రాజకీయాలు, చరిత్రలు చాలామంది కంటే చాలా తక్కువే తెలిసినా కొందరు నాయకులు నిజంగా నాయకులు అనిపిస్తుంది. అలాంటి గౌరవభావాన్ని నాలో కలిగించిన ఓ ఇద్దరి గురించి, నాకనిపించినదిదీ 🤗 –
Politicians with delicate sense of humor and deep respect for parliamentary values are a species on the path of extinction. Two of that species bid good bye to Indians in a span of a week.
Saying RIP to both
⚘🙏⚘
No, not to Rest in peace but to –
🌹Return If Possible🌻
***
“మాలిక” టపాల పట్టీలో మీ టపా హెడింగ్ చూసి leftist అంటే జస్ట్ అటుమొన్ననే (15-08-2018) మరణించిన left-hand batsman (and captain) అజిత్ వాడేకర్ గురించి అయ్యుంటుంది, హెడింగ్ బాగుంది అనుకున్నాను. టపా చదివితే
తెలిసింది … మీరు సోమనాథ్ చటర్జీ గారి గురించి leftist అంటున్నారని.
అవునండీ, వాజపాయి గారు, సోమనాథ్ గారూ ఇద్దరూ వారివారి పంధాల్లో మహానుభావులే 🙏.
RIP కు మీరిచ్చిన నిర్వచనం బాగుంది. కానీ నిజమయ్యే అవకాశాలు తక్కువ … ఎందుకంటే … అటువంటి మోడల్స్ తయారీ ఆపేశారట 😳.
మెచ్చుకోండిమెచ్చుకోండి
థాంక్యూ వీఎన్నార్ గారు . మీరనుకున్నట్టుగానే ఓ మూడువారాలు చైనా గాలి పీల్చాల్సి వచ్చి ఇంకా అక్కడే వున్నాను. అందుకే రిప్లై ఆలస్యమైంది.
RIPకి కొత్త అర్ధం నా సొంతం కాదండి. వాట్సాప్ లో దొరికింది. ఆ మోడల్స్ తయారీ ఆపేసినా కొత్త మోడల్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ వచ్చి సాధ్యపడుతుందేమోనని పిచ్చి ఆశ. 😀
మెచ్చుకోండిమెచ్చుకోండి
☺. ఆశావాదం మంచిదే లెండి 👍.
అవునూ, ఇంత తరచుగా చైనా దేశానికి వెళ్ళివస్తుంటారు కదా, ఆ భాషేమన్నా కాస్త పట్టుబడిందా (ఐ మీన్, మాట్లాడడం)? మాండరిన్ గానీ కాన్-టోనీస్ గానీ?
మెచ్చుకోండిమెచ్చుకోండి
థాంక్యూ చెప్పడం తప్ప ఏమీ రాదు సార్. నాతో పాటు ఇంగ్లీష్ తెలిసిన చైనీస్ / ఇక్కడ అలవాటున్న ఇండియన్స్ అయిన కొలీగ్స్ ఉండడంతో సాగుబాటు అయిపోతోంది.
మెచ్చుకోండిమెచ్చుకోండి
🌹Return If Possible🌻
గొప్ప గొప్ప పనులు చేసి ఆత్మ సంతృప్తిపొందిన వాళ్ళు మళ్ళీ పుట్టరండీ !
మెచ్చుకోండిమెచ్చుకోండి
అందుకే దేవుడి సృష్టిలో చాలా improvements చేసుకోవాలండీ. ఆ గొప్ప, no no, మంచివాళ్ళని మళ్ళీ మళ్ళీ పుట్టించి, పాపాత్ముల్ని తన లోకంలో రిఫార్మ్ చేస్తూ ఉంటే ఆయనకిన్ని అవతారాలెత్తాల్సిన పనీ ఉండదు, మతవాదులు + హేతువాదుల బెడదా ఉండదు. ఎప్పటికి గ్రహిస్తాడో!? హేవిటో!?🤣😉
(Jk, jk)
మెచ్చుకోండిమెచ్చుకోండి
—
దేవుడూ ఔట్ డేట్ అయిపోయేవోయ్ నువ్వు 🙂
బెటర్ రీసైకిల్ మేనేజ్మెంట్ నేర్చుకో స్మీ 😉
దేవుడు! నీసృష్టి విధా
నావళి మార్చుకొనవలె సునాయాసముగా
నీ వసుధ తీరు మారును!
కావలె రీ సైకిలు హితకారులు సుమ్మీ 🙂
జిలేబి
మెచ్చుకోండిమెచ్చుకోండి
జిలేబిగారి పద్యం మా బ్లాగులోకొచ్చి ఎన్నాళ్ళయిందో!!👍👍👌👌😀
మెచ్చుకోండిమెచ్చుకోండి
పద్యాలను కోరి మరీ వాయించుకునేవాళ్ళను
చూస్తోంటే నాకు మరీ ముచ్చట వేస్తోంది స్మీ 🙂
మరో పద్యం వేయమంటారా 🙂
నెనరుల్స్
మీ అభిమానాని కి ప్రోత్సాహాలకున్ను
జిలేబి
https://polldaddy.com/js/rating/rating.js
మెచ్చుకోండిమెచ్చుకోండి
మీకు శంకరాభరణంలో వచ్చే చిన్ముద్రలు👌 చూస్తున్నా ,
మీ పద్యాల్లో వుండే పన్ముద్రలు(pun) + ఫన్ముద్రల (fun)ని ఎంజాయ్ చేస్తున్నా. మొహమాట పడకుండా పద్యాలు రాయండి. కావాలంటే టైపు చెయ్యండి. కానీ పద్యాలు వేయడం ఏంటండీ పెయింటింగ్సులా? 😁
మెచ్చుకోండిమెచ్చుకోండి
// “పద్యాలు వేయడం ఏంటండీ పెయింటింగ్సులా? ” //
పెయింటింగ్సులా కాదు, పకోడీల వాయలా 😀😀.
“జిలేబి” గారు పద్యంలో తప్ప గద్యంలో మాట్లాడడం మానేశారుగా🙁. ఆంగ్లంలో అన్నట్లు at the drop of a hat వారు పద్యం వండేస్తుంటారు, అందువలనయ్యుంటుంది పైన వారిచ్చిన ఆ ఆఫర్ 🙂.
(jk 🙂).
మెచ్చుకోండిమెచ్చుకోండి
అడుగుట యే యెఱుంగము మహాత్మ ! యిటుల్ మము , పద్యముల్ , భళా !
అడిగితిరా! యిదో ! కనుడయా !విలువీడి , శరాపరంపరల్
జడిగురియున్ , థడీల్ థడిలు , సారు ! భయంపడకుందురే ! కటా !
యెడనెడ గుండియల్ భిగియ నేగతి గట్టిగ పట్టుకొందురో !
మెచ్చుకోండిమెచ్చుకోండి
—
అడుగక పోయినా భళి టపా మది గిల్లిన వేసెదమ్మయా
యెడనెడ జాంగ్రి లడ్డులను నెవ్వరి కైనను వ్యాఖ్యగా భళా
జడిగురియన్ , థడీల్ థడిలు , సారు ! భయమ్మును వీడిగానుడీ
అడరున వేసె దమ్ము మరియాదగ మీకొరకై జిలేబులన్ 🙂
జిలేబి
మెచ్చుకోండిమెచ్చుకోండి