హాపీ! మాతృDayవోభవ!!


ఈ రోజు మదర్స్ డే. యధావిధిగా ఓపక్క శుభాకాంక్షలు, మరోపక్క ఇదేమన్నా మన సంస్కృతా అంటూ చాదస్తుల అక్షింతలూ … అన్ని లోకాల్లోనూ జరిగిపోతున్నాయ్ . ఇక్కడ అన్ని లోకాలు అంటే ముఖాముఖి చెప్పడంతోపాటు తక్కిన అన్ని రకాల మీడియాలోనూ… వాట్సప్, ముఖపుస్తకం, బ్లాగులూ గట్రా అన్నిట్లో అన్నమాట. గూగుల్ అంటే నారదుడు అనగలిగినప్పుడు సోషల్ మీడియాలని లోకాలు అంటే తప్పేంవుంది?
మాతృత్వం, అమ్మదనం, మదర్-హుడ్ – భాషలు వేరైనా భావం ఒకటే – అమ్మ అన్నదే ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియనీ మమతలమూట అన్నదే. మనం అమ్మని ప్రతిక్షణం తల్చుకుంటామో లేదో చెప్పడం కొంచెం కష్టం అవచ్చు కానీ ఏ క్షణంలోనూ మర్చిపో(లే)ము అనడం అక్షరాలా నిజం. అది ఇండియన్‌‌కైనా ఆఫ్రికన్‌‌కైనా నార్త్ కొరియన్‌‌కైనా అందరికీ నిజమే. భాషతో, సంస్కృతితో దానికస్సలు సంబంధం లేదు. ఎందుకంటే అది ప్రకృతిలో సహజంగా వున్న గుణం కనుక.

( వీలైతే ఇది కూడా చదివెయ్యండి😊🙏 : Beautifully Dutiful Mothers of the World at

🌿🐢YVR’S 👣WALKS🐾WITH🌾NATURE🐌🍄 )

🌹May all the mothers..

….the🌳 Mother Nature🌳 and the nature of Mother 👩‍👦‍👦…

DSC_0244

…and Motherhood be Happy and enjoy undisturbed Peace 😍

మన ప్రస్తుతసంస్కృతిలోనే ఉంటూ మదర్స్ డే కూడా అదనంగా చేసుకునేవాళ్ళ మీద అక్షింతలు వెయ్యడం అవసరమా? అనవసరం.

 • మన సంస్కృతి ప్రకారం పంచె, కండువా కాకుండా పాంటూ, షర్టూ వేసుకునేవాళ్ళకీ
 • మన సంప్రదాయంలో లేని సినిమాలని మొన్నమొన్నటి వరకూ క్లబ్ డాన్సులు, డబల్ మీనింగ్ డైలాగుల్తో సహా కిమ్మనకుండా ఎంజాయ్ చేసేసి , ఇప్పుడు సంస్కృతి భ్రష్టు పట్టిందంటున్నవాళ్లకి
 • పోర్న్ వెబ్-సైట్స్‌‌ని బ్లాక్ చేయించలేనివాళ్లకి
 • అత్యాచార నిందితులని రాజకీయాలకి అతీతంగా నిలదియ్యలేనివాళ్ళకి

అలా అక్షింతలేసే అధికారం అస్సల్లేదు. ఎందుకంటే సంస్కృతి భ్రష్టు పట్టడంలో వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు ఆల్రెడీ ధరించేశారు మరి.
హ్యాపీ మదర్స్ డే అని ఎవరైనా అంటే చిరాకుపడేవాళ్ళ చిరాకు ప్రకృతి వరంగా వచ్చిన గుణం అడుగంటిపోతోందనా? లేక పరాయి సంస్కృతి నుంచి ఒక ‘డే’ని అరువు తెచ్చుకున్నందుకా? ఎందుకు?
మొదటి సమస్య అస్సలు లేని పక్షంలో రెండోదాని మీద విరుచుకుపడితే దాన్ని అర్ధం చేసుకోవచ్చు. కేవలం రెండోదాని మీదే కోపం అయినట్లయితే ముందు మొదటి సమస్య మన గుమ్మం వరకూ వచ్చేసిందని గుర్తించాలి. గుర్తించామా?
ఆల్రెడీ గుర్తించినట్టైతే ఆడపిల్లల్ని చుట్టుముడుతున్న అన్ని సమస్యలని – అవేంటో ఇక్కడ ఏకరువు పెట్టను – వాటన్నిటినీ సమాజం సాల్వ్ చెయ్యాలి. చేస్తున్నామా?

అవినీతి, ఐటం డాన్సులు, అత్యాచారాలు, ఆర్థికనేరాలు,… ఇవన్నీ మన సంస్కృతీ సాంప్రదాయాలా? మరి అవి ఎందుకు, ఎలా వచ్చిచేరాయి మన సమాజంలో?

లోకాస్సమస్తా (సోషల్ మీడియా మాలోకాల్తో సహా😆) సుఖినోభవంతు

మాతృదేవోభవ

హాపీ మదర్స్ డే

హాపీ మాతృడేవోభవ

(పెద్దపెద్ద సమస్యల్ని గాలికొదిలేసి నిరంతరం మార్పుకి గురయ్యే విషయాల మీద రాద్ధాంతాలు చేసుకుంటూ దేశం రాజకీయ కధాకాలక్షేపం చేసేస్తోందని చిరాకొచ్చి టైటిల్ అలా పెట్టాను. ఏమనుకోకండి.)

🙏

10 thoughts on “హాపీ! మాతృDayవోభవ!!

 1. Zilebi

  చాదస్తుల వీరవాయింపుడు 🙂

  దేవతలౌ యమ్మలకున్
  డే! వార్నీ పాసగూల ! డింగరుగా కొ
  ల్చేవా యేనా డైనన్?
  ఈవెస్ట్రను మోజులేల యీప్సిత మే సూ ?

  జిలేబి

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   జిలేబిగారు, ఇదేదో బావుంది. ఛందస్సుకి బదులు ఛాందసంతో పద్యాలు కట్టి వాయిస్తే తెలుగుభాషకి సేవ చేసినట్టైనా అవుతుంది. 😆

   Like

   Reply
 2. Zilebi

  కాలపు పోకడ మారిన
  నేలను విడువకు జనుడ పునీత సుమా య
  మ్మౌ! లక్షణముగ కొలువు మ
  యా లచ్చిందేవిగ నభయమునిచ్చు సదా !

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   //కాలపు పోకడ మారిన// కాలం మారడం ఏంటండీ, మనుషుల పోకడలు మారడాన్ని జస్టిఫై చేసుకోడానికి కాలం మీద పెట్టేస్తున్నాం.
   //నేలను విడువకు జనుడ// నేలతల్లిని విడవలేకే కదా ఈ గోడు.

   Like

   Reply
 3. Zilebi

  హ్యాపీ! మదర్సు డే! ఆ
  కౌపీనపు నాటి నుండి కాపాడెను తా
  నౌ పిరియముగా పిల్లల
  పాపిట సింధూరముగ సభామర్యాదౌ !

  Like

  Reply
   1. నీహారిక

    ఒక్క పద్యంతో పోయేదానికి మూడు పద్యాలతో కొట్టారు.ఇంకా అర్ధం కాలేదన్నారంటే మళ్ళీ పద్యంతో వాయిస్తుంది.వదిలేయండి మహాప్రభో !

    Like

    Reply
    1. Zilebi

     ఒక పద్యముతో పోయెడు
     యకమున కిప్పుడరరె యమ యాతన లాయెన్ !
     చకచక వేయు‌ జిలేబియు
     నిక పద్యములను టపటప నీహారికకై 🙂

     Like

     Reply
 4. విన్నకోట నరసింహారావు

  అయిందా (దీన్నే తెలుగు సినిమాల డయలాగుల్లో మరింత ముతకగా చెబుతారు) ? నాలుగో పద్యం కూడా దిగిందిగా ☺. అందుకే Quit while you are ahead అంటారు పెద్దలు.

  Like

  Reply

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s