మొన్న🚅 🌇అమరావతి🌇✈ లో 🏰🏯(సిని)మాహిష్మతి🏯🏰 పోస్టు రాసి అలా ఇంతే సంగతులు చెప్పానో లేదో జిలేబిగారు “అదురహో” అంటూ ఆశుకవితాస్రవంతి ప్రవహింపజేశారు, పన్లో పనిగా “ఉదరావర్తం” అనే దర్శకేంద్రుడు తప్ప ఎవరూ అర్ధం చెప్పలేని పదం ఒకదాన్ని జనజీవన స్రవంతిలోకి లాక్కొచ్చేసారు. ఈ పదం గురించి వీఎన్నార్ సారూ, నేనూ ప్రశ్నా/సందేహ వృష్టి కురిపించడంతో జిలేబిగారు స్పందిస్తూ అత్యంత అరుదుగా వచ్చే తమ స్పెషల్ ప్ర”వచన” టపాలలో ఒకదాన్ని “ఉదరావర్తం”అంటే సాముద్రిక లక్షణమని వివరిస్తూ వెలువరించారు. ఇందులోనే భాగంగా “ఉదరావర్తా”న్ని సినీజగత్తుకి పరిచయం చేసిన దిగ్దర్శకుడికి ఓ పద్యం కూడా అంకితం ఇచ్చారు. దీనివల్ల నిన్న మొన్నటి వరకూ సినీ యాపిల్స్ & గ్రేప్స్కి మాత్రమే పరిమితమైన దురద కందకి అంటుకుని హీరోయిన్ల మీద కందమూలాలు విసిరే ట్రెండ్ మొదలౌతుందేమో వేచిచూడాలి. అయితే కాస్త తెలుగు మమకారం చూపే దర్శకులు కందపద్యాలు విసిరించే “రిస్కు” కూడా లేకపోలేదని చిన్న ఆశ. అదే జరిగితే ఆ ప్రక్రియకి ప్రత్యేకంగా కందగర్భిత ఉదరావర్తతనియావర్తనం అనే నామధేయాన్ని ఈ సందర్భంగా సూచిస్తూ జిలేబీగారికి అనేకానేక నెనర్లు. ఇంతలో సాక్షాత్తూ లలితా త్రిపుర సుం (సో)దరి “ఇలస్ట్రేటెడ్ బ్లాగ్లీ” అనే టైటిల్ విజయదశమి నాడు ప్రసాదించడం, అందుకు సోదరి చంద్రికగారు తమ శైలిలో బలపరచడం వరసగా జరిగిపోయి మహదానందంగా విజయదశమి కమ్ వీకెండ్ గడిపేస్తుంటే మాస్టారు లక్కాకులవారు –
సారూ ! వైవీయరూ !
మీరైతే అమర పురపు మేలు డిజైనుల్
తీరిచిన నెటువ లుండునొ
సారించి రచించ – చూడ జర మనసయ్యెన్
– – – అన్నారు. ఇకనుంచీ సారూ / గారూ అని కాక వైవీ”యారూ” (హిందీలో యార్ అంటే స్నేహితుడు కదా! అందుకు.) అంటే చాలని వారిని కోరి, సొంత “డిజైన్లు” ఇస్తానని కమిట్ అయ్యాను. ఐతే, సెటైర్లు/కామెడీలు/పేరడీలు చేసినంత వీజీనా ఆంధ్రరాజధానిని నిర్మించడం? అది కాగితం మీదే అయినా సరే. దాంతో బుర్రలోంచి చిన్న ఐడియా (లాంటిది) తవ్వితియ్యడానికే (మట్టిబుర్ర కదా మరి!) ముప్ఫైయ్యారు గంటలు పట్టింది. ఇంక అమరావతి నిర్మాణంలో ఇన్వాల్వ్ అయినవాళ్ళందరూ (నార్మన్ ఫోస్టర్‌తో సహా) ఎన్ని తంటాలు పడుతున్నారో అనిపించింది. మొత్తమ్మీద మట్టిబుర్రలో తయారైన డిజైన్స్ ఇదిగో👇 ఇలా వచ్చాయి –
మొదటగా వచ్చిన ఐడియా అసెంబ్లీ భవనంతో సహా మొత్తం గవర్న్మెంటు అంతా ఓ రెండు భవనాల్లో కూరెయ్యాలని 👇 –
కానీ ఈ డిజైను సేఫ్టీ, సెక్యూరిటీ, మెయింటెనెన్స్‌ల దృష్ట్యా పెద్ద తలనెప్పిగా మారే అవకాశం ఉందని గ్రహించా. అలాంటి బిల్డింగుల్లోకి వచ్చీపోయేవాళ్ళ కోసం కట్టాల్సిన మెట్లూ, లిఫ్ట్‌ల కోసమే ఓ పెద్ద “వైకుంఠం” కాంప్లెక్స్ నిర్మించాల్సి వుంటుంది.రిజెక్ట్ చేసేశా. ఇంకాసేపు బుర్ర బద్దలు కొట్టుకున్నాక ముందుగా ఏ బిల్డింగయినా పర్యావరణహితంగా – ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా – ఉండి తీరాలని నిర్ణయించి ఇదిగో ఇలా స్కెచ్ తయారుచేశా –
ఆ పైన అధికారిక నివాసాలు , ట్రాన్స్పోర్ట్ ఎరేంజ్మెంట్స్ గురించి ఆలోచించా. ఎలాగో ప్రత్యేకపాకేజీగా మోడీ మహాశయుడు అందించిన మట్టి, నీళ్ళని గుర్తు చేసేలాగా మరియు స్తోమత లేనప్పుడు అవలంబించాల్సిన జీవన విధానాన్ని సూచిస్తూ మంత్రుల, అధికారుల నివాసాలన్నీ ఒకే కాంపౌండ్‌లో పర్ణకుటీరాల కాంప్లెక్స్ నిర్మించాలని, అక్కణ్నుంచి అందరూ సైకిళ్ళ మీదే ఆఫీసులకీ, అసెంబ్లీకి, సెక్రటేరియట్‌కి వెళ్లాలని; అమరావతికి ఒకటి, రెండు కిలోమీటర్ల పరిధిలో డీసెల్/పెట్రోల్ వాహనాలు తిరక్కూడదనీ కాన్సెప్టు.
ఇంక అసెంబ్లీ భవనాల విషయంలో “విప్లవాత్మక” నిర్ణయం తీసుకోడం జరిగింది 😆. ప్రభుత్వాలకీ, ప్రతిపక్షాలకీ ఎడ్డెం అంటే తెడ్డెం అనడం ఆనవాయితీ అయిపోయింది కనక ఎవరి అసెంబ్లీ వాళ్లకి కట్టేస్తే ఎవరి గొడవలో వాళ్ళుంటారు + ప్రజాధనం, ప్రభుత్వ సమయం వృధా అవ్వకుండా ఉంటుందని అసెంబ్లీని ఇలా డిజైన్ చెయ్యడం జరిగింది 👇 –

ఇహపోతే రాజధానికి అవసరమైన విద్యుత్ సరఫరా సంగతేంటి? ఇప్పటికే పక్క రాష్ట్రాలతో నదుల నీళ్ళు పంచుకోడం ప్ర(వా)హసనాలు లేకుండా అవ్వట్లేదు. హైడెల్ ప్రాజెక్ట్‌లకి నీళ్ళే సరిగ్గా లేకపోతే ఇంక జల విద్యుత్ మాత్రం ఏఁవొస్తుంది? అంచేత రాజధానికి అవసరమైన ఎలక్ట్రిసిటీ అంతా సోలార్ ఫార్మ్స్ నుంచే రాబట్టాలని డిసైడ్ జేసి ఇదిగో 👇 ఈ ఏర్పాటు సూచిస్తున్నాం –

ఎంతైనా 🌏మట్టిబుర్ర🌦లో 🌱మొలిచిన🌱 ఐడియాలు కదా? రాజధాని హంగులూ, ఆర్భాటాల మీదకన్నా నేలతల్లి మీద ప్రేమే ఎక్కువ కనిపిస్తోంది (అని అనుకుంటున్నాను) కదా?
ఈ పోస్టు రాయడానికి ప్రేరణ ఇచ్చిన మాస్టారు, శ్రీ లక్కాకుల వెంకటరాజారావుగారికి 🙏నమస్కృతు 🙏లతో…
ఇప్పటికిక ఇంతే సంగతులు. బై4నౌ 🙏 😊.
Like this:
Like Loading...
Related
బోల్డన్ని చప్పట్లు – మీ బొమ్మల గీతలకి గమ్మత్తైన రాతలకి 👏👏👏👏
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
@Lalitha TS
మీరు చప్పట్లతో సరిపెడితే ఎలాగండి? ఒక పేకెట్ కరివేపాకు పొడో / పచ్చడో …
jk 😊
LikeLiked by 1 person
ఒక పేకటు కరివేపా
కు!కుదిరిన పొడిగను లేక, ఘుమ్మని యెగబీ
ల్చ కనకనలాడు పచ్చడి
గ కరుణ జూపు లలితమ్మ కరతాళముతో 🙂
జిలేబి
LikeLiked by 1 person
మానాన్నే ! మా నాన్నే !
రెండు అసెంబ్లీలు పక్షానికొకటి పెట్టారు చూడండి అన్నిట్లోకి ఇది బెష్టస్య బెష్టుః !
ఇట్లాంటి అవిడియా లే చేంజస్ లైఫ్ 🙂
చీర్స్
జిలేబి
LikeLike
ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ డిజైన్ కదా! అసెంబ్లీలో, మీడియాలో శబ్దకాలుష్యం వుండకూడదు మరి 😉
LikeLiked by 1 person
హేంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోనియా కాన్సెప్ట్ కూడా మీ డిజైన్లలో చొప్పించండి, పాతకొత్తల మేలు కలయికగా ఉంటుంది 👌. అలాగే మీ “విరచిత” స్కెచ్ లన్నీ ప్రభుత్వం వారికి గినా పంపిస్తిరా ఓ సలహాదారు పదవి రావచ్చు కూడా, గుడ్ లక్ 👍.
“ఇలస్ట్రేటెడ్ బ్లాగ్లీ” అని లలితమ్మ సూచించిన పేరు మార్పు ప్రశస్తమైన సలహా. ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా లేని లోటు తీర్చినట్లుంటుంది.
మీది మట్టిబుర్రేమిటండీ! శ్యామలీయం గారు, లక్కాకుల గారు లాంటి పండితులు మీరని వర్గీకరణ జరిగింది ఇటీవలే. అయితే మీలాంటి వారి సరసన నాక్కూడా చోటు కల్పించబడిందండోయ్ అదేవిటో గానీ నేను పండితుడిని కాక పోయినా. అదృష్టం అన్నమాట 😎.
LikeLiked by 2 people
VNR sir, నెనరులు 🙏. ఇప్పుడు వస్తున్న గ్రీన్ వాల్ , స్కై రైజ్ గార్డెన్స్ లాంటివన్నీ హేంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోనియా కాన్సెప్ట్ నుంచి వచ్చినవేనటండి.
//పండితులు మీరని వర్గీకరణ జరిగింది// వర్గీకరణ అనే బదులు వర్గీ”కరుణ” అనుకోవడమే సర్.
LikeLike
వర్గీ ‘కరుణ’ బావుంది 🙂
LikeLike
@చంద్రికగారు
//వర్గీ ‘కరుణ’ // వుట్టి కరుణ కాదు, అహేతుక కరుణ 😂
LikeLiked by 1 person
తనియావర్తనములతో
మునుగుచు తేలుచు జిలేబి ముకుదాడుగనెన్
వనితల ఉదరా వర్తన
మునకున్ కందము కలిపెను మురువననిదియే 🙂
జిలేబి
LikeLiked by 1 person
అమరాధినాధు లందరు
గమకించుచు సైకిలెక్కి గమ్యము చేరన్
తమ రీగతి విరచించుట
తమరూ సైకిల్ ప్రియులని తలపగ వచ్చా ?
ఇంద్రు డైరావతమ్ము మహేంద్ర గిరిని
డిగ్గి సైకిలు నెక్కునా తగ్గి సారు ,
అక్క టకటా !అవియును హర్మ్యంబులేన ?
అమృతము దొరుకునాయేమి ? అనిమిషులకు ?
హేమిటో ! తమ కిట్లప్ప గించితిమి,మ
రేమొ అక్షయ పాత్ర ధారీయ విభవ
మొలుకంగ దీర్చిరి గద ! సింగ పురము
వాళ్ళకే యిక ఖరారు,తమకు వద్దు లెండి.
LikeLiked by 1 person
//సైకిల్ ప్రియులన వచ్చా ?//1.మాది పర్యావరణ సైకిలేనండి.పొలిటికల్ సైకిలు కాదు.
2.చక్రాలు తిరగని సైకిల్ , కరెంట్ లేని ఫానూ , పెట్రోల్ లేని కారు, సూర్యుడు లేని కమలం వలన లాభం లేదు కదండీ. అందువల్ల దేనిమీదా ప్రత్యేకమైన ప్రీతి లేదు. పని చేసేది, చేస్తే, ఏదైనా ఇష్టమే.
3. పంఖా , పంకజం, పాదచోదితమైన సైకిలు – మూడో దొక్కటే స్వశక్తితో
పని చేసేది . అది వుందో లేదు వేచి చూడాలి మరి.
//ఇంద్రుడు సైకిలెక్కునా?//
తెలుగు నేలపై చంద్రులే కానీ ఇంద్రులు లేరు కదా సార్. ఒక చంద్రుడు కారు ఎక్కాడు, మరో చంద్రుడు నిరంతర సైకిలు వాహనా రూఢుడు, ఇంద్రుడితో పనిలేదు లెండి. 😊
LikeLike
ప్రతిపక్షాల అసెంబ్లీకి సైకిళ్ళంటే ఎలా? వాళ్ళు ఒప్పుకోరు. హెలీకాప్టర్లయితే ఓకే…
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
బోనగిరి గారు, గాలి పంఖా ఐనా , హెలికాప్టర్ పంఖా అయినా పంకజనాధుల చెయ్యి పడకుండా తిరుగుతుందంటారా? 😊
LikeLike
దివంగత నేత గారి పంఖా మీద ఎవరి ‘చెయ్యి’ పడిందో ఎవరికెఱుక?
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
YVR గారు , చక చక మని భలే బొమ్మలు వేసేస్తున్నారే !!
LikeLiked by 1 person
@చంద్రిక గారు
స్మార్ట్ ఫోన్ మహిమతో గీస్తున్న గీతలేనండి, కాయితం మీద చేత్తో గియ్యమంటే అంతే సంగతులు😊 .
LikeLike
సారూ!సైకిల్ చక్రాల్
భారీ కాయులను మోయ బహు కష్టంబౌ ,
వేరే యేర్పా టేదై
నా రయ మొనరింప రాదె ! రామయతండ్రీ !
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
// సైకిల్ చక్రాల్ భారీకాయులను మోయ బహు కష్టంబౌ//
రాజకీయాల్లో ఉంటూ భారీకాయాలు పెంచినవారికి సైకిళ్ళు కూడా ఇవ్వం సార్ 😊. వారికి పాదయాత్రలే రైటు.
LikeLiked by 1 person
సియ్యెం(cm)కూ గుడిసేనా ?
కుయ్యో ! యిందేదొ పెద్ద కుట్ర గలదు , ఏ
మయ్యా ! యీ గుడిసెలలో
‘అయ్య’లు నివసించ గలర ? ఆలోచించూ !
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
గుప్పెడుమట్టీ, చెంబెడునీళ్ళకు
అమరునది గుడిసెలే కానీ
గోపురములు కుదురునే అయ్యలకు
అమరపురమ్మున ఆలోచింపన్ … 🤔
LikeLike
గో-పురములు వద్దులెండి ,
గుడిసెలే మేలు .
మరీ పశువులా యేమి ,
పసుల కొట్టాలలో పెట్టకండి .
LikeLike
ఎంత పర్యావరణ ప్రేమైతే మాత్రం, బొత్తిగా low budget designs ఇచ్చేశారు. ప్రత్యేక పాకేజీ వస్తోంది కాబట్టి, కనీసం ఏనుగులని భారీకాయులకి వాహనాలుగా ఇవ్వండి.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
అన్యగామిగారు, ఎంత అమరావతి అయితే మాత్రం ఏనుగుల్నీ, ఐరావతాల్ని (white elephants) భరించడం ఎలాగండీ? అదీ పాకేజిలో ఏముందో తెలిసిపోయాకా?
LikeLike
పైన తిని తాగి యధికార పక్షపోళ్ళు
చెత్త వేయర ప్రతిపక్ష శిరసుపైన
క్రింది వాళ్ళకు టీనీళ్ళకేని నిధులు
ఇత్తురాయేమి ? యివియేమి యెత్తుగడలు?
ప్రతిపక్షపోళ్ళు లోకువ !
గతిచెడి యధికార పక్ష ఘనులకు క్రిందన్
మతివోవ తన్నుకొనుటకు
జతగూడుదురేమి? సారు!చక్కని యూహే!
LikeLike
< "గుప్పెడుమట్టీ, చెంబెడునీళ్ళకు … "
👌 YVR గారూ.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
ಅಟ್ಲಾ ಕ್ಲಿಕ್ಕು ಲನಿ ಹೈಪರ್ ಲಿಂಕುಲನು
ಮೀರು ನಮೋ ನಮ್ಃ ಚೇಸ್ತೇ
ಎಟ್ಲಾ ಅಂಡಿ ?
ಚೊಉದರಿ ಏಮವ್ವಾಲ ! 🙂
ಜಿಲೇಬಿ
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike