(Photo Courtesy : Google)
మొన్న మా వాట్సప్ గ్రూప్లో ఓ ఇంటరెస్టింగ్ డిస్కషన్ జరిగింది. సందర్భం ఏంటంటే గ్రూప్లో ఒకళ్ళ వివాహ రజతోత్సవం. క్లాసుమేట్కి ఒక్కొక్కరూ ఎవరి శైలిలో వారు అభినందనలు గుప్పిస్తున్నారు. ఒకతను – జిడ్డు కృష్ణమూర్తిగారి స్కూల్లో చదవు వల్ల అలవడిన మంచి కవితాత్మకత + సామాజిక స్పృహ + కరుణార్ద్ర హృదయం తన పోస్టుల్లో మామూలుగానే నింపుతూ ఉంటాడు – తన అభినందన సందేశాన్ని కూడా అలాగే మలిచాడు. అందులో మొదటివాక్యం – Our Friend _ _ _ _, A Deep and Beautiful Lake Filled with Wisdom and Wit (సౌందర్యం, గాంభీర్యం నిండిన సరోవరంలాంటి మనసున్న మన స్నేహితుడు _ _ _ _) నా దృష్టిని ఆకర్షించింది, ఆలోచనల్ని కదిలించింది. సరోవరానికి అందం, ఆకారం, అస్తిత్వం ఎలా వస్తాయి?ఒక మనసుకి ఆ సరోవరమంత సహజంగా భావసౌందర్యం, గాంభీర్యం ఎలా అలవడతాయంటూ ప్రశ్నలు కురిపించింది. ఇంతలో గ్రీటింగ్స్ అందుకుంటున్న స్నేహితుడి కృతజ్ఞతల రూపంలో వచ్చాయి సమాధానాలు. ఇలా 👇 –
(ఇంగ్లిష్ కాలమ్ అతను వాట్సప్ కోసం క్లుప్తంగా రాసినది. తెలుగుస్తంభం (కాలమ్ = స్తంభం అనే వుంది మరి ఆంధ్రభారతిలో) ఏమో నా సొంత ఆంధ్రీకరణం. ఏది సేఫ్ అనిపిస్తే అదే చదువుకోండి. 😆)
A lake,
Gets its depth from the geography Its beauty is not its own, but of –
What I think ‘I am’ is not me, |
సరోవరానికి అందం, గాంభీర్యం(లోతు) ఎలా వస్తాయి?
లోతు అనేది నైసర్గికంగా వచ్చిన లక్షణం. సరస్సు ఏర్పడాలంటే లోతుగా వున్న ప్రదేశం ఉంటేనేకదా సాధ్యమయ్యేది? మరి సరోవరపు సౌందర్యం సంగతి? లోతైన ప్రదేశంలో నిలిచిన నీళ్ళలో –
ఇవన్నీ లేకుండా సరోవరానికి ఒక ఉనికి, ఒక అస్తిత్వం, గుణగణాలు, … ఎలా వస్తాయి? అవేవీ లేనప్పుడు అది ఉట్టి నీరు అవుతుంది కానీ సరస్సు అవుతుందా? మీరంతా ప్రశాంత సుందర మందిరమైన కొలనుగా చూస్తున్న నేను నిజంగా “ఆ నేను” కాను. ఒక అహాన్ని మాత్రమే. నా గాంభీర్యత అని మీరంటున్న ఆ లోతు నాది కాదు. నా చుట్టూ ఉన్న సమాజం, ప్రపంచం ద్వారా నాకు సంక్రమించిన గుణం. నా మానసిక సౌందర్యం అని మీరంటున్న గుణం అది నిజానికి నాకు తెలియకనే, నేను అడగకనే నా సమాజం, నా సంస్కృతి – అంటే మీరు, నా స్నేహితులు, నా కుటుంబం, నా ప్రపంచం – నాకు అందించి నాకు నేర్పించినవే. నేను అనేవాడిని నిజంగా లేను. మీరు చూస్తున్న “నేను” నిజంగా మీ ప్రతిబింబమే. |
నిజమేనేమో కదా? ఇలా ఆలోచిస్తే మనిషికి బ్రతుకు కాస్త ఈజీ అవుతుందేమో కదా?
అవ్వచ్చు.
ఇంతేసంగతులు. బై4నౌ. 🙏
—
నేనసలు నేను కాదయ !
మేనియు ప్రకృతి దయ నరయ మెలపున్, ప్రతిబిం
బానిని మీకందరికిన్
నేనే జిడ్డును బిలేజిని జిలేబియునౌ 🙂
జిలేబి
LikeLike
జిలేబిగారు
బావుందండి 3జి ‘స్కాము’😊
జిడ్డు
జిలేబి
బిలేజి
LikeLike
—
త్రీజీ స్కాముల జేసె బి
లేజి, జిలేబియను జిడ్డు లేమయు సుమ్మీ !
గోజీ లారా రండిటు
వాజమ్మకు శాస్తి జేయ వడివడి యిపుడే !
జిలేబి
LikeLike
గోజీ లని చేర్చి 4G చేశారా ?😀
LikeLike
వాజిని వది లే సా రే 🙂
ఫైవ్ జి 😦
జిలేబి
LikeLike
‘వాజమ్మ’లో ‘వాజి’ లేదు కనక.
LikeLike
అహం మైనస్ ఈగో = అమీగో 🙂
LikeLike
అ-వునండి
మీ-రన్నవి
గో-ల్డెన్ వర్డ్స్
🙏🙏🙏🙏
LikeLike
HAPPINESS MEANS KNOWING THAT LIFE HAS REALITY AND REFLECTION.
LikeLike
“జేజి” కూడా కలపండి, 5జి అవుతుంది ☺.
LikeLike