జవహర్లాల్ నెహ్రూ – ఒకప్పుడు ఈయన్ని అభిమానించిన జనాభా ఎంతో ఇప్పుడు ఆయన్ని వ్యతిరేకిస్తున్న, కొండొకచో దూషిస్తున్న జనాభా దానికి రెట్టింపు వుండచ్చు. స్వాతంత్రం వచ్చినప్పట్నుంచీ జనాభా నాలుగు రెట్లు పెరిగిందన్న దాంట్లో డౌట్ ఏమీలేదు కానీ, జనంలో చరిత్ర పరిజ్ఞానం నాలుగు రెట్లు పెరిగిందా? నాలుగోవంతుకి పడిపోయిందా అనేది చెప్పడం కష్టం. ఇంత తేలిగ్గా ఎలా చెప్పేస్తున్నానంటే –
- అశోకుడి నుంచీ ఔరంగజేబు వరకూ ఎవరి చరిత్ర చూసినా గర్వపడేవాళ్ళు ఉన్నారు ఏమున్నది గర్వకారణం అనేవాళ్ళూ ఉన్నారు(పెరుగుతున్నారు).
- చిన్నప్పుడు చదివిన హిస్టరీ బుక్స్ అన్నీ అప్పటికే తిరగబడ్డాయనే విషయం అనుమానం స్థాయి నుంచీ పెనుభూతం సైజు వరకూ ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా పెరుగుతోంది. చరిత్ర ఈ పాటికి ఎన్నిసార్లు తిరగరాయబడి వుంటుందా అనేది దీనికి అనుబంధ ప్రశ్నగా తలెత్తక తప్పదు. (మనసు లేని దేవుడు .. మనిషికెందుకో మనసిచ్చాడూ… ఊ..ఊ..ఊ..😂)
- History is but the version of the victor అని నెపోలియన్ అన్న మాటలు అప్పుడందరికీ తెలీవు. ఇప్పుడు చాలా మందికి తెలుసు.
- పై మూడు పాయింట్ల వల్ల హిస్టరీ అనేది మిస్టరీగా మారి కన్ఫ్యూజన్లో పడిపోయినవాళ్ళలో నేనూ ఒకణ్ణి.
- ఇంకోటి, ప్రజలు / సామాన్యులు అనబడే వోట్-బ్యాంకుల్లో హిస్టరీ తెల్సుకోవాలనే వైజ్ఞానిక ఆసక్తి ప్రత్యేకంగా వుందని చెప్పుకోడానికి తగిన ఆధారాలు కూడా పెద్దగా …. నెవర్ మైండ్..ఐనా, మెకాలే విద్యావిధానాన్ని ఇవాళ్టి చై.నా. విద్యావిధానం రిప్లేస్ చేస్తున్న ఈ రోజుల్లో చరిత్ర తిరగ రాసినా, మరగ రాసినా ఎవడిక్కావాలి?
సో, హిస్టరీ పరిజ్ఞానం పెరగలేదు కానీ మిస్టరీ/కన్ఫ్యూజన్ పెరిగిందనేది సొంత పర్సనల్ అభిప్రాయం. అంచేత నెహ్రూని — ఆ మాటకొస్తే చరిత్రలోకి వెళ్ళిపోయిన వాళ్ళెవరి మీదా కూడా అభిప్రాయాలు ప్రకటించడం నా బోటి కన్ఫ్యూజ్డ్ మైండ్స్‌కి కుదరదు. సో, ప్రకటించను. కానీ – నెహ్రూకి, నోబెల్ బహుమతి సంపాయించిన మన సైంటిస్టు సి.వీ. రామన్‌కి మధ్య జరిగిన పిట్టకధ ఒకటి నెహ్రూ పాలిట భవిష్యపురాణంలా అనిపించింది. 1948లో నెహ్రూజీ రామన్ గారి లేబరేటరీ సందర్శనకి వెళ్ళినప్పుడు జరిగింది(ట) –
ఒక రాగితీగపై అల్ట్రావయొలెట్ కిరణాలు ప్రసరిస్తుండగా అది ప్రధానికి చూపించి అదే లోహమో చెప్పమన్నాడట శాస్త్రజ్ఞుడు. అల్ట్రావయొలెట్ కిరణాల ప్రభావంతో మెరుస్తున్న రాగి నెహ్రూజీకి బంగారంలా కనబడిందిట. ఆ మాటే అనేసాడాయన. “మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మెరిసేదంతా బంగారం కాదు (Mr Prime Minister, everything that glitters is not