వృద్ధపతీ ఏకపత్నీవ్రతః


కొందరు రాజకీయుల వ్యవహారం ఎలా ఉంటుందంటే….,, చెప్తా, ఎలావుంటుందో చివర్లో చెప్తా…

పాపం కలియుగ అశ్వమేధం(=హార్స్ ట్రేడింగ్‌‌) కుదరకపోయేప్పటికి –

స్పీకర్ పదవి యొక్క హుందాతనము,

పార్లమెంటరీ విలువలు,

సభామర్యాదలు,

సభా ఇదీ,

సభా అదీ,…

వగైరాలన్నీ గుర్తొచ్చిపడిపోతాయి వాళ్లకి. దెబ్బతో స్పీకర్ పదవికి పోటీపడట్లేదనేస్తారు. ఏకగ్రీవ స్పీకర్ ఎన్నిక ప్రజాస్వామ్య సాంప్రదాయమని సెలవిచ్చేస్తారు కూడా.

ఆ సభాపతి ఏకగ్రీవుడుగా వుంటాడా? లేక కిష్కింధాపతి సుగ్రీవుడౌతాడా? అసలే ప్రజాస్వామ్య “పరిరక్షకు”లందరూ కలిసి ఏర్పాటు చేసేస్తున్న ప్రభుత్వమయ్యే!! కిష్కింధ వాతావరణం లేకుండా ఉంటుందా? అది బుల్లి వెండితెరల మీద ఎలాగు చూస్తాం. ఇంతకీ –

ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతానేవుంటాయి. అది మామూలే కానీ ఓడయిన బండి బండైన ఓడని ఎక్కిరించడం ఎద్దేవా చెయ్యడం; దానికి vice versa మహా చిరాగ్గా ఉంటది, మనకి. ఆ చిరాకుతో –

వృద్ధపతీ ఏకపత్నీవ్రతః అని పూర్వీకులు చెప్పని ముతక సామెతొకటుంది. (అఫ్‌‌కోర్స్, దీని పూర్వాశ్రమ సామెతంత ముతకా, షావినిస్టిక్కూ కాదనుకోండి) అదుగో ఆ సామెత గుర్తొస్తుంది రాజకీయుల యవ్వారం చూస్తే; రాజకీయ శ్రీరంగనీతులు వింటుంటే.

ఇంతేసంగతులు. బై4నౌ