లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినతుది నలోకంబగు పెం
జీఁకటి కవ్వలనెవ్వం
డేకాకృతి వెలుంగు నతని నే సేవింతున్
విన్నారా
అలనాటి వేణుగానం మోగింది మరలా
అలనాటి వేణుగానం మోగింది మరలా
చెలరేగే మురళీ సుధలు తలపించును కృష్ణుని కథలు
విన్నారా…
పుట్టింది ఎంతో గొప్ప వంశం పెరిగింది ఏదో మరో లోకం
పుట్టింది ఎంతో గొప్ప వంశం పెరిగింది ఏదో మరో లోకం
అడుగడుగున గండాలైనా ఎదురీది బతికాడు
చిలిపి చిలిపి దొంగతనాలు చిననాడే మరిగాడు
దొంగైనా దొర అయినా మనసే హరించేనులే
విన్నారా
అలనాటి వేణుగానం మోగింది మరలా
ద్వేషించే కూటమిలోనా నిలచీ
ప్రేమించే మనిషే కదా మనిషి
ఆడేది నాటకమైనా పరుల మేలు తలచాడు
అందరికీ ఆనందాల బృందావని నిలిచాడు
ఆనాడూ ఈనాడూ మమతే తరించేనులే
విన్నారా
అలనాటి వేణుగానం మోగింది మరలా
చెలరేగే మురళీ సుధలు తలపించును కృష్ణుని కథలు
విన్నారా ...
విన్నారా
అలనాటి వేణుగానం మోగింది మరలా
అలనాటి వేణుగానం మోగింది మరలా
చెలరేగే మురళీ సుధలు తలపించును కృష్ణుని కథలు
విన్నారా…
పుట్టింది ఎంతో గొప్ప వంశం పెరిగింది ఏదో మరో లోకం
పుట్టింది ఎంతో గొప్ప వంశం పెరిగింది ఏదో మరో లోకం
అడుగడుగున గండాలైనా ఎదురీది బతికాడు
చిలిపి చిలిపి దొంగతనాలు చిననాడే మరిగాడు
దొంగైనా దొర అయినా మనసే హరించేనులే
విన్నారా
అలనాటి వేణుగానం మోగింది మరలా
అలనాటి వేణుగానం మోగింది మరలా
ద్వేషించే కూటమి లోనా నిలచీ
ప్రేమించే మనిషే కదా మనిషి
ద్వేషించే కూటమి లోనా నిలచీ
ప్రేమించే మనిషే కదా మనిషి
ఆడేది నాటకమైనా పరుల మేలు తలచాడు
ఆడేది నాటకమైనా పరుల మేలు తలచాడు
అందరికీ ఆనందాల బృందావని నిలిచాడు
ఆనాడూ ఈనాడూ మమతే తరించేనులే
విన్నారా
అలనాటి వేణుగానం మోగింది మరలా
చెలరేగే మురళీ సుధలు తలపించును కృష్ణుని కథలు
విన్నారా …
కృష్ణాష్టమి శుభాకాంక్షలతో…
🌹🌻🌷🌼⚘🙏⚘🌼🌷🌻🌹
“కస్తూరీతిలకం లలాటఫలకే ………..
https://m.youtube.com/watch?v=EiKHGO3nZoc
కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
VNR sir, ధన్యోస్మి🙏
LikeLike
చిత్రం బాగుందండి 👌. మీలో ఈ కళ కూడా ఉందన్నమాట, గుడ్.
ఈ టపా క్రిందటేడు “కిత్తాత్తమి” కి మీరు పెట్టిన టపా గుర్తుకు తెచ్చింది.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
సర్, చిన్నప్పుడు నేర్చుకోని బొమ్మలు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ పుణ్యాన ప్రాక్టీసు చేస్తున్నాను.
క్రిందటేడు వేసిన కిత్తాత్తమి మీకు గుర్తు వచ్చిందంటే నాకెంత తుత్తి 😍నిచ్చిందో చెప్పలేను🙏.
LikeLike
భువనైక మోహన స్థవనీయ దివ్య మం
గళ మూర్తి ! శ్రీకృష్ణ ! కమలనయన !
భువనైక విజ్ఞాన స్థవనీయ గీతా ప్ర
బోధ జగద్గురు ! పుణ్యమూర్తి !
భువనైక ప్రేమ సంస్థవనీయ రససిధ్ధి
కేకైక సంకేత రాకా మనోజ్ఞ !
భువనైక యోగ సంస్థవనీయ వి
ధి విధాన సముదిత దేవ దేవ !
కృష్ణ ! పరమాత్మ ! మాధవా ! కేలు మొగిచి
నిన్ను ధ్యానించి నంతనే , కన్ను లెదుట
గానుపింతువు , చిత్తమేకాగ్ర మగును ,
హృదయ మానంద మగ్నమై ముదము గలుగు .
LikeLike
నా చిన్ని బొమ్మకి మీరిచ్చిన తియ్యని పద్యం చిన్ని కృష్ణుడి ప్రసాదంగా భావిస్తాను మాస్టారు 🙏
LikeLike
చుక్కలును శశి సూర్యుండు నొక్కచోట ,
తరు ధరాధర నీరధుల్ జంతు తతులు ,
మనుజ కోటియు , కృష్ణుండు , మరుల గొలుపు
వేణుగానమ్ము ‘ చిత్రమై ‘ ప్రియము గూర్చె .
LikeLike
ఏ విధమైన విశేషం లేని నా ఈ చిత్రము మీ మనసున పద్యమాధురుల పురికొల్పిన తీరు నిజముగ చిత్రము. అటుకులు ఇచ్చిన కుచేలునికి అష్టైశ్వర్యములిచ్చిన శ్రీకృష్ణుని లీలావైచిత్ర్యము.
నెనరులు మాస్టారూ. మీలోనున్న మురళీధరుడు నా టపా చదివాడు.
⚘🙏⚘
LikeLike
—
కన్నడు రామారావుల
సన్నగ తలపించుచుండె సరియేనా ఓ
రన్నా వైవీయారుడ!
మిన్నగ కిత్తాత్తమిన్ కమితముగ గనిరే 🙂
జిలేబి
LikeLike
కమితమను కొత్త పదమది తెలిసెన్ 👍
జిలేబి పద్యము కొంచెం లేటుగ దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా!!😊
LikeLike
కమితమను కొత్త పదము తి
రముగ తెలిసెనోయి నాకు రయముగ నిపుడే
ఘుమఘుమ కందం బొక్కటి
సమూహమునవేసెదన్ పసందుగ సుమ్మీ 🙂
జిలేబి
LikeLike
సందు దొరికె ప
సందగు కందముతో
విందులు సేయన్, జిలేబ్యా నందమది నింగిని తాకెన్
😊😊😊😊😊😊😊😊
LikeLike
కృష్ణం కలయ సఖీ సుందరం
బాల కృష్ణం కలయ సఖీ సుందరం
LikeLike
బాలకృష్ణుని సహోదరికి అనేక నెనరులు😊 (ఐ మీన్, ఒరిజినల్ బాలకృష్ణుడే లెండి😄)
LikeLike
అందరికిష్టుడు కిష్టుడు. ఆ కిష్టుడిని కిష్టాష్టమి రోజున ఇష్టంగా మాకిచ్చి, మా ఇష్టాన్ని, అదృష్టాన్ని రెట్టింపు చేసినందులకు సాష్టాంగ నమస్కారం సారూ …
చాలా చక్కగా ఉంది చిత్రం. అభినందనలు …
LikeLike
ఎన్నెమ్ రావుగారూ! నిజానికి ఈ బొమ్మకి నేను ఇవ్వాలనుకున్న కాప్షన్ ఇదీ- “A childish drawing for the DivineChild.” ఆ బొమ్మ అందరికీ నచ్చి మీరు మెచ్చడం బాలకృష్ణుడి ప్రసాదమే, ధన్యోస్మి.🙏
సాష్టాంగాలు అందుకునే స్థాయి నాకెక్కడిది సార్? మీకిష్టుడైన మా కిష్టుడే అందుకుంటాడు మీ నుంచి.😍🙏🙏🙏
LikeLike
‘కిట్టు’ ఫాన్స్ తప్పక వినవలసిన ఆపాతమధురం (పాత “విప్రనారాయణ” చిత్రంలోని పాట)👇. ఇదివరలోనే వినేసున్నా మరోసారి విని ఆస్వాదించండి. 👍.
LikeLike
పైనిచ్చిన “చూడుమదే చెలియా” పాట విన్నారో లేదో / నచ్చిందో లేదో చెప్పనేలేదు YVR గారూ.
LikeLike
ఇప్పుడే చూశానండి. విప్రనారాయణ పాటలన్నీ చాలా ఇష్టం సార్. ఈ పాట వరకూ
అయితే పాటలో
వున్న అందం/పారవశ్యం పిక్చరైజేషన్-లోకి పూర్తిగా translate అవ్వలేదనిపించింది.(ANR పార్టు తప్ప)
LikeLike
బహుశః సినిమా పాతప్రింట్ లోని విడియో అవడం మూలాన కాస్త blurred గా ఉండి అలా అనిపించిందంటారా , I wouldn’t know 🤔 ? అఫ్కోర్స్ మీరన్నట్లు ఏ.ఎన్.ఆర్, భానుమతిల నటన ముందు పోలికతో కూడా తతిమ్మా వారి నటన తేలిపోయుంటుంది లెండి. ఏమైనా ఈ పాట సాహిత్యం అద్భుతం.
ఒకటి మాత్రం నిజం. నిజజీవితంలో నాస్తికుడైన ఏ.ఎన్.ఆర్ తెరమీద భక్తి ప్రధాన పాత్రలు కూడా చాలా బాగా పోషించడం విశేషం.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
LikeLike
చిరంజీవిగారు, మీరిచ్చిన లింక్ లో కలలో నీలిమ గని పాటతో పాటు వుందువో మధురానగరి, ఎవరిదో ఈ మురళి & కలలైనా రాకపోతే .. కూడా విన్నాను.(వినమని మీరు ప్రత్యేకించి చెప్పకపోయినా వినేశాను🙏😊) చాలా బావున్నాయి. కలలైనా రాకపోతే … సాహిత్యపరంగా గుండె బరువెక్కించింది.(కృష్ణుడి మీద కాస్త కోపం కూడా వచ్చింది.😔)
LikeLike
చిన్నప్పుడు రేడియోలో నాకు బాగా నచ్చిన పాట అది. 2 సం.. క్రితం దాన్ని వెతికి పట్టుకోని దాచుకున్నాను. ఇప్పటికి కూడా నాకు దాన్లో ఒక్క ముక్కకి కూడా అర్ధం తెలియదు .
LikeLike
చిరంజీవి గారు,
ఈ పాటను గురించిన సమగ్రవ్యాసం (సాహిత్యం మరియు ఆడియోతో సహా) ‘వేణువు’ బ్లాగులో ఉన్నది. ఇదొక మంచి బ్లాగు. ఇది కూడా తప్పక చదవదగిన వ్యాసం. దీనికి లింక్ ఇస్తున్నాను.
కలలో నీలిమ కని …. వేణువు విని!
ఐతే, ఈ పాటకు అర్థం గురించి మాత్రం ఎక్కువగా లేదనే అనుకుంటూన్నాను. కాని మనం తెలుసుకొన దగిన మంచి సమాచారం మాత్రం చాలా ఉన్నది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీలైతే ఈ పాటకు వివరణ ‘శ్యామలీయం’ బ్లాగులో వ్రాయటానికి ప్రయత్నిస్తాను.
https://polldaddy.com/js/rating/rating.js
https://polldaddy.com/js/rating/rating.js
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
ధన్యవాదాలు.
మీ టపాక్రింద నేను ఉంచిన వ్యాఖ్య ఇంకా కనబడటం లేదు! బహుశః స్పామ్ క్రిందకు వెళ్ళిపోయిందేమో.
LikeLike
శ్యామలరావు సర్ , అవును ముందటి కామెంట్ స్పాం లోకి వెళ్ళిపోయింది. సరి చేశాను. నెనరులు.
LikeLike