Coutsey: Andhrajyothi
మోడీ మేష్టారు సారీ చెప్పడం ఏంటి? అసలాయన సారీ చెప్పల్సినంత పెద్ద సమస్య ఏముందీ ?
గురువు అద్వానీ నమస్కారాన్ని పట్టించుకోలేదని దేశమంతా తల్లడిల్లిపోయినా దాని గురించి బాధ పడినట్టు చిన్న హింట్ కూడా ఇవ్వనాయన,
డీమోనిటైజేషన్ టైములో వారానికి రెండువేల కోసం క్యూలల్లో జనం నానా తంటాలు పడుతుంటే సారీ అనిపించనాయన,
బాంక్ ఎక్కౌంట్ వున్న ప్రతి ఒక్కరూ ఆ ఎక్కౌంట్లో పడాల్సిన పదిహేనులక్షలు ఎప్పుడు పడతాయా అని నాలుగేళ్ల బట్టీ కళ్ళు వాచేలా వెయిట్ చేస్తున్నా కిమ్మనకుండా కూచున్నాయన,
ఉన్నట్టుండి సారీ చెప్పడమేంటి? అసలాయన సారీ చెప్పల్సినంత పెద్ద సమస్య ఏముందీ దేశంలో? అనిపించక తప్పదు కొందరికైనా. జనరలైజ్ చేసెయ్యడం ఎందుగ్గానీ నాకు మాత్రం అనిపించింది. అందుకే పై హెడ్డింగ్ అదే ఫలానా పేపర్లో కనిపించగానే చదివేశా. ఎగ్జాక్ట్లీ ఇదీ ఆ న్యూస్ –
//కోల్కతా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం విద్యార్థులకు క్షమాపణ చెప్పారు. విశ్వభారతి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం సందర్భంగా ఆయన శాంతినికేతన్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు ఆయన మాట్లాడుతూ ‘‘అన్నిటికన్నా ముందు, విశ్వభారతి విశ్వవిద్యాలయం ఛాన్సలర్ హోదాలో నేను క్షమాపణలు చెప్తున్నాను. నేను వస్తున్నపుడు కొందరు విద్యార్థులు సైగలు చేశారు, తమకు తాగునీటి ఏర్పాట్లు చేయలేదని చెప్పారు. మీకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్తున్నాను’’ అన్నారు. ఈ స్నాతకోత్సవంలో బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా పాల్గొన్నారు.//
Coutsey: Andhrajyothi
ఆయనకి నేను ఫానూ కాదు, అలా అని యాంటీ కూడా కాదు, కానీ ఆయన యొక్క జెస్చర్ మాత్రం నాకు భలే నచ్చింది. ఆయన ఛాన్సలర్ హోదాలోనే చెప్తున్నానంటూ ప్రధానమంత్రి హోదాలో కాదని నర్మగర్భంగా చెప్పినట్టనిపించినా కూడా నచ్చింది.
మనం గుళ్ళో విగ్రహాన్ని చూసి అది విగ్రహమే అనుకునే జనాలం కాదు కదా! అది అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడనే అనుకుంటాం కదా!! అలాగే ఆయన నేను ఛాన్సలర్ హోదాలోనే చెప్తున్నానర్రోయ్ అంటూ హైలైట్ చేసుకున్నా మనం ఆయనకున్న ప్రధాని హోదానే పట్టించుకుంటాం, ఆ మాటలు ప్రధాని మాటలే అనుకుంటాం. అనుకున్నాం. అనుకుందాం.
ఆ మాటలు చెప్పి మోడీ మేష్టారు ఎందరో పాత ప్రధానులు చెయ్యని, రాబోయే ప్రధానులు చేస్తారో చెయ్యరో తెలియని ఒక గొప్ప పని చేసి ఒక ట్రెండ్ సెట్ చేసారని నాకనిపించింది.
విశ్వభారతి ప్రాంగణంలో విశ్వకవి ఆత్మ వింటుండగా ప్రధాని దేశంలో ప్రబలుతున్న మంచినీటి సమస్యలని, నానాటికీ అడుగంటుతున్న భూగర్భ జలాల సమస్యని ఎక్నాలెడ్జ్ చేసారు.
ఆ యూనివర్సిటీ విద్యార్ధులు మంచినీళ్ళు లేవని చేసిన సైగలని ఆయన దేశం నలుమూలలనించీ ప్రజలు చేసిన సైగలుగా గుర్తించారనిపించింది.
తద్వారా ఫేస్బుక్కులూ, వాట్సప్పులూ, టీవీ డిబేట్లూ, చివరికి బ్లాగులూ – వీటిల్లో ఎక్కడా కనిపించని, నిజానికవేంటో కూడా తెలీని జనాల సమస్యల్ని ఎక్నాలెడ్జ్ చేసారు.
ఇంక ఆయన మార్గదర్శకత్వంలో కేంద్రం, రాష్ట్రాలూ –
అందరి నీటి కష్టాలూ తీర్చేస్తారని ఆశించచ్చు. (అసలే వాళ్ళ సత్సంబంధాలు అదిరిపోతున్నాయి కూడాను)
ఇంక జనాభాలో ప్రతి మనిషికి-
గుప్పెడు మట్టి సంగతెలా వున్నా రోజూ చెంబెడు నీళ్ళు దొరికి ఆ విధంగా స్వచ్ఛభారత్ ప్రాజెక్టు కూడా సక్సెస్ అవుతుందని కూడా-
ఆశించచ్చు
ఆశిద్దాం
ఆశిస్తూనే ఉందాం.
ఇంతేసంగతులు.
బై4నౌ
🙏
మీ దేశంలో మా హయాంలో జరిగిన అన్యాయాల / దారుణాల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం అంటూ ఇంగ్లండ్ రాణి గారైనా సారీ చెప్పారు కానీ మన నాయకులు అటువంటి వాటికి అతీతులు కదా.
అయినా ప్రజలు అలవాటుపడిపోయాక ఇంక సమస్యేముంది, సారీ చెప్పేదేముంది?
పైన పెట్టిన ఫొటోలు అన్నీ pathetic గానే ఉన్నాయి కానీ చివరిది మరీనూ …. నా దృష్టిలో. ఆ చిన్నపిల్ల కాళ్ళకు కనీసం చెప్పులైనా ఉన్నాయో లేవో (ఉండి ఉండవనే నా అనుమానం)? ఏమి బాల్యం! 70 సంవత్సరాల తరవాత కూడా The face of parched rural India లో మార్పు లేదు 😪.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLiked by 1 person
మీ వ్యాఖ్యల్లో మీరు ఉటంకించే విషయాలు, anecdotes, భలే వుంటాయండి.
ఆ పాప ఫోటోని రెండేళ్ల క్రితం చూసినప్పటినుంచీ కలుక్కుమనిపిస్తూనే వుంది. ఆ ఫోటో ఇక్కడ వాడి ఆ బాధ కొంచెం తీర్చుకున్నాను. మీ స్పందన ఇంకా కదిలిస్తోంది.🙏
LikeLike
పైపెచ్చు నిన్ననే పెట్రోలు ధరను లీటర్ కి … ఒక పైసా … ఒక పైసా … తగ్గించి ప్రజలంటే తమకున్న “అభిమానాన్ని” చాటుకున్న ప్రభుత్వం. అపహాస్యం చెయ్యడం అంటే ఇదేనేమో? ఒక వార్తాపత్రిక “cruel joke” అనింది. ఈ క్రింది లింక్ లోనున్న కార్టూన్ చూడండి (31-May-2018 Deccan Chronicle front page), సామన్యుడి నిస్సహాయత తెలుస్తుంది. దిగుమతుల మీద ఆధారపడ్డవారి నిస్సహాయత, ఆయిల్ ఉత్పత్తి దేశాల దాష్టీకం, వారి గుప్పెట్లో ఉన్న ఆయిల్ ధరలు ….. వగైరా పడికట్టు మాటలు వినిపిస్తూనే ఉంటాయి, చిరాకుగా ఉంటుంది.
https://www.deccanchronicle.com/counter-point
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
సారీ చెప్పగ మోడియంట విను వైస్చాంస్లర్రు హోదాన, దే
శారిష్టంబులు కండ్ల ముందగుపడన్ సాధ్యంబయెన్! పౌరులా
రా రయ్యంచును నీటికష్టముల ధారాళంబుగా తీర్చు న
ర్రా రారాజగు మోడి యే! చనవరీ రా వందనాల్జెప్పు భో! 🙂
జిలేబి
LikeLiked by 1 person
జిలేబిగారు, పద్ధ్యన్యవాదములు.
ఇంతకీ ఛందస్సుకి ఛాన్సలర్ ని బలిచ్చేశారా వైస్-ఛాన్సలర్ అయిపోయాడు? (Jk😀)
LikeLike
ఓ మానవుడు చాన్స్లర్రా సర్లెండీ ఇంకా బాగా ఇమిడేరు 🙂
సారీ చెప్పగ మోడియంట వినుడీ చాన్స్లర్రు హోదాన దే
శారిష్టంబులు కండ్ల ముందగుపడన్ సాధ్యంబయెన్! పౌరులా
రా రయ్యంచిక నీటికష్టముల ధారాళంబుగా తీర్చు న
ర్రా రారాజగు మోడి యే! చనవరీ రా వందనాల్జెప్పు, భో
జిలేబి
LikeLike
// “మీ వ్యాఖ్యల్లో మీరు ఉటంకించే విషయాలు, anecdotes, భలే వుంటాయండి.” //
Thanks. సమయానికి తగు మాటలాడెనే …. లాగా ఉండాలని తాపత్రయం. ఒక్కోసారి కుదురుతుంది 🙂, ఒక్కోసారి బెడిసికొడుతుంది 🙁.
LikeLike