gold),” అంటూ రామన్ కిరణాల ప్రసారం ఆపి రాగి తీగని చూపించాడట. ప్రధాని రియాక్షన్ ఏంటో తెలియదు కానీ రామన్ మాటలు చైనా విషయంలోనూ, వీకే మీనన్‌పై నమ్మకంతోనూ నెహ్రూ చేసిన పొరపాట్లని (🤔) పదమూడేళ్ళ ముందే సశరీరవాణిలా వినిపించినట్టులేదూ? ఆయన కారెక్టర్లో ఏదో లోపాన్ని రామన్ పసిగట్టి ఒక ప్రధాని మీదే జోక్ పేల్చాడా? లేక అలాంటి జోక్స్ పేల్చడం ఆయన నైజమా? తెలీదు కానీ నెహ్రూ మాత్రం విమర్శనీ, వ్యంగ్యాన్నీ పాజిటివ్‌గా తీసుకునేవాడంటారు. శంకర్స్ వీక్లీలో తనపై పడిన పదునైన కార్టూన్స్‌ని చూసి ఆయన నవ్వుకునేవాడంటారు. అంటారా? నిజంగానే నవ్వుకునేవాడా? ఎవరికి తెల్సూ? హిస్టరీ ఈజ్ ఎ మిస్టరీ. హిస్టరీ & పాలిటిక్స్ పక్కనపెట్టి ఒక సైంటిస్టుకి, ఒక లీడర్‌కి మధ్య నడిచిన చమత్కారంగా చూస్తే చాలు.
బై4నౌ😉
నెహ్రు గారికి సైన్స్ తెలియదనుకొందాము. అయినా రామన్ గారికి ప్రక్కన ఉన్నది ప్రధానమంత్రి అన్న విషయం మరిచి అలా జోక్ చేసిఉంటారని నేననుకోను. మనకి యెర్ర చొక్కాల వాళ్లు, ఆకుపచ్చ ఎరుపు కండువాలు వాళ్లు, నారింజ రంగు తలపాగాల వాళ్లు నేర్పించిన చరిత్రలా కాకుండా నెహ్రు గారు, వారి సమకాలికులు నిజాయతీగా, నిస్వార్థంగానే దేశసేవ చేశారనే చెప్పాలి (within their scope of influence, power, limitations and human frailties). ఎప్పుడో ఒక రోజు ఈ విషయం మీద టపా వ్రాయాలని నాకోరిక. మీ వ్యాసం ప్రథమ భాగంలోని వన్నీ సత్యాలే.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
అన్యగామిగారు,
//నెహ్రుగారు, వారి సమకాలికులు నిజాయతీగా, నిస్వార్థంగానే దేశసేవ చేశారనే చెప్పాలి (within their scope of influence, power, limitations and human frailties)// ఈ మాటతో పూర్తిగా ఏకీభవిస్తాను. నిజానికి ఈ సంఘటనకి సంబంధించిన వ్యాసంలో రామన్‌కి, నెహ్రూకి సైన్సు రీసెర్చి విషయంలో policy differences వుండేవనీ, ఆ నేపధ్యంలోనే రామన్ ఆ వ్యంగ్యబాణం విసిరి ఉంటాడనీ ధ్వనించేలా రాశారు.అంత అవసరమా అనిపించింది. ఒక స్కాలర్-లీడర్‌కి, ఒక గొప్పసైంటిస్టుకి మధ్య ఆ మాత్రం సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కి చోటుండకపోదనే నా అభిప్రాయం.
LikeLike
ఆ వ్యాసకర్త trying to read too much between the lines అనిపిస్తోంది నాకయితే. లేదా wisdom after the event అయ్యుండవచ్చు — తరవాత కాలంలో నెహ్రూ గారి హయాంలో జరిగిన కొన్ని పరిణామాలను ఇప్పుడు విశ్లేషిస్తూ …. రామన్ గారి సరదా సంఘటనని నెహ్రూ గారి కారెక్టర్ “లోపాని”కి ఉదాహరణ అంటూ చిత్రీకరించే ప్రయత్నం అయ్యుండవచ్చు. ఆ వ్యాసం ఏమిటో…. లింక్ ఇస్తే మేమూ చదువుదామని “ఆత్రం”గా ఉంది.
ఏ లోపాలున్నా (లేని మనిషెవరు) నెహ్రూ గారి సెన్సాఫ్ హ్యూమర్ కి మాత్రం మీరు చెప్పిన శంకర్స్ వీక్లీ కార్టూన్లని ఆయన కూడా ఆస్వాదించేవాడనీ, తననే lampoon చేస్తూ వేసిన కార్టూన్లు అయినా కూడా తనే ఫోన్ చేసి మెచ్చుకునేవాడనీ అంటారు.
LikeLike
// …చిత్రీకరించే ప్రయత్నం అయ్యుండవచ్చు//
వీఎన్నార్ సర్, నిజానికి ఆ ప్రయత్నంలో రామన్ కారెక్టర్ గురించి ఎక్కువ చెప్పారు. వ్యాసకర్త ఉద్దేశం ఏమిటో మరి. ఇక్కడ చూడండి- https://scroll.in/magazine/856835/why-nobel-laureate-cv-raman-resented-nehru-and-even-took-a-public-swipe-at-him.
ఈ scroll.in సాధారణంగా నెహ్రూ భావజాలాన్నే అనుసరిస్తుంది నాకు తెలిసి.
LikeLike
వాత్సాపు గాధ లందున
పత్సలము లెరుక గదా ! కపటమైనటి చి
త్రోత్సవములును జిలేబీ !
ఉత్సుకత గొలిపెను గాని ఊకర కతయే 🙂
జిలేబి
LikeLike
జిలేబిగారూ, ఈ పద్యం కొంచెం నారికేళపాకంలా వుండి వెంటనే అర్ధం కాలేదు. ఇంతకీ ఇది వాట్సాప్‌లో వచ్చిన కత కాదండి. ఇక్కడ చదివాను 😊 – https://scroll.in/magazine/856835/why-nobel-laureate-cv-raman-resented-nehru-and-even-took-a-public-swipe-at-him
LikeLike
—
పాకంబయ్యెను నారికేళపు వహిన్, పద్యమ్ము, కందమ్ములున్
పాకంబయ్యెను నారి, కేల బడగన్ పాంజేబు పట్టీలుగన్,
పాకంబయ్యెను నారి ! కేళిక, మజా, పాటల్ కవాలీ లహో !
పాకంబయ్యెను “నారికేళఫలముల్” బామ్మా ! జిలేబీ భళీ !
చీర్స్
జిలేబి
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
జిలేబిగారూ, ఆంధ్రభారతివారితో అర్జెంట్ మీటింగ్‌లో వున్నా. ఐనవెంటనే పద్యంపై కామెంటెదను.😊
LikeLike
జిలేబిగారూ, సరదాగా రాశాను. ఏమనుకోరనే అనుకుంటున్నా🙏.—
పాకశాసన! నీవైన తెలుపవయ్యఈ నారికేళ
పాకపు భావమికను, ఎన్నితెలిసియున్నా జిలేబి
పాకము తెలియక తిరుమలేశుడు తాను చేతులెత్తె 🙏
పాకలోక ప్రభో! కొబ్బరి పీచు వొల్చి, భావమేమున్నదో బయటపెట్టవయ్యా!!
LikeLike
ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని సామెత. సహజంగా సాగిపోయిన సంభాషణకి తరవాత కాలంలో మొలుచుకొచ్చిన వ్యాఖ్యానాలు.
LikeLike
గురువుగారు 🙏.
వారిద్దరి మధ్యా సున్నిత, సునిశిత హాస్యమే చోటు చేసుకుందని నేను అనుకుంటున్నాను.
LikeLike
S, it is true.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
“History is but the version of the victor అని నెపోలియన్ అన్న మాటలు” … నిజమేనని అనిపిస్తోంది కెసిఆర్ గారి “తెలంగాణా చరిత్రను తిరగ రాయిస్తాం” విన్నాక … వ్యాసంలో మీరు చూపిన 5 అంశాలు అక్షరక్షర సత్యం (ప్రస్తుత కాలానికి). “హిస్టరీ పరిజ్ఞానం పెరగలేదు కానీ మిస్టరీ/కన్ఫ్యూజన్ పెరిగిందనేది …” – ఇది మరింత నిజం.
మీడియా రకరకాల దారులు తొక్కుతున్న ఇప్పటి పరిస్థితుల్లో వెల్లడవుతున్న అనేకానేక ప్రముఖుల/అప్రముఖుల వ్యక్తిగత/ప్రాయోజిత అభిప్రాయాలు/ప్రకటనలు చరిత్రపై ‘హిస్టరీయా ! మిస్టరీయా !’ లేక/మరియు ‘ఏది వైరల్ ఏది నిజం’ అన్న గందరగోళాన్నీ కలిగిస్తున్నాయి.
బాగా వ్రాశారు yvr గారు …
LikeLike
నో.వా.చే.రా …
నోటితో వాగు చేత్తో రాయి …
అవునంటే ఎస్ నొక్కండి …
కాదంటే ఎన్ నొక్కండి …
🙂 jf / jk …
LikeLiked by 1 person
యెస్👍నో👍😊
LikeLike
నోటితో వాగుము జిలేబి ! నోరు నొక్కి
చేతి తో రాయి నట బట్టి చేవ గాంచు
జీవి తమ్మున బేజారు చేరదు సుమ !
బండి వారి పలుకులవి పసిడి పలుకు 🙂
జిలేబి
LikeLike
రావుగారు మీ వ్యాఖ్యకు నెనరులు. నెపోలియన్ మాటలు అన్ని చోట్లా అప్లై కాకపోవచ్చు కానీ అప్లై అవడానికి అవకాశాలు అన్నిచోట్లా వుంటాయి. //‘ఏది వైరల్ ఏది నిజం’// – పత్రికల నెట్ ఎడిషన్లలో హెడింగ్స్ అన్నీ షాకింగ్ లేకపోతే సంచలనం అనే పదాలు లేకుండా ఉండట్లేదు.
LikeLike
బండివారు,
చిన్న సవరణ 🙂
నోటితో వాయించు,చేతిలో రాయి. ఇదే నో.వా.చే.రా పోలసీ అండి 🙂
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
హహ … బాగుంది గురువు గారు.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
రావుగారు , గురువుగారు నోవాచేరా = నోటితో వాగింది చేత్తో మాత్రం రాయకు (రాజకీయాల్లో కెళ్తే పాటించడానికి పెట్టుకున్న పొలిటికల్ ఫిలాసఫీయండి 😁)
LikeLike
చెప్పింది చెయ్యకపోవడమే రాజకీయాల్లో మొదటి మాట కదా 🙂
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
మీ ఫిలాసఫీ చూస్తే మీకు survival instinct బాగా ఉన్నట్లు తోస్తోంది. మీరు పొలిటికల్ రంగానికి చక్కగా సరిపోతారు. దిగండి, All the best 👍. మీరు మాకు బాగా తెలిసిన రాజకీయ నాయకుడే అని మేం చెప్పుకోవచ్చు (అప్పుడప్పుడు పైరవీల కోసం వస్తాం మరి, ఓకే కదా? 🙂) .
https://polldaddy.com/js/rating/rating.js
LikeLiked by 1 person
ఆ ఫిలాసఫీ నోటితో చెప్పిందేనండీ 😃
LikeLiked by 1 person
ఆంధ్రభారతికిని అంతుబట్టని తెల్గు
బామ్మ పద్య మందు పరిఢవిల్లు ,
నారి కేల బడగ నారికేళం బైన
వైన మేమి వింత ? వంత గాక !
LikeLiked by 1 person
“జిలేబి పాకము” 😀. భలే పదం coin చేశారండీ YVR గారూ 👌. ఇది జిలేబి గారికే పూర్తిగా proprietory అన్నమాట 🙂.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
వీఎన్నార్ సర్ , పదం బావుందన్నారు , మరి (ఛందో రహిత) పద్యం గురించి ఏమీ చెప్పరా ?☺
LikeLike
కందము గాకున్నను , ఏ
ఛందము లేకున్న నేమి సారూ ! పద్యం
బందున ‘పాకం’బున్నది ,
అందుననూ ‘బంక’లాగ అతికిందండీ !
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
మాస్టారు మీకు 🙏లు
నాకేమో 👏👏👏👏 ఇవి , మీ మంగళా (పాక😃) శాసనాలు పొందినందుకు.
LikeLike
ఎవరిది “ఛందోరహిత” పద్యం 🙂? నా ఛందోపరిజ్ఞానం “పూర్ణం” 🙁.
కొబ్బరి పీచు ఒలిస్తే రిజల్ట్ ఎలాగైనా వుండచ్చు కదా 🙂.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
—
హా! వింజోవిని పాదముల్గనుచు హాహాహాయనన్ మెత్తురే
మో వీరెల్ల యనంగ హాళినిగనన్ మోగించిగా పాకముల్
మోవుల్దీర్చి యిటన్, జిలేబి గనవే మోదమ్ము బోవంగ, హా !,
వైవీయారుకు మంగళమ్మని జనుల్ వయ్యారముల్బోయిరే 🙂
జిలేబి :)”
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike