క్లియరసిల్ అమ్మాయి మొహంపై మొటిమల్లా ; దిష్టిగుమ్మడికాయ మీది చారల్లా; నక్సలైట్లకి అధికారం యిచ్చే తుపాకీగొట్టంలా; ఇసకమాఫియా తవ్వేసిన గోతుల్లా….


ఈ ప్రపంచానికో దుర్గుణం వుంది. ఏ ఒక్క కంటికీ ఒక్కలా కనబడదు. టెర్రరిస్టులకీ, ఛాందసవాదులకీ, పెద్ద మార్కెట్ కేపిటలిస్టులకీ తప్ప. ఇంక మిగిలినవాళ్ళు మనుషులు. వీళ్లకి సంబంధించినంత వరకూ మాత్రం – చూసే కంటిని బట్టి ప్రపంచ స్వరూపం మారిపోతావుంటది. నీళ్ళు గ్లాసులో పోసినప్పుడు గ్లాసు షేపు లోనూ, తొట్టెలో పోస్తే తొట్టె ఆకృతిలో, ఎందులోనూ పోయ్యకపోతే వాటిష్టం వచ్చిన ఆకారంలోనూ – ఇలా రకరకాల రూపాల్లో కనపడినట్టే ఈ ప్రపంచకం గూడా వేరు వేరు విధాలుగా కనిపిస్తావుంటది. అయితే నీళ్ళలా బిహేవ్ చేసే గుణం ఒక్క ప్రపంచానిదే కాదు, దాన్ని అబ్జర్వ్ చేస్తన్న కళ్ళగ్గూడా వుంటది. అయ్యిగూడా ప్రపంచంలో భాగమే కదా మరి! మెదడు, దాని ఆలోచనా ఇధానాన్ని బట్టీ కళ్ళకుండే దృష్టిగూడా మారద్ది. మెదడు, అందట్లో పంజేసే మనసు – ఈ రెండింటీ మీదనా ఆటి చుట్టూత వుండే పరిస్థితులు – అంటే అలవాట్లు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆటితోబాటు కొసరుగా వచ్చేటి చట్టుబండలూ ప్లస్ చరిత్రా .. ఈటన్నింటి  ప్రెబావం పడతది. పడిందాని ప్రెకారవేఁ మెదడూ, మైండు పన్జేస్తంటయి. అయ్యెట్టా జూడమంటే అట్టా కళ్ళు సూస్తుంటై. ఎగ్జాంపుల్, ఫరెగ్జాంపుల్ చందమామలో మచ్చుండది గదా. అది కొందరికి కుందేల్లెక్క, ఇంకొందరికి జింక లెక్క, ఇంకాఇంకా కొందరికి ఏకులు వడికే ముసలవ్వ లెక్క గనపళ్ళే? అట్లెందుకు గనపడినై? ఎందుకంటే ఆ చూసినోళ్ళ మనసుల దేని ప్రెభావం ఎక్కువుంటే ఆ లెక్కన కనబడిందనుకోవాలె. మడుసులింకా యేటాడి తినే దశలో ఆళ్ళకి చంద్రుడి మచ్చ కుందేలులెక్కనో, జింకలెక్కనో కనబడుంటది. కొద్దిగా నాగరికత పెరిగినంక అంటే బట్టలు నేసుడు, కట్టుకొనుడు మొదలైనంక ఏకులొడికే అవ్వలెక్క కనబడుంటది. అంటే ఆ కాలంల ముసలమ్మలకు ఏకులు వడకడం ఇప్పుడు లేడీస్‌కు టీవీ సీరియల్స్ జూసినంత ఫేవరెట్ యాక్టివిటీ అయ్యుండాల. ఆ తర్వాత సైంటిస్టులు దప్ప మామూలు జనాలు పెద్దగా చందమామను పట్టించుకోలేదనుకోవాల. లేకుంటే ఇంకా రకరకాల షేపులున్నట్టు చెప్పుకునేటోళ్ళమేగద! ఎందుకట్లా అంటే, తరవాత కాలంలో జనాలు యుద్ధాలు, యాగాలు, ప్రబంధాలు, రిజర్వేషన్లు, డొనేషన్లు, వోట్-బాంకులు, ఉద్యోగాలు, ఉద్యమాలు, సత్యాగ్రహాలు, బందులు, బిగినెస్సులు, సినిమాలు,…. గట్రా గంద్రగోళం ఎక్కువై చంద్రగోళం వైపు చూడడమే మర్చిపోయుంటారు. మార్కస్ బార్ట్లేలాంటి గొప్పోళ్లు చూపించే ఫోటోజెనిక్ చందమామలకీ, సినీతారల మేకప్పుల్లోంచి విరుచుకుపడే వెన్నెలకీ అలవాటుపడిపోయారనుకోవాలె. లేగపోతే ఈ నాటికి చంద్రుడి మచ్చలో –

క్లియరాసిల్ ఎడ్వర్టైజుమెంటు అమ్మాయి మొహంలో మొటిమల్లాగా

ఇళ్ళముందు కట్టే దిష్టిగుమ్మడికాయ మీది చారల్లాగా

నక్సలైట్లకి అధికారం తెచ్చిపెట్టే తుపాకీ గొట్టంలాగా

మాఫియావాళ్ళు నదీతీరాల్లో ఇసక తవ్వేసాక ఏర్పడిన గోతుల్లాగా

ఏపీ స్పెషల్ స్టేటస్‌లాగా

తెలంగాణలో నిజాం కీర్తిలాగా

— ఏదో ఒక కొత్త షేపు కనపడేదిగదా?

ప్చ్! నరజాతిలో కళాపోషణ కరువైపోతావుంది, ఇప్పుడెట్టా అని నిట్టూర్చాల్నా?

అక్కర్లేదనుకుంటన్నా, మొన్న నాకు జరిగిన ఎక్స్పీరియెన్సు తరవాత. అదేంటంటే –

ఒక శనోరం, మధ్యానంపూట కెమేరా ఒకటి మెళ్ళోబడేసుకుని, బైటికిపోయినా. ఇంటికి దగ్గర్లోనున్న వరదనీళ్ళ కాలవ ఎమ్మటే పోతుంటే అదిగో ఆ👇ఆఫ్రికన్ తులిప్ చెట్టు కనబడ్డది. పచ్చటి ఆకుల మధ్య తియ్యటి జాంగ్రీలు యేళ్ళాడుతున్నట్టుందే అనుకుంటా దగ్గరికిబోయి రెండు ఫుటోలు దీసినా.

Palasa1

Palasa1-1దగ్గర్నుండి జూస్తా వుంటే నిజంగనే జాంగ్రీల మాదిరే వుండి నోరు వూరిపోతావుంది. మనసులో జాంగ్రీలు మెదుల్తావుంటే ఆ రంగులో ఏదున్నా కళ్ళకు జాంగ్రీలే కనిపిస్తై. దృష్టిని బట్టీ సృష్టి అంటే ఇదేగందా మరి? ఇంతలో చెట్టునుండి జాంగ్రీలు యేళ్ళాడుడేంది, ఈ కళాపోసనేందని చిరాకొచ్చింది. కానీ దాన్ని తగ్గిస్తా ఇంకో ఐడియా ఎలిగింది. ఆకుపచ్చని ఆకులు, ఆటిపైన కాషాయరంగులో వెలుగుతా ఆ మోదుగుపూలు, ఎనక అశోకచక్రాన్ని తలిపిస్తా ఆకాశపు నీలం రంగు… అరె ఇండియన్  జెండాకిక తెలుపు రంగు తగ్గిందే అనుకుంటా జూస్తుండా, అప్పుడు కనబడ్డాడు ఆకాశానికి ఆ సివరన “అర” ఇరిసిన అర్ధచంద్రుడు.DSC_0671అప్పుడేమనిపించిందో జెప్తే నిజంగా షాకే. ఐనా జెప్పెస్తా.  ప్రెకృతి నిండా భారతీయ వర్ణవ్యెవస్థ – అయ్‌బాబోయ్! యేదాల్లోనో, ఎక్కడో జెప్పిన ఆ వ్యెవస్థ అనుకోబాకండి, నేజెప్పేది  మన జెండాలో వుండే అన్ని రంగులూ ఈ మధ్యాన్నపేళ  ప్రెకృతిలో కనబడతన్నాయని. సూసే కంటిని బట్టీ ప్రెపంచం రూపు మారతావుంటదంటే ఇదే మరి. ఇట్టా చెబుతావుంటే అనిపిస్తంది, ఆ యేదాల్లో  చెప్పిన వర్ణవ్యెవస్థ  మన జెండారంగుల వ్యెవస్థ ఎందుగ్గాగూడదూ అని.

త్యాగాలు చేసి దేశానికి, సంఘానికి ఆదర్శంగా నిలబడేవోళ్ళు,

అందరికీ అందర్నీ సమానంగా జూడడం నేర్పిచ్చి సంఘాన్ని శాంతింపజేసేవోళ్ళు

పంటలు పండించి, ప్రెకృతిని కాపాడి దేశాన్ని పచ్చగా వుంచేవోళ్లు

మంచి-చెడుల విచక్షణ కోల్పోకుండానే కాలంతోపాటుగా మారేలా సంఘాన్ని తీర్చిదిద్దేవాళ్ళు

— మడుసుల్లో ఈ నాలుగు వర్ణాలు వుండనేవున్నాయి గందా? ఆ పాత వర్ణవ్యెవస్థని ఈ రకంగా మార్చుకోరాదా అనిపిస్తా వుంది. “నువ్వు నోరు ముయ్యరా అబ్బాయా! బగమంతుడు జెప్పింది మనమెట్టా మార్చేదిరా?,” అంటరా? అట్టయితే మరి బగమంతుడు జెప్పిన మొత్తం అన్ని మంచిపన్లుగూడ జేయ్యండబ్బాయా!! జేస్తున్నారా అంట?……………………………

అదండీ కత. దృష్టి మార్చుకుంటే సృష్టి కూడా మారతది, బగమంతుడికి యే అబ్జెక్షనూ వుండదూ అని  ఒక్క మధ్యాన్నం పూట వాకింగులో ఇట్టా తెలిసొచ్చింది.

అంతే కాదండోవ్! ఆ ఫోటోలో వున్న చందమామ బొమ్మని ఎన్-లార్జ్ చేస్తే –

Chandamaama

ఆయన మొహమ్మ్మీద మచ్చల్లో ఏదో అస్పష్టమైన కొత్త రూపం కనబడింది. దృష్టి మారితే సృష్టి మారుతుందనే మాటని మళ్ళీ ఋజువు చేస్తున్నట్టు, ఇప్పుడు కుందేళ్ళూ, జింకలూ, ముసలవ్వలూ కాదు. నా దృష్టిని ఆకర్షించిన చోట గీతలు గీస్తూ పోతే ఇదిగో ఇలా  –

Emojimaama

ఈనాటి సోషల్ మీడియా యుగానికి తగినట్టు, ఒక ఎమోటికాన్‌లా. అవును మరి ఇప్పుడు మనిషి దృష్టి ప్రకృతి, పశుపక్ష్యాదుల మీదా లేదు. చేతి వృత్తులూ, రైతన్నలూ, నేతన్నల మీదకూడా లేదు. వీళ్ళ విషయంలోనూ దృష్టి మారాలి. మరి మారుతుందా? ఏమో మరి? చందమామని మామలా, దాయిదాయిలా, జాబిల్లిలా, నెలబాలుడిలా, వెన్నెలఱేడులా, చల్లనివాడులా మళ్ళీ చూస్తామా? అలా చూడాలంటే మన దృష్టి అలా వుండాలిగా? వుందా?

😊ఇంతేసంగతులు😊

బై4నౌ

 🙏

 

 

 

8 thoughts on “క్లియరసిల్ అమ్మాయి మొహంపై మొటిమల్లా ; దిష్టిగుమ్మడికాయ మీది చారల్లా; నక్సలైట్లకి అధికారం యిచ్చే తుపాకీగొట్టంలా; ఇసకమాఫియా తవ్వేసిన గోతుల్లా….”

 1. మీరు వ్రాసిన దాన్ని బట్టి జూస్తే మిమ్మల్ని నాలుగవ తరగతి లోనే వేయాలనిపిస్తుంది. ఏ తరగతిలో ఉన్నామన్నదంట్లో తిరకాసులేదండీ మొదటి తరగతిలో ఉన్నవాళ్ళే గొప్పోళ్ళు అని గిరిగీస్తేనే తిక్క లేస్తది. నాలుగవ తరగతి వాడు మొదటి తరగతి కి చేరకూడదా ? మొదటి తరగతి వాడు మొదటి తరగతిలోనే పుట్టడం నా జన్మ హక్కు అనడం వల్లనే వస్తుంది తంటా ! మొదటి తరగతిలో పుట్టినా నీచ్, కమీనే, కుత్తే గాళ్ళతోనే పోరాటం ! పాకిస్థాన్ లో పరం వీర్ చక్ర లు ఉండరేమిటండీ ? వాళ్ళని మొదటి తరగతి లో వే(యనిస్తా)స్తారా ?

  Like

  1. నీహారికగారూ, నాలుగో తరగతిలో వేసినందుకు నెనరులు, కానీ తరగతిలో ఒకరు వెయ్యడం అనే పధ్ధతి వల్లే కదా గొడవంతా. ప్రస్తుతకాలానికి అనుగుణంగా అందరూ అన్ని తరగతులూ చదవాల్సిందే. తప్పదు.
   //గిరిగీసుకోవడం//
   గిరి గీసుకునే గుణం కొందరిలో వుందంటే పక్కనే గిరి గీసుకోనిచ్చే తెలివితక్కువతనమో , అమాయకత్వమో ఉండబట్టే కదా! ఆ లోపం సరిదిద్దుకోనంతవరకూ గిరి గీసేవాళ్ళు, గీసుకోనిచ్చేవాళ్ళూ స్థానాలు మారుతూవుంటారు తప్ప, గిరిగీతలు, తరగతులూ పోవు.
   //నీచ్, కమీనే, కుత్తే గాళ్ళతోనే పోరాటం// తరగతులు పోయినంత మాత్రాన వీళ్ళు పోతారనే గారంటీ ఏ మాత్రం లేదండి. ఏ తరగతిలో పుడితేనేం, మనిషి మనసులో నీచత్వం, అల్పత్వం, వ్యాపార మనస్తత్వం పోనంతవరకూ ఏంటి లాభం? కులాలు, మతాలూ లేని సొసైటీల్లో అవినీతిపరులూ, చైల్డ్-ఎబ్యూజర్స్, హ్యూమన్ ట్రాఫికర్సూ, క్రిమినల్సూ లేరా?
   //పాకిస్థాన్ లో పరం వీర్ చక్ర లు// దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమీ లేదండి. మనుషుల్లో తరగతులు, గిరిగీతలు పోతే ఏదో ఒక నాటికి దేశాలు, సరిహద్దులు కూడా పోతాయి.

   Like

 2. ఈ తరగతులు గురించి అప్పట్లో భగవద్గీతలో వ్యాసుడు వ్రాస్తే ఇక్కడ బ్లాగుల్లో మీరు వ్రాసారు కాబట్టి మిమ్మల్ని నాలుగవ తరగతిలో వేసేసాను. అదే ఎవరయినా నన్ను నాలుగవ తరగతిలో వేస్తానంటే ఊరుకోను కదా ? తెలివితేటలను బట్టి మొదటి తరగతి లభిస్తుందా ? తెలివి తక్కువ వాళ్ళు నలుగవ తరగతిలోనే పుడతారా ? తెలివితేటలకు గీటురాయి ఏమిటీ ?

  Like

 3. చూచెడు కనులకు తెలియును
  కాచిన వన్నియు ఫలముల కర్మఫలములా
  ఓ చినదాన! జిలేబీ
  యోచన జేయన్నఖండ యోగంబిదియే !

  జిలేబి

  Like

 4. //ఈ తరగతులు గురించి అప్పట్లో భగవద్గీతలో వ్యాసుడు వ్రాస్తే ఇక్కడ బ్లాగుల్లో మీరు వ్రాసారు కాబట్టి…//

  నీహారికాజీ, టపాలో నా భావం సరిగ్గా వ్యక్తం చెయ్యలేదేమో అనుకుంటున్నా. జస్ట్ టు క్లారిఫై, నా ఉద్దేశం అసలు తరగతులు అనేవి మనిషి పట్టించుకోవాల్సిన విషయం కాదు. దేవుడే అలా విడదీశాడని చెప్పాడంటే ఏదో తిరకాసు వుండే వుంటుంది. అందరిలో సమానంగా వుండే దేవుడు విభజించి పాలిస్తాడా?
  దేవుడు చెప్పింది మనిషి సరిగ్గా అర్ధం చేసుకోలేదు. అంతే.
  ప్రకృతిపరంగా వచ్చిన శక్తిసామర్ధ్యాల ప్రకారం జీవరాసుల్లో ఒక వ్యవస్థ ఏర్పడుతుంది కదా. అలాగే మానవజాతిలో కూడా సామాజిక అవసరాలని బట్టీ, అవి తీర్చే స్కిల్స్ & కేపబిలిటీస్ బట్టీ ఒక వ్యవస్థ ఏర్పడింది. కానీ మనిషికి కవిహృదయం ఎక్కువ కదా, ఆ వ్యవస్థని దేవుడి శరీరంతో పోల్చాడు. స్వార్ధం పెరిగి రాజకీయం నేర్చుకున్నాక తరగతులు మారడం కుదరదు అన్నాడు. ఇప్పుడా సిస్టమ్ మార్చుకోలేక నానాతంటాలు పడుతున్నాడు. మారిన పరిస్థితులకి అనుగుణంగా వర్ణవ్యవస్థ మార్చుకోవద్దు అని వ్యాసులవారు చెప్పాడా?వర్ణవ్యవస్థలో cross-ward mobility వుండకూడదని చెప్పాడా?నాకు తెలిసి చెప్పలేదు. అందుకే ఇప్పుడు మనిషి ఫాలో అవ్వాల్సిన వర్ణవ్యవస్థ భారతీయజెండా రంగులు సూచించే గుణాలవ్యవస్థ అని, వ్యక్తులు “చాతుర్వర్ణం….” ప్రకారం విడిపోవడం కాదు, ప్రతివ్యక్తిలోనూ జెండాలో వుండే నాలుగువర్ణాలు(గుణాలు) కలిసి వుండాలని చెప్పడానికి ట్రై చేశా.

  ఇది రాస్తుండగానే మీ కామెంట్లు రెండు వచ్చాయి.వాటికీ ఇక్కడే రెస్పాండ్ అవుతున్నా.

  //మీరు కూడా కంచె ఐలయ్య అన్నట్లు వ్యాపార మనస్థత్వం అంటున్నారు :)) మన రక్తంలోనే వ్యాపార మనస్థత్వం ఉంది కదా ? //
  అందులో డౌటా? ఆయనెందుకో ఒక వర్గాన్నే టార్గెట్ చేసాడు కానీ… కట్నం, కన్యాశుల్కం, లంచం, చదువులు/ఉద్యోగాలు కొనుక్కోడం, వోట్లకి నోట్లు+నోట్లకి వోట్లు, ఆడపిల్లల్ని పుట్టకముందే హరీమనిపించడం, సొంతలాభం కోసం కులచిచ్చులు పెట్టడం…. వీటన్నిట్నీ ఏమనాలో? నేను మాత్రం వీటికే పేరూ పెట్టదల్చుకోలేదు. Lack of Human Values అనుకుంటాను.

  //మనుషుల్లో తరగతులు, గిరిగీతలు పోతే ఏదో ఒక నాటికి దేశాలు, సరిహద్దులు కూడా పోతాయి.
  ఆ – – – – – – – – – డబ్బు విషయానికి వచ్చేసరికి గిరిగీతలు, సరిహద్దులు చెరిపేస్తున్నారు. మానవత్వం విషయానికి వచ్చేటప్పటికి మేమే దేవుళ్ళం అంటున్నారు. పూజారి దేవుడెట్టా అవుతాడని ఐలయ్యగారి ప్రశ్న ! దేవుడినే స్మగ్లింగ్ చేసేస్తే పోదూ ?//
  (1) మనోభావాల్ని గాయపరిచే ఇరిటేటింగ్ స్టైలునీ, ఆయన ఎజెండానీ పక్కనపెట్టి కేవలం ఫిలసాఫికల్‌గా చూస్తే ఆలోచించే ఏ మైండ్‌లోనైనా ఆ ప్రశ్న రాదంటారా?
  (2) Unless we can separate god from universe, సృష్టిలో దేన్ని స్మగుల్ చేసినా దేవుణ్ణి స్మగుల్ చేసినట్టే కదా?

  Like

 5. సృష్టిలో దేనిని స్మగుల్ చేసినా దేవుడిని స్మగుల్ చేసినట్లే అన్నారు కాబట్టి దేవుడి తెలివితేటలను స్మగుల్ చేస్తాను. ధన్యవాదాలు.

  మీ బ్లాగ్ లో polldaddy .com add ఏమిటండీ ?

  Like

 6. హస్త సాముద్రికం బందించి భవితను
  నేడె కళ్ళకు గట్టు నేర్చి యొకడు
  జ్యోతిష్యము మనుష్యజాతికి తగిలించి
  గతుల నాపాదించు ఘను డొకండు
  పేరును సంఖ్యగా పేర్చి యిట్టటు మార్చి
  నెంబరు గేమాడు నేర్పరొకడు
  తాయెత్తు గట్టి మంత్రాలు మాయ లొనర్చ
  నేమమ్ము గల మహనీయు డొకడు

  అంద రున్నత ‘వర్ణమే’ , అందులోను
  శాస్త్ర పాండితీ ధిషణులే , చదువు నింత
  గొప్పగా వాడుచున్నారు , గొప్ప వారె !
  భారతావని చల్లగా బ్రతుకు గాత !

  https://polldaddy.com/js/rating/rating.js

  Like

Leave a Reply to YVR's అం'తరంగం' Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s