చరిత్ర తిరగరాయడం అనేది మన దేశంలో ఎప్పట్నుంచీ వుందోగానీ ఆర్యన్ ఇన్వేజన్ నుంచీ అమరావతి నిర్మాణం వరకూ అన్నిట్నీ , ఎవరికి తోచినట్టు వాళ్ళం తిరగరాసేస్తున్నాం.
ఈ సంగతి నీకు అక్టోబర్2న గుర్తొచ్చిందేం బాబూ అంటారా?
బాపూజీ పుట్టిన్రోజు పూట ఎందుకు గుర్తొస్తుంది? ఆయన చరిత్ర కూడా భారతీయుల అసంకల్పిత ప్రతీకార చర్య అనదగ్గ ఈ నిరంతర ప్రక్రియకి గురౌతోందేమోననే సందేహం వస్తేనే గదా!! సో, ఆ సందేహం వచ్చింది.
మదామ్ తుసాడ్ మ్యూజియం వాళ్ళకి గాంధీ చేతిలో చీపురు పెట్టండని మోడీ మేష్టారు సలహా పారేసినప్పటి నుంచీ ఆ డౌటు పెరుగుతోంది. ఆహహా !! మోడీ గారి మీద కాదు, అసంకల్పిత చరిత్ర తిరగరాతలకి అలవాటు పడిపోయిన మన మీదే ఆ డౌటు.
ఎందుకంటే – – –
ఆయన దేశస్వతంత్రం కోసం కాదు మనిషి ఆత్మస్వతంత్రం కోసం పోరాడాడు అనేది మనం ఆల్మోస్ట్ మర్చిపోయాం కనక…
ప్రకృతి వ్యవసాయం గురించి ఐక్యరాజ్య సమితిలో మనం బల్ల గుద్దడానికి శతాబ్దం ముందే రాట్నం వడకమని చాటి ప్రకృతితో శాంతియుత సహజీవనం చెయ్యమన్నాడన్న విషయం మనకసలు గుర్తే లేదు కనక….
ఆయన చెప్పిన అహింసా సిద్ధాంతం, సత్యాగ్రహం సంగతి దేవుడెరుగు కనీసం ఆయన పాటించిన క్రమశిక్షణ, టైమ్ మానేజిమెంట్లని నేర్చుకోవడం సరే మనమసలు పట్టించుకోనేలేదు కాబట్టీ….
స్వతంత్ర భారతం అనే పసిబిడ్డకి అపరిగ్రహం అనే ఊతాన్నిచ్చి నడపాలనుకున్న ఆయన్ని మర్చిపోయి ఈ రోజు అవినీతి బురదలో కూరుకుపోయాం కాబట్టీ…
సెల్ఫ్ హెల్ప్ అనే కాన్సెప్ట్ మనకి అలవాటు చేద్దామని చీపురు చేతబడితే అదేదో రోడ్లూడ్చడానికే అవతరించాడన్నట్టు బిల్డప్ ఇస్తే ఈ సోషల్ మీడియాయుగంలో, చై.నా. చదువులు, చెత్త సినిమాలు చూపించని లోకం కూడా వుంటుందని తెలీని తరంలో ఆయన చరిత్ర మొత్తం తిరగబడిపోతుందేమోనని డౌట్ రాదా మరి? వచ్చింది.
అసలు నీకు బుద్ధుందా శాస్త్రీజీని మరిచిపోతావా అని ఎవరూ సున్నితంగా గుర్తు చెయ్యక ముందే చెప్పేస్తున్నా👇 —
ఈ రోజే పుట్టిన గట్టిపొట్టివాడు లాల్ బహాదూర్ మనకి బహుదూరమైన క్రమంలో ఆయన చరిత్రని తిరగరాయడం కాదు పూర్తిగా పేజీలే చింపేసే ప్రయత్నం జరిగిందంటారు. నిజానిజాలు తేల్చడం మనవల్ల కాదని అందరికీ తెలుసు ఎట్ లీస్ట్ ఆయన మరణం వెనకున్న వివాదాన్ని రాజకీయాల కోసం చీటికీ మాటికీ తెర పైకి తీసుకు రాకుండా వుంటే బావుండు. కనీసం జవాన్లకీ, కిసాన్లకీ జై కొట్టి మరీ వాళ్ళని మోసం చెయ్యకుండా వుంటే చాలు.
🇧🇴🇧🇴గాంధీజీ!!శాస్త్రీజీ!!🇧🇴🇧🇴
⚘We wish many, No No No, Not many, but at least ONE happy return of you both to (y)our land⚘
🇧🇴🇧🇴🇧🇴🇧🇴🇧🇴🇧🇴🇧🇴🇧🇴🇧🇴🇧🇴
🌱⚘🕊⚘🌱🕊⚘🌱🕊⚘
—
గాంధీజీ ! శాస్త్రీజీ !
బంధుత్వంబనగ పుట్టి పరిభాసిల్లన్
సంధాయతగా వైవీ
రంధిపడుచు చిత్రముల సరాగమొనర్చెన్ !
జిలేబి
LikeLike
జిలేబి గారూ థాంక్ యూ
LikeLike
తిరగరాస్తున్నామేమో అని ఆ సందేహం ఎందుకు? అఫ్కోర్స్ తిరగరాసేస్తున్నాం – రాజకీయ కారణాల వలనో, వెర్రితలలు వేస్తున్న సోషల్ మీడియా వలనో. నేనేదో డిఫరెంట్ గా చెప్పాలి, లక్షల లైక్ లు రావాలి లాంటి దుగ్ధ ఎక్కువైంది. దాంతో అపరిపక్వ రాతలు, వెర్రిమొర్రి రాతలూ వరదలా వస్తున్నాయి. ఏది నిజమో, ఏది కల్పితమో అయోమయంగా తయారవుతోంది. శ్రీశ్రీ గారి చెప్పిన మాటల్లాగా ఉంటోంది 👇.
“You must be the change you want to see in the world.” అని సలహా ఇచ్చిన మహానుభావుడు గాంధీజి.. ఈ దేశం గాంధీజీని ఏనాడో మరచిపోయిందండి – బహుశః ఆయన పోయిన వెంటనే అని నా అనుమానం. జూలియస్ సీజర్ హత్య తరువాత మార్క్ ఏంటొనీ అన్న మాట The evil that men do lives after them; The good is oft interred with their bones గుర్తొస్తుంది (Friends, Romans, countrymen అనే speech లో). ఏదో … గాంధీ జయంతి నాడు hypocrisy తో కూడుకున్న ప్రసంగాలివ్వడం, ఆటెన్ బరో గారి “గాంధీ” సినిమా టీవీ లో వెయ్యడం (ఈమధ్య ఇది కూడా అరుదైపోయింది), వర్థంతి నాడు దేశమంతా రెండునిమిషాలు మౌనం పాటించడం (ఇదో పెద్ద hypocrisy) … లాంటి చర్యలతో గడిపేస్తుంటాం.
ఆవేదనతో కూడిన మంచి నివాళి మీ పోస్ట్.
LikeLike
@ 🦁 garu,
కమెంట్ లో వీడియో ఎలా పెట్టగలిగారో తెలుపప్రార్ధన !
LikeLike
ప్రత్యేకించి నేనేమీ చెయ్యలేదండి నీహారిక గారూ. సంబంధిత యూట్యూబ్ లింక్ కాపీ చేసి ఇక్కడ నా కామెంట్ లో పెట్టాను. అప్పుడు ఆ లింక్ అక్షరాల్లోనే కనిపించింది. కామెంట్ పబ్లిష్ అయిన తరువాత చూస్తే అక్షరాల లింక్ బదులు డైరెక్ట్ గా విడియో కనిపిస్తోంది …. చూసేవాళ్ళ మొహం మీదకి దూకుతున్నట్లు 🙂. వర్డ్ ప్రెస్ మాయ అయ్యుండచ్చేమో 🙄?
LikeLike
వీఎన్నార్ గారూ యధావిధిగా మీ కామెంటు కర్ణపేయంగా వుంది. ఐన్-స్టీన్ గాంధీ గురించి అన్న మాటలు – “Generations to come, it may well be, will scarce believe that such a man as this one ever in flesh and blood walked upon this Earth” ఈ విధంగా నిజం అవుతున్నాయంటారా?
LikeLike
మీరన్న రకంగా అన్వయించడానికి ఏమీ సంకోచం అక్కర్లేదండి YVR గారూ. మేరా భారత్ మహాన్ కదా.
ఒక ఆపాత మధురం (హిందీ) గుర్తుకొస్తుంటుంది … “దేఖ్ తెరే సంసార్ కీ హాలత్ క్యా హోగయీ భగవాన్” అనే పాట. పాటలో “సంసార్” బదులు “భారత్” అని పెట్టుకుని పాడేసుకోవచ్చు. 😔
LikeLike
మీరేమనుకోకుంటే …
గాంధీయం
అనరేమో !
గాంధేయం
అంటారనుకుంటా …
పెద్దలు సెలవియ్యాలె .
LikeLike
—
గాంధీయమ్ము జిలేబి యై కనబడెన్ కాదయ్య వైవీ మరే
గాంధేయంబన బాగు సోదరుడ! వ్యాఖ్యానింప బిల్తున్ మరే
సంధాయింపగ శ్యామలీయులను తస్సాదియ్య పోటీ మరే
రంధిన్ జూడగ వత్తురయ్య జనులున్ రంధ్రమ్ము లన్ తోడగన్
జిలేబి
LikeLike
ఏమైనా అనుకునేలా మీరు ఏమీ అనరు కదా మాస్టారూ. గాంధేయమే సరి అని అనుమానంగా వున్నా అందులో కాంగ్రెస్ వాసన వుందనిపించి గాంధీయం అనే వుంచాను. చిన్న తప్పుగా మన్నించండి.🙏
LikeLike
చిన్న తప్పుగా మన్నించండి.
ఇలాంటి మాటలు మనమధ్య వద్దు
సార్ , మనం సన్నిహితులం .🙏
LikeLike
గాంధీయమ్ము జిలేబి యై కనబడెన్ కాదయ్య వైవీ మరే
గాంధేయంబన బాగు సోదరుడ! వ్యాఖ్యానింప బిల్తున్ మరే
సంధాయింపగ శ్యామలీయులను తస్సాదియ్య పోటీ మరే
రంధిన్ జూడగ వత్తురయ్య జనులున్ రంధ్రమ్ము లన్ తోడగన్
జిలేబి
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
జిలేబీగారూ, అర్ధమైంది పద్యం. ఇక ముందు రాబోయే కామెంట్లు టపా టాపిక్ మీదే వస్తాయని ఆశిద్దాం. 😊
LikeLike
ఏ వనితల్ మముం దలప నేమి పనో యిట మౌనమూనినన్
-శ్యామలీయం.
LikeLike
సేవలు సేయగా హృదయ సీమ ద్రవించిన దేమొ శ్యామలా
రావుల మీద
LikeLike
కావలె మారుమాటయన కాస్త జిలేబుల జేర్చి దానితో
త్రోవన దీర్ఘదర్శులకు ధూపము వేయుచు నారదాయనన్
జిలేబి
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike