వాట్సాప్ అనగానే ఎవరో ఫార్వార్డ్ చేసిన నీతివాక్యాలు, ఇన్స్పిరేషనల్ మెసేజులు, ఔట్-డేటెడ్ వైఫ్ & హజ్బెండ్ జోకులు, ఓవర్-ది-టాప్ భక్తిప్రపత్తులు, నిజంగా ఉన్నదానికి కాస్త ఎక్స్‌ట్రాలు కలిసిన సంస్కృతీసాంప్రదాయ సూక్తిముక్తావళీ ఇవన్నీ మామూలే. చాలామంది వాట్సాప్ వీడియోలు, పిక్చర్లు ఓపెన్ చూసి చూడ్డం సంగతి అలావుంచి వాటిని డిలీట్ చేసుకుని ఫోన్ స్టోరేజి తగ్గిపోకుండా చూసుకోడంలో బిజీగా ఉంటున్నారు. ఐతే, ఒక్కోసారి మంచి మంచి డిస్కషన్లు, చమత్కారాలు, ఎవరికో ఏదో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు చకచకా జరిగిపోయే సహాయసహకారాలు – ఇవి కూడా అప్పుడప్పుడు దొర్లుతున్నాయి. అలాంటి వాటిల్లో కొన్నిటికి బ్లాగ్ఠపా స్టేటస్ ఇస్తే ఎలా ఉంటుందా అనిపించి, ఇదిగో నిర్మలాసీతారామన్గారికి డిఫెన్స్ మినిస్టర్‌గా ప్రమోషన్ వచ్చిన సందర్భంగా వాట్సాప్‌లో వచ్చిన ఈ👇 ఫోటోతో మొదలుపెడుతున్నా ఈ WhatsApp కబుర్లు –
మా కాలేజ్ గ్రూపులో వచ్చిన ఈ ఫోటో చూడగానే ఫస్టు ఫస్టు ఆశువుగా ఈ తవిక (యెస్, తవికే, కవిత కాదు) వేళ్ళలోంచి కీబోర్డులోకి ప్రవహించింది –
ఆవకాయ కలుపుటలో అత్తగారితో భేటీ
ఆంధ్రప్రదేశ్ అత్తారింటి అయ్యంగార్ బేటీ,
ఆర్ధికశాస్త్రంలో మేటి ఎవరికైన సరిసాటి
అణుబాంబులశాఖలో ఆడపడుచు ధాటి
ఇండియా, అమెరికాలనుంచి తవికాప్రియుల నుంచి ఇవి> 👌 ఇవి >👍 ఇవీ > 👏 కూడా బాగానే వచ్చాయి.
ఇక్కడో సంగజ్జెప్పాలి. ఆంధ్రావారి కోడలనే సెంటిమెంటుతో అత్యుత్సాహంగా ఏపీనుంచే రాజ్యసభకి పంపినా ఆవిడ ఆంధ్రాకి ఏం చెయ్యలేదనే గుర్రు ఇవాళ్టివరకూ వున్నా ఇవాళ అత్తగారితో కూర్చుని ఆవకాయ కలుపుతున్న ఆ దృశ్యం చూడగానే అది ఎక్కడికో ఎగిరిపోయింది. మరి ఎర్రటి ఆవకాయ, పక్కనే తెలుగుదనం ఊరే మన ఊరగాయ సంస్కృతిని ప్రతిఫలిస్తూ మెరుస్తున్న ఆ జాడీల మహత్యం అయ్యుంటుంది.
“క్రింద కూర్చుని ఆవకాయ పెట్టే ఆవిడే నేటి రక్షణ మంత్రిణి” – ఆ అక్షరాలు చూసి ముందు పెట్టిన కామెంట్ –
Making A(tom)vakaaya bombs? (మేకింగ్ ఆ(టం)వకాయ బాంబ్స్?) అనీ. ఆహాహా! మేల్ షావినిజం కాదండోయ్, I hate it, ఏపీకి ఏం సాయం చెయ్యలేదనే గుర్రు, అంతే. ఒక ఫ్రెండ్ రెస్పాన్సు – “ఆవకాయ బాంబు నోట్లోకి, ఆటంబాంబు శత్రువులమీదకి” అని. ఆబ్వియస్లీ, అతని ఫోకస్ ఆవకాయ మీద, అది నాలుక మీద పుట్టించిన అలజడి మీద అని తెలుస్తోంది కదా! 😋😋😋 Perfectly Understandable & Understandably Perfect. కదా? 🤗
ఇంతలో ఆవకాయ ఆలోచనల్ని కొంచెం సైడ్ ట్రాక్ చేసింది, అసలా ఎర్ర్హటి ఆవకాయ నింపిన జాడీల్ని మిసైల్స్‌కి తగిలించి శత్రుసైన్యాల మీద వదిల్తే ఎలా వుంటుందీ ? అని. కెమికల్ వెపన్స్ అంటే ప్రాణాలు తీసేవే కానీ ఇలాంటి ప్రాణం లేచొచ్చేంత టేస్టీగా కూడా ఉంటాయా అనే సంభ్రమాశ్చర్యాలతో అర్జెంటుగా స్వచ్చంధ కాల్పుల విరమణ చేసేసి “అమృతం కురిసిన రాత్రి”కి సీక్వెల్ రాయడం మొదలెట్టెయ్యరూ? ఆపైన మన ఫారిన్ మినిస్ట్రీ క్రికెట్ డిప్లొమసీలా ఆవకాయ డిప్లొమసీ తోడౌతుంది.. బట్, అంత విలువైన ఆవకాయని బాంబింగ్ కోసం వాడుకోడానికి మనకి మనసెలా ఒప్పుతుంది? ఒప్పదు. అంచేత మళ్ళీ ట్రాక్‌లోకి వచ్చేసి అంతర్జాలంలో ఆవిడ ప్రస్థానం చదివా –
జేఎన్‌యూలో చదువు,
అక్కడ మామూలుగా ఉండే లెఫ్టిస్ట్ ప్రభావంలో పడకుండా ఫ్రీ-థింకర్‌గా ఉండడం,
యూకే వెళ్లి అక్కడ ప్రైస్-వాటర్‌హౌస్ సంస్థలో పన్జెయ్యడం,
ఆ తర్వాతెప్పుడో ఆరెస్సెస్ / హిందూత్వ బాక్గ్రౌండ్తో కాక ప్రతిభ ఆధారంగానే National Commission for Womenలో నాన్-పొలిటికల్ మెంబర్ అవ్వడం,
ఆపైన క్రమంగా బీజేపీలో, మోడీ కేబినేట్లో సమర్ధంగా పని చెయ్యడం
ఇప్పుడింక డిఫెన్స్ మినిస్టర్ అయిపోవడం —
ఇవన్నీ తెలుసుకున్నాక, పై తవికకి మొదట తోకగా పెట్టిన “ఆంధ్రాకి మాత్రం ఏం చేసినట్టు లేదు” అన్న లైను తీసేసాను. అయ్యా, పేపర్స్‌లో రాసినవన్నీ నమ్మెయ్యడమేనా? అదంతా ఉత్త ప్రచారం, అసలు నిజం వేరు అనేవాళ్ళుంటారనుకోండి. అది రాంగ్ అని కాదు, అలా అని వాళ్లకి తెల్సిన్దంతా మాత్రం నిజమేనని గారంటీ ఏముంది? సో, ఒక మహిళ-
అత్తగారితో అన్యోన్యంగా,
ఆవకాయ మీద అతిశ్రద్ధతో,
ఆర్ధికశాఖలో ఆలవోకగా,
ఆరెస్సెస్‌వారి మధ్య అతినైపుణ్యంగా
మెలిగి,
ఇప్పుడు –
అగ్గిగుళ్ళశాఖపై అధికారం చెలాయించబోతోందంటే ఆవిడలో నిజమైన ప్రతిభాపాటవాల్లేకుండా జరిగే పనేనా? ఆవిడ సుష్మా స్వరాజ్, ఉమాభారతీ, స్మృతీ ఇరానీల కంటే చాలా డిఫరెంట్ & చాలా స్పెషల్ అని సొంత ఒపీనియనున్నూ మరియు పర్సనల్ అభిప్రాయం కూడానున్నున్నూను. ఇంతా రాశాక ఆ ఫోటోలో అత్తగారు అనుకుంటున్నావిడ గురించి రాయకుండా ఈ ఆర్టికల్ పూర్తయినట్టు కాదు. అత్తగారే అనుకోవడం ఎందుకూ అంటే ఆవకాయ అలా పెట్టేది తెలుగు ఇళ్లలోనే కాబట్టి. ఇంతకీ ఆవిడ నర్సాపురం కాంగ్రెస్ ఎమ్మేల్యేగా డెబ్భైల్లో పనిచేసారుట. ఎంత వెతికినా గూగుల్‌లో మంత్రి పరకాల శేషావతారంగారి భార్య / పరకాల ప్రభాకర్ గారి తల్లి అనే తప్ప ఆవిడ పేరు దొరకలేదు. చివరికి వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల జాబితాలు చూస్తే 1983 లిస్టులో దొరికింది ఆవిడ పేరు పరకాల కాళికాంబగారు. రక్షణమంత్రిగా పదవి స్వీకరించాక, ఎకార్డింగ్ టు ఈనాడు పేపర్, – “ఇదంతా మీ చలవే అత్తయ్యా! ఏమాత్రం రాజకీయ అనుభవంలేని కుటుంబం నుంచి వచ్చాన్నేను. మీరిచ్చిన ధైర్యం, ప్రోత్సాహం వల్లే ఇంతదూరం ఎదిగాను..!’ అని చెప్పారట నిర్మలా సీతారామన్, అత్తయ్య పరకాల కాళికాంబతో. తెలుగు అత్తగారు తమిళ కోడలు అనుబంధం ఎన్నేళ్ళైనా కొత్తావకాయలా ఘుమఘుమలాడుతోందనమాట. ఆ ఘుమఘుమలు ఆస్వాదించేనేమో పరకాల ప్రభాకర్‌గారు రెండుమూడేళ్ళ క్రితమే రిలీజ్ చేసేసారని తెల్సింది. అమ్మ, ఆవకాయి ఒక తమిళమ్మాయి అనే పేరేమైనా పెట్టారా లేదా అనేది అభిజ్ఞవర్గాలు ఇంకా తేల్చాల్సి వుంది.
🌹With best wishes to Mrs. NirmalaSitharaman for her new role as India’s Defense Minister🌹
ఇదే సందర్భంలో ఈ టపా రాయడానికి రక్షణ మంత్రితో సమానంగా స్ఫూర్తినిచ్చిన ఆవకాయ – ఎమ్మెల్యే ఆవకాయ, మంత్రి ఆవకాయ, ఎంపీ / సీఎం/ పీఎం/ ప్రెసిడెంట్ ఆవకాయలుగా అభివృద్ధి చెంది అశేషజనవాహినికి ఆనందామృతవర్షిణై వెలుగొందాలని ఆశిస్తూ…
🙏ఈసారికి WhatsApp ముచ్చట్లు ఇంతటితో సమాప్తం 😊
(ఇది చదివినవారు రేటింగో, లైకో, కామెంటో పెట్టి ఆవకాయపై, అత్తగార్లపై (😈optional 😊), ఆడపిల్లలపై తమ అభిమానమును చాటుకొందురుగాక!!)
దేశానికి మంత్రి అయినా ఆవిడ ఆంధ్రాకి ఏమి చెయ్యలేదనుకోవడం అత్యాసేమో. వెంకయ్య గారు చేసింది చూసాము కదా. whatsup పోస్టుల గురించి నిజం చెప్పారు. అవకాయని ఆయుధంలా వాడుకోవచ్చని ప్రతిపాదించినందుకు మీకు అభినందనలు. ఒక మహిళా నేత చిత్తశుద్ధితో పనిచేసి దేశానికి పేరు, ఆవిడ శాఖకి వన్నె తెస్తారని కోరుకుందాము.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
అన్యగామి గారు, థాంక్యూ.
LikeLike
“ఎంత వెతికినా గూగుల్‌లో మంత్రి పరకాల శేషావతారంగారి భార్య / పరకాల ప్రభాకర్ గారి తల్లి అనే తప్ప ఆవిడ పేరు దొరకలేదు”
అయ్యో! నన్నడిగితే నేను చెప్పేవాడిని కదండీ! మాది నరసాపురమే.
1981లో అనుకుంటాను, పరకాల శేషావతారం గారు చనిపోయిన తరువాత నరసాపురంలో ఉప ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఆయన భార్య కాళికాంబ గారు పోటీ చేసారు. ఎందుకనో కాంగ్రెసు, జనతాపార్టీ ఆ ఎన్నికలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హొరాహోరీగా తలపడ్డాయి. కాంగ్రెసు తరపