గు = చీకటి = అజ్ఞానం అనే చీకటి
రు = వెలుగు = జ్ఞానం అనే వెల్తురు
సో, గురు = అంటే చీకటి పక్కనే వెలుగు. కానీ చీకటి అంటే వెల్తురు లేకపోవటం. వెల్తురు రాగానే చీకటి ఎక్కడికీ పోదు, అదింక వుండదు. అంతే. జ్ఞానం వికసిస్తే అజ్ఞానం అదృశ్యం అయినట్టు.
అన్-ఫార్ట్యునేట్లీ, ఆ విషయం కొందరు గురువులకి, ఐ మీన్, చాలా మటుకు స్వయం ప్రకటిత గురువులకి, తెలీదు. వాళ్ళని అనుసరించే భక్తజనాళికి అంతకంటే తెలీదు.
తెలీదు = అజ్ఞానం = చీకటి
ఇలాంటి గురువులు + వాళ్ళ శిష్యగణం కలిపి ఎంత అజ్ఞానం, ఎంత చీకటీ నింపుతున్నారో లోకంలో !!🤔
ఎందుకోగానీ నిజంగా చీకటి తొలగించే గురువులు ఎక్కువ వార్తల్లోకి రారు. వచ్చినా వాళ్ళు తొలగించేది అజ్ఞానం, మూఢత్వం అనే చీకట్లు కాబట్టి, నైన్టీ పర్సెంట్ జనాభాకి కావాల్సింది కూడా “Divinely-endorsed” అజ్ఞానమే తప్ప నిజమైన జ్ఞానం కాదు కాబట్టి వాళ్ళు లో-ప్రొఫైల్‌తోనే వుంటారు.
జ్ఞానం పేరుతో అజ్ఞానాన్ని, వీలైతే కొత్తకొత్తరకాల అజ్ఞానాల్ని తయారు చేసే గురువులకి మాత్రం ఇన్స్టాన్ట్ పబ్లిసిటీ. వీళ్ళ వెనకున్న శిష్యగణం జనాభాని బట్టీ వీళ్ళ వెనకబడే రాజకీయ నాయకులు. అందుకే ఆధ్యాత్మికతకి, రాజకీయాలకి అవినాభావ సబంధం – రెండూ వ్యాపారంగా మారిపోయినప్పుడు. రెండు వ్యాపారాలకీ సొసైటీలో పేరుకున్న అజ్ఞానమే పెట్టుబడి.
చీకటి గదిలోకి వెలుగు రావాలంటే కిటికీలు తెరవాలి. లేకపోతే లైట్ ఆన్ చెయ్యాలి. గదికి కిటికీలు లేకపోయినా, గదిలో లైటు లేకపోయినా అంతే సంగతులు. గురు = అంటే చీకటిని పోగొట్టే వెలుగు. అంతే కానీ –
వెలుగునిచ్చే కిటికీ కాదు, కిటికీ తెరిచే చెయ్యీ కాదు.
లైటు బల్బు కాదు, లైట్ ఆన్ చేసే స్విచ్చీ కాదు, స్విచ్చి వేసే చెయ్యీ కాదు.
కిటికీ తెరవాలన్నా, లైటు వెయ్యాలన్నా వెలుగు కావాలని మనకి అనిపించాలి కదా? ఆ అనిపించడం ఎలా జరుగుతుంది?
ఒకసారి అనిపించాక, తుప్పు పట్టో, ఇంకెందుకో కిటికీ తెరుచుకోపోయినా; కరెంటు పోయో, బల్బు మాడిపోయో లైటు వెలక్కపోయినా వాటిని మార్చుకోవడమో, రిపేర్ చేసుకోవడమో మన పనే కదా? అది చెయ్యాల్సింది మనమే అని మనకెలా తెలుస్తుంది?
అండర్-లైన్ చేసిన ఆ రెండు ప్రశ్నలూ మనసుల్లో పుట్టించి, వాటికి జవాబులు రాబట్టుకోవడం ఎలాగో మనుషులకి నేర్పించేవాడికే గురు అనేపేరు పొందే అర్హత వస్తుంది. పరిణతి చెందిన ఆలోచనాస్థాయి వున్నవాళ్ళ ప్రశ్నలు, సందేహాలు తీర్చగలిగిన వాడిని గురుస్థానంలో కూర్చోపెట్టచ్చు. సందేహాలు తీరి, తాత్విక సమస్యలన్నీ తీర్చుకుని, “ఏకం సత్ విప్రాః బహుదా వదంతి” అని బల్లగుద్ది నిరూపించగల స్థాయిలో వున్నవాణ్ణి రాముడిని తీర్చిదిద్దిన విశ్వామిత్రుడిలా నడిపించగలిగిన వాణ్ణి సద్గురువు అనొచ్చు. ఇవేం కాకుండా –
కోట్లు కూడబెట్టడం,
పాలిటిక్స్‌లో తలదూర్చి మంత్రిపదవులు పొందడం,
ప్రజల ఆలోచనాస్థాయిని ఎదగనివ్వకపోవడం,
అరాచకాల్ని, అత్యాచారాల్ని ఆధ్యాత్మికత ముసుగులో జస్టిఫై చెయ్యడం,
వగైరా కార్యక్రమాల్లో వున్నవాళ్ళని సద్గురు అని ఎలా అంటాం?
గు = చీకటి = అజ్ఞానం అనే చీకటి
రు = వెలుగు = జ్ఞానం అనే వెల్తురు
దీన్నిబట్టీ గురువులు రెండు రకాలు –
- గురు = చీకటి పక్కనే వెలుగు. కానీ చీకటి అంటే వెల్తురు లేకపోవటం. వెల్తురు రాగానే చీకటి ఎక్కడికీ పోదు, అదింక వుండదు. ఇలాంటి అనుభవం ఇచ్చేవాడు సద్గురువు.
- గురు = వెలుగుతో పాటే చీకటి. చీకటి అంటే వెల్తురు లేకపోవటం. వెల్తురు లేకపోయినా/రాకపోయినా చీకటి చీకటి దాని స్థానంలో అది పదిలంగా వుంటుంది. ఎక్కడికీ పోదు. ఈ టైపు అనుభవాన్ని ఇచ్చేవాడు శాడ్గురువు.(Sad గురు, అందరికీ శాడ్‌నెస్ ప్రసాదించే మహానుభావుడని కవిహృదయం.)
సమస్యేంటంటే ప్రపంచంలో రెండు రకాల గురువులూ వున్నారు. అన్ని మతాల్లోనూ వున్నారు. ఎక్కడో చదివాను గురువుని ఎంచుకునేముందు ఆ గురువుని అనేకరకాలుగా పరీక్షించి కానీ అతని దగ్గర చేరకూడదని. ప్రస్తుతం ఈ ప్రాసెస్ జరగట్లేదనిపిస్తోంది. జరిగినా అందులో ఏదో లోపం గారెంటీగా వుంది. అదేంటో మనమే వెతుక్కోవాలి. ఏ గురువులూ అందుకు సాయం చెయ్యరు. (అలా అని ప్రస్తుతం పెరుగుతున్న హేతు-తీవ్రవాదాన్ని సమర్ధించట్లేదు కానీ ఆధ్యాత్మికమార్గంలో హేతువాదానికి ముఖ్యపాత్ర వుందని చెప్పక తప్పదు)
ఇవాల్టికి ఇంతే సంగతులు. బై4నౌ 🙏.
కలువాయిబ్రహ్మజ్ఞా
నుల పల్కుల నెల్ల వినుచు నూతిన్ బడిరే
జలకమ్ము లాడి రే జను
లు లబ్జుగా భళి జిలేబు లూరన్ సుదతీ 🙂
జిలేబి
LikeLike
పద్యము ద్రాక్షాపాకము🍇 కలువాయి అనే కొత్త పదము తెలిసెను.
LikeLike
కొత్త పదం తెలిసిందని YVR గారు ఆనందిస్తున్నారు సరేగానీ ఇంతకీ “కలువాయి” అనగానేమి “జిలేబి” గారూ??
హేవిటో “జిలేబి” గారూ, మీ పద్యాల్లో మీరు వాడే పదాలు చూస్తుంట్ ఎర్నెస్ట్ హెమింగ్వే గారు (Ernest Hemingway) విలియం ఫాక్నర్ (William Faulkner) గారి గురించి “He has never been known to use a word that might send a reader to the dictionary” అంటూ చేసిన ప్రశంస గుర్తొస్తోంది. ఏమనుకోకండి, మీకు కూడా అటువంటి కితాబు ఇద్దామంటే కుదరడంలేదు, ప్చ్ 🙁.
LikeLike
సర్, కలువాయి పదం వల్ల హెమింగ్వే కోట్ కూడా తెలుసుకున్నాను. ధన్యవాదాలు.
ఇంక ఓవర్ టూ జిలేబీజీ – కలువాయి వివరణకై 😊
LikeLike
In the meantime, మీ పోస్ట్ గురించి నా అభిప్రాయం :-
“ప్రజల ఆలోచనాస్థాయిని ఎదగనివ్వకపోవడం,” అని పైన అన్నారు చూశారా అదే ఈ గురూజీల / స్వామీజీల / బాబాల survival కిటుకు అని నా అనుమానం కూడా.
రాజకీయ నాయకులు కూడా అంతేగా. నా అనుభవం ఒకటి గుర్తొస్తోంది. ఉద్యోగరీత్యా ఒకసారి ఒక చిన్న గ్రామానికి కొద్దిరోజులు వెళ్ళుండాల్సి వచ్చింది చాలా ఏళ్ళ క్రితం. ఆ ఊరి ప్రెసిడెంట్ గారు తరచుగా వచ్చి కూర్చుని కాలక్షేపం కబుర్లాడుతుండేవాడు. ఒకరోజున నేనడిగాను – ప్రెసిడెంటు గారూ, మీ పలుకుబడినుపయోగించి మీ ఊరికి కరెంటు, ఓ చిన్న లైబ్రరీ / కనీసం వార్తాపత్రికలూ తెప్పించరాదా – అని. అవన్నీ వస్తే ఆ తరవాత జనం మన మాటెక్కడ వింటారండి అన్నాడాయన …. గొంతు తగ్గించి. అయ్యా అదీ సంగతి. కాబట్టి అజ్ఞానంలో ఉంచడమే మంచిదని కొంతమంది “గురువులు” నమ్ముతారేమో అనిపిస్తుంది.
LikeLike