గణపతి కోరికలు, కాదు👐, Demands☝️తీర్చి తీరాల్సిందే!!


గణపతితత్త్వం అంతా గరికపూజలోనే ఉందంటారు. నా మట్టిబుర్రకి గరికలో అంత గొప్పదనం ఏవుంది అనే డౌట్ రాక మానదు. ఎవరో ఒకళ్ళని ఆడక్కా మానదు. అడిగాం కదాని ఆ చెప్పేవాళ్ళు సింపుల్ గా మట్టిబుర్రకి అర్ధమయ్యేట్టు చెప్పి ఊరుకోరు కదా.

ఆ “చెప్పడం”లో –

అష్టోత్తరాలు, సహస్రాలు, తంత్రాలు, మంత్రాలు….
విగ్రహాలు, నిమజ్జనాలు, బందోబస్తులు, శాంతిభద్రతలు…
అరటిపళ్ళు, అగరొత్తులు, లడ్డూలు- వాటి వేలాలు ….

ఆధ్యాత్మిక ప్రవచనాలు, నాస్తికుల ప్రలాపాలు, మతపిచ్చిగాళ్ళ ప్రేలాపనలు, రాజకీయ నాయకుల ప్రలోభాలు…

ఇన్ని పోగుపడతాయ్ వినాయకుడి మీద పత్రిలా.

ఇన్నిట్లో కప్పడిపోయి
ప్రకృతిమాత పుత్రుడు,
సృష్టిస్థితిలయాలకి అవతల వుండే ఆదిదేవుడి ఆత్మజుడు ఎక్కడా కనిపించడు. తెల్లారితే మళ్ళీ మామూలే.
తిన్నామా, పడుకున్నామా , తెల్లారిందా …
మట్టిబుర్రకి గరిక పవరేంటో అర్ధమవ్వదు.

పూజలు, హోమాలు, గుంజిళ్ళు , గుళ్ళు ఎన్ని చేసినా ప్రతి ఏడూ వినాయకుడు ఎప్పుడొచ్చాడో, ఎప్పుడెళ్ళిపోయాడో తెలీకుండానే వినాయక చవితి వెళ్ళిపోతుంది.

ఈ సంగతి ముందే తెల్సు కనక మట్టిబుర్ర మీదున్న ప్రేమతో, జాలితో తన బొమ్మని మట్టితోనే చెయ్యాలన్నాడు. కాస్త మట్టి ఉంటే చాలు ఇంకేం లేకపోయినా సర్దుకుపోయి అల్లుకుపోగల గడ్డి పరక గరికతోటే పూజ చాలన్నాడు.
మట్టి (simplicity) గరిక (humility) ఉన్నచోట తాను సాక్షాత్కరిస్తానన్నాడు.
ఆ రెండూ లేకపోతే ప్రపంచం అతివృష్టి- అనావృష్టి అన్నట్టు అల్లాడుతుందని ఆయన ఉద్దేశం అయ్యుండచ్చు. ఉద్దేశం కాదు సందేశమే అయ్యుండచ్చు. ఇప్పుడిప్పుడే మట్టిబుర్రకి విషయం తెలుస్తోంది. మెటీరియలిజంలో పడి మెంటల్ ఎక్కుతోందని అర్ధం అవుతోంది. చిలవలు పలవలు చెప్పి చివరికి చింతకాయలు కూడా రాల్చలేని వాళ్ళ బండారం బయట పడుతోంది. మట్టిబుర్ర గమనిస్తోంది. ప్రకృతికి దూరం అయిపోయానని గ్రహిస్తోంది. ఇవన్నీ చూస్తున్న గణపతికి మట్టిబుర్ర మీద జాలేసింది. అందుకే వచ్చేశాడు మళ్ళీ. సింపుల్ గా చెప్తే కానీ మట్టిబుర్రకి బోధపడదని తన తత్వాన్ని, సింబాలిజాన్ని ఆధునిక ఆంగ్ల మట్టిబుర్రల కోసం ఆంగ్లంలో, ప్లకార్డుల మీద డిమాండ్స్ గా రాసుకుని మరీ వచ్చేశాడు . అదుగో 👇అలా

మట్టితో తన బొమ్మని చేస్తూ మనసులో సింప్లిసిటీగా తనని ప్రతిష్టించుకొమ్మనీ, గరికతో తన మట్టి విగ్రహాన్ని పూజిస్తూ మనసుని హ్యుమిలిటీతో అలంకరించమనీ ఈసారి ఆయన సందేశం(ట). మనుషుల్లో నిరాడంబరత, అణకువ తక్కువ వ్వడమే వాళ్ళు పడుతున్న బాధలకి, తీస్తున్న గుంజిళ్లకి మూలం అని మూలాధారక్షేత్రస్థితుడికి అనిపించిందేమో!!

ఆయనకి విశ్వకవి పలుకులతో ఇదే ఈ మట్టిబుర్ర చేసే గరిక పూజ.

🌾Tiny grass, your steps are small, 
but you possess the earth under your 
tread🌾.
దుర్వాయుగ్మం పూజయామి🙏 
🌼God grows weary of great kingdoms,
but never of little flowers🌷.
దుర్వాయుగ్మం పూజయామి🙏

🌻The great earth makes herself hospitable with the help of the grass🌾.

దుర్వాయుగ్మం పూజయామి🙏

⚘God expects answers for the flowers he sends us, not for the sun and the earth🌿.

దుర్వాయుగ్మం పూజయామి🙏

ఇంతా చేసి మట్టిబుర్రకి వినాయకుడికి వాహనం ఏర్పాటు చెయ్యాలని తట్టలేదు. గణపతి గుర్తు చేశాడు . మట్టిబుర్రలో లైటు వెలిగింది.ఇన్నాళ్ల బట్టీ ఉన్న తీరని సందేహం తీరినట్టనిపించింది. స్వామీ! నీకు
చిట్టెలుకని వాహనంగా ఏర్పాటు చేస్తాను ఓకేనా? అంది. ఓకేనే కానీ చిట్టెలుకనే ఎందుకు సెలెక్ట్ చేశావో చెప్పు ముందు అన్నాడు.మట్టిబుర్ర ఇలా అంది –
స్వామీ, నేను అనే అహంకారాన్ని చిట్టెలుక సైజుకి తగ్గించేసుకుని, ఏనుగంతటి నీ తత్వానికి సరెండర్ అయ్యి నీ ఫిలాసఫీని ఒక తరం నుంచి మరో తరానికి మోసుకెళ్ళాలి అని నా భావం.ఈ సృష్టిలో నీ ఎజెండానే నడుస్తుందననే సత్యాన్ని నీ జెండాగా ఉండి సూచిస్తూ బతకాలని నా కోరిక అంది. మూషికధ్వజుడు మరియు అఖువాహనుడికి నచ్చినట్టుంది. “ఏనుగంత నేను ఎలక మీదెక్కి తిరగడం అంటే సింపుల్ లివింగ్ & హై థింకింగ్ అనే ఆదర్శానికి ప్రతీక అన్నమాట, బావుంది,అలాక్కానీ,” అన్నాడు.

🌻🌷🌾🌿🌹🌼

వాతాపి గణపతిం భజేహం

🌻🌷🌾🌿🌹🌼

17 thoughts on “గణపతి కోరికలు, కాదు👐, Demands☝️తీర్చి తీరాల్సిందే!!”

  1. విన్నకోట నరసింహారావు గారి వ్యాఖ్య :
   //వంగి, తిరిగి లేచి తలెత్తి నిలబడే resilience ఉన్న గరిక / గడ్డి అంటే అందుకే ఇష్టమేమో ? మొత్తానికి మన దగ్గర్నుండి సౌత్-ఈస్ట్ ఏషియా వరకు గరికతో నింపేశారు మీ చిత్రంలో .
   మీ వినాయకుడి కోరికలు / డిమాండ్లు కొంచెం కష్టసాధ్యం సుమండీ … మెటీరియలిజం విచ్చలవిడిగా ఎగదోయబడుతున్న ఈ కాలంలో.
   మీ ఆలోచనలయితే అంతకంతకూ profound గా తయారవుతున్నాయి. మీరెప్పుడైనా ఆశ్రమం అంటూ ప్రారంభిస్తే దానికి మొదటి మేనేజర్ని నేనే, ముందే చెప్పేస్తున్నాను .
   మీకు, మీ కుటుంబానికీ వినాయక చవితి శుభాకాంక్షలు .//

   Like

   1. VNR sir, ఎందుకనో మీ కామెంటు బ్లాగులో బ్లాంక్ గా వుంది. మాలికలో అసలు పబ్లిష్ అవలేదు. అందుకే కాపీ, పేస్ట్ చేశాను.

    Like

    1. Hm, technology going erratic sometimes, I suppose. Thanks for posting my comment.

     Like

 1. మంచి బుధ్ధి నొసగి , మనుజ జాతిని దిద్ది
  తీర్చుము , గణనాథ ! దేవ దేవ !
  కార్యసిధ్ధి నొసగి , కరుణతో రక్షించు ,
  శివ తనూజ ! నీకు సేతు నతులు .
  సార్ , మీకు వినాయక చవితి శుభాకాంక్షలు .


  https://polldaddy.com/js/rating/rating.js

  Like

 2. 🌼God grows weary of great kingdoms,
  but never of little flowers🌷.
  దుర్వాయుగ్మం పూజయామి🙏
  👌👌👌👌👌
  మీకు మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు .


  https://polldaddy.com/js/rating/rating.js

  Like

 3. వినాయక చవితి శుభాకాంక్షలతో

  గో గ్రీన్ విఘ్నవినాయకుండనెను “మైక్రోసాఫ్టు మృత్స్నంబు నీ
  వై, గ్రీన్హౌసు ప్రభావముల్నడచగా వానీరకంబున్ జిలే
  బీ గ్రావన్ వలె తారకాణముగ గుంభింపన్ దగున్, క్షాంతి తా
  నుగ్రంబై జనులన్ గ్రసింపగ భళా నూబిండియే మీరు సూ”!

  జిలేబి

  Like

  1. గజాననుడికి ద్రాక్షా🍇, నారికేళ🍈🥕, జిలేబి🥨 పాకాలతో పద్యం అల్లిన మీకు & మీ కుటుంబసభ్యులందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు🙏😊

   Like

 4. “కానీ చిట్టెలుకనే ఎందుకు సెలెక్ట్ చేశావో చెప్పు”

  ఎన్ని కోట్లు సంపాదించినా, చిన్న కారులోనే తిరిగితే జేబుకి, రూపాయికి, పర్యావరణానికి మంచిదని కాబోలు!!!

  Like

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s