తొమ్మిదో క్లాసు నుంచీ డిగ్రీ ఫస్టియర్ వరకూ అదృష్టం బావుండి మంచి అధ్యాపకులు దొరికితే లాంగ్వేజి క్లాసుని మించిన ఆటవిడుపు ఇంకోటుండదు. ఫిజిక్స్, లెక్కలు, ఎకనామిక్స్, వగైరా ఐతే కూటి కోసం లేకపోతే కూలీ కోసం అదీకాకపోతే కట్నం కోసం చదివే కోటి సబ్జెక్ట్‌ల మధ్య పడి అప్పుడప్పుడే నలుగుతున్న కుర్ర బ్రెయిన్లకి తెలుగు, ఇంగ్లిష్ క్లాసులు మంచి రిలీఫ్. ఇప్పుడైతే తెలుగు పద్యాల గురించి రాయట్లేదులెండి. తెలుగు పద్యాలు వినీ, చదివీ అవి అర్ధమైతే ఆనందించడమే తప్ప వాటి గురించి మాట్లాడే కెపాసిటీ లేదు మరి. ఒకవేళ కెపాసిటీ వున్నా (వుందని నేననుకున్నా) మాలిక “ఉత్పలమాలి”కైపోయి, బ్లాగర్లంతా అమందానంద “కంద”ళిత హృద”యాటవెలదు**”లైన వేళ తెలుగు పద్యాల గురించి మాట్లాడ్డం అంత వీజీ కాదు. మంచిదీ కాదు. అంచేత ………. (ఆటవెలది అంటే ఒక రకం పద్యవృత్తం అనే మీనింగు మాత్రమే తీసుకోండి మహాప్రభో!!)
రెండుమూడ్రోజుల క్రితం Whatsapp కబుర్లలో అనుకోకుండా అమెరికన్ కవి రాబర్ట్ ఫ్రాస్ట్ ప్రస్తావన వచ్చింది. దాంతోపాటు తొమ్మిదిలోనో, పదిలోనో చదివిన, కాదు, విన్న Ozymandias by P.B. Shelley; From a Railway Carriage by Robert Louis Stevenson; ఇంటర్లో విన్న Arabia by Walter De La Mare; డిగ్రీ ఫస్టియర్‌లో విన్న La Belle Dame sans Merci by Keats; Stopping by Woods on a Snowy Evening by Robert Frost ఇవన్నీ గుర్తొచ్చాయి. మొదటి రెండు పద్యాలూ చెప్పిన రామయ్యసారు, అరేబియా పద్యం అద్భుతంగా వారం రోజుల పాటు వివరించిన పి.సుబ్బారావు మాస్టారు, చివరి రెండు పద్యాల్లో ఒక్కోదాంట్లో వారం రోజుల పాటు ముంచి తేల్చిన లయోలా కాలేజి ఆంగ్లోపన్యాసకులు ‘కీట్స్’ రెడ్డిగారు అందరూ స్మృతిపధంలో మెదిలి నా వందనాలందుకున్నారు.
రాబర్ట్ ఫ్రాస్ట్ అనగానే ఇండియన్స్‌కి పోయెట్రీలో ఆసక్తి ఉన్నవాళ్ళకి, లేనివాళ్ళక్కూడా మొట్టమొదట జవహర్లాల్ నెహ్రూ తన ఆఫీసు టేబుల్ మీద ప్రతిరోజూ తనకి కనపడేలా పెట్టుకున్న ఫ్రాస్ట్ వాక్యాలు గుర్తుకొస్తాయి. అవి –
And miles to go before I sleep,
And miles to go before I sleep.
నెహ్రూగారి దృష్టిలో miles to go అంటే పంచవర్ష ప్రణాళికలు, పంచశీల పధకాలు, నాన్-అలైన్మెంట్ మూవ్-మెంట్లూ, ……. ఇలాంటివే కదా ! ఇలాంటివే అని అందరూ అనుకోరు (అది వేరే విషయం😉), ఇంకెలాంటివో కూడా ఉంటాయని కొందరు అనుకుంటున్నారు. అనుకోమని అందరికీ నూరిపోస్తున్నారు కూడా. ఒక చరిత్రని తిరగేస్తే ఇంకో చరిత్రని మరగెయ్యాలి. ఇలా తిరగా మరగా వెయ్యడంలో అసలు చరిత్ర ఏంటో, ఏది కరెక్ట్ వెర్షనో ఎవడికీ తెలీదు. ఒకసారి తిరగబడిన చరిత్ర పాలిటిక్సుకి తప్ప ఎందుకూ పనికిరాదు. అంచేత అదక్కడితో వదిలేద్దాం.
