(1)స్వ+ఇచ్ఛ=స్వేచ్ఛ=one’s own liberty(2) రామూ-హనుమ యుద్ధం(3) ఒకడికి వాగడం స్వేచ్ఛ, ఇంకొకడికి “ఉతకడం” స్వేచ్ఛ


మొన్న ఫ్రీడం గురించి రాసిన గాంధీగారి🙈🙉🙊కోతులు + 3 కొత్త🐒🐵🐒 కోతులు Monkey’s Message😉 to its Cousins😆 పోస్టుకిది సీక్వెల్. ఈ సీక్వెల్ రాయడానికి స్ఫూర్తి ఆ టపా మీద వ్యాఖ్యలు చూసినప్పుడే వచ్చింది. సబ్జెక్ట్ మీద కాక భాష మీద భలే భలే ఇంటరెస్టింగ్ కామెంట్స్ బోల్డు వచ్చాయి. సరే కామెంటర్ల స్వేచ్ఛ కామెంటర్లది అనుకున్నా. అనుకుని అప్పుడే సీక్వెల్ సగం రాసేశా. కానీ పోస్టు చెయ్యడానికి సరైన సందర్భం ఇప్పుడొచ్చింది. అదేంటో చెప్పక్కర్లేదు. ఈసారి, హోప్ఫుల్లీ, సబ్జెక్ట్ మీదే కామెంట్స్ వస్తాయనుకుంటున్నా.

స్వేచ్ఛని డిఫైన్ చెయ్యడం ఎలా? స్వ+ ఇచ్ఛ = స్వేచ్ఛ = one’s own will or pleasure/ liberty/freedom/independence అని అర్ధం చెప్పుకోచ్చు కానీ అది 100% ఫ్రీడం అనుకోడానికి లేదు. ఈ విశ్వంలోంచి బయటికిపోతే తప్ప. స్వేచ్ఛగా వున్నాయనుకునే పంచభూతాలూ, పశుపక్ష్యాదులూ కూడా ఏదో ఒక లా – physical and / or biological lawని అనుసరించే బతకాలి. ఒకదాని మీద ఒకటి ఆధారపడి వుండాల్సిందే. ఏ ఒక్క వ్యక్తీ తనకి తనే పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చుకోలేరు. ఎందుకంటే బాహ్యంలోనూ, అంతర్గతంగానూ కూడా స్వాతంత్రాన్ని నియంత్రించే శక్తులు – ఫోర్సెస్ – వుంటాయి. ఎవ్విరీ యాక్షన్ హాజ్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది భౌతిక వస్తువులకే కాదు మనుషులకీ, మనసులకీ కూడా వర్తిస్తుంది.

నోరుందికదానని అదేపనిగా తింటే పొట్ట ఒప్పుకోదు. యాంటాసిడో, డల్కోలక్సో మింగే వరకూ గోల చేస్తుంది. తాగితే? నీళ్ళనుంచీ ఆల్కొహాల్ వరకూ ఏది ఎక్కువైనా ఏదో ఒక సమస్య వచ్చిపడుతుంది కదా? ఒక్క నోరు విషయంలోనే అబ్సొల్యూట్ ఫ్రీడంకి ఇన్ని అడ్డంకులున్నాయి. ఎలా పడితే అలా వుండే స్వాతంత్ర్యాన్నిదానికి ప్రకృతే ఇవ్వలేదని తెలుస్తోంది. ఇంకాపైగా నోటిని ఎవరి మీదైనా పారేసుకుంటే వాళ్ళు రివర్స్ అవుతారు. సోది చెప్తే వినలేని జనం ఎవాయిడ్ చెయ్యడం మొదలెడతారు. ఇంక కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు,… ఎట్సెట్రాలకి లెక్కలు తీస్తే? ఆ రకంగా చూస్తే భూమ్మీద ఏ ఒక్కరికీ పూర్తి స్వేచ్ఛలేదు. మనం ఎలా వుండాలని అనుకుంటామో దాన్ని బట్టీ, మనపై ఇతరుల అభిప్రాయం ఎలా వుండాలని కోరుకుంటామో దాన్ని బట్టీ మన స్వేచ్ఛాస్వతంత్రాల్ని నియంత్రించుకుంటాం.

అబ్సొల్యూట్ ఫ్రీడం అనేది నిజంలో లేకపోయినా ఉందని ఫీలైపోయే కేటగిరీలు కొన్నున్నాయి – పిచ్చి ముదిరిపోయిన కేసులు, క్రిమినల్ కేసులు, టెర్రరిస్ట్‌లు + అతివాదులు (ఏ సబ్జెక్టులోనైనా కావచ్చు), గడ్డితినమని బుద్ధిని బైటికి తోలేసినవాళ్ళు, వెర్రితలల సంస్కృతికి అలవాటు పడినవాళ్ళు.

స్వేచ్ఛ, దాని పరిమితుల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో నిర్వచనం.దానికి తగ్గట్టుగానే  ఒక్కొకరూ ఒక్కో పాఠం నేర్చుకుంటారు.

స్వేచ్ఛ అంటే అవగాహన లేనప్పుడు… 

తన సెన్సాఫ్ హ్యూమర్ రాయలవారికే నచ్చాక తక్కిన వారికి నచ్చకపోతుందా అన్న విశ్వాసం తో “తాతా వూతునా?” అని అడిగి మరీ  నందితిమ్మన మీద వుమ్మేసిన రామలింగడికి చెప్పుదెబ్బ, తొస్సిపన్ను తప్పలేదు. అదే అదునుగా తీసుకుని అంతకుముందు అతనిమీద గుర్రుగా వున్న ధూర్జటి రవి కాననిచొ కవి గాంచునే పద్యంతో ముక్కు తిమ్మన రామలింగని మూతి పన్ను చెప్పు దెబ్బతో ఊడిన వైనం లీక్ చేసేశాడు. అంతటితో రామలింగడికి స్వేచ్ఛ, దాని పరిమితులు అనే విషయంపై మంచి అవగాహన వచ్చేసి వుండాలి.

ప్రిన్సిపుల్స్ ప్రకారం స్వేచ్ఛని వాడుకున్నప్పుడు… 

రామ, హనుమంతుల మధ్య యయాతి విషయంలో బేధాభిప్రాయాలోచ్చాయి(ట). ఎవరి స్వేచ్ఛకొద్దీ వాళ్ళు డెసిషన్స్ తీసేసుకున్నాక రాకుండా ఎలా వుంటాయి? అలా అని వాళ్ళిద్దరి డెసిషన్సూ తప్పు అనగలమా? భక్తికి ఉన్న శక్తిని నిరూపించడానికి దేవతలు ఆడించిన నాటకం అనుకుంటే అనలేము. కానీ సామాన్యులకి ధర్మాధర్మ విచక్షణ నేర్పే కధగా తీసుకుంటే – కిష్కింధాపురపు ప్రజాస్వామ్యం అలవాటు పడిన వాళ్లకి విశ్వామిత్రుడి కంప్లైంటుని Suo Motoగా తీసుకుని రాముడు యయాతికి మరణశిక్ష విధించడం కరెక్టు కాదేమో అనిపిస్తుంది. తను కట్టుబడిన న్యాయానికి, రామభక్తికి క్లాష్ వచ్చిన సిట్యుయేషన్‌లో రెండూ వదులుకోలేక న్యాయపోరాటానికి తన భక్తినే ఆయుధంగా వాడుకున్న హనుమంతుడి స్టాండ్ కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఒక్క అబ్జర్వేషన్ – రాముడు, హనుమంతుడు ఎంత పాతకాలం వాళ్లైనా మనకంటే చాలా డెమోక్రటిక్ పీపుల్ అనిపిస్తుంది. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ టీవీ చర్చలు చెయ్యకుండా, మధ్యలో అమాయకుల్ని ఇరికించి ఫాక్షన్ ఫైట్లు చెయ్యకుండా విషయాన్ని తమ ఇద్దరి మధ్యే తేల్చుకునేందుకు సిద్ధం అయ్యారు. రామాంజనేయ యుద్ధం పౌరాణిక వ్యవహారం. ఇష్యూ పొలిటికలా? సోషలా? అనేదానికంటే “నీ బలమా? నామాబలమా…?” అన్న మీమాంసకే ప్రాధాన్యత ఎక్కువ. అంచేత దాన్నలా వుంచి ఈ మధ్య జరిగిన కలియుగ సాంఘిక రామాంజనేయయుద్ధం చూద్దాం.

స్వేచ్ఛని అపహాస్యం చేసినప్పుడు… 

త్రేతాయుగంనాటి  ఋషులు vs. రాజుల ఇష్యూ మీద కాక కలియుగానికి తగ్గట్టు మొన్న అర్జున్ రెడ్డి సినిమాలో లిప్-లాక్ సీన్ల గురించి జరిగిందీ రామూ-హనుమ యుద్ధం. పేరుకు తగ్గట్టు కలియుగ హనుమన్న పోస్టర్లు చింపేస్తే, నాస్తికరాముడు ట్వీటాస్త్రాలు సంధించాడు. ట్వీటు-దండం పట్టిన కలి(యుగ)రాముడు తన పేరులో గోపాలుణ్ణి కలుపుకుని కలియుగ యూత్-ట్రెండ్ ఫాలో అవడంతో ఈసారి విజయం కలి(యుగ)రాముణ్ణే వరించిందనుకోవాలి. “అర్జున్ రెడ్డి ” హిట్టయ్యాడు కనక. దీన్నిబట్టీ స్వేచ్ఛకి లిమిట్స్ సామాజిక ట్రెండ్స్‌ని బట్టీ ఏర్పడతాయని అనుకోవచ్చేమో. ఆ ట్రెండ్స్ డెమోగ్రాఫిక్స్‌ని బట్టీ, ఏజ్ గ్రూప్స్‌ని బట్టీ మారిపోతాయ్. అందుకే తెలివి మీరిన నాయకులు గోడ మీద పిల్లుల్లా కూచుంటారు. యుద్ధం చేసుకున్నవాళ్ళక్కూడా ఎవరి ప్రయోజనం వాళ్ళది. డబ్బులో, పబ్లిసిటీయో, వోట్లో. అంచేత పబ్లిక్ లిప్-లాక్ అవసరమా? కాదా? అనేదసలు సోదిలోక్కూడా కనిపించదు. స్వేచ్ఛ – దాని పరిమితులు పేరిట జరిగిన ప్రహసనం.

వితండవాదమే స్వేచ్ఛ అనుకుంటే…

ఫ్రీడం ఆఫ్ స్పీచ్ / ఎక్స్ప్రెషన్ పేరిట వితండవాదం చేసే స్వేచ్ఛ తమకుందని  కొందరనుకుంటారు. వితండవాదం వరకే అయితే కొంతవరకూ భరించచ్చు. అది వ్యక్తుల్ని, వర్గాల్ని, జీవనవిధానాల్ని కించపరిచే వితండతాండవం అయితే ? కించపడినవాళ్ళకి రియాక్ట్ అయ్యే స్వేచ్ఛ వుండాలి కదా? మనం వితండతాండవం చెయ్యొచ్చుగానీ దానికి ప్రతిగా అవతలవాడు ఉగ్రతాండవం చేసినప్పుడు నాకు బయ్యమేస్తోందంటే ఎలా మాస్టారూ? నిప్పు తొక్కనేల? అరిచి గీపెట్టుటేల? రాయేసే స్వేచ్ఛ మనకున్నప్పుడు మొహం మీద పడే స్వేచ్ఛ బురదకి ఉండకూడదంటే కుదురుతుందా? “నువ్వు నాకు నచ్చావు”లో వెంకటేష్ – “బురదలో రాయేసే ముందు బట్టలన్నీ విప్పేసి అప్పుడు వెయ్యాలం”టాడు. స్వేచ్ఛ పేరుతో నోటిదూల ప్రదర్శించే ముందు ఈ డైలాగు గుర్తుంచుకుని జాగ్రత్తగానైనా వుండాలి లేదా బురద అంటించుకునేందుకు / బురదలో ములిగేందుకు  సిద్ధంగానైనా వుండాలి.

జునిచిరో కోయిజుమీ జపాన్ ప్రధానిగా ఉన్నప్పుడని గుర్తు – ఇష్యూ ఏంటో గుర్తులేదు – జపాన్‌వాళ్ళు చైనా మనోభావాలు దెబ్బదీసారు. చైనావాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారంటే జపనీస్ ఎంబసీ / హై కమిషన్ ఆఫీసులు చైనాలో ఎక్కడుంటే వాటి మీద ప్రజల చేత దాడులు చేయించి డామేజ్ చెయ్యడం మొదలెట్టారు. దెబ్బకి జపాన్ వెనక్కి తగ్గింది. తగ్గాల్సొచ్చింది, మళ్ళీ అలాంటి నోటిదూల ప్రదర్శించినట్టు లేదు. ఉష్ణం ఉష్ణేన శీతలం అన్నట్టు నోటిదూల చేతివాటేన నియంత్రితం అని చైనా చూపెట్టింది. మనకిష్టమొచ్చినంత స్వేచ్ఛ ఇష్టం వచ్చినట్టు వాడుకోవాలంటే ఎగస్పార్టీక్కూడా అదే డిమాండూ, హక్కూ ఉండవా మరి? ఇష్టం వచ్చినట్టు వాగడం ఒకడికి స్వేచ్ఛ అనిపిస్తే ఇష్టం వచ్చినట్టు “ఉతకడం” ఇంకొకడికి స్వేచ్ఛ. కాదనే స్వేచ్ఛ ఎవరికుంది?

మొత్తమ్మీద అర్ధమౌతున్నదేంటంటే –

(1) అబ్సొల్యూట్ ఫ్రీడమ్ అనేది ఈ ప్రపంచంలో కుదిరే విషయం కాదు.

(2) మనం అనుభవించే స్వేచ్ఛ, ఏ విషయంలోనైనా సరే, కొన్ని పరిమితులతో కూడుకున్నదే. అంచేత, ఒకరి స్వేచ్ఛ హరించడం ఎంత తప్పో ఉన్న స్వేచ్ఛని దుర్వినియోగం చెయ్యడం అంతే తప్పు.

(3) పరిమితులలో తేడాలు ఉండొచ్చు కానీ పరిమితులు లేకపోవడం అనేది ఇంపాజిబుల్.

(4) స్వేచ్ఛ అనేది అందరికీ కామన్ కావచ్చు కానీ దాన్ని ప్రదర్శించే మెథడ్స్ కామన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకడి పధ్ధతి వాగడం అయితే ఇంకొకడి పధ్ధతి “ఉతకడం” కావచ్చు. దేర్-ఫోర్, యూజ్ ఫ్రీడమ్ ప్రాపర్లీ & సేఫ్‌లీ. ఎందుకంటే వాగేవాడికి వినేవాడు లోకువ కావచ్చు. కానీ “ఉతికేవాడి”కి వాగేవాడు లోకువ.

ఇంతే సంగతులు. బై4నౌ 🙏

 

 

 

 

 

 

 

 

 

 

40 comments

 1. ఎప్పటిలాగే స్వేచ్చని దుర్వినియోగం చేసేవాళ్ళని సోదాహరణంగా ఉతికేసారు. ఇవన్నీ నాకు నచ్చిన లైన్లు. మొత్తం మీద లా అండ్ ఆర్డర్ లేని వ్యవస్థ బాగా వృద్ధి చెందుతోంది.

  ఆ రకంగా చూస్తే భూమ్మీద ఏ ఒక్కరికీ పూర్తి స్వేచ్ఛలేదు.
  వాగేవాడికి వినేవాడు లోకువ కావచ్చు. కానీ “ఉతికేవాడి”కి వాగేవాడు లోకువ.

  Liked by 1 person

  1. అన్యగామిగారు, థాంక్యూ. మీకు నచ్చిన లైన్లని ప్రత్యేకంగా చెప్పడం మంచి ఎంకరేజ్‌మెంట్ నాకు 🙏 .

   Like

 2. Your liberty to swing your fist ends just where my nose begins` అని ఒక ఆంగ్ల కొటేషన్. ఇది physical sense లో చెప్పబడినది. అయినా వాక్స్వాతంత్ర్యం గురించి కూడా ఓ రకంగా అన్వయించుకోవచ్చు. అయితే ఇప్పటి కాలంలో ఇటువంటి సూక్తుల్ని పట్టించుకోవడం లేదు లెండి. దేనికైనా సరే my choice అని తలెగరేయడమే.


  https://polldaddy.com/js/rating/rating.js

  Like

 3. ఎదుటివాడిని నాలుగు దెబ్బలు కొట్టాలనుకుంటే ఎదుటివాడి నుండి ఓ రెండు దెబ్బలైనా తినడానికి సిద్ధపడాలి.


  https://polldaddy.com/js/rating/rating.js

  Like

 4. “రామ, హనుమంతుల మధ్య యయాతి విషయంలో బేధాభిప్రాయాలోచ్చాయి(ట)” అన్నారు పైన.
  యయాతి రామాంజనేయుల కాలం నాటి వాడంటారా?


  https://polldaddy.com/js/rating/rating.js

  Like

  1. విన్నకోట వారు, 🙏. వ్యాఖ్యలకు నెనరులు. మహాభారతంలో యయాతి, ఈయన ఒకరు కాదనుకుంటానండి. రామాంజనేయ యుద్ధం కల్పితకధ కదా, ఒకరవ్వటానికి ఛాన్సే లేదు.

   Like

  1. అవును గురువుగారు. న్యూటన్ సూత్రం ప్రకారం వస్తువుల విషయంలో రియాక్షన్ తక్షణం ఉంటుంది. మనుషుల దగ్గరకొచ్చే సరికి ఒక తరం యాక్షన్ కి మరో తరం రియాక్ట్ అవుతుంది లేదా రియాక్షన్ కి గురౌతుంది. యాక్షన్-రియాక్షన్ మధ్య శతాబ్దాల గ్యాప్ ఉండొచ్చు కూడా.

   Like

 5. స్వేచ్ఛ గురించి ఆల్రెడీ ఓ మారు
  అలరెడి కా మంటలతో వాచి పోయామండీ 🙂
  అందుకని ఇకమీదట (అంటే యీ పారి :)) దీని మీద అనగా స్వేచ్చ , స్వేఛ్చ, స్వేచ్ఛ మీద నేనేమి చెప్పదలచు కోలేదని
  మీ బ్లాగ్మూలకమ్నుగా వాంగ్మూలము
  యిట్లు
  దాఖల్ చేయువారు
  జిలాలంగడి
  జిలేబి


  https://polldaddy.com/js/rating/rating.js

  Like

 6. మీ కోరిక నెం దు కు కాదనడం 🙂

  గమనిక యిందుమూలముగా వచ్చు సకల కలహమ్ములకు యీ బ్లాగ్ వారే పూచి‌:)

  కొట్టాలమ్మి ఘనంబుగాను పదముల్ కొంకర్లు బోవన్ జనుల్
  చెట్టూపుట్టల వారు బట్ట వలెనౌ చెంగావి రంగుల్ గన
  న్నట్టాయిట్టని పూనకమ్ము ల భళీ నాట్యంబులాడన్ వలెన్
  పట్టమ్మా విను ఛాచిఛీ యనుచు రాపాడన్ దగున్ సర్వదా

  జిలేబి

  https://polldaddy.com/js/rating/rating.js

  Like

  1. సర్, రెండు కారణాలు. (౧) శంకరాభరణం బ్లాగులో వారికి 👌లు, 👏లు వస్తున్నాయని (౨) ఆ పద్యాలు అలవాటై, ఇప్పుడు వచనం అర్ధంకాక 😊

   Like

    1. జిలేబిగారు, జవాబు చెప్పక తప్పదన్నాక, మీరు నారదాయనమః అనేస్తే? అసలే నారదులవారు ఆవురావురంటున్నార్ట ఆకలితో, 😉 . దేర్‌ఫోర్ మా బాసు పాలసీ –
     ప్రియం బ్రూయాత్ సత్యం బ్రూయాత్ | న బ్రూయాత్ సత్యం OR అసత్యమప్రియం 😆 – ఇదే ఫాలో అయిపోతాను 🙈

     Like

     1. అద్గదీ 🙂

      ఇప్పుడు రాముడు మంచిబాలుడు 🙂

      నారదా !
      జిలేబి

      Like

 7. అడిగి మరీ పద్యాలు కట్టించుకునేవారు కూడా ఉన్నారా!!?

  Like

  1. //బతుకంతా స్పీడు కతన…// లక్కాకుల సర్, విశ్లేషణాత్మకపద్యం, వేడిగా, వాడిగా వుంది. నెనరులు🙏.

   Like

 8. భలేవారండి

  వాల్మీకి బుర్రలో కథ మొత్తాన్ని జొనిపి సుప్రా లెవల్ ప్రొగ్రామ్ మేనేజ్మెంట్ చేసిన స్పేస్ స్పెషలిస్ట్ నారదుల వారు కాదూ ? కతలో రాకుండానే కత మొత్తాన్ని నడిపినవాడు కాదూ ?

  వ్యాసుల వారైతే పాపం హాండ్ హోల్డింగ్ ఫక్తు ప్రాజెక్టు మేనేజరు ; కతలోకి వస్తూ పోతూ తంటాలు పడిపోతూ … అపసోపాలు పడిపోతూ వచ్చిన భూగ్రహ వాసి 🙂

  చీర్స్
  జిలేబి

  Like

  1. @Zilebi, మీరిలా క్రెడిట్ అంతా నారదమహర్షి ఎకౌంట్‌లో వేసేస్తే (వేసేసుకుంటే😊) ఎలాగండీ? వాల్మీకికి మొదట స్ఫూర్తినిచ్చింది క్రౌంచపక్షిని కొట్టినతననైతేనూ? ఆ తరవాతేగా నారదులవారి ఎంట్రెన్సు?
   వ్యాసులవారి సంగతి కరెక్టే. కధ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం+ కధ ఆగిపోయినప్పుడల్లా ముందుకి నడిపే గెస్ట్ రోల్

   Like

   1. Project Essentials
    మరిచిపోతే ఎట్లాండీ 🙂

    రామాయణము మరియొక
    మారు చదువుడూ 🙂

    Valmikiramayan.net

    జిలేబి

    Like

    1. //Project Essentials మరిచిపోతే ఎట్లాండీ//
     జిలేబిగారు, ఆ ఘట్టం మళ్ళీ చదివాను. మీరు చెప్పిన సీక్వెన్సే కరెక్టు👏👏.
     Just want to share my renewed perspective –
     వాల్మీకి రామాయణం రచనకి దారితీసిన కారణాలు, నాలుగు కనిపిస్తున్నాయి –
     ౧) పరిపూర్ణ మానవుడెవరైనా భూమ్మీద వున్నాడా అన్న వాల్మీకి మీమాంస. ఆయనకీ ఆకాంక్ష ఎందుకు కలిగిందో అనేది మొదటిది, అతిముఖ్యమైనది ఐన కారణం.
     ౨) ఈయన మైండులో Receptivity ఏర్పడగానే నారదులవారు మీరన్నట్టు ప్రోగ్రామింగ్ చేసేశారు.
     ౩) రచనకి అవసరమైన గ్రామరూ, మీటరూ, ఫీల్, జీల్.. ఇవన్నీ క్రౌంచాన్ని పడగొట్టి కిరాతుడు కలిగించాడు.
     ౪) ఆ తర్వాత బ్రహ్మ వచ్చి Project Essentials కన్ఫర్మ్ చేసుకుని పచ్చజెండా చూపించాడు.
     నరజాతి పరిణామంలో సత్యం, ధర్మం ముఖ్యపాత్ర ధరించే క్రమంలో దైవసంకల్పం – మానవ ఆకాంక్ష/ప్రయత్నం coincide అయిన అరుదైన సందర్భం ఇది అనిపించింది.పరిపూర్ణమానవుడికై వాల్మీకి తపించి ఉండకపోతే “సీతకి రాముడేమౌతాడు?లో ఆరుద్రగారు ఉదహరించిన రకరకాల రామాయణాల్లాంటిదే ఇంకోటి రాసివుండేవాడేమో? 🙏

     Like

      1. చెప్పుకోవడమేనా? ఏకంగా పుస్తకం రాసేసే ప్లాన్ లో వుంటేనూ !! ముందు పద్యాల్రాయడం నేర్చేసుకుని …..😆😆😆

       Liked by 1 person

  1. మాస్టారు, రాములవారికి యుద్ధాలు బోరుకొట్టి జాంబవంతుడు యుద్ధం కోరితే కృష్ణావతారానికి పోస్టుపోన్ చేశాడు కదా? ఇంక నారదులవారితో ఒప్పుకుంటాడా? అదేదో కృష్ణావతారానికి ఔట్-సోర్స్ చేసెయ్యండి.😊😊😊

   Like

  2. హమ్మయ్య

   ఒక క్రౌంచము బుట్టలో పడెను
   మిగిలిన క్రౌంచములకై ఎదురు చూతము

   రామ నారద మహా యుద్ధము మొదలు 😦

   జిలేబి

   Like

   1. అది క్రౌంచమో లేక నారదుని బుట్టలో వెయ్యుచున్న వారి తాతగారు, శ్రీమహావిష్ణువో? ఇంతకీ రాములవారెక్కడ?😊😊

    Like

 9. వచ్చెడునేమి రాఘవుడు ? వాలియు , రావణ రాక్షసాదిగా
  చచ్చిరిగాని , బంటుదెస చాలదు రాముని శక్తి , యుక్తి – మా
  పొచ్చెము గల్గు నారదుల పోడిమి ముందర మాధవుండు రాన్
  రచ్చలు గల్గుగాని , యవురా ! గెలుపేది ? తలంచి చూచినన్ .

  Liked by 1 person

 10. –చెప్పుకోవడమేనా? ఏకంగా పుస్తకం రాసేసే ప్లాన్ లో వుంటేనూ !! ముందు పద్యాల్రాయడం నేర్చేసుకుని …..😆😆😆

  ఇంకేం ప్రొసీద ! ప్రొసీద!
  విజయదశమి వస్తోంది
  శంకరాభరణం లోని కి
  ప్రొసీద ! ప్రొసీద ! ప్రయచ్చ ప్రయచ్చ 🙂

  చీర్స్
  జిలేబి

  https://polldaddy.com/js/rating/rating.js

  Like

  1. //శంకరాభరణం లోనికి ప్రొసీద ! ప్రొసీద !//
   అమ్మో! శంకరాభరణంలోకే? సోమయాజులు – చంద్రమోహన్‌ (రిషభం vs. వృషభం 🙂 ) ఎపిసోడ్ ఇంకా గుర్తుందండీ. 😊

   Like

   1. అబ్బే

    భయపడ మాకండి . xమయాజుల లాంటి వారిని దరిచేర నీయకుండా అడ్డు చక్రము వేసె పూచీ నాది.

    ప్రొసీద ప్రొసీద
    ప్రో, యిచ్చ ; ప్రో యిచ్చ !

    చీర్స్
    జిలేబి

    Like

    1. వర్డు ప్రెస్సులో
     కామంటల
     కాంతి తగ్గించు
     మాపకదళమున్నదా !

     తెలియక పోయెనే !

     హా! ‘ఏక్సూ ‘ 🙂

     జిలేబి

     Like

     1. కా’మంట’లుపెట్టే నారదా!
      మంటలనార్పేదీ నారదమే కాదా?😊
      అరెరే! కందవిశారద
      కోరిక నేటికి తీరదా?😊

      Like

      1. కా “మింటుగ” మార్చెదమోయ్
       ఓ మారటు యొజ్జ యిచ్చె నోటీసుగదా !
       కా “మంటలు” పెట్టు జిలే
       బీ! మంద బుధులము గాము బిరబిర నొక్కన్ 🙂

       జిలేబి

       Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s