కోతిtoమనిషి?డౌటు🤔 మనిషిtoకోతి?రైటు👍+ Don’t miss this పవన్K.ఇంటర్వ్యూ


ఆ మంత్రిగారిని చాలామంది అన్ సైన్టిఫిక్ అని ఆడిపోసుకున్నారు కానీ ఆయన చెప్పిందాంట్లో సగమైనా నిజం లేకపోలేదు. కానీ అది మామూలు నిజం కాదు. నిలకడగా ఆలోచిస్తే తెలిసే నిజం.
అసలాయన ఏమన్నాడు? కోతి మనిషిగా పరిణమించడం అనేటటువంటి దాన్ని మానవమాత్రులెవరూ చూళ్ళేదు అన్నారు. ఏం? అది నిజం కాదా? అసలు మనిషే లేనప్పుడు కోతి మనిషిగా రూపాంతరం చెందడం మనిషెలా చూడగలడు? బి.కామ్ లో ఫిజిక్స్ చదివితే తప్ప అర్ధం కాని ఇంతటి సంక్లిష్ట విషయాన్ని మంత్రివర్యులు వివరిస్తే అది అర్ధం చేసుకోలేని సైన్టిఫిక్ కమ్యూనిటీ అంతా నానా యాగీ చేశారు. నిజానికి మినిస్టర్వర్యులు చూళ్ళేదన్నారు కానీ ఇకముందు చూడబోరు అన్లేదు కదా? దేర్ ఫోర్, ఆయన స్టేట్మెంట్ పూర్తిగా నిజం. హెన్స్ ప్రూవ్డ్.
ఐతే, మినిష్టర్వర్యులు తను ఏరి కోరిన “సైన్టిస్ట్”లతో ఒక లాంగ్ టర్మ్ కమిటీ (ఎంత లాంగ్ అంటే మినిమమ్ ఒక కోతి తోకంత లాంగ్ ఉండాలి) ఏర్పాటు చేసి మనిషి కోతిగా రూపాంతరం చెందడం లేదర్రోయ్ అని నిరూపించేసి తన మంత్రివాక్కుని మంత్రవాక్కు చెయ్యడం అత్యవసరం. ఎందుకంటే రోజూ పేపర్ చూస్తుంటే కోతి నుంచి మనిషి రావడం సంగతి అటుంచి కోతే మనిషిలోంచి పరిణామక్రమం చెందుతోందేమో అనిపిస్తోంది. అదేదో చింపాంజీ, గొరిల్లా టైపు వానరాలు కాకుండా ఇంకా అనాగరిక కోతులేవో తయారౌతున్నాయని —
పిల్లల దగ్గర్నుంచి ముసలి ముక్కా వరకూ,
డబ్బూదస్కం వున్నాళ్ల నించీ బీదాబిక్కీ వరకూ ,
చేతబళ్లు చేసేవాళ్ళ నుంచీ గుళ్ళో పూజాదికాలు చేసేవాళ్ళ వరకూ
కొందరు దేశాధిపతుల నుంచీ సకలదోషాధిపతుల వరకూ

ఆడామగా,

ఆస్తికనాస్తిక,

చదువుకున్న,

చదువు కొన్న , చదువుకోకున్న …. వగైరా వర్గ బేధాలేం లేకుండా అన్ని రంగాల్లోనూ, వర్గాల్లోనూ జనం చేస్తున్న నేరాలు, ఘోరాలు, వెకిలిచేష్టలు చూస్తుంటే “అదో రకం” పరిణామక్రమం జరుగుతున్నట్టు కొందరికనుమానాలొస్తున్నాయ్ మరి.
అనుమానాలు భయాలుగా మారకుండా అప్పుడప్పుడూ –

నిర్భయ కేసులో ఇవాళ సుప్రీం తీర్పులాంటివి వినిపిస్తుంటాయి.
అలాగే, ఇవాళే నేను విన్న పవన్ కె. —- ఆహ్హా హ్హా .. మీరనుకున్న ఆ పవన్ కె. కాదు , ఆయన ఏకంగా ప్రజలందరినీ ఒక్క ఎలక్షన్ తో ఉద్దరించేసే అవతార లక్ష్యం దిశలో బిజీ, ఆయన కాదు. నేచెప్పేది పవన్ కె. వర్మ అనే డిప్లొమాట్ కం జర్నలిస్ట్ గురించి.
ఆయన అద్వైత సిద్ధాంతం పుస్తకం రాశారట. దానికి ఇంట్రో ఇస్తూ హైందవవైభవంపై ఆయన మాటలు వింటే నిజానికి అనుమానాలు, భయాల సంగతలా ఉంచి అమాంతం ధైర్యం పెరిగిపోతుంది. ఇక్కడ👇

చూస్తూ వినండి. చూడకుండా, జస్ట్ వింటాం అంటే అది మీ ఇష్టం. వినడం మాత్రం మిస్సవ్వద్దు. అదీ సంగతి. ఇంతకీ ఇంత వాగించిన శ్రీమన్మంత్రి వర్యులకి అనేకానేక నెనర్లకి తోడు-

నేను చెప్పిన కమిటీ తొందరగా వెయ్యకపోతే, ప్రస్తుత
పరిణామక్రమం చూసి, ఝడుసుకుంటున్న మనుషులు, ఎగస్పార్టీలు కుమ్మక్కై , “అయ్యా!మనిషిలోంచి కోతి రావడం మానవమాత్రులం ఇప్పుడు చూసేస్తున్నాం, ఆ లెక్కన కోతిలోంచి మనిషి రావడం పెద్ద వింతా కాదు, హాశ్చర్యం అంతకంటే కాదు. ఇంక మీ స్టేట్మెంటు విత్ డ్రా చేస్కోండం టూ” తగులుకుంటారేమో కాస్త చూసుకొండనే ముందుజాగ్రత్త జతపర్చి …
ఇంతే సంగతులు. బై 4 నౌ .

54 thoughts on “కోతిtoమనిషి?డౌటు🤔 మనిషిtoకోతి?రైటు👍+ Don’t miss this పవన్K.ఇంటర్వ్యూ

 1. నీహారిక

  62 నిమిషాల వీడియో చూసే ఓపిక లేదు.ఎపుడైనా మిట్టమద్యాన్నం నిద్రపట్టనపుడు చూస్తా !
  కోతులకీ మనుష్యులకీ సంబంధం ఉన్నమాట నిజమని ఒప్పుకున్నారు కదా ?

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   ఒప్పుకోడానికీ / కోకపోడానికీ మనమెవరమండీ? మంత్రిగారు ఒప్పుకుంటే చాలు. దేశమంతా ఒప్పేసుకున్నట్టే.
   BTW, ఆ ఇంటర్వ్యూ మంత్రిగారి ‘శాఖ’కి సంబంధించింది కాదండి, అద్వైత సిద్ధాంతంమీద. 62 నిముషాలూ 5 నిముషాల్లో అయిపోతాయి.😀

   Like

   Reply
  1. YVR's అం'తరంగం' Post author

   మీరెవరో కానీ వ్యాఖ్య అదిరింది. 😁 మీ సందేహ నివారణకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి.
   1) పరిణామవాదం ప్రకారం చెప్పాలంటే ఒకానొక జాతి తోకలేని కోతులే (నరవా నరం అనాలేమో) మనుషులయ్యాయి. సో, తక్కిన తోక వున్న / లేని కోతులన్నీ మిగిలున్నాయి.
   2) మంత్రిగారి లాజిక్ ప్రకారం ఐతే నరులు, వానరాలు వేరు వేరు + ఏ కోతికీ మనిషి పిల్ల పుట్టడం ఎవరూ చూళ్ళేదు కాబట్టి సహజంగానే కోతులు మిగిలుంటాయి.

   Like

   Reply
 2. విన్నకోట నరసింహారావు

  5 నిమిషాలు 62 నిమిషాల్లాగా నాకు తోచిన ఈ వీడియోలో మీకు 62 నిమిషాలు 5 నిమిషాల్లాగా అయిపోయాయా…. మీరు దేవుడు సామే 👏.
  “స్వర్ణ కమలం” సినిమాలో … గవర్నమెంట్ ఆఫీసర్ గారి ప్రవర్తనతో భంగపడ్డ పేద ఘనాపాఠీ వృద్ధుడిని (చెవుడు కూడా ఉంది) ఓదారుస్తూ మాట్లాడతారు అక్కడే ఉన్న నాట్యగురువు గారు. అప్పుడు ఆ ఘనాపాఠీ గారు తనకు తోడుగా వచ్చిన కుర్రవాడితో “వారేం అన్నారో వినబడలేదు గానీ వారి మాటలలోని భావం అర్థమైంది” లాంటి డైలాగ్ చెబుతారు. కొంచెం మార్చి … వారేంఅన్నారో వినబడింది గానీ వారి మాటలలోని భావం అర్థం కాలేదు … అనాలి నాబోటి వాడు పవన్ వర్మ గారి విడియో విన్న తరవాత 🙁.
  ఆ clipped accent తో వర్మ గారి మాటలు, 60 ఏళ్ళు పైబడిన ఆ పెద్దమనిషి ఏదో తన బాయ్ ఫ్రెండ్ అయినట్లు “పవన్” (కనీసం మిస్టర్ వర్మ అని గానీ, వర్మాజీ అని గానీ కాదు) అంటూ సంబోధిస్తూ rolling accent తో కామాలు ఫుల్ స్టాపులూ లేకుండా “సాక్షి” (వార్తాపత్రిక కాదు) వ్యాసాల్లో వాక్యాలలాగా చాంతాడంత ప్రశ్నలు .. ఆ ప్రశ్నకు తలెక్కడో తోకెక్కడో తనూ చూస్తున్నవాళ్ళూ మరచిపోయేట్లు .. ఆ ఏంకరిణి అడిగే తీరు (తను చెప్పిన “బ్లాక్ సేన” సభ్యురాలు అనాలేమో?) ….. నా వల్ల కాదు బాబోయ్ 😳.
  ఒకటి చెప్పనా – ఇటువంటి మాటలు చాలా వరకు play on words అనిపిస్తుంది నామటుకు. Turn of phrase చాతుర్యం. ఏమైనా … ఇదంతా నా అభిప్రాయం సుమండీ. వర్మ గారి ప్రసంగం నచ్చినవారు నన్ను క్షమించాలి 🙏. అంత profound గా ఉన్నవి నా బుర్రకెక్కవు.
  విడియోలో నాకు బాగా నచ్చినది ఏమిటో చెప్పనా 😉? వెనకాల తెర మీదున్న The Glenlivet అన్న పేరు 🤪.
  ఇక అసలు సంగతి … మీ టపా హెడ్డింగు లో మీరన్న రెండో భాగం నిజం 👌. కాకపోతే మనిషి కోతి లాగా కాదు, ఇంకా అంతకంటే నేలబారు ప్రాణిగా పరిణామం చెందుతున్నాడని నా అనుమానం 🤘. అప్పుడప్పుడు నిర్భయ కేసు తీర్పు లాంటివి వచ్చి సిల్వర్ లైనింగా అనిపిస్తుందేమో కానీ అది తాత్కాలికమే. ఒక భయంకర జంతువుగా పరిణామం చెందే ప్రక్రియ చాలా ముందుకు వెళ్ళిందని అనిపిస్తుంటుంది … నాది నిరాశావాదం అనుకున్నా సరే.


  https://polldaddy.com/js/rating/rating.js

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   సార్ VNR గారు, నమస్తే.
   బీహారీ ఇంగ్లీషు వినడం కష్టమే లెండి. కానీ సబ్జెక్టు ఆదిశంకరుడు కావడంతో ఓపిగ్గా వినేసాను. నిజానికి సెకండ్ హాఫ్ లో ఎక్కువ మేటర్ ఉందండి . హైందవపు కోర్ ఫిలాసఫీ ని అవసరంలేని చిలవలు పలవలు తీసేసి చెప్పడం నాకు నచ్చింది. పవన్
   వర్మ గారి జర్నలిస్ట్ వ్యాసాలు నాక్కూడా ఎక్కలేదు.
   Glenlivet అనేది మీకు ఎందుకంత నచ్చిందో చెప్పలేదు మీరు. అదేంటో తెలియదు.

   Like

   Reply
     1. Zilebi

      నేటి సమస్యా పూరణము 🙂

      సారా కంపెని ఆదిశంకరుల విస్తారమ్ము తెల్పెన్ గదా!

      జిలేబి

      Like

      Reply
      1. YVR's అం'తరంగం' Post author

       @Zilebi garu & VNR garu

       అనుకుంటూనే వున్నా, ఇలాంటిదేదో జరుగుతుందని 😄,
       వీఎన్నార్ సార్ సమస్య మీరే పూరింపవలె …

       Like

     2. విన్నకోట నరసింహారావు

      అంతే కదా మరి, సింగిల్ మాల్ట్ … స్కాచ్ విస్కీ 🥃. ఎందుకా puzzled look 🙂?

      Like

      Reply
      1. Zilebi

       పోరాటంబగు జీవితమ్ము భగవత్ప్రోక్తమ్ము రా మానవా
       ప్రేరేపించిరినాడు శంకరులటన్ పేత్వంపు నద్వైతమున్
       ధారాళంబుగ విశ్వమెల్ల నరయన్ ధర్మంబు మార్గంబుగా
       సారా కంపెని నేడు శంకరుల విస్తారమ్ము తెల్పెన్ గదా!

       జిలేబి

       Like

 3. Zilebi

  మనుజునికి మూలమని కో
  తిని చూపిరి! తప్పు సూవె తిమ్మడికి నరుం
  డని మంత్రిబల్కె నిక్కం
  బని నొక్కుచు పల్కెదన్ సభాసదులారా !

  जिलेबी

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   జిలేబిగారు, 👌👌మంత్రిగారికి పద్యాలతో పరిణామ సిద్ధాంతం బోధిస్తే ఎలా ఉంటుందనిపిస్తోంది !!
   నెనర్స్ 😀

   Like

   Reply
 4. విన్నకోట నరసింహారావు

  ఈ సారా సంబంధిత సమస్యా పూరణ నేనే చెయ్యగలనని మీరెందుకు అనుకున్నారు YVR గారూ 🤔 ?
  సరే మీ సరదాని కాదనడమెందుకు, ఇదిగోండి నేను రిస్క్ తీసుకుని వండిన పద్యం (?), జాగ్రత్తండి 👍. పోతే ఛందస్సులు గట్రాకి నా పూచీ ఏమీ లేదు, అవన్నీ “జిలేబి” గారు చూసుకోవలసినదే .☝️
  మన సారా మనసారా తాగవోయ్
  నేనే నీవని ఇరువురమొకటేనని త్వరలో తెలుస్తుందోయ్
  అదేనోయ్ అద్వైతమంటే అని
  సారా కంపెని ఆదిశంకరుల విస్తారమ్ము తెల్పెన్ గదా! 🤘


  https://polldaddy.com/js/rating/rating.js

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   VNR గారు, భావుంది (భావం+బావుంది 😊). ఛందోబద్ధం చేస్తే అర్ధం కాదేమో, తర్వాత మీ ఇష్టం.

   Like

   Reply
   1. విన్నకోట నరసింహారావు

    థాంక్స్. మీరన్నది కరక్టే. అందుకే free verse జిందాబాద్ 👍.
    కొత్త పదాలు తయారు చెయ్యడం మీరూ మెదలెట్టారే 🙂. “భావుంది” పదం బావుంది 👌.


    https://polldaddy.com/js/rating/rating.js

    Like

    Reply
    1. YVR's అం'తరంగం' Post author

     పదాలే కాదండి మీరిచ్చిన ఐడియాతో ఇదేదో పద్యంలాంటిది కూడా రాశాను 😄-

     మనసారా గ్రోల మనక
     ద్వైతసారము కలదదియె
     మన సారా! నిస్సారపు వి
     దేశి సారాలేలా?
     సమ్-సారాలేలా? గోలా?

     (ఛందోబద్ధీకరణ రైట్స్ జిలేబిగారికి 😊)

     Like

     Reply
     1. Zilebi

      మనసారా గ్రోలు మయా
      మన సారా ద్వైతసార మదియె! విదేశీ
      గ్లెనులివెటను “సమ్ సారా”
      మనకేలా? మన జిలేబి మన గంధవతీ!

      జిలేబి

      Like

      Reply
      1. YVR's అం'తరంగం' Post author

       భావుందండి జిలేబిగారు.
       సమ్-సారా అనేది నేను సంసారం అనే అర్ధంలో వాడాను. మీరో స్టెప్పు ముందుకెళ్లి అందులోనూ సారా నింపే”సారా “? 😄

       Like

   2. Zilebi

    00
    ఛందోబద్దము కాని దేది నరుడా సాధింప సాధింపగన్ 🙂
    ఏరాలమ్ముగ నేను నీవు ఒకటే, నెవ్వారికైనన్ సుమా,
    సారాతాగగ విన్నకోటవరుడా సారంబు బోధిల్లు, తా
    నైరాశ్యంబును వీడు నయ్య,వినుమా నద్వైతమార్గంబిదే !
    సారా కంపెని ఆదిశంకరుల విస్తారమ్ము తెల్పెన్ గదా!


    https://polldaddy.com/js/rating/rating.js

    Like

    Reply
  2. nmrao bandi

   సారో! వీఏన్నార్ సారో! ఏం చెప్పార్
   సారో! ఎంచక్కగా గొంతులో గ్లెన్లివెట్ పో
   సారో! తెలీనోళ్ళకి గ’మ్మత్తు’గా తెలిపే
   సారో! ఇంకా డౌటా వైవీయార్ సారో!
   hearing our very own, vnr sir softly murmur, glenlivit !
   wondered fully, a puzzled mr yvr, as to what is it ?
   shakin’ a bit, slighly, vnr sir thundered, whooozzit !?
   takin’ a glass gently, in hand, did we gulp, this is it !!
   ha ha ha … just fun … :::)))


   https://polldaddy.com/js/rating/rating.js

   Like

   Reply
  3. nmraobandi

   సారో! వీఏన్నార్ సారో! ఏం చెప్పార్
   సారో! ఎంచక్కగా గొంతులో గ్లెన్లివెట్ పో
   సారో! తెలీనోళ్ళకి గ’మ్మత్తు’గా తెలిపే
   సారో! ఇంకా డౌటా వైవీయార్ సారో!
   hearing our very own, vnr sir softly murmur, glenlivit !
   wondered fully, a puzzled mr yvr, as to what is it ?
   shakin’ a bit, tightly, vnr sir thundered, whooozzit !?
   takin’ a glass gently, in hand, did we gulp, this is it !!
   ha ha ha … just fun … :::)))


   https://polldaddy.com/js/rating/rating.js

   Like

   Reply
   1. Zilebi

    బండి వచ్చె బీరు పోసె భారి గాను; వై వి యారు
    కొండ నెక్కి కోరు నో పకోడి, వేయ రావు గారి
    యండ వచ్చు నో జిలేబి, “ఆవలోడు పారు, పారు”

    నారాయణ

    జిలేబి

    Like

    Reply
    1. nmraobandi

     @ zilebi …
     బీరు పోసిన దేవత
     ఆ చేయి నెన్నడు దాచక
     గ్లాసు గ్లాసుకి వంచుతూ
     నా ఫ్రెండు నువ్వనిపించుకో …
     🙂

     Like

     Reply
     1. Zilebi

      ఏమండీ బండివారు

      మీరన్నారు కదా అని బీరు, బ్రాంది విస్కి అన్నీ కలబోత గా పోస్తే నో‌నో అన్నారు పూసపాటి వారు పండిత సభలో . మీకేమన్నా వివరాలు తెలుసా ?

      జిలేబి

      Like

      Reply
      1. విన్నకోట నరసింహారావు

       హ్హ హ్హ హ్హ, అవన్నీ కలుపుకోమని బండి గారెక్కడ చెప్పారు “జిలేబి” గారూ? ఏదో కొత్త ఉత్సాహంతో మీరే కలబోసుకున్నట్లున్నారు 😀. ఒక్కరూ కూర్చుని పార్టీ చేసుకుంటే ఇలాగే ఉంటుంది ☝️😀.
       (jk 🙂)

       Like

      2. nmraobandi

       ఏదో పైపై పూత లు, tell tales వరకే గానీ …
       అంత లోతుగా, cocktails వరకూ విషయాలు తెలియవు మేడం గారు …
       🙂

       Like

     2. విన్నకోట నరసింహారావు

      హ్హ హ్హ హ్హ పేరడీ అదిరింది బండీ వారూ 🍺.

