కొన్ని పనులు ఎందుకు చేస్తామో – ‘చేస్తామో’ అని అందర్నీ ఇన్వాల్వ్ చెయ్యడం ఎందుక్కానీ…… కొన్ని పనులు ఎందుకు చేస్తానో నాకే తెలీదు. అలాంటి పనుల్లో ఒకటే ఈ పోస్టు కూడా.
అసలా👇బొమ్మెందుకు గీశానో, అందులో ఆ ఫిలసాఫికల్ స్టేట్- మెంట్లు ఎందుకు ఇరికించానో నాకే తెలీదు.
Life is an Experience. Neither an Enjoyment nor a Suffering అంటోంది. ఏంటో దీని కాన్ఫిడెన్సు. ఎక్కడ, ఏ చెట్టు కిందయ్యిందో జ్ఞానోదయం. మనం ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా జీవితం చట్టంలా తన పని తను చేసుకుపోతుందని ఫిలాసపులికి ఎలా, ఎందుకు అనిపించిందో🤔
అసలు పులికి ఫిలాసఫీకి ఆమడ దూరం. ఆమడ కాదు, ఆమడలే. మనకి, కాదు కాదు, నాకు తెలిసి పులి ఫిలాసఫీ మాట్లాడింది పంచతంత్రంలో పులి, బ్రాహ్మడు, బంగారు కడియం కధలోనే. అదీ దొంగ ఫిలాసఫీనే. మరి ఈ పులికెందుకింత హెవీ ఫిలాసఫీ పుట్టుకొచ్చిందో🤔.
ఇదేమన్నా బోధిసత్వుడి అవతారమేమో. బోధిసత్వుడైనా కాకపోయినా కడియం పులి మాత్రం కాదు. డేంజరేం లేదు. ఏమైతేనేం డెైలాగులు బుద్ధుడి సూక్తుల్లాగే అనిపిస్తున్నాయి కదాని బ్లాగులో పెట్టేశా.
ఇంతే సంగతులు.
బై4నౌ🙏😊
ఏ పులి గురించండీ ఈ కత 🙂
జిలేబి
LikeLike
జిలేబిగారూ, టపాలో చెప్పింది అక్షరాలా నిజం. ఎందుకు రాశానో నాకే తెలియదు😇. రాసింది మాత్రం బొమ్మలో పులి గురించే, అది చెప్పిన మాటల గురించే🤗
LikeLike
పులి “అంతరంగం” అన్నమాట ఇది 🙂.
LikeLike
VNR sir, ఒక రకంగా అంతే. బొమ్మలు వేసుకోడానికి ADOBE DRAW అనే ఒక App దొరికింది. అందులో గీసిన పులి ఇది. దాని మొహం చూస్తే మాట్లాడుతున్నట్టుoది. ఎప్పట్నుంచో అంతరంగంలో వున్న ఆలోచనలు అక్కడ అంటించాను🤗. పులి+అం’తరంగం’😊
LikeLike
పై యిద్దరు పెద్దలూ ఈ పులి మీరేయనీ , అది మీ అంతరంగమేననీ వూహిస్తున్నట్లుంది .
LikeLike
చిన్న క్లారిఫికేషన్ తో అంతే మాస్టారూ 🙏. ఆ పులి అం’తరంగం’ లోంచి వచ్చిన బొమ్మ మాత్రమే, అంతరంగం మాత్రం పులి కాదు😊
LikeLike
మీ పులి అంతరంగం చదివాక, నాకు శ్యామలీయం బ్లాగులో కొన్నాళ్ళ క్రిందట వ్రాసిన పగబట్టిన మేక అనే ఒక ఖండికలోని పులి గుర్తుకు వచ్చింది!
LikeLike
నాలో రేగె గుహాశయుండు! భళి నానారీతి యాలో చనల్
తేలాడెన్ మరి యేల నోయనుచునుద్వేగమ్ముతో వేసితిన్
మూలాధారము తట్టదాయె జనులమ్మో వైవి యారేయనన్
చాలా చక్కగ నంతరంగమును భాజాయించితిన్చిత్రమై
నారదా!
జిలేబి
LikeLike