Uncategorized

🌇(భ)వన🌿 భోజనం🌾 + ♬మైక్-టెర్రరిజం😈+ “మరలిరాదా మానవలోకం? తనకి దూరమైన🐦వనాల కోసం🐒…”

goodmorning1

మొన్న శనివారం పొద్దున్నే నా కెమెరాలో చిక్కిన ఆ కొంగ నా గుడ్ మార్నింగ్ మెసేజిలో M అక్షరంగా –

అందంగా చందంగా సలలితభావ నిష్యందంగా

ఒదిగిపోతే వచ్చిన చిన్ముద్రలు👌 చప్పట్ల👏తో వాట్సప్ దద్దరిల్లి అద్భుతంగా మొదలైంది వారాంతం. మీక్కూడా అదే గుడ్మార్నింగ్ చెప్పకుండా ఉండలేకపోతున్నా.

మా శ్రీమతి వాట్సప్ గ్రూప్‌లో లేడీస్ అంతా కల్సి ఆదివారం వనభోజనాలు అన్నారు. శని, ఆదివారాలు రాగానే పూటకి రెండు, మూడు గంటలు వనాల్లో వనచరాల వెంట కెమెరా పట్టుకు తిరగడం, ఆ నాలుగు పూటలూ పూటుగా తిని సోమ-టు-శుక్రవారం రొటీన్లో పడిపోడం అలవాటు పడుతున్న నాకు వనంలోనే భోజనం అంటే అంతకంటే ఏం కావాలి? ఏం అక్కర్లేదు. కానీ ఆ ఐడియాకి ఎగిరి గంతెయ్యాలనేం అనిపించలేదు. ఎందుకంటే చిన్నప్పుడెప్పుడో కట్టాసుబ్బారావు తోటకెళ్ళి చేసిన వనభోజనం, అప్పుడు తిన్న- కాదు ఎవరో తినిపించిన 😊 – కొబ్బరిపాల పరమాన్నం ఇప్పటి వరకూ మర్చిపోలేదు. ఇంకొన్నాళ్ళకి – అంటే మరీ ఎక్కువ రోజులేం కాదు ఇంజినీరింగ్‌‌ చదువులోకి వచ్చాకే – మా తోటలోనే తాతా-సమేతులై అమ్మమ్మ, నానమ్మలు, పిన్నిలు, బాబాయిలు, కజిన్స్… అందరితో స”మేతం”గా కలిసి చేసిన వన సమారాధనలు మర్చిపోడం అసలే కుదరదు. అంతకంటే మర్చిపోలేనిది ఫ్రెండ్స్ అందరం అటో పదమూడు, ఇటో పదమూడు కిలోమీటర్లు సైకిళ్ళు తొక్కి మా తోటలో లేలేత కొబ్బరినీళ్ళతో, ఇళ్ళనుంచి పట్టుకెళ్ళిన కారియర్ భోజనాలు పంచుకుని తిన్న ఒకేఒక్క సందర్భం. సహజ వాతావరణంలో, మరీ పల్లెపట్టుల్లో కాకపోయినా చిన్న చిన్న పట్నాల అంచుల్లో చేసిన అలాంటి వనభోజనాలకి ఫొటోజెనిక్ వనాల్లో, కాండోమినియం ఫంక్షన్ హాల్స్‌లో, ప్లాస్టిక్ ప్లేట్లలో, మాటిమాటికి స్మార్ట్ ఫోన్లు చెక్ చేసుకుంటూ చేసే (భ)వనభోజనాలు ఎలా సరితూగుతాయి? అంచేత ఎగిరి గంతెయ్యలేదు. ఐనా, ప్రవాసమహిళాలోకం ఈసారి ఎలాగైనా ఎప్పుడూకంటే బాగా పూర్వపు వనభోజనాలకి ఇంచుమించు సరిసాటి అయ్యేలా నిర్వహిస్తాం అని కంకణాలు కట్టుకుని బయల్దేరేప్పటికి వాళ్ళని ప్రోత్సహించాలన్చెప్పి కంకణం కట్టుకోకుండానే నేనూ బయల్దేరా. అన్నమాట నిలబెట్టుకుంటూ సంసారాల్లో స్ట్రెస్ మేనేజ్ చెయ్యడం ఎలా అనే అంశం మీద సైకియాట్రీతో పాటు సంస్కృతం చదువుకుని సనాతన సంస్కృతి పాటిస్తున్న ఓ అచ్చ తెలుగు డాక్టర్ గారి చేత మంచి ప్రసంగం ఇప్పించారు. ఆయన చెప్పిన విషయాల్లో పాశ్చాత్యసంస్కృతి గురించి, విదేశీయుల మెటీరియలిజం గురించి మనలో సాధారణంగా వుండే అపోహల్లో ఒకదాని గురించి ఆయన చెప్పినది – బహుశా అది నేనూ గమనించి వుండడంవల్లనేమో – నాకు బాగా నచ్చింది. పెద్దవాళ్ళైన తల్లిదండ్రులని చూసుకోవడంలో కొందరు పాశ్చాత్యులు (& చైనీయులు కూడా) చూపించే శ్రద్ధా-ప్రేమా అత్యద్భుతం. ఉద్యోగాలు వదులుకున్నవాళ్ళూ, పెళ్ళిళ్ళు మానుకున్నవాళ్ళు, నర్సులు/ హాస్పిటల్స్ సంరక్షణలో కాకుండా తమంతట తామే పెద్దల్ని చివరివరకూ అంటిపెట్టుకు కాపాడిన వాళ్ళు అనేకమంది అని చెప్తూ వాళ్ళలో కొందరు ఇదే విషయాన్ని మన సంస్కృతినుంచి నేర్చుకున్నామని చెప్పడం ఇంకా నచ్చింది. కారణం – మన సంస్కృతి గురించిన గర్వం + దాన్ని గుర్తించిన విదేశీయుల భావవైశాల్యంపై గౌరవం. విచిత్రంగా – గర్వం, గౌరవం – రెండు పదాలూ గ,ర,వ అనే అక్షరాలనుంచే పుట్టాయి. పరస్పర గౌరవం ఉన్నచోటే గర్వించడం అనేదానికి అర్ధం అని చాటుతున్న “అక్షర”సత్యమా ఇది? ప్రసంగం అయిన వెంటనే భోజనాలు. అచ్చతెలుగు వంటకాలు – ఇంక్లూడింగ్ అవర్ హోం-మేడ్ (తెలుగు, తెలుగు !!) – సృష్టిస్థితిలయాలన్నీ స్వగృహంలోనే మా చేతుల్లో, సీసాల్లో, నోళ్ళలో (respectively 😆) పొందే – శాకంబరీ దేవీ వరప్రసాదంతో సహా – వడ్డించేశారు. భోజనాలయ్యే సమయానికి ఔత్సాహిక, వర్ధమాన, స్వయంప్రకటిత గాయనీగాయకులు గళాలు సవరించుకున్నారు. ఒకాయన ఘంటసాల భగవద్గీతని అందరికీ తన గళంలో వినిపించాలని కుట్ర చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. అప్పుడే భోజనాలకి దూరంగా వున్న వనాల్లోంచి వడ్రంగిపిట్ట కూత పెట్టింది. తీతువుపిట్ట బిజీగా వుండి వడ్రంగిపిట్టకి తన ఉద్యోగ బాధ్యతలు అప్పచెప్పిందా అనిపించింది, రానున్న “ఉపద్రవా”న్ని సూచిస్తూ ప్రకృతి స్తంభించిందా అనిపించేలా పొద్దున్నించీ పడుతూ అందర్నీ చల్లగా ఉంచిన వాన ఆగింది. పావుగంటలో వాతావరణం వెచ్చబడింది. అసంకల్పిత ప్రతీకార చర్యగా చెమటలు కారడం మొదలైంది. ఈ శకునాలకి తోడు వనదేవతలు “ఏఁవఁర్రా! భోజనాలు చేసారు. మరి వనాలు చూడరా?,” అంటూ ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది. అంతలో పొద్దున్న (భ)వనభోజనసీమలోకి ప్రవేశిస్తూనే కనబడిన ఓ ముద్దొచ్చే దృశ్యం – ఫోటో తీసుకున్నా – గుర్తొచ్చింది. నాలుగేళ్ల పసివాడికి వర్షం తప్పించుకోడానికో మరిదేనికో గడ్డిలోంచి బయటికి వచ్చి గచ్చునేల మీద  ఆఘమేఘాల మీద ఆదరాబాదరాగా వెళ్ళిపోతున్న నత్త కనిపించింది. వాళ్ళ నాన్నతో కలిసి దాన్ని చూస్తూ, ఏవేవో అడుగుతూ ఎంజాయ్ చేస్తున్నవాడి బుల్లి బుర్రలో చిన్న అందమైన ఆలోచన మెరిసింది. ఆ నత్తకి ఇతర జంతువులతో స్నేహం కలపాలని. తనతో తెచ్చుకున్న బుల్లి బుల్లి అడివిజంతువుల బొమ్మలు నత్త చుట్టూ పెట్టాడు. వాటి “కబుర్లూ, ఆటలూ” చూస్తూ సంబరపడుతున్నవాడిని చూడగానే వనభోజనం చేసిన ఫలితం, పుణ్యం, ఆనందం అన్నీ ఒక్కసారే కలిగేసాయి.

snail & animals

వనభోజనాల్లో జనం, భోజనంతో పాటు వనం తప్పనిసరి అని అవేమీ తెలియని పసివాడి చేత “మరలిరాద మానవలోకం? తనకి దూరమైన వనాల కోసం…” అంటూ ప్రకృతిమాత ఇచ్చిన సందేశమా ఇది అనిపించింది.

అదే అదునుగా తీసుకుని చెట్టూ పిట్టా పురుగూ పుట్రాలని ఒకసారి పలకరించి వచ్చే వంకతో అక్కణ్ణించి బయటపడితే మైక్-టెర్రరిజం నుంచి తప్పించుకోవచ్చని చెవులూ, కళ్ళూ, కాళ్ళూ, వాటికి వంత పాడుతూ కెమెరా సణుగుడు మొదలు పెట్టాయి. ఎప్పుడు బయల్దేరతానా అని చెప్పులు కూడా ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. ఇలా అనిపించడాన్నే కన్వీనియెంట్ థింకింగ్ అని, యాంటీ-సోషల్ థింకింగ్ అనీ కొందరంటారు. కానీ ఆత్మరక్షణ మన జన్మహక్కు. వాళ్ళ మాటలస్సలు పట్టించుకోకూడదు మనం. చెట్లు, చేమల్లో తిరిగేప్పుడు దోమలు, చీమలు తెగ కుడతాయి. మైకు-తీవ్రవాదుల బెడదతో పోలిస్తే వాటి కాట్లు ఫిష్-స్పా లో చిరుచేపలు పాదాల్ని గిలిగింతలు పెట్టినట్టు వుంటాయి. సో, వనభోజనంలో సగానికి అంటే భోజనానికి, టిక్కు పెట్టేసి, మిగిలిన సగం, వనవిహారానిక్కూడా టిక్కు పెడదామని బయల్దేరిపోయాను, వడ్రంగిపిట్ట కూత వినబడిన దిశగా …”వెడలెను కెమెరాపాణి, అడవులబడి, పక్షుల వెంబడి…” అంటూ వనదేవతలు పేరడీలు కడుతుండగా…

వనసంచారం నుంచి తిరిగి భవనసీమల్లోకి వస్తుంటే రెండు అనుభవాలు ఒకటి కాస్త కామెడీది, రెండోది కార్తీక వనభోజనానికి ఆహ్లాదకరమైన ముగింపు అనిపించే ఆధ్యాత్మిక స్పర్శ (=Spiritual Touch) వున్నది కలిగాయి. అవి వచ్చే టపాలో.

బై4నౌ 😊🙏

***

 

 

32 thoughts on “🌇(భ)వన🌿 భోజనం🌾 + ♬మైక్-టెర్రరిజం😈+ “మరలిరాదా మానవలోకం? తనకి దూరమైన🐦వనాల కోసం🐒…”


 1. వనభోజనముల్ జేయుచు
  ఘనమౌ స్ట్రెస్సుల గురించి జ్ఞానమును గడిం
  చి, నలుదెసల కలయ తిరుగ
  మనసుకు నచ్చినటి చిత్ర మయె కహ్వమటన్ !
  జిలేబి


  https://polldaddy.com/js/rating/rating.js

  మెచ్చుకోండి

 2. జిహ్వకు వనభోజనముల్
  లహ్వోలబ్బుల జిలేబుల కథల గానన్
  వాహ్వాహ్హనుచున్నచటన్
  కహ్వంబయ్యెనట బంది కందము లోనన్ 🙂

  జిలేబి

  https://polldaddy.com/js/rating/rating.js

  మెచ్చుకోండి

 3. “కహ్వము”? “కహ్వము”? You too, YVR garu 🙁?

  పద్యాల్లో వ్యావహారిక పదాలు వాడడం గురించి చూడుడు – లక్కాకుల రాజారావు మాస్టారి ఇటీవలి టపా “పద్యం – పరమార్ధం”. జిలేబి గారు చదివినట్లే వున్నారులెండి.

  https://polldaddy.com/js/rating/rating.js

  మెచ్చుకోండి

  1. నారదాయ నమః
   వారెవరో యేదో య
   న్నారని గ్రాంధిక పదముల నాట్యంబుల తా
   నాడ విడచునా నరస
   న్నా రమణి జిలేబులమ్మి నారద సకియా!
   జిలేబి


   https://polldaddy.com/js/rating/rating.js

   మెచ్చుకోండి

   1. “నరసన్నా”?? నయం, “ప్రగడ రాణ్ణరసా” అంటూ తెనాలి రామకృష్ణుడి లాగా ఓ తిట్టుపద్యంతో కొట్టలేదు, ధన్యోస్మి 🙏.

    https://polldaddy.com/js/rating/rating.js

    మెచ్చుకోండి

    1. రాణ్ణరసా! వ్యాఖ్యాశ్రీ !
     విన్నాణపు విన్న కోట విదురా ! ప్రగడా!
     క్షుణ్ణము గా బ్లాగ్లోకము
     లన్నీ చుట్టుచు జిలేబులన్ గను సింహా !

     ఇదేనా మీరడిగింది 🙂

     చీర్స్
     జిలేబి

     https://polldaddy.com/js/rating/rating.js

     మెచ్చుకోండి

  2. వీయెన్నార్ సర్, సాహిత్యం పెద్దగా తెలియదు నాకు. తెలిసినంతలో రాజారావు మాస్టారిది శ్రీశ్రీ గారి బడి, ప్రజాకవిత్వం. ఆయన పద్యాలూ అలాగే విలక్షణంగా, వినసొంపుగా వుంటాయి. ఎక్కువ వాడుకలో లేని పదాలు వాడడంలోజిలేబిగారిది విశ్వనాధ స్కూల్ ఆఫ్ పోయెట్రి. కానీ వారి పద్యాల్లో వెరైటీ సెటైర్ వుంటుంది. నాలాంటివారికి డిక్షనరీ చూడకుండా ఎవరి కవిత్వమూ అర్ధం కాదు, అది వేరే విషయం అనుకోండి.😊

   మెచ్చుకోండి

 4. వైవియార్ సారు వైవిధ్య కథనాల
  శైలి రాదెవరికి , శక్య మవదు ,
  బ్రహ్మ కలము నిచ్చి ప్రత్యేక మైనట్టి
  యింకు నింపె నేము ! యిట్లు రాయ .

  https://polldaddy.com/js/rating/rating.js

  మెచ్చుకోండి

  1. త్వమేవాహం త్వమేవాహం 🙂
   తానా అంటే తందానా యనాలె 🙂

   కలరే వైవీ యారు వ
   లె లక్షణంబుగ జిలేబు లెల్లన్ వేయన్
   కలరే యుర్విన్ కలకల
   కలముల బ్రహ్మ కమలముల కనికట్టుగనన్ 🙂

   జిలేబి

   మెచ్చుకోండి

   1. //త్వమేవాహం త్వమేవాహం//
    గురువుగారు, జిలేబిజీ – ఇద్దరూ త్వమేవాహం త్వమేవాహం అంటూ క్రిప్టోగ్రఫీలో ఎదో మాట్లాడుకుంటున్నారు.😇😇

    మెచ్చుకోండి

    1. ఓ గురువుగారు ! మీరూ
     బ్లాగు జిలేబీ గుసగుస బాసల యేదో
     కాగళి కలన్త్వమేవా
     హా గమకములన్ జిగిబిగి హాహా గనిరే 🙂

     బిలేజి

     https://polldaddy.com/js/rating/rating.js

     మెచ్చుకోండి

 5. వేగమ్మే తమ జీవితమ్ముగ భళీ వేర్వేరు పారీంద్రముల్
  రాగంబెల్లగనన్, మనోహరముగా రంజిల్లగన్, నందనో
  ద్యోగాభ్రాంతులు సేదదీరి మదిలో దోబూచులాడంగగన్
  మేఘానందపు రెక్కలార్చు విధమై మేధన్ విభూతిన్గనెన్!
  జిలేబి


  https://polldaddy.com/js/rating/rating.js

  మెచ్చుకోండి

  1. పారీంద్రము = సింహము, ఆంధ్రభారతి ఉవాచ. అది కాక ఇంకో అర్ధమేమైనా ఉందా? పద్యంలోకి సింహం ఎలా వచ్చిందో తెలియట్లేదు జిలేబిగారు!! 😇.
   నందనోద్యోగాభ్రాంతులు = ??? అనగానేమి? ఆంధ్రభారతి న ఉవాచ😊.

   మెచ్చుకోండి

 6. తలను గోడ కేసి తట్టినా కొట్టినా
  దీని భావ మేమొ తెలియ దనఘ !
  అమ్మకు బడిజెప్పు అయ్యకు దప్ప ఆ
  యజుని కైన వాని యబ్బ కైన .

  https://polldaddy.com/js/rating/rating.js

  మెచ్చుకోండి

 7. ఆ ‘ సమోస ‘ బంధ మనితర సాధ్యమ్ము
  వైవియారు సారు వల్ల గాక
  ఆంధ్రభారతమ్మ నడిగిరి , ఐనను
  దిక్కు లొక్క తీరు తేజరిల్లె .

  https://polldaddy.com/js/rating/rating.js

  మెచ్చుకోండి

  1. ఉద్యోగ మనే భ్రాంతి లో సంతసించే వారు సేదదీరి …

   నందనోద్యోగభ్రాంతులు

   నన్దన – సంతోషించువాడు
   ఉద్యోగము
   భ్రాంతి – భ్రమ

   హమ్మయ్య ఎట్లాగో కిట్టించేసాం
   మేఘానంద వారిని పారీంద్రులను 🙂

   జిలేబి

   https://polldaddy.com/js/rating/rating.js

   మెచ్చుకోండి

 8. పారీంద్రులే జిలేబీ ?
  భారీ కథగట్టినారు పద్యంబులతో !
  హోరాహోరీగానన్
  సోరణి దివ్వెల వెలుగుల శోభల్ గనుచున్ 🙂

  బిలేజి

  https://polldaddy.com/js/rating/rating.js

  మెచ్చుకోండి

HI, _/\_ :-) THANK YOU FOR COMING THIS FAR IN THE POST ;-) I REALLY DO APPRECIATE PEOPLE WHO STIMULATE MY CREATIVITY & MAKE ME THINK ON A DEEPER LEVEL. YOUR RATING THIS POST HELPS. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s