      Liked by 1 person

      Reply
      1. nmraobandi

       గురువు గారూ,
       సరదాగా ఇది కూడా చిత్తగించండి …
       జస్ట్ ఫన్ అండ్ ప్రాలిక్ …

       మౌనంగా నువు తాగమని బారు నీకు చెబుతుంది
       తాగినకొద్దీ తాగమనే అర్ధ ‘మందులో’ ఉంది
       పరిచయాలు పెరిగిన చోటే గ్లాసు పిలుపు వినిపిస్తుంది
       పెగ్గు కొలిచి పోసిన క్షణమే ఐసు కలుపు అనిపిస్తుంది

       మౌనంగా నువు తాగమని బారు నీకు చెబుతుంది
       తాగినకొద్దీ తాగమనే అర్ధ ‘మందులో’ ఉంది
       అపజయాలు కలిగిన రోజే మందు నీకు తోడౌతుంది
       మందు కొంత కొట్టకపొతే మనసు అంత పాడౌతుంది

       🙂

       Like

      2. Zilebi

       మౌనముగా నీ మనసు పాడిన “బారు” గానమును‌ వింటిలే 🙂

       జిలేబి

       Like

     1. Zilebi

      ఆధునిక ఉభయ కవిమి
      త్రా! ధౌరేయుండ! బండి రావు మనీషా!
      బోధగురో! సినిమా గీ
      తా ధృష్టుడ!మా జిలేబి తారీపు గొనన్!

      జిలేబి

      Like

      Reply
      1. nmraobandi

       తారీఫును కంటిని …
       బారు గానము వింటిని …
       … మరేమంటాను !!
       నమస్కారం … 🙂

       Like

 5. విన్నకోట నరసింహారావు

  థాంక్యూ బండి వారూ and YVR గారూ. వోర్నాయనోయ్, మీ ఇద్దరి పద్యాలు – ఒకర్ని మించి మరొకరు 👌. పైగా బండి వారు ఇంగ్లీషు పద్యం కూడా (కన్యాశుల్కం నాటకంలో గిరీశం గారి ఇంగ్లీషు పద్యాల మాదిరి) 👏 . సరే గురివిణి “జిలేబి” గారి పద్యాల గురించి చెప్పక్కరలేదు 🙂. మీ ముందరా నా కుప్పిగంతులు 😳 !
  ఏమైనా … గ్లెన్లివెటాయ నమః 🙏

  Like

  Reply
  1. Zilebi

   ఇంక బకాయి రావలసిన వారు

   కష్టేఫలి, లక్కాకుల వారు

   వారు కూడా కొంత సారంబొప్పిస్తే సరిపోవు 🙂

   జిలేబి

   Like

   Reply
  2. YVR's అం'తరంగం' Post author

   కేంద్రమంత్రిగారి వ్యాఖ్యలు మీడియాలో జోకులై పేలితే ఇక్కడ పద్యాలై ప్రవహించాయి, గ్లెన్లివెట్ తో 😁

   Like

   Reply
 6. విన్నకోట నరసింహారావు

  // “మనసా! రా! మనసారా😋!! మన సారా🍷 మా నషా రా🤗 “//
  “Only” అనే పదాన్ని ఒక వాక్యంలో రకరకాల అర్థాలతో ఎలా వాడచ్చో ఇంగ్లీష్ బోధనలో చెబుతుంటారు. అలా ఉంది మీ కవిత 👌. మీలో చాలా టాలెంట్ ఉందండీ YVR గారూ 👏.

  Like

  Reply
 7. విన్నకోట నరసింహారావు

  // “మౌనంగా నువు తాగమని బారు నీకు చెబుతుంది” //
  అబ్బబ్బబ్బ, అద్భుత పేరడీ బండి గారూ👌.
  ఇలాగే అన్వయించడానికి మరొక పాటుందండీ, అదే … బారు బారు దేఖో, హజార్ బారు దేఖో. ప్రయత్నించరాదూ? 👍

  Like

  Reply
  1. nmraobandi

   సరే మీ కోరికెందుకు కాదనాలి గురువు గారూ,
   ఊరులెన్నొ చూశా బారులెన్నో చూశా
   బ్రాండులన్ని తాగి ఊగి వాలి తూలతా
   తాగుతా ఊగుతా రేగుతా …
   🙂


   https://polldaddy.com/js/rating/rating.js

   Like

   Reply
  2. nmraobandi

   సరే మీ కోరికెందుకు కాదనాలి గురువు గారూ,
   ఊరులెన్నొ చూశా బారులెన్నో చూశా
   బ్రాండులన్ని తాగి ఊగి వాలి తూలతా
   తాగుతా ఊగుతా రేగుతా …
   బీరు జిన్ను చూశా లోన వోడ్క యేశా
   ఓల్డ్ మాంక్ రమ్ము తాగి చిందులాడుతా
   ఉందిలే మందులో ఓ మజా …
   🙂
   (పొరపాటున కొంచెం కట్ అయ్యింది, అందుకని మళ్ళీ … పూర్తిగా …)


   https://polldaddy.com/js/rating/rating.js

   Like

   Reply
 8. విన్నకోట నరసింహారావు

  // “ఊరులెన్నొ చూశా బారులెన్నో చూశా“ //
  ఆహా, మరోసారి అద్భుతః 👌. నా నమ్మకాన్ని వమ్ము చెయ్యలేదు. థాంక్స్ బండి గారూ.


  https://polldaddy.com/js/rating/rating.js

  Like

  Reply
 9. విన్నకోట నరసింహారావు

  “స్పిరిటెడ్” డిస్కషన్ నుండి ఇంక బయటకు వద్దాం 😀. మీ కోసం మరొక న్యూస్ పేపర్ వ్యాసం … మీకిష్టమైన హాబీకి సంబంధించినది … పక్షుల ఫొటోలు. ఈ రోజు Deccan Chronicle (Hyd) పేపర్ Sunday Chronicle సప్లిమెంట్ లో రణదీప్ సింగ్ అనే నేచర్ ఫోటోగ్రాఫర్ గురించి The Call of the Wild అనే పేరుతో స్వాతి శర్మ అనే ఆవిడ వ్రాసిన పక్షుల ఫొటోలతో కూడిన వ్యాసం. లింక్ ఈ క్రింద ఇచ్చాను. ఆనందించండి 👍.
  https://www.deccanchronicle.com/sunday-chronicle/headliners/150718/the-call-of-the-wild-1.html
  The Call of the Wild అని విన్నప్పుడల్లా అదే పేరుతో గత శతాబ్దపు అమెరికన్ రచయిత Jack London వ్రాసిన ఎంతో ప్రాచుర్యం పొందిన నవల పేరే గుర్తొస్తుంది నాకెప్పుడూ. Sledge dog గురించి ఆ కథ. ఈ వ్యాసం చిన్న పిట్టలను కూడా wild అంటోంది ఏవిటో (సరే రచయిత ఇష్టమే అనుకోండి) 🙁?
  మీరు కూడా మీరు తీసిన పక్షుల ఫొటోలు జత చేస్తూ ఏదన్నా పెద్ద వార్తాపత్రికలో వీలుచేసుకుని తరచూ వ్యాసాలు వ్రాయవచ్చు కదా (ఇప్పటికే అలా చేస్తున్నారేమో మరి, తెలియదు). ఆ విధంగా ఎక్కువ మందికి మీ పేరు తెలుస్తుంది, మీరు తీసిన ఫొటోలు నలుగురూ చూస్తారు …. ఏదైనా చెయ్యడమే కాదు, చేసినట్లు కనబడాలి కూడా. అది ఆధునిక జీవిత సత్యం మాస్టారూ. కూసింత పబ్లిసిటీ వస్తే చేదు కాదు కదా 🙂.


