మొన్న జూన్5th న ‘జులాయి’ సినిమాలో రాజేంద్రప్రసాద్ చెప్పిన త్రివిక్రమ్ డైలాగ్ గుర్తొచ్చింది


If you can’t be in awe of Mother Nature, there’s something wrong with you – Alex Trebek

జూన్5thన వర్ల్డ్ ఎన్విరాన్‌‌మెంట్ డే అని కొంచెం లేటుగా గుర్తొచ్చింది. వాట్సప్ మిత్రులందరికీ నిన్న మా ఆఫీస్ బిల్డింగ్ పక్కనున్న పార్కులో కనబడ్డ ఆ 👇 –

poobaala

పూబాలతో గ్రీటింగ్స్ పంపే దాకా బ్లాగ్‌‌లో కూడా ఒక ఎన్విరాన్‌‌మెంటల్ టపా ఒకటి పోస్ట్ చెయ్యాలని గుర్తురాలా.  ఎన్విరాన్‌‌మెంటల్ అనుకోగానే ‘జులాయి’ సినిమాలో రాజేంద్రప్రసాద్ డైలాగొకటి గుర్తొచ్చింది. ఒక దొంగతో నిజం చెప్పించడానికి హీరో వాడి చేతిలో ఒక పెన్ను గుచ్చేస్తాడు. రాజేంద్రప్రసాద్ పోలీస్ కమిషనరే అయినా పోలీస్ పన్లు ఎప్పుడూ చెయ్యని శాల్తీ కావడంతో జడుసుకుంటాడు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పుణ్యమా అని మాంఛి డైలాగ్ వదుల్తాడు – కుర్రాడు మరీ వయోలెంట్‌‌గా వున్నాడు. వీడికి పువ్వుల్నీ, పిల్లల్నీ చూపించండ్రా!! – అని.

మాటల మాంత్రికుడి డైలాగులో వున్న మంత్రం ఏంటోగానీ ఆ పూబాల కాస్తా ఈ👇 మురిపాలబాలయ్యింది.

muripaala bala

మళ్ళీ వాట్సప్పుకి పని పడింది. నిజంగా ఆ డైలాగులో “మాయమైపోతున్నాడమ్మా మనిషన్న వాడు…” అనే నైరాశ్యాన్ని పోగొట్టే మందుంది. ఎన్విరాన్మెంటల్ హెల్త్‌‌లో దాగిన మెంటల్ హెల్త్ రహస్యాన్ని విప్పి చెప్తుంది.

Every flower is a soul blossoming in nature – Gerard De Nerval 

ఒక పువ్వుని పూజ కోసమైనా కొయ్యడానికి మనసొప్పని చేతులు యాసిడ్ అటాక్‌‌లు చెయ్యగలవా?

ఎట్ లీస్ట్ అటాక్ చేసేముందు సందేహిస్తాయేమో, ఆ సందిగ్ధంలో అనర్ధం ఆగిపోయే అవకాశం ఉంటుందేమో!?!

DSC_0451

తల్లిపక్షి అందించిన పండుని గారంగా అందుకుంటున్న ఆ పిట్టపిల్లలో అమ్మ చేతి గోరుముద్దలు తిన్న తనని చూసుకున్న కుర్రాడు ఇంకో తల్లి బిడ్డని నొప్పించగలడా?

ఒక క్షణంంపాటైనా తటపటాయింపుకి గురై మనసు మార్చుకుంటాడేమో!?!

DSC_0413-1

సాలెగూడులో చిక్కి విలవిల్లాడుతున్న అందాల సీతాకోకచిలుకని చూసి ఒకే ఒక్కసారి ఒక పసిమనసు ద్రవిస్తే అది మళ్ళీ ఎవరి స్వాతంత్రాన్నైనా, ఎవరి ప్రాణాలైనా హరించడానికి ఒడిగట్టగలదా?

మనసులో ఒడిగట్టినా చేతల్లోకి దిగకుండా ఆగుతుందేమో!?!

DSC_0257

పూవు-తేనెటీగల అవినాభావ సంబంధంలో రెండు వేరు వేరు జీవులుగా కనిపిస్తున్న ఏకత్వాన్ని, విభిన్న రూపాల్లో కనిపిస్తున్న వాటిలో అంతర్లీనంగా స్ఫురించే అద్వైతతత్వాన్ని ఆకళింపు చేసుకున్న యువతలో వ్యతిరిక్త భావాలు, పరస్పర విద్వేషాలు ఎలా పుడతాయి?

ఏకం సత్ విప్రాః బహుదా వదంతి అని ఎవరి భాషలో వాళ్ళు అర్ధం చేసుకుంటారేమో!?! ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారేమో!?! 

DSC_0170

సొంతంగా విత్తు నాటి పెంచిన వృక్షం పూలు పూసి, కాయలు కాసి కొత్త చెట్టుకి జన్మనివ్వడం చిన్నప్పుడే అనుభవంలోకి తెచ్చుకున్నవాళ్ళు  తమని కని పెంచినవాళ్ళ ప్రేమానురాగాల్ని వమ్ము చేసి ఆత్మహత్యలకి పాల్పడగలరా? నేరస్తులుగా మారగలరా?

పువ్వుల్ని, పొలాల్నీ, తోటల్నీ చూస్తూ –

తూనీగలతో, తువ్వాయిలతో ఆడుకుంటూ –

పంటకాలవకి అడ్డంగా వేసిన తాటి దుంగ మీద అడుగులో అడుగేసుకుంటూ నడుస్తూ –

తొలకరి జల్లు నేలనంటగానే వెలువడే మట్టివాసన పీలుస్తూ –

నల్లటి వానమబ్బుల క్రిందగా, పచ్చటిపైర్ల మీదగా అందంగా, మందంగా పయనించే తెల్లకొంగల బారుల్ని చూసి పరవశిస్తూ –

బడికెళ్ళే ఛాన్సే లేని పిల్లలకి ఆ పైన చెప్పినవన్నీ ఎలా అనుభవంలోకి వస్తాయి?

Look deep into nature, and then you will understand everything better – Albert Einstein 
పర్యావరణ పరిరక్షణ అంటే చెట్లు పెంచడం, వన్యప్రాణుల్ని కాపాడ్డం మాత్రమే కాదేమో వాటితో మనిషి తాదాత్మ్యం చెందడం కూడా అవసరమేమో?

అందుకే ఎన్విరాన్‌‌మెంటల్ లో మెంటల్ కూడా ఇమిడిపోయివుంది.

ఎన్విరాన్‌‌మెంటల్ పొల్యూషన్, మెంటల్ పొల్యూషన్ రెండూ ఒకేసారి విజృంభిస్తున్న తరుణంలో వనాలు పెంచడంతో పాటు పిల్లల చదువులు ధనం కన్నా వనం ముఖ్యమనిపింపజేసేలా వుంటే ఎంత బావుండు!!??!!

Study nature, love nature, stay close to nature. It will never fail you – Frank Lloyd Wright

🐦🐒 🐵🍵 🌏 🌊 🌄 🌇 🌃 🌉 🌷 🌿 🌾 🌹 🌴

15 thoughts on “మొన్న జూన్5th న ‘జులాయి’ సినిమాలో రాజేంద్రప్రసాద్ చెప్పిన త్రివిక్రమ్ డైలాగ్ గుర్తొచ్చింది

 1. విన్నకోట నరసింహారావు

  సందర్భానికి తగిన టపా వ్రాశారు.
  ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై ………… అనుకోగలిగిన భావుకత / సున్నితత్వం పిల్లల్లో ప్రవేశపెట్టగలిగితే ధన్యులమే.

  Like

  Reply
    1. YVR's అం'తరంగం' Post author

     Sir, డాష్ బోర్డులో కాకుండా డైరెక్ట్ గా టపాలో రిప్లై ఇస్తే ఈ మెయిల్ ఐడి వగైరా అడిగింది. ఇవ్వలేదు. దాంతో అనామకుణ్ణి చేసేసింది. డాష్ బోర్డులోంచి రిప్లై ఇస్తే ఆ బాధలేదు.

     Like

     Reply
 2. వెనకట రాజారావు . లక్కాకుల

  బాగుంది పోష్ట్ .
  మీ చేతిలో మురిపాల బొమ్మగా ఊపిరి పోసు (తీసు)కున్న పూబాల ఇంకా బాగుంది JK 😊.
  ఒక పువ్వుని ….. అనర్థం జరిగిపోయే అవకాశం
  …..( జారిపోతుందేమో ! కూడాను , ఐదు సెకండ్లు
  ఆలోచిస్తే మరి ! )
  పిట్ట పిల్లకి తల్లి పక్షి అందించేది పురుగుల్ని . అదీ,
  లార్వాదశలో ఉన్న ఇంకో తల్లి పిల్లల్ని — తన
  పిల్లలు బలంగా , ఆరోగ్యంగా పెరగడానికి .
  సాలె గూడులో చిక్కి విలవలాలాడుతూ ఉన్న
  అందాల సీతాకోక చిలుకను చూస్తే , పసిమనసుకు
  కలిగేది వినోదం . ఇంక చేతల్లోకి దిగకుండా
  ఆపడం ఎవ్వరి తరమూ కాదు , రెక్కలూడే దాకా .
  విత్తు వృక్షంగా – వృక్షం పుష్ప ఫల భరితమై సు
  సంపన్నమై అపురూపాన్ని సంతరించుకోవడం
  తాననుభవించడానికే నని వికృతంగా ఆనందిం
  డా మనిషి ?
  దూడను కాస్త కుడిపితే కాని గోవు చేపుకు
  రాదు . పాలు చేపుకు రాగానే దూడను లాగేసి
  పాలు పిండు కుంటాము . గోవు పాలు చేపేది
  దూడ కోసమా , మనకోసమా ?
  తేటి మకరందాన్నాస్వాదిస్తుంది .
  ఆ క్రమంలో పూవుకు పర పరాగ సంపర్కం
  ఏర్పడనూ వచ్చు .
  ఇరువైపులా – ఇందులో యువత స్వార్థాన్నే
  ఆకళింపు చేసుకుంటుంది .
  మన పిల్లలకి బడా బడులకెళ్లే తప్పనిసరి
  పరిస్థితులైతే ఉన్నవి గాని , ప్రకృతి బడిని కనీసం
  చూచే భాగ్యమెక్కడుంది ?
  చదివేదీ డబ్బు కోసమే . బతికేదీ డబ్బు కోసమే .
  ఏకం సత్ విప్రాః బహుదా వదంతి . ఇందులో
  మీదొక పార్శ్వ మైతే , నాదో పార్శ్వం .
  ధన్యవాదములు .

  Liked by 1 person

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   ధన్యవాదాలు మాష్టారు _/\_
   మీ పార్శ్వాన్ని కాదనలేను. కృతయుగంలో కూడా రాక్షసులుండేవారు కదా!! దేవాసుర సంగ్రామం నిరంతర ప్రక్రియ అయినదీ అందుకే కదా!!
   కానీ, చిన్నిమనసులకి బిజినెస్ తెలీదనీ, ప్రకృతి పాఠాలని పెద్దలు చెప్పే విధాన్ని బట్టీ వాళ్ళ ఆలోచనలు ప్రభావితం అవుతాయనీ ఆశాభావం అంతే.

   Like

   Reply
   1. వెనకట రాజారావు . లక్కాకుల

    పుడమి చీల్చుక మొలకెత్త పురుగు కొరక ?
    పురుగు పక్షి పిల్ల కొరక ? పరగ పాము
    కొరక పక్షి నిసుగులు ? ఆకొన్న జగతి
    సతత హననమ్ము సలిపెడు , సాక్షి ప్రకృతె .

    Like

    Reply
    1. YVR's అం'తరంగం' Post author

     రుద్రుడు, విష్ణువు పక్కపక్కనే నడవడమే ప్రకృతి లీల. వైవిధ్యం వెనక వున్న ఏకత్వాన్ని గ్రహించడమే మనిషికి ప్రకృతి నేర్పే పాఠం.

     Like

     Reply
 3. Zilebi

  ಲಕ್ಕಾಕುಲ ವಾರು ಕೂಡಾ ಜೆಕೆ ಅನಡಂ ಮೊದಲೆಟ್ಟೇರೇ 🙂

  ಜಿಲೇಬಿ

  Like

  Reply
 4. Zilebi

  పువ్వులతో పిల్లలతో
  నవ్వు ముఖమ్ముల రమణుల నయిసు నయిసుగా
  కవ్వించు జిలేబులతో
  లవ్వాడింప దగు యువకుల దుడుకు తగ్గన్ 🙂

  జిలేబి

  Like

  Reply
 5. Anonymous

  పోస్ట్ మరియు పిక్స్ బావున్నాయండీ. ప్రకృతి అంటే పరవశించిపోతాన్నేను.

  కామెంట్లకు గాను మీ సూచన పెద్ద అక్షరాల్లో వుంది. చిన్నక్షరాల్లో వుంచితే బావుంటుంది. పెద్దక్షరాలు వాడితే మామూలుగా చెప్పినట్లు కాదు అరిచేసి చెబుతున్నట్లు :)) అందుకే.

  Liked by 1 person

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   బ్లాగ్‌‌కి స్వాగతమండి _/\_. మీ సూచనకి మెనీ మెనీ థాంక్స్. మార్చేశాను.😊 .
   ప్రకృతి ఇష్టమన్నారు కాబట్టి నా కొత్త ఓన్లీ నేచర్ బ్లాగ్ చూడమని కోరుతున్నాను –
   https://yvrwalkswithnature.wordpress.com/

   Like

   Reply
 6. S P Jagadeesh

  అద్భుతమయిన వ్యక్తీకరణండి… ప్రకృతిలో మమేకమయిన మన సనాతన ఆలోచనా విధానం…, పరలోకంలో ఏదో ఉందనుకుని అందరినీ శత్రులువుల్లాగా చూసే వాళ్ళ ఆలోచనకి కూడా అందదు…

  Like

  Reply
 7. విన్నకోట నరసింహారావు

  పైన మీరు చెప్పిన మీ ఓన్లీ నేచర్ బ్లాగ్ ని కూడా ఏదైనా సంకలినికి తగిలిస్తే బాగుంటుంది కదా. రీడర్ షిప్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

  Like

  Reply

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s