KSD”అప్పల్రాజు” ఎవరో తెలుసుకోవాలని, రెండో, మూడో వేల ఏళ్ళ క్రితం ఒక రాజుగారబ్బాయి…


మొన్న మార్చిలో రెండు వారాల  చైనా ట్రిప్పు పడింది. సుజౌ సిటీ చుట్టుపక్కల మూడు రోజులు తెగ తిరిగాం, ఫౌండ్రీలు, ఫోర్జింగ్ షాపులు వగైరాలు విజిట్ చేస్తూ. ఆ తిరుగుడులో ఒక చోట అదుగో ఆ బుద్ధుడు👇 కనిపించాడు.WhatsApp Image 2018-05-29 at 11.47.50ఆదిశంకరాచార్యుడు, జీసస్‌‌‌‌ల ప్రతిరూపాలని చూసినప్పుడు ఎలాంటి అలౌకిక భావపరంపర మనసుని తాకుతుందో శాక్యమునిని చూసినా కలుగుతుంది. కలుగుతుంది కాదు మనసు కరుగుతుంది అంటే కరెక్టు. అలా కరిగిపోయినప్పుడు కలిగే  అనుభవం ఏంటంటే ఈ అస్తిత్వానికి కులం, మతం, దేశం, …. టు కట్ ఇట్ షార్ట్ .. మనని మనం చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి సెపరేట్ చేసుకోడానికి ఎన్ని రకాల సాకులుంటే అన్ని సాకులూ మాయమైపోతాయి. క్షణంలో సగం సేపే ఐనా ఆ ఆనుభూతి అద్వితీయం. కాదు, అద్వైతం. ఆ ఆద్భుతవ్యక్తుల ఆలోచనా పరంపర  వేల ఏళ్ళ తర్వాత ఇంకా నిలిచి వుందంటే అది వారి జీవితకాలంలో  వాళ్ళు తమ అనుయాయులకి కలిగించిన అద్వితీయ భావనలకి అద్వైత అనుభవానికి సాక్ష్యం అని నాకర్ధమైంది అని నేననుకుంటున్న వారి గొప్పతనం. లెటజ్ నాట్ గో టు వాట్ సమ్ ఆఫ్ దెయిర్ ఫాలోవర్స్ డు ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాలోయింగ్ దెయిర్ ఫిలాసఫీస్. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ హియర్.

ఇప్పుడా బుద్ధుడు ఎందుకు గుర్తొచ్చాడంటే ఇవాళాయన బర్తు డే కదా! అది మర్చిపోకూదడనే సెలవు కూడా ఇచ్చారు కదా!! ఈ సందర్భంగా మానవజాతిని నిజంగా మెచ్చుకోవాల్సిన సంగతి – మహానుభావుడు అనుకున్న వ్యక్తి పుట్టినరోజుకి పబ్లిక్ హాలిడే ఇవ్వడం. ఆ రకంగా, “జీవితమంటే అంతులేని ఒక పోరాటం. బ్రతుకు తెరువుకై  పెనుగులాడుటే ఆరాటం..” అంటూ పాడుకోడానిక్కూడా టైము, ఛాన్సు కూడా లేని మనిషికి పోరాటాలకి, ఆరాటాలకి అవతల ఏముందోనన్న ఆసక్తి, కుతూహలం పెంచుకోడానికి, వీలయితే తీర్చుకోడానికీ ఒక అవకాశం ఇవ్వడం.  ఎంతమంది దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు అనేది వేరే విషయం. అది నెగెటివ్ థింకింగ్.

పోరాటాలకి, ఆరాటాలకి అవతల ఏముందోనన్న ఆసక్తి, కుతూహలంతో, ఈ ప్రపంచం అనే నాటకరంగానికి తెర వెనక కధ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం చేసే “అప్పల్రాజు” ఎవరో తెలుసుకోవాలని –

రెండో, మూడో వేల ఏళ్ళ క్రితం ఒక రాజుగారబ్బాయి ఇంట్లోంచి వెళ్ళిపోతే,

అలా వెళ్ళిపోయి “తెర వెనక భాగవతం” అంతా తెలిసేసుకుని ఇవతలికి వచ్చి “ఒరేయ్! బాబుల్లారా! K.S.D “అప్పల్రాజు” సంగతలా వుంచండి. పరలోకంలో ప్రశాంతత కోసం ఈ లోకంలో అశాంతి సృష్టించక్కర్లేదురా! మీ పరలోక సుఖాల కోసం ఇతర జీవుల్ని పరలోకానికి పంపించాల్సిన పనిలేదురా! మీ బుద్ధిని వాడండి, మీ ధర్మాన్ని ఆచరించండి, మీ సంఘాన్ని ఆశ్రయించండి” అని బోధిస్తే

ఆయన కృషి అంతా ఈ రోజు మనకి ఒక పబ్లిక్ హాలి డే రూపంలో వస్తే, దాన్ని ఎంజాయ్ చెయ్యడానికి, బిర్యానీ తిని, సినిమా చూడ్డానికి  ఉపయోగిస్తే ఆయన ఫీలవ్వడూ?!? ఇవాళ మాయింట్లో బిర్యానీయే; అది ఆపలేదుగానీ పిల్లలు సినిమా చూద్దామని యూ ట్యూబ్ ఓపెన్ చెయ్యగానే మాత్రం సక్సెస్‌‌ఫుల్‌‌గా, శాంతియుతంగా ఆపించా💪💪💪. బుద్ధుడు ఫీలవ్వడనే ఫీలౌతున్నా. ఫీలౌతాడని మనసులో ఏ మూలో వున్న కాస్త అనుమానం, గిల్ట్ పోగొట్టుకోడానికి నాకు తెలిసిన “బుద్ధం శరణం గచ్ఛామి….”కి నాకు తోచిన ఎక్స్ప్లనేషన్ ఇలా👇 ….

WhatsApp Image 2018-05-29 at 12.12.45

…. రాసుకుని బంధుమిత్రులతో వాట్సాప్‌‌లో పంచేసుకున్నా. చూసినవాళ్ళు చిన్ముద్రలు 👌 పెట్టారుగానీ చివాట్లు పెట్టకపోడంతో  అందరికీ నచ్చిందనే అనుకున్నా. ఒక ఫ్రెండు బుద్ధతత్వాన్ని ఇలా జ్ఞానకర్మ యోగాలతో ఇలా ముడి పెట్టాడు – Three layers of human life. Self, dharma and society. All three layers have their importance. Only when we follow our Dharma and work towards a righteous society, Karma yogam is fulfilled. By looking inwards gyana yogam is initiated. Karma yogam and Gyana yogam are inseparable. ఇది చూసి ఇంకాస్త ధైర్యం వచ్చి టపాలో పెట్టేశా.

(ఈ టపాకి టైటిల్‌‌గా ఆర్జీవీగారి సినిమా టైటిల్ ఎలా కుదిరిందో ఆ దేవుడికే తెలియాలి  ‌😆 )

ఏకం సత్ విప్రాః బహుదా వదంతి

 

🌹 🙏🌹

 

21 thoughts on “KSD”అప్పల్రాజు” ఎవరో తెలుసుకోవాలని, రెండో, మూడో వేల ఏళ్ళ క్రితం ఒక రాజుగారబ్బాయి…”

 1. “అప్పల్రాజెవరయ్యా?”
  తిప్పలు తిండాటములు మదిని విడువన్ తా
  దప్పర గా ధ్యానము, చే
  దప్పక నొనరింప బౌద్ధ ధర్మంబాయెన్!

  జిలేబి

  Like

  1. //“అప్పల్రాజెవరయ్యా?”// మొదటిపాదం నాకు సంధించిన ప్రశ్న అనుకుంటున్నా జిలేబిగారు. కధ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం అప్పలరాజు అని రామ్ గోపాల వర్మ సినిమా పేరు గుర్తొచ్చి దేవుడికి వాడేశాను. అంతా ఆర్జీవిగారి “పుణ్యఫలం” 🙂

   Like

   1. బుద్ధుని జన్మ దినమ్ము ! ని
    బద్దత తో కొలిచినాము! పండగ వేళన్
    పద్ధతి గా బిర్యానీ !
    శుద్ధము గా వెజ్జు బువ్వ సుమనోహరుడా !

    జిలేబి

    Like

 2. మీ Thoughts on Buddhadom 👌.
  నేనిదివరలోనే అందామనుకున్నాను —-> అసలు మీ ఆలోచనలు ఎంత profound గా ఉంటాయంటే మీరు కూడా ఒక ఆధ్యాత్మిక గురువుగా అవతరించవచ్చు అన్నంత. రిటైర్ అయ్యాక చేపట్టండి 👍 (సన్యసించనక్కరలేదు). పేరు మాత్రం ఇప్పుడే సూచిస్తున్నాను … నోవాచేరా స్వామీ లేదా కాఫీబాబా 🤘.

  అన్నట్లు .. వెజ్ బిర్యానీయేగా? అహ, ఏంలేదు, ఇవాళ బుద్ధజయంతి అన్నారు కదా, అందుకుని అడిగానన్నమాట 🙂.

  Liked by 1 person

  1. విఎన్నార్ సర్ !

   1.మీ అభిమానానికి అసంఖ్యాక నమస్సులు 🙏🙏🙏🙏

   2.బుద్ధుడి పుట్టుకతో సంబంధం లేని 100% వెజ్ బిర్యానీయే సార్ 😊

   Liked by 1 person

   1. సన్యసించాలనుకునే వారికి రాజకీయాలపై ఆసక్తి ఉండకూడదు.సముద్రం దాటి దేశాలు తిరగాలనే యావ అస్సలు ఉండకూడదు.మోడీ సన్యాసి అంటేనే నేను నమ్మను.మీకు అస్సలు అర్హత లేదు.అప్పల్రాజే గ్రేట్ !


    https://polldaddy.com/js/rating/rating.js

    Like

 3. నీహారిగ్గారూ ,
  నాకు అర్ధమైనంత వరకూ సంసారి కంటే సన్యాసికే యావ ఎక్కువండీ. సంసారి తాను బావుపడితే చాలనుకుంటాడు. సన్యాసి అలాకాదు సంసారాన్ని వదిలేసినట్టే కనిపిస్తూ మొత్తం ప్రపంచాన్ని మార్చేద్దామని చూస్తాడు. మోడీ మాష్టారు అన్ని రాష్ట్రాలూ ఆక్రమించెయ్యాలని చూడట్లా? అలా.
  నేను సన్యసించే ఛాన్సే లేదండీ. గృహస్థాశ్రమాన్ని మించిన సన్యాసం, సంపూర్ణశరణాగతి ఎక్కడుందసలు?

  Like

 4. // గృహస్థాశ్రమం …….., సంపూర్ణశరణాగతి //

  హ్హ హ్హ హ్హ, true true, well said 😀😀. మీలో ఒక గురువు దాగి ఉన్నాడని ఊరికే అనలేదు ☝️.

  Like

  1. Vnr గారూ ,

   మీరు కమెంట్ లో పెట్టే చిన్ముద్రలు ఎలాగో తెలుపగలరా ?

   Like

   1. జవాబు కూర్చేలోపే “జిలేబి” గారి పద్యం వచ్చేసింది (వారి బ్లాగ్ లో) 🤨.

    సరే, సింపుల్ నీహారిక గారూ. మీరు టైప్ చేస్తున్న చోట (బ్లాగ్ పోస్ట్ అవచ్చు, కామెంట్ బాక్స్ అవచ్చు, మెయిల్ అవచ్చు) ఇమోజి పెట్టాలనుకున్న దగ్గర ఆగి (కర్సర్ .. నిలువు గీత .. అక్కడ ఉండాలి), కీబోర్డ్ మీద ఇమోజి బొమ్మ ఉన్న కీ ఉంటే (సాధారణంగా స్పేస్ బార్ ప్రక్కన ఉంటుంది) దాన్ని నొక్కండి. బోల్డన్ని ఇమోజీలు, చిన్ముద్రలు, జంతువులు, మొక్కలు, పూలు, పళ్ళు, స్టార్లు (🙂) వగైరా వగైరా కనబడతాయి. మీకు కావలసిన దాని మీద నొక్కితే అది మీరు టైపు చేస్తున్న దగ్గరకి వస్తుంది. అంతే.

    కొన్ని కీబోర్డ్ ల మీద డైరెక్ట్ గా ఇమోజి కీ ఉండకపోవచ్చు. కానీ గ్లోబ్ బొమ్మ ఉన్న కీ ఉంటుంది (అవును, స్పేస్ బార్ ప్రక్కనే). దాన్ని నొక్కుతూ ఉండండి …. ఇమోజీల లిస్ట్ వచ్చేటంత వరకు 👍.

    ఓకే?

    * 😎 ⭐️

    Like

      1. HTML emojis అని సెర్చ్ చెయ్యండి. ఎమోజి వెబ్-సైట్ వస్తుంది. అందులో మీ కంప్యూటర్ కి సరిపోయే ముద్ర కాపీ పేస్ట్ చెయ్యండి. నా పధ్ధతి ఇదే.

       Like

 5. బాబాయౌతరు! విన్న కోట నరసింహారావు పల్కిద్ది ! కా
  ఫీబాబా! యని పేరు బెట్టితినిదే ! ఫీచర్లతో మీ కతల్
  గాబాగూబిగ సాగు చుండె! జనులున్ కాంక్షించుచున్ కొల్తుర
  య్యా బారాది, గృహస్థ జీవనపు సయ్యాటల్ దిగద్రోచకన్
  రాబోయే రిటయిర్డు లైఫునకిదే రాచందమౌ వైవియార్ !

  జిలేబి

  Like

 6. నీహారిక గారూ, YVR గారు సూచించిన పద్ధతి మరింత సులభమని తోస్తోంది కాబట్టి ఫాలో అయిపోవచ్చు. వారి పద్ధతో, నా పద్ధతో ఏదో ఒకటి అనుసరించి ఇక్కడ మీ జవాబొకటి పెట్టండి – దాంట్లో ఇమోజీలు దట్టించి ☝️. అటువంటి జవాబు మేం ఇచ్చిన సోకాల్డ్ “శిక్షణ” (—-> జిలేబి గారి ఉవాచ) కు summative assessment గా పనికొస్తుంది. 👍

  * 😎⭐️

  Like

  1. పైన ఇచ్చిన కోడ్ కాపీ పేస్ట్ చేస్తే అలాగే వస్తుంది.ద్యేవుడా…

   Like

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s