Kingfisher🐥🐤Kinship (లకుముకి లైఫులో ఒక ఎపిసోడ్)


English only version of this post can be read in my Nature blog : https://wp.me/p9S9LZ-1k

ఏప్రిల్ పధ్నాలుగు, మధ్యాహ్నం ఒంటిగంటా రెండు అయ్యేప్పటికి భోరున వాన మొదలైంది. ఇవాల్టికి నా బర్డ్-వాకింగ్ ఎగిరిపోయినట్టే అనుకుని తెలుగు ఛానల్స్‌‌లో వచ్చే రాజకీయ చర్చ ఒకటి యూట్యూబ్‌‌లో పెట్టుకుని నిద్రకి ఉపక్రమించా. యెస్, నిజమే టీవీ పొలిటికల్ డిబేట్స్ వల్ల ఏ ఇతర లాభం వున్నా లేకపోయినా నిద్ర మాత్రం చక్కగా పడుతుంది. ఈసారీ పట్టింది. ఆ పట్టడం పట్టడం సాయంత్రం ఐదున్నర వరకూ మెలుకువ రాలేదు. ఆ మెలుకువ కూడా మామూలుగా రాలేదు. ఎవరో తట్టి లేపినట్టు వచ్చింది. కళ్ళు తెరవగానే కెమెరా పట్టుకుని బయల్దేరమని ఏదో అశరీరవాణి చెప్తున్న ఫీలింగ్. ఇలాంటి ఫీలింగ్ కలిగినప్పుడు, ముఖ్యంగా కెమెరా విషయంలో, దాన్ని గౌరవించడం మంచిది. ఇలాంటప్పుడు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువని ఇంతకుముందు ఎదురైనా కొన్ని అనుభవాలు చెప్తున్నాయి. సో, రెండు నిమిషాల్లో ఇంట్లోంచి బైట పడ్డా. It was raining heavily that 14th April afternoon. Feeling disappointed that my weekend bird-walk wouldn’t happen now I did the next best thing possible – fall asleep listening to one of the umpteen noisy but largely inconclusive debates of Indian tv channels. It was almost 5.30 in the evening when I woke up with a start as if called by someone. There was a feeling that I should go out with the camera. The rain had stopped altogether, not even a drop, it seemed, was left in the clouds. I decided to respect my instinct and was on the canal-side track within minutes.

KK1

దార్లో ఒక Tiger moth మెల్లిగా ఎగురుతూ కనబడింది. ఫోటో తియ్యడానికి ప్రయత్నిస్తుండగా అది వెళ్లి వానకి తడిసి ఇంకా నీటిబొట్లు రాల్చుతున్న ఒక ఆకు పైన ఒక రెక్క, కాస్త మీసం కనిపించేలా కూచుని పోజిచ్చింది. పోన్లే, తన ఫోటో ఎలా ఉండాలో దానిష్టం అన్చేప్పేసి అలాగే ఫోటో తీసేశా. నిజానికి ఈ శలభానికి మంచి కెమెరా సెన్స్ ఉందనిపించింది, ఫోటో చూసాక. నాకే ఇంకాస్త బాగా ఫోటో తియ్యడం వస్తే ఇంకా బావుండేది. Once on the canal track I tried to click a Tiger moth on wing but the handsome insect seems to have its own idea of how it wanted to pose for a picture. It settled on a large leaf with a rain drop dangling from its tip and offered only one of its wings and a whisker to the camera. I am happy to present it to the nature-lovers the way the winged Tiger liked it.

KK2.png

ఆ రెక్కల పులిని దాటుకుని ముందుకి పోతుంటే, “వానకు తడిసిన నీ బిగి రెక్కలు ఎండకు ఆరాలోయీ …,” అంటూ కూనిరాగాలు తీస్తూ ఆ గువ్వ కనబడింది. అంత ముద్దుగా, క్యూట్‌‌గా ఉన్నదాన్ని ఫోటోలో బంధించకపోతే పాపం కాదూ? అలా గువ్వపిట్టని ఛాయాచిత్రబంధితం చేసి అశరీరవాణి ఎటువైపు నడిపిస్తుందో ఆటే వెళ్లాను. A rain-drenched spotted dove waiting to let the rain trapped in its feathers drain before taking to wings was a brief but pleasant distraction on the way to where my hunch led me.

మా యింటికి దగ్గరలో ప్రవహించే కెనాల్ మీదగా దగ్గర్లో వున్న ఇండస్ట్రియల్ ఎస్టేట్‌‌కి ఒక బ్రిడ్జి వుంది. ఆ బ్రిడ్జి దాటి వెళ్తే క్రాంజి రిజర్వాయిర్ ఏరియా. ఆ పక్కన కాలవ గట్టు, రిజర్వాయర్ ఒడ్డు సహజంగా పెరిగిన చెట్లు, గడ్డితో వుండి చిన్నపాటి అడవి వాతావరణంతో రకరకాల పక్షులతో వుంటుంది. ఆ బ్రిడ్జికి దగ్గరలో నీళ్ళలో తేలుతూ చిన్న బల్లకట్టులాంటిది – కాలవని శుభ్రం చెయ్యడానికి వాడతారనుకుంటా – వుంటుంది. ఈ బల్లకట్టు మీద కూచుని నీళ్ళలో చేపల కోసం లకుముకిపిట్టలు, గాల్లో పురుగుల కోసం swallows (వానకోయిల అని ఆంధ్రభారతిలో వుంది కానీ కరెక్టో కాదో డౌటే) చూస్తూవుంటాయి. ఇటువైపు బర్డ్-వాక్‌‌కి వచ్చినప్పుడు ముందు ఈ పంటూన్‌‌ని చెక్ చెయ్యడం అలవాటుగా మారింది. ఇప్పుడా అలవాటు, అసరీరవాణి ఏకీభవించాయి.

ఆ బల్లకట్టు పైన కూచుని తోక పైకి కిందకీ కదుపుతూ అరుస్తోంది ఒక లకుముకి పిట్ట. ఎందుకో ఆ అరుపు – జంట కోసమా, ఆల్రెడీ ఉన్న తోడుని పిలవడమా కోసమా, తిండి కోసం తల్లితండ్రుల్ని పిలవడమా? ఏంటో కాస్సేపట్లో తెలియచ్చు. ఇలా అనుకుంటుండగానే మరోవైపునించి ఇంకో లకుముకి అరుపు వినపడింది. ఈ కొత్త పక్షి ఎక్కడుందాని అటూ ఇటూ చూసేలోగా నీలిరంగు మెరుపు మెరిసినట్టు ఆ కొత్త పిట్ట మొదటిదాని పక్కనే వాలింది.

There is a bridge connecting my neighborhood with the Sungei Kadut industrial area across the Pang Sua canal. One of the first things I do on reaching this bridge is to check for signs of bird activity on the farther side of the bridge i.e. the part where the Yewtee-side of the canal looks relatively wild with some natural growth of trees and tall grass bordering the banks of Kranji reservoir. This area also harbors a good variety of birds including sea eagles, herons, woodpeckers, etc. First spot I look for here is a pontoon-like floating structure that is kept close to the bridge and used, I believe, during canal maintenance works. This is a favorite perch of Kingfishers and Barn swallows.

And this is the point where my habit and my hunch converged. I saw a Collared Kingfisher perched on the pontoon and calling out loudly with its tail bobbing up and down at each note. It kept calling as I positioned myself against the railings of the bridge as close to the bird as possible.

I was wondering if the bird was calling out to attract a mate or to summon its spouse or to announce its hunger to its parent(s). I was still wondering when another Kingfisher’s voice joined the former’s. I was trying to figure out the direction from which the second bird was calling when the bird appeared, in a flash of aqua blue, beside the first one.

KK6

రెండు పిట్టలూ ఒకవైపుకే పరీక్షగా చూస్తూ కాసేపు కూచున్నాయి. గ్రద్ద, డేగ, ఈగిల్ లేదా మరో లకుముకి – ఇలా రూపంలోనైనా, ఎటుపక్కనుంచైనా ప్రమాదం ముంచుకురావచ్చు. ఆ జాగ్రత్తలోనే అలా చూస్తున్నాయా? లేదా తమ కుటుంబంలో మరో లకుముకి కోసం ఎదురు చూస్తున్నాయా? ఏమో, చూద్దాం. ఇంతలో కొత్త లకుముకి కొద్దిగా నేనున్నవైపుకి తల తిప్పింది. ముక్కుతో పట్టుకుని వుంది. Both of them sat in silence for a while looking in the same direction. Are they looking out for another family member or a possible competitor or for some danger lurking in the form of a Brahminy kite or a hawk or an eagle? I have no way of knowing but I know any one of these must be a possibility. Now, the second bird turned slightly towards my position. Oh, that’s interesting, there is something held in its beak!!

KK7

ఇంగ్లీషులో స్టైలుగా కింగ్-ఫిషర్ అని పేరు పెట్టుకున్నా ఈ రకం లకుముకులు చేపలు పట్టడం కన్నా బల్లుల్లాంటి జీవుల మీదే ఎక్కువ ఆధారపడి బతుకుతాయిలావుంది. ఐతే, ఇప్పుడు దీనికోసం నూకలు చెల్లించుకున్న ప్రాణి ఏంటో? ఇంటికెళ్ళి ఫోటో ఎన్-లార్జ్ చేసి చూడాలి. A frog? A lizard? I am sure its not a fish. Despite the name Kingfisher, these collared Kingfishers seem to subsist more on frogs, lizards and insects than on fish. As far as I know, at least. I would know what it is shortly, when this episode ends and I get a chance to view the snaps on the LED screen.

KK8

KK9

KK10

పిట్టలు రెండూ కొన్ని క్షణాలు అలాగే దిక్కులు పరికిస్తూ గడిపాక, రెండోది మొదటిదాని వైపు తిరిగింది. మొదటిది కూడా “ఇది ఏం పట్టుకోచ్చిందా,” అన్నట్టు చూసింది. ఒకదాని ముక్కునుంచి రెండోదాని ముక్కులోకి ఆ బల్లో, ఎదో దాన్ని మార్చుకున్నాయి. పక్షిపిల్లలు తల్లి నుంచి ఆహారం అందుకునేప్పుడు రెక్కలు లూజుగా చేసి ఆడిస్తాయి. ఇప్పుడు ఈ రెండూ రెక్కలు కొంచెంగా విప్పార్చాయి. బాలన్స్ కోసమేమో!! Few more moments passed when the second bird turned to the first and passed the “cargo” to it. The exchange took place with the wings of both the birds stretched out slightly. Fledgling birds stretch wings while begging or receiving food from a parent. Here both birds did it. Maybe they are parent birds and wing stretching was, probably, meant to balance their foothold on the perch while making the exchange.

KK11

KK12

KK13

KK14

వస్తుమార్పిడి అయ్యాక రెండూ ఎడమొహం పెడమొహంగా కాసేపు కూచుని చుట్టూ చూసుకున్నాయి. సహజప్రకృతిలో దోపిడీలు, కబ్జాలు మామూలే కదా! ఆ మాత్రం జాగ్రత్త పడక తప్పదు. కొన్ని క్షణాల తర్వాత మొదటి లకుముకి గాల్లోకి ఎగిరింది. Once the exchange was complete the two birds went back to scanning the horizons. Probably to detect any predators spying on the precious little exchange that was taking place. A few moments of scanning and then the first bird took off with the second one keeping the guard on the pontoon.

KK15

అలా ఎగిరి కాలవ గట్టున వున్న రెయిలింగ్స్ మెడ వాలి కాస్సేపు మళ్ళీ ఇటూ అటూ పరకాయించింది. ఆ చూడడంలో నన్నూ కవర్ చేస్తోందని తెలుస్తూనే వుంది. అది పట్టుకునే బల్లులూ, పురుగుల కోసం పోటీపడే రకం నేను కాదని? ఏకంగా వాటి ప్రపంచాన్నే కబళించేసే జాతికి చెందినవాణ్ణనీ పాపం, దానికేం తెల్సు ? రెండో పక్షి వచ్చినప్పటినుంచీ రెండూ అరవడం మానేశాయి. అంటే చుట్టూ పక్కల వున్నవి ఈ రెండే అన్నమాట, మూడో కింగ్-ఫిషర్ లేదనుకోవచ్చు. ఆహరం తెచ్చిన పిట్ట ఒక పేరెంట్ అయితే రెండోది రెండో పేరెంట్ కావాలి లేదా పిల్ల కావాలి. Bird with the “cargo” did not go very far. It alighted on the canal side railings for a minute or two of scanning the surroundings. I am sure I was one of those being scanned for the Kingfisher kept looking in my direction for a major part of those few minutes. One thing to note is that the birds stopped calling as soon as the second bird arrived with its “cargo”. That, possibly, rules out the possibility of a third kingfisher and confirms the first bird either as one of the parents or as a juvenile.

KK16

రెండు, మూడు నిమిషాలు కూచున్న పిట్ట దగ్గరలోనే వున్న ఇందాస్త్రియాల్ ఏరియాలో ఉన్న చెట్టు మీదికి వెళ్లి అక్కడే కూచుని అలా చుట్టూ చూస్తూ అలాగే ఉండిపోయింది. ఆ చెట్టులో దాని గూడు కానీ ఉందా? లేక ఇంకెక్కడో వున్న గూటికి వెళ్ళే ముందు నేను అక్కణ్ణుంచివెళ్ళిపోయే వరకూ ఎదురుచూస్తూ కూర్చుందా? ఇవాళ్టిలాగా మళ్ళీ ఏ అశరీరవాణో నడిపిస్తే గానీ తెలిసే ఛాన్సు లేదు. ఐతే, ఒక విషయం తేటతెల్లం అయింది. ఆ పక్షి కూడా పిల్ల కాదు. పిల్ల అయితే దొరికిన తిండి వెంటనే మింగేయ్యాలి కదా? అలా చెయ్యకుండా ఓపిగ్గా అలా పట్టుకుని, చుట్టుపక్కల ఏ ప్రమాదంలేదని రూఢి అయ్యేవరకూ కదలను అన్నట్టు అలా కూచుందంటే అది తల్లిపక్షి అయ్యుండాలి. తిండి పెట్టడమే కాదు, తన గూడున్న చోటు ఎవరికీ తెలియకుండా చూసుకోడం కూడా ఈ బుల్లి పిట్టకి తెలుసు అనుకుంటే అదింక పక్షిలాగా కనిపించడంలేదు. ఇక్కడ ఇంకొక్క సంగతి చెప్పాలి. ఇప్పటి వరకూ బల్లి / కప్ప పాత్ర ధరించి బావుండక కొంచెం ముందే మరో ప్రాణికి ఆహారంగా కొత్తపాత్ర ధరించిన ఆ ప్రాణి బల్లి అని తేలింది. ఆ బల్లి ఈ మధ్యే తన తోకని పోగొట్టుకుంది. ఆ విషయంలో ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది. మరో బల్లితో జరిగిన టెర్రిటోరియల్ పోరాటంలో గెలవలేక తోకని త్యాగం చేసి అక్కణ్నుంచి తప్పించుకుని బతికి బట్టకట్టింది. కానీ పాపం అదృష్టం సరిపోలేదు. లకుముకి బారిన పడింది. After two, three minutes of sitting on the railings, the Kingfisher 1 flew into a tree in the industrial area and started scanning skies (and me) from there. Is the Kingfishers’ nest inside the tree or somewhere else? I won’t be able to know unless I have another lucky chance or a hunch again of watching this pair in action. I am tempted to draw the conclusion that this bird must be a parent, mostly the mother, because, had it been a fledgling it would immediately have swallowed the little reptile instead of carrying it away, taking all the care to shake off any predator or a competitor (including me ) that might be following, before passing the “dinner”, to her offspring. The unfortunate “dinner” whose career as a frog/lizard has just culminated on a Kingfishers’ food platter, turned out to be a lizard who apparently had engaged in some confrontation with another lizard as indicated by the stub of its tail. It must have sacrificed its tail as a lure to the opponent in making its escape from some territorial conflict.

ఇంతే సంగతులు.

బై4నౌ 🙏

🌹 Look deep into nature, and then you will understand everything better 🌹
👨‍🔬Albert Einstein👨‍🏫

20 thoughts on “Kingfisher🐥🐤Kinship (లకుముకి లైఫులో ఒక ఎపిసోడ్)

 1. Zilebi

  పిట్టల ఫోటో పట్టే
  మిట్టే జనులార రండు మీకోసమ్మే
  పెట్టామోయ్ వీటినిటన్
  చట్టు నిదుర వీడి చాకచక్యము గానన్ !

  జిలేబి

  Liked by 1 person

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   ఎట్టెట్టా!! చిట్టిపిట్టను పట్టి
   పొట్టిపద్యమున బెట్టిన
   మీ దిట్టతనమాహాహా!!గట్టిదిగా !!!
   Thank you, Zilebi garu😊

   Like

   Reply
 2. విన్నకోట నరసింహారావు

  నాలుగో పాదం ఆంగ్లంలో చెప్పేసి మొత్తానికి పద్యం కిట్టించేశారు 👏. “జిలేబి” గారికి ఏకలవ్యుడా 🙂 ?

  మాలాంటి సామాన్యులకు టెక్స్ట్ పుస్తకం చేతిలోకి తీసుకోగానే నిద్ర పట్టేసేది. అరుపులు కేకలతో నిండిపోయుండే టీవీ చర్చల విడియోల్ని చూడడం నిద్ర పట్టడానికి ఉపయోగిస్తారంటే మీరు చాలా ధీరోదాత్తులన్నమాట 🙂.

  లకుముకి పక్షుల ఫొటోలు, ఆ పిట్టల ఆహారసేకరణ క్రమం బాగా capture అయ్యాయి. “గాంధీ” మూవీలో (ఆటెన్ బరో) దక్షిణాఫ్రికాలో ఒక సభలో ప్రసంగిస్తున్న గాంధీని చూసి వారి మిత్రులు he is getting better at it అంటారు చూశారా, ఆ మాట bird watching లో మీకు వర్తిస్తుంది. మీరు కూడా సలీం ఆలీ గారంత ఎత్తుకు ఎదుగుతారని మా నమ్మకం. All the best 🤙.

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   సర్,
   >>పాదాలు, ఛందస్సులూ అవీ లేకుండానే జిలేబిగారికి అంకితం ఇచ్చేశానండి. క్రమబద్ధీకరణ వారి పనేనండి.
   >>టీవీ చర్చల గుట్టు తెలీనన్నాళ్ళు బానే విన్నాను. తెలిసేసరికి పుష్పకవిమానం సినిమాలో కమల్ కి సినిమాహాల్ సౌండ్స్ రికార్డ్ చేసుకుని మరీ నిద్రపోయినట్టు వింటేగానీ నిద్రపట్టనట్టుగా తయారైంది పరిస్థితి.
   >> //సలీం ఆలీ గారంత ఎత్తుకు ఎదుగుతారని మా నమ్మకం// ఇది మీ ఆశీస్సుగా భావిస్తాను. రిచర్డ్ అటెన్‌‌బరోని గుర్తు చేసి, అయన తమ్ముడు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న జంతుప్రేమికుడు డేవిడ్ అటెన్‌‌బరోని కూడా జ్ఞప్తికి తెచ్చారు. అనేక నెనరులు.🙏

   Like

   Reply
 3. Zilebi

  సాదాదోసె మసాల్వడా బకెటులో సాంబారుగా కల్పినా
  రేద్రావంగజిలేబులూర జనులున్! రేకంటు లానింగినన్
  బాధామీటరుగా భళా కొలిచిరే! ప్రార్థించెదన్ మిమ్ములన్
  పాదాలంకితమిచ్చినాను సొబగై భాగ్యంబుగానొప్పగన్!
  జిలేబి


  https://polldaddy.com/js/rating/rating.js

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   సాదా దోసె + మసాలవ డ + సాంబారు = జిలేబిలూరడమా ?
   ఛందస్సులు, మీటర్ల సంగతెలా వున్నా రెసిపీ వెరైటీగా ఉందండి. 👏🙏

   Like

   Reply
 4. Zilebi

  పాదాలు అంకితమిచ్చేసారా ! మానాన్నే ! మానాన్నే ! రిటర్ను గిఫ్టు 🙂

  ఎట్టెట్టా!! అరె! చిట్టిపిట్ట ననఘా మీస్టైలనన్ పొట్టిగన్
  పెట్టేరండిట పద్యమందు? మజ! భేష్! భేష్! మీరు దిట్టే సుమా !
  చట్టంచున్ సయి విన్నకోట వరులున్ సారూ! సలీంఆలియై
  కొట్టెట్టేస్తరటంచు మెచ్చిరిగదా కొండంత యండై భళా!

  జిలేబి

  Like

  Reply
 5. Ravi S

  A very nice story captured through the lens. Amazing life scene captured. Shows the caring attitude for the other. Nice it all happened within your vicinity to make it a complete story

  Like

  Reply
 6. విన్నకోట నరసింహారావు

  ఇవాళ్టి (Sunday 13-May-2018) Deccan Chronicle (Hyd) వారి Sunday Chronicle supplement లో “In love with the wild!” అని ఒక వ్యాసం వచ్చింది … ఫొటోలతో సహా. ఈ క్రింది లింక్ లో చదవచ్చు. మీరు కూడా అదే కోవ కాబట్టి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. Happy reading 🤙.

  ముఖ్యంగా వ్యాసంలోని చివరి రెండు ఫొటోలు చూస్తే మీ ఈ పోస్ట్ గుర్తొచ్చింది.

  https://www.deccanchronicle.com/sunday-chronicle/headliners/130518/in-love-with-the-wild.html

  Liked by 1 person

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   సర్, ఇది చూడగానే మీకు నేను గుర్తుకురావడం మీ అభిమానం, కృతజ్ఞుడిని 🙏.
   వ్యాసంలో చూపిన White-bellied Sea eagle అనే పక్షి మీద ఒక టపా తయారుచేస్తున్నాను. త్వరలో విడుదల. 🙂

   Like

   Reply
 7. Zilebi

  ధవళచ్ఛాయా కంజర
  తవిష చిరంభణము జూడ తనువుప్పొంగెన్ 🙂

  జిలేబి

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   ధవళచ్ఛాయా = తెల్లని
   కంజర = ఉదరము
   తవిష = సముద్రము
   చిరంభణము = గరుడపక్షి
   అనగా White-bellied Sea Eagle.
   తెలుగు వాడకం రాను రాను తగ్గిపోతోందంటే, తగ్గదా మరి?😆

   Liked by 1 person

   Reply
    1. YVR's అం'తరంగం' Post author

     //ధవళ ఛాయా కంజర
     తవిష చిరంభణము//
     జిలేబిగారు, ఆ గరుడపక్షి మీద రాయబోయే టపాకి టైటిల్ ఇదే 👌👌 Thank you.😊🙏

     Like

     Reply
     1. విన్నకోట నరసింహారావు

      // “జిలేబిగారు, ఆ గరుడపక్షి మీద రాయబోయే టపాకి టైటిల్ ఇదే” //

      🙂 మీ పాండిత్యానికి తగిన బహుమతి కాదిది. నా శక్తి కొద్దీ సమర్పించుకుంటున్నాను అని స్వర్ణకమలం సినిమాలో (భానుప్రియ, వెంకటేష్) ఘనాపాఠీతో నాట్యాచార్యుడు గారన్నట్లన్నమాట 🙂

      Liked by 1 person

      Reply

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s