  https://polldaddy.com/js/rating/rating.js

  Like

  Reply
 10. విన్నకోట నరసింహారావు

  అఫ్ కోర్స్, ఇక్కడ wild అంటే undomesticated అని అర్థం తీసుకోవాలనుకుంటాను లెండి. పెంపుడు పక్షులు కాదని, స్వేచ్ఛావిహంగాలు అని భావమయ్యుంటుంది. Ok.


  https://polldaddy.com/js/rating/rating.js

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   VNR సర్, మన్నించండి,వెంటనే రిప్లై ఇవ్వలేకపోయాను. మీరిచ్చిన లింక్ చూశాను. మంచి ప్రొఫెషనల్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ తీసినవి. నాకంత నైపుణ్యం, అలాంటి కెమెరా లెన్స్, టైమూ – ఏవీ లేవండి.
   అయినా బీబీసీడిస్కవరీ మ్యాగజైన్ కి బ్లాగ్ పంపించాను మూడు నెల్లయినా ఏ రెస్పాన్సూ లేదు.
   నిజానికి, జిమ్ కార్బెట్ పుస్తకాలు బట్టీ పట్టడంవల్ల కావచ్చు, ఫోటో క్వాలిటీ కంటే స్టోరీ మీదే నాకు దృష్టి ఎక్కువ, తెలుగువాళ్లు చదవాలనే ఆశ కూడా ఎక్కువ.
   కానీ తెలుగులో ఈ టాపిక్స్ పని కట్టుకు చదివేవాళ్ళు తక్కువనుకుంటా. ఐనా ప్రయత్నించాలనే వుంది. 🙏

   Like

   Reply
   1. Zilebi


    మీరు తెలుగు వారిని చాలా తక్కువగ అంచనా వేస్తున్నారండి.

    జిలేబి వారి పద్యాల్నే చదివేస్తున్నారు ంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంం
    జీర్ణించేసుకుంటున్నారు. నిభాయించుకుని గాట్టిగా నిలబడి వున్నారు 🙂

    మీ వనమాలా కథలను చదవరంటారా ?

    ప్రయత్నించి చూడండి.

    ఆల్ ది బెష్టు

    చీర్స్
    జిలేబి

    Like

    Reply
    1. YVR's అం'తరంగం' Post author

     జిలేబిగారు, మీ పద్యాల్లో శార్దూల🐯, మత్తేభ🐘, మత్తకోకిల🐦లని చూస్తూ,’కంద’🥕మూలాలు ఆస్వాదిస్తూ ఇంకా నా వనమాలికలేం చదువుతారులెండి …😁 (jk)

     Like

     Reply
 11. విన్నకోట నరసింహారావు

  సాధారణంగా జవాబు త్వరగానే ఇస్తుంటారు మీరు. ఈసారి లేట్ అవడంతో మీరు బహుశః ఆఫీస్ పని మీద ఏ చైనా గానీ, బ్రెజిల్ గానీ, వేరే ఏదన్నా విదేశం గానీ వెళ్ళారేమో అనుకున్నాను.
  మీ కెమెరా లెన్స్ సంగతి తెలియదు గానీ మీ నైపుణ్యం గురించి మీరే తక్కువగా అంచనా వేసుకుంటున్నారంటాను నేను. మీరు తీసిన ఫొటోలే అద్దం మీ స్కిల్ కి.
  డిస్కవరీ వాడు కాకపోతే పోయె, నేషనల్ జియోగ్రాఫిక్ కు పంపించి చూడండి. “జిలేబి” గారన్నట్లు మీ సబ్జెక్ట్ మీద మీరు వ్రాసే వ్యాసాలు చదివే అభిరుచి కలిగిన cross section తప్పక ఉంటారు ….. జిమ్ కార్బెట్ పుస్తకాలు చదివే వారి లాగా. కాబట్టి తప్పక ప్రయత్నించండి. గుడ్ లక్ 👍.

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   సర్, మీ అభిమానానికి అనేకానేక 🙏🙏🙏🙏లు. మీరు, జిలేబిగారు చెప్పినట్టు ప్రయత్నిస్తాను.😊

   Like

   Reply

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s