ఉగాది ఇంకా మూణ్ణాలుగు నెలల దూరంలో వుందని మర్చిపోయిందో, భోగిమంటల సంగతి దేవుడెరుగు ఎడతెరిపి లేకుండా పట్టిన ముసురుతో పాటు ముసురుకున్న బద్ధకం వదిలించుకోవాలనుకుందోగానీ ఈసారి మావూళ్లో కోయిల తొందరపడి ముందే కూసేసింది. దట్టంగా పట్టిన మబ్బుల వల్ల సూర్యుడు మకర సంక్రమణం చేశాడా లేదా తెలీకుండానే మకరసంక్రాంతి వచ్చేసింది. ఆలిండియా రేడియోలో చెప్పేవాళ్ళు దేశమంతా సంక్రాంతి ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు అని. కానీ అలాంటివేం లేకుండానే సంక్రాంతి రోజంతా ఆఫీసులో గడిపి సాయంత్రం ఇంటికెళ్తూ టాక్సీ కోసం వెయిట్ చేస్తుంటే ఆకాశంలో వాన మబ్బులు, ఆ చెట్లూ, మిలమిలలాడుతున్న స్ట్రీట్ లైట్లూ వగైరాలన్నీ చూసి ఓ ఫోటో తియ్యాలనిపించింది. తీశా . అక్కడితో అయిపోతే ఎలా? కుదరదు కదా! అందుకేనేమో టాక్సీ ఎక్కాక ఆ కింద రాసిన తవికా వాక్యాలు బుర్రలోంచి నోట్ పాడ్ మీదకి ఒలికాయి. అక్కడితో ఆగితే కూడా కుదరదనుకుంటా. ఎత్తిపోతల పధకం పెట్టి నోట్ పాడ్ మీంచి బ్లాగులోకి మళ్ళించా. ఇక్కడితో ఆగిపోతే మీ అదృష్టం. ఆగలేకపోతే తరవాత మీ యిష్టం. 😀😀😀
(మనుషులు గంగిరెద్దులైన మోడర్న్ మార్కెట్ ఎకానమీల్లో —
మబ్బులే గొబ్బిళ్ళు
డిసిప్లిన్డ్ గా నుంచున్న చెట్లే పూలు
రంగుల లైట్లే పసుపూ కుంకాలు
ఆటోమొబైళ్లే ఎడ్లూ, బళ్ళూ
రోడ్ల మీద గీతలే ముత్యాల ముగ్గులు
జీతాలే చేతికందిన పంటలు
నిలబెట్టుకున్న మానవత్వాలే నూత్న వస్త్రాలు
రావాలి ప్రతి ఏటా మకర సంక్రాంతి
కావాలి మెటీరియలిస్ట్ మకరాన్ని వదిలించే some క్రాంతి )
అందరికీ (రైతన్నలతో సహా🙏) సంక్రాంతి⚘ మరియు some క్రాంతి🌋 (అదేంటో నాకూ అంతు పట్టట్లా !!🤔) శుభాకాంక్షలు. తరవాత మీ యిష్టం.🙏
మీరు పదే పదే “తరవాత మీ యిష్టం” అంటుంటే “తాంబోలాలిచ్చేశాను” అన్నట్లుంది jk 😀.
మీ ఊహ అద్భుతం. “జీతాలే చేతికందిన పంటలు” 👌👌.
మీ ప్రవాసులకయితే “మబ్బులే గొబ్బిళ్ళు” అనుకోవాలేమో. అదే మన భారతదేశంలో అయితే ఆ ఇబ్బంది లేదు – కింద రోడ్ల మీదే ఎక్కడ పడితే అక్కడే, ఎప్పుడు పడితే అప్పుడే గొబ్బిళ్ళు – ఆవులు, గేదెలు రోడ్ల మీదే స్వేచ్చావిహారం చేస్తుంటాయిగా (again jk) ☺.
మెటీరియలిస్ట్ “మకరాన్నే” కాదు మకిలాన్ని కూడా సంక్రాంతి వదలగొడితే బాగుండు.
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
విన్నకోటవారు ధన్యవాదాలు సార్ 🙏
LikeLike
సారెటు వోయిరో యనుచు , సారెకు మోమిటు ద్రిప్పి ద్రిప్పి , వే
సారితి , వచ్ఛి , రద్గదె , విసావిస , భావుక చిత్రకారులై ,
కోరిక తీర , నాకసము , గూడిన మబ్బులు , చెట్లు , లైట్లనూ
తీరుగ ఫోటొ దీసి వినుతించుచు పోల్చిరి సంకురాతిరిన్ .
సంక్రాంతి శుభాకాంక్షలతో …..
LikeLike
మాస్టారు పద్యం ఎంత అందంగా వుందో చెప్పలేను. మేమిద్దరమూ ఆ అందానికి పరవశించాము.🙏
LikeLike
ఎంత మంచి ఫోటో తీశారండి! భలే బావుంది. నగలు పెట్టుకున్న నేల వగలు పోతున్నట్టుంది. మీ Someక్రాంతి చూడగానే నాదో పాతపోస్ట్ పంచుకోవాలనిపించింది:
https://boldannikaburlu.blogspot.com/2017/01/blog-post_13.html
మీకు, మీ కుటుంబానికి మకరసంక్రాంతి శుభకామనలు.
విన్నకోట నరసింహారావుగారు: మీకు, మీ కుటుంబానికి మకరసంక్రాంతి శుభకామనలు.
LikeLike
పదాలని ‘పన్’నడంలో మీ తరువాతే ఎవరైనా. సన్ క్రాంతి / స మ్ క్రాంతి అని ఏడాది ముందే రాసేశారన్నమాట 👏
మీ శుభకామనలకు నెనర్లు. మీ అందరికీ మా శుభాకాంక్షలు.
మీరిచ్చిన టపా త్వరలోనే చదువుతాను.
LikeLike
Well said.. asusual..
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
🙏🙏🙏🙏
LikeLike
====
పట్టినారట పట్టణమ్మున పారణమ్ముల మాలికన్
పెట్టినారిట సంకురాతిరి పేర్మిగా సయి వైవియార్ !
చుట్టినారిట రాజువారలు సోయగమ్ముల పద్యమున్!
పట్టుమామి జిలేబి వార రపమ్ము జేసిరి కోకిలన్ 🙂
“సమ” క్రాంతి శుబాకాంక్షల తో
చీర్స్
జిలేబి
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
జిలేబిగారు మీ పద్యాలకు మొదట్నుంచీ అభిమానినే కదా . ఇంకేం చెప్పను? ‘సమ’ క్రాంతి !!!👌👌👌 వెతుక్కోవాలి గానీ ఎంతో మీనింగున్న పదం 🙏
LikeLike
మకరాన్ని వదిలించే మహావిష్ణువు ఎవరు?
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
నాలోన శివుడు కలడు అని భరణి గారన్నట్టే మనలోనే మహావిష్ణువు కలడు అనుకోవాలేమో మానవులు.☺☺☺☺
LikeLike
థాంక్స్ లలిత గారూ. మీకు, మీ కుటుంబానికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
చాలా బాగుందండీ మీ తవిక… నిజాన్ని నిష్టూరంగా ప్రతిబింబించింది.
LikeLike
థాంక్యూ జగదీష్ గారు.
LikeLike
—
తరువాతహె మీ యిష్టము!
మురిపెమ్ముగ మొదటిపాదము కుదిరె గాదే!
వరుస కుదిరె కందంబుగ
సరిసరి వ్రాసుకొనుమమ్మ ఛందంబునిటన్ 🙂
జిలేబి
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
జిలేబిగారు
మళ్ళీ మళ్ళీ వచ్చే పద్యాలకి
మరీ మరీ నెనర్లు 😊😊😊
LikeLike