వ్యాఖ్యలకి కుదరకపోవడం అర్ధం చేసుకోగలను. నా పరిస్థితీ అంతే, రీడర్ లోకి వెళ్ళి ఫాలోడ్ బ్లాగ్స్ చదివి కొన్ని నెలలైంది.

   Like

 6. @నీహారిక గారు
  // “అక్కడ విన్నకోట వారు గిల గిలా కొట్టుకుంటున్నారు” //
  ———————
  నో గిలగిల. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. మీరే అన్ని సార్లు తలుచుకుంటున్నారు. హిరణ్యకశిపుడి హరినామస్మరణ తెలుసు కదా, అలాగన్నమాట 🙂 😀😀.

  Like

 7. వావ్ ఇంతమంచి పోస్టు ఇంతకుముందు కనబడలేదేంటి చెప్మా!

  Like

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s