స్టేటుని మరో సింగపూర్ చేసెయ్యాలన్న చంద్రబాబుగారి ఆకాంక్షలని, ఒకవేళ ప్రజలకి ఆ విషయంలో ఆసలేమైనా వుంటే వాటినీ నిజం చెయ్యాలని పాపం బీజేపీ వాళ్ళు తెగ ప్రయత్నిస్తున్నారు. కానీ మనకే వాళ్ళ నిజాయితీ, చిత్తశుద్ధి, (చెత్తశుద్ధి కూడా, స్వచ్ఛభారత్ స్లోగన్ వాళ్ళదే కదా)… ఇవన్నీ అర్ధమై చావట్లేదు. నమ్మబుద్ధి కావట్లేదా?
courtesy : eenadu
ఒకసారి మొన్నామధ్య సీఎం అసెంబ్లీలో భావోద్వేగానికి లోనైనా సన్నివేశం చూస్తే స్టేట్ సింగపూర్ అయిపోయే తరుణం ఎంతో దూరం లేదనిపిస్తుంది. ఎందుకంటే, పందొమ్మిదివందల అరవైయ్యైదులో మలేషియా సింగపూర్ని ఫెడరేషన్ ఆఫ్ మలేషియా నుంచి బహిష్కరించినప్పుడు సింగపూర్ ప్రధమ ప్రధాని కూడా ఇలాగే భావోద్వేగానికి గురైన సందర్భం వచ్చింది. ఏ విధమైన సహజ వనరులూ లేని సింగపూర్ మనుగడ ఎలాగా అనేది అప్పుడాయనకెదురైన పెను సవాలు. ఆ కన్నీటి చుక్క తుడుచుకుని ఆయన కార్యాచరణలోకి దిగిన తర్వాత ఎలాంటి చరిత్ర సృష్టించబడిందో సింగపూర్ వాసుల కంటే ఆ దేశం సాధించినవి చూసి నోరు తెరిచినవాళ్ళకే బాగా తెలుసు.
courtesy : Google.ipinions journal
ఒకప్పుడు సింగపూర్ని మలేషియా క్లిష్టపరిస్థితిలోకి నెట్టినట్టు ఆంధ్రులని ఆ దిశగా నెట్టడమే మోడీమేష్టారి దర్సకత్వంలో ఏపీలో పార్టీని అదేదో బలోపేతమో, ఏదో చేసేద్దామంటూ అమితాశాగారు, నాబార్డ్ నుంచి అప్పులిప్పించి అవి మేమే తీర్చేస్తామని పైసా రాల్చకుండా ఊరిస్తూ అ’ఋణ’జైట్లీగారు చేస్తున్న ఘనకార్యం. రామకార్యంలో పాల్గొన్న కోతులు, ఉడతల్లాగే ఈ ఘనకార్యంలో కూడా పాలుపంచుకునే జీవులుంటాయి. స్వామికార్యం, స్వకార్యం కూడా వాటి జెండాల్లో, ఎజెండాల్లో పెట్టుకుని పని చేస్తూ ఉంటాయి. ఈ రామాయణం అంతా అర్ధం కాక మనం గందరగోళ పడిపోతావుంటాం, అనవసరంగా.
రామాయణం అన్నాక పిడకల వేట అంటూ ఉంటుంది కదా? అలాంటిదే ఒక చిన్న స్నిప్పెట్. అలా అని ఉడతలు, మిడతల గురించి కాదు. రామకార్యంలో సుగ్రీవుడి స్థానంతో సమానమైన స్థాయి వున్న ఒకాయన ఈ మధ్య మోడీగారికి ఏపీ ప్రత్యేక హోదా గురించి అస్సలు అవగాహనే లేదు, ఎవరో రాసిచ్చిన చీటీ తిరుపతిలో చదివేశారు అని స్టేట్మెంట్ ఒకటిచ్చేసేప్పటికి మహా కన్ఫ్యూజన్లో పడిపోయారు జనం. ప్రత్యేకహోదా గురించి కాదీ కన్ఫ్యూజన్, మోడీ గారి చీటీలు చదవడం గురించి. ఇక్కడొక చోటేనా ఈయన చీటీ చదివింది? ఎక్కడ ఏం మాట్లాడినా అదే వ్యవహారమా అని. స్విస్బ్యాంకులలో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించడం నుంచీ డీమానిటైజేషన్ వరకూ అన్నీ చీటీల మహాత్యమేనా కొంపదీసి అని కొందరికైనా అనుమానం కలిగుండకపోదు.
ఇంతే సంగతులు.
బై4నౌ 🙏
తూచ్… తూచ్ … హరిగారి కామెంటు చూసాక ఈ 👇పాత పోస్టు గుర్తుకొచ్చి, పీకేగారి జేఎఫ్సి ఇచ్చిన లెక్కల్ని బట్టీ అది నిజమైందనిపించి మళ్ళీ ఇక్కడ పోస్ట్ చేస్తున్నా …
ఇంకోసారి … ఇంతే సంగతులు మరియు బై4నౌ 🙏
గ్యారంటీ, మీరు చెప్పాక జరక్కపోవడమా!చరిత్రా?మజాకా?
అమితాశా గారూ అఋణ జైట్లీ గారూ మోదే గారూ సామాన్యులా?
LikeLike
//మీరు చెప్పాక జరక్కపోవడమా!// ఇది చూస్తే ఇదివరకు వేసిన పోస్ట్ ఒకటి గుర్తొచ్చింది. జేఎఫ్సీ వారిచ్చిన లెక్కల్ని బట్టీ చూస్తే అది నిజమైనట్టే వుంది. ఈ టపాకి అది కూడా కలుపుతాను 😊
LikeLike