కానీ కవిగారి దృష్టిలో ఆ మైళ్ళకి అర్ధమేంటి? బిఫోర్ ఐ స్లీప్ అనడంలో ఆయన ఉద్దేశం ఏంటి అని ఇప్పటికీ చర్చోపచర్చలు జరుగుతూనే వుంటాయిట. అసలు రాబర్ట్ ఫ్రాస్ట్ గారి కవిత్వంలో పదాల కన్నా శబ్దానికి ప్రాధాన్యత ఎక్కువట. కొందరికి ప్రకృతి సౌందర్యానికి పులకరించిన కవి పులకరింతలా వినిపిస్తే ఇంకొందరికి శిశిర ఋతువుని జీవనసంధ్యకి ప్రతీకగా అభివర్ణించినట్టు అనిపిస్తుంది. షరా మామూలుగా ఇక్కడ (ట) తగిలించలేదు. ఎందుకంటే కాలేజిలో మొదటిసారి విన్నప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఈ కవితలో రెండు అర్ధాలూ స్ఫురిస్తున్నాయి, మొదటిది కొంచెం తక్కువగా, రెండోది బాగా ఎక్కువగా.
Stopping by Woods on a Snowy Evening
BY ROBERT FROST
Whose woods these are I think I know.
His house is in the village though;
He will not see me stopping here
To watch his woods fill up with snow.
My little horse must think it queer
To stop without a farmhouse near
Between the woods and frozen lake
The darkest evening of the year.
He gives his harness bells a shake
To ask if there is some mistake.
The only other sound’s the sweep
Of easy wind and downy flake.
The woods are lovely, dark and deep,
But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep.
కవితలో ఎదో మాజిక్కుంది కదా? వాట్సాప్‌లో ఫ్రాస్ట్‌ని గుర్తు చేసుకున్నప్పుడు మాత్రం ఆ మాజిక్ కానీ, నెహ్రూ గారు కానీ, ఫ్రాస్టుగారి కవిహృదయం కానీ గుర్తు రాలేదు. వాళ్ళిద్దరికీ అస్సలు తెలీని నేటి సోషల్ మీడియా ప్రభావం ఒక్కటే పన్జేసింది. ఏంచేస్తాం? కాల మహిమ 😆 టెక్నాలజీ మహత్యం 😂. పన్జేసి ఫ్రాస్ట్ కనక ఈ కాలం వాడైతే ఆ చివరి రెండు లైన్లు ఎలా రాసివుండేవాడా అనే వైపుకి పోయాయి ఆలోచన్లు. పోక ఏం చేస్తాయి? ఎంత సేపూ గడ్డ కట్టిన ప్రకృతి, జీవన సంధ్యలూ, ముసురుకుంటున్న చీకట్లు, తీరని ఇక్కట్లు, తనివి తీరని ముచ్చట్లు వీటి చుట్టే తిరగమంటే ఆలోచన్లకి మాత్రం చిరాకు పుట్టదా? అలాంటి చిరాకు పుట్టో, పొద్దున్న ఫోన్ ఓపెన్ చెయ్యగానే కనిపించే దాదాపు వంద పెండింగ్ మెసేజిల మీద చిరాకు పుట్టో, ఆ మెసేజీల్తో వచ్చే ఫోటోలు, వీడియోలు దురాక్రమించే మెమరీ స్పేస్ తల్చుకుని కలిగిన చిరాకు వల్లోగానీ, కొత్త డైరెక్షన్లో పయనించిన ఆలోచన్లు నెహ్రూగారి రెండు ఫేవరిట్ లైన్లనీ తిరగ రాసి పట్టుకొచ్చాయి ఇలా 👇.
Messages to read before I sleep
Messages to forward before I sleep
Pictures to like before I sleep
Videos to watch before I sleep
👌s&👌s to check before I sleep
👏s&👏s to post before I sleep
GBs & GBs to delete before I sleep
ఏంచేస్తాం? కాల మహిమ 😆 టెక్నాలజీ మహత్యం 😂
ఇంతే సంగతులు. బై4నౌ
🙏
అన్యగామి గారు చెప్పినట్లు మీ స్పీడ్ మాకందదు గానీ ఫ్రాస్ట్ గారి లాగా చాలా పనుందని డిసైడ్ అయిపోయినట్లున్నారు తప్ప అసలు హేంలెట్ లా సందిగ్ధమేమీ లేదన్నమాట – To delete or not to delete” – అని?
ఫ్రాస్ట్ గారి పద్యంలో రెండర్ధాలు పట్టుకో గలిగిన మీరు అసాధ్యులండీ
సోషల్ మీడియా మూలంగా పడుతున్న ఘోష అంతా మీరన్నట్లు “టెక్నాలజీ మహత్యం 😂”. అంతే కదా మరి – టెక్నాలజీ …. “తెల్లోడి బిస”.
సరే గానీ, చెప్పారు కారు మీరూ లయోలా ఉత్పత్తేనని (విజయవాడే కదా?). అయితే – మీది లయోలా, మాది లయోలా, మనది లయోలా – అన్నమాట. మీరన్న ‘Keats’ రెడ్డి గారి పేరు మా రోజుల్లో విన్నట్లు గుర్తు రావడం లేదు. మాకు
ఆంగ్లోపన్యాసకులు E.B.సత్యం గారు (Head), సురేశన్ గారు, భాస్కర రావు గారు, పురుషోత్తం గారు ప్రభృతులు (వీరిలో ఎవరయినా మీకు బోధించారా?).
ముఖ్యంగా సురేశన్ గారు బాగా పాప్యులర్. డిగ్రీ రెండవ సంవత్సరంతో లాంగ్వేజెస్‌కి గుడ్‌బై ఆ రోజుల్లో. చివరి క్లాసులో సురేశన్ గారు మంచి సలహా ఇచ్చారు – రేపు మీరు సైంటిస్టులవచ్చు, ఇంజనీర్లవచ్చు, గవర్న్మెంట్ ఆఫీసర్లవచ్చు; ఏది చదివినా, ఏ వృత్తిలో జేరినా లిటరేచర్ని మాత్రం వదలకండి; ఈ ఏడాదితో అయిపోయింది కదా అనుకోవద్దు; పరీక్షల వరకే అయిపోయింది; ఉద్యోగంనుంచి ఇంటికొచ్చాక మంచి కాలక్షేపంగా ఉండేది, జీవితంలో కొన్ని సందర్భాల్లో సాంత్వననిచ్చేది లిటరేచరొక్కటే – అన్నారా రోజున ఆ మహానుభావుడు. ఎంత నిజమనిపిస్తుంది.(ఆ నాటికింకా ఈ సోకాల్డ్ “సోషల్ మీడియా”, అసలు ఇంటర్నెట్టే ఇంకా రంగ ప్రవేశం చెయ్యలేదులెండి. అటువంటిది మన జీవితాల్లోకి ప్రవేశిస్తుందనీ, అతలాకుతలం చేస్తుందనీ కలలో కూడా ఊహించలేదు. సురేశన్ మాస్టారు ఏమంటారో పాపం?)
https://polldaddy.com/js/rating/rating.js
LikeLiked by 1 person
==
ఏమనెదరో సురేశన్ !
“e- మానవు” లయ్యిరోయి ఈమోజీలై
కోమాలో కెళ్ళిరహో !
ఓమాటైనన్ పలుకరు ఓన్లీ స్మైలీస్ 🙂
జిలేబి
LikeLiked by 1 person
జిలేబిగారూ, మీ పద్యం ఇంత జాప్యాలస్యం అవడానికి కారణమేమి?
LikeLike
అర్థమ్ముల్ సరిగానలేక పదముల్ యావత్తు భావంబుగన్
వర్ధిల్లంగ జిలేబివేచె నచటన్ వైవీ! సజావైగనన్
మర్దించంగను మేలురీతి పదముల్ మాన్యంబుగావేయగన్
శార్దూల్యోత్పలకందచంప కములన్ సాయంబుగానన్ సుమా!
జిలేబి
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
వీఎన్నార్ సర్! నమస్కారం. జెట్-లాగ్ తీరి సెటిలయ్యారనమాట.
ఎంసెట్ ప్రవాహంలో కొట్టుకుపోయేముందు(83-84) విజయవాడ లయోలాలో ఫస్ట్ బీఎస్సీ చదివానండి. సురేశన్గారు కొన్ని క్లాసులు తీసుకున్నారు మాకు.ఎక్కువగా రెడ్డిగారు పోయెట్రీ, గోపయ్యగారు ప్రోజ్ చెప్పేవారు. సురేశన్గారి ఆంగ్లం మృదుమధురం.
//To delete or not to delete// హామ్లెట్ స్మార్ట్-ఫోన్ వాడివుంటే ఆయనకీ డైలమా వుండదేమో.
LikeLiked by 1 person
జెట్లాగ్ తీరిందా అంటే ఆమధ్యెక్కడో చూసిన ఒక కార్టూన్ గుర్తొచ్చింది.
స్పృహలో లేని పేషెంట్ పరిస్ధితి గురించి కుటుంబం అడిగితే డాక్టర్ – ఇంకా అలాగే ఉంది. అప్పుడప్పుడు మెసేజ్‌లు చెక్ చేసుకోవడానికి మాత్రం స్పృహలోకి వస్తున్నాడు, మళ్ళా స్పృహ తప్పుతోంది – అంటాడు 😀
ఈ జెట్లాగ్గూ అలాగే ఉంది – మధ్య మధ్యలో బ్లాగులు చూస్తూ😀. అందుకే నా వ్యాఖ్యలు మీకు విచిత్రమైన సమయాల్లో వస్తుండుంటాయి
LikeLiked by 1 person
మీరన్న “e-మానవులు” అక్షరసత్యం
– దురదృష్టవశాత్తూ.
సురేశన్ మాస్టారు అరుదుగా దొరికే ఒక మంచి లెక్చరర్ జిలేబి గారూ. ఈనాటికీ ఓపికగా బోధిస్తూనే ఉన్నారు (వారు మాకు పాఠాలు చెప్పింది ఏభై ఏళ్ళ క్తితం నాటి మాట).
వారి ఫొటో చూడాలనుకుంటే ప్రతాదివారం వచ్చే “ఈనాడు” పేపర్లో “ప్రతిభ” పేజ్‌లో కనిపిస్తుంది.
LikeLike
//”ఎంసెట్ ప్రవాహంలో కొట్టుకుపోయేముందు …. “//
ఒక సంఘటన గుర్తొచ్చింది. మా రోజుల్లో ఎంసెట్ ప్రవాహం లేదు. 12వ తరగతి / PUC మార్కులతో రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఇంజనీరింగ్ / మెడికల్ కాలేజ్‌లకి (ప్రైవేట్ కాలేజ్‌లు లేవు) అప్లికేషన్లు పెట్టడం, తరవాత దణ్ణం పెట్టుకుంటూ కూర్చోవడమే.
సీట్ వచ్చేస్తుందనే ఆశతో డిగ్రీవి టెక్స్ట్ పుస్తకాలు కొనకుండా కాలక్షేపం చేసేవారు కొంతమంది ఆశావహులు. క్లాసులో లెక్చరర్ గారు అడిగితే “I am expecting Sir” (సీట్ అని భావం) అని సంజాయిషీ ఇచ్చేవారు (వాక్యం సరిగా నిర్మించకుండా – కొత్తగా ఇంగ్లీష్ మాట్లాడడం కదా 😀). పైన చెప్పిన ఇంగ్లీష్ లెక్చరర్ భాస్కరరావు గారు – పొయెట్రీ బోధించేవారు – ఒక రోజున ఇలాగే జవాబిచ్చిన కుర్రాడిని “What are you expecting, a baby?” అన్నారు 😁😁.
LikeLiked by 1 person
@VNRగారు, క్లాస్రూమ్ హ్యూమర్ బావుంది సర్. ఇప్పుడే “ప్రతిభ”లో సురేశన్గారి ఫోటో చూశాను. నెనరులు.
LikeLike
నేను కూడా బెజవాడ లయొలైట్ సింహాన్నే:-)
మాకు home burial చెప్పింది కూడా రెడ్దిగారే అన్న గుర్తు!
ఒక తమాషా ఏంటంటే,అక్కది వరకు చాలా బోరు కొట్టించారు,కానీ ఆ కవితకి ఆయబ చెప్పిన వ్యాఖ్యానం ఇప్పతికీ గుర్తుంది.
LikeLiked by 1 person
హరిగారు భలే. ఇప్పటికి ముగ్గురు లయోలైట్స్ తేలాము.
మీరు చదివినది ఏ సంవత్సరాల్లో? నేను 83-84 అక్కడున్నాను.
LikeLike
from 1979 to 1982
LikeLike
మీరొక లాయల్లయోలాలయనన్నమాట – Thanks for the nice reminder of good old poetry.
There are days when I too am crazed with the spell of far Arabia.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
@Lalitha TS,
లాయల్, లయోలా వరకూ ఓకేనండి. లయన్ కాదు, అక్కడ డిగ్రీ పూర్తీ చెయ్యలేదు కదా.
ఐతే అరేబియాపై కవితలూ అవీ రాసే వుంటారు, షేర్ చెయ్యండి త్వరలో. 🙂
LikeLike