🚅 🌇అమరావతి🌇✈ లో 🏰🏯(సిని)మాహిష్మతి🏯🏰


సినీనటులు తలచుకుంటే ఏమైనా చెయ్యగలరని ఎమ్జీయారూ, ఎన్టీయారూ, పురచ్చితలైవి… ఇలా చాలా మంది ప్రూవ్ చేసేశారు. డైరెక్టర్ల దగ్గిరికొస్తే దాసరిగారు ఓ పక్క సినిమాల్లో  కధ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం-మాటలు-పాటలు-నటన, ఇంకోపక్క పత్రికలూ, మూడోపక్క మంత్రిత్వం చేస్తూ లిటరల్లీ అష్టావధానం చేసేశారు. ఆ తరవాత వెరైటీగా ఉంటుందని పుష్కరాల డైరెక్షన్‌కి ఒకాయన్ని తీసుకొచ్చారు. ఆ మధ్య జరిగిన గోదావరి పుష్కరాలకి చెయ్యాల్సిన ఏర్పాట్లన్నీ ఆగమశాస్త్రోక్తంగా ఒక డైరెక్టర్‌గారు చేశారు. నై, నై చేయించబడ్డారు. జనం కనుబొమలెగరేశారు ముందు. తరవాత, “భగవంతుడికి, భక్తుడికి అనుసంధానం ఎవరు? ఒకప్పుడు పూజారులు, పురోహితులూ. కొంతకాలానికి ఆ స్థానాన్ని అంబికాదర్బార్ బత్తీ ఆక్రమించేసింది. ఇప్పుడిక సినిమా డైరెక్టర్ల వంతన్నమాట,” అనుకుని సద్దుకున్నారు.

సమాజంలో అన్ని రంగాల్నీ సినిమా, సినిమావాళ్ళూ ప్రభావితం చేసేస్తుంటే రాజధాని నిర్మాణాన్ని ఎందుకు చెయ్యకూడదు అనిపించిందో ఏమో ఇప్పుడింక రాజధాని డిజైన్ కూడా సినిమాడైరెక్టర్లే చెయ్యాలని శ్రీ ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ మధ్య తెలుగు చలనచిత్రాల చరిత్రనే తిరగరాసేసిన రెండుభాగాల సినిమా తీసిన ఆ డైరెక్టరే అమరావతిని డిజైన్ చేస్తే ఆం.ప్ర. చరిత్ర కూడా తిరగరాయబడుతుందనో ఏమో తెలీదు కానీ, “సినీజనుల్ చేయగరాని పని యున్నదే ముద్దార చేచేయించినన్?,” అంటూ ఆ డైరెక్టర్ గారికి రాజధాని డిజైన్ బాధ్యత అప్పజేప్పేసారు. ఆయనేమో నాకా సబ్జెక్టస్సలు తెలీదర్రోయ్ అంటున్నా సరే. ఎలా డిజైన్ చేస్తారో ఏంటో అదంతా ఆయన తలనెప్పి కానీ, మన వంతుగా, ఆ ఇంటర్నేషనల్ బ్లాక్-బస్టర్ రెండు భాగాలూ చూసేసిన బాధ్యతగల పౌరులుగా, అమరావతిలో సిని’మాహిష్మతి’ ఎలా పరకాయ ప్రవేశం చేస్తుందో ఊహించుకోవచ్చు. అదే ట్రై చేశానిక్కడ నా గెలాక్సీ నోట్ 5తో. ఐతే, ముందుగా ఇంకో ఇద్దరు సీనియర్ డైరెక్టర్స్ కూడా రాజధాని డిజైన్ చేస్తే ఎలా వుంటుందో చూసి ఆ తర్వాత సూపర్ డూపర్ డైరెక్టర్‌’స్ డిజైన్ చూద్దాం.

మొదటగా – తెలుగుదనాన్ని, కొంటెబొమ్మల్ని, రాములవారిపై భక్తినీ ప్రతి సినిమాలో ప్రకటించే ఆంధ్రుల అభిమాన డైరెక్టర్ ఒకరు డిజైన్ చేస్తే ఇలా👇 ముగ్గులూ, గొబ్బెమ్మలూ, కుటీరాలతో ఉంటుందేమో  –

1

ప్రపంచంలో ఎవరికైనా సగం కొరికిన యాపిల్ పండుని చూస్తే స్టీవ్‌‌ జాబ్స్ ఎలాగైతే గుర్తోస్తాడో, యాపిల్స్, ద్రాక్షపళ్ళూ చూస్తే ఒక సినీడైరెక్టర్ గుర్తొస్తారు. మునుల తపస్సులు భంగం చెయ్యడమే పనిగా పెట్టుకున్న ఒక దేవతపేరు ఆయనకి బిరుదైయ్యింది. అందుకేనేమో యాపిల్స్, ద్రాక్షలూ హీరోయిన్ల మీదకి విసురుతూ సారీ, విసిరిస్తూ  (సినిమాల్లోనే లెండి) ప్రేక్షకుల మతులు చెడగొడుతూ సార్ధకబిరుదాంకితుడైన ఆయన డిజైన్ చేసిన కేపిటల్ సిటీ (దానికీ, ఈయన బిరుదనామానికి విడదీయరాని బంధం) బోర్లించిన బిందెల్లాంటి బిల్డింగ్సూ, పరిచిన రంగురంగుల చీరల్లా కనిపించే రోడ్లతో, అక్కడక్కడా ఎర్రటి యాపిల్సూ (కొన్ని కొరికినవి, కొన్ని కొరకనివి), పంచరంగుల గొడుగులతో… ఇలా 👇 వుంటే ఎవరూ ఆశ్చర్యపోరు –

2

ఫైనల్లీ, ఇప్పుడు నిజంగానే అమరావతిని డిజైన్ చేహేస్తున్నడైరెక్టర్‌గారి డిజైన్లు ఇలాగే 👇 వుండాలని ఆయన అభిమానులం కోరుకుంటే, ఊహించుకుంటే తప్పులేదు. ఎందుకంటే తన సినిమాలతో డోనాల్డ్ ట్రంప్‌కే గుండెదడ పుట్టించిన (పుట్టించాడు(ట) మరి) ఆయన డిజైన్ చేసిన కేపిటల్ సిటీ ఆ మాత్రం ఇదిగా వుండొద్దూ? వుండాలి.

3

5

4

6

ఇంకొక విషయం. అసెంబ్లీ భవనం చుట్టూ కనుచూపు మేరలో తాటిచెట్లు లేకుండా జాగ్రత్త పడతారు ఈ డిజైన్‌లో. ఎందుకంటే ప్రతిపక్షాలవాళ్ళు ఎలక్షన్స్‌లో గెలవకపోయినా తాటిచెట్ల మీంచి మిసైల్స్ లాగా లాంచింగ్ అయిపోయి అసెంబ్లీలోకి వచ్చెయ్యకుండా అన్నమాట.

ఇంతేసంగతులు. బై4నౌ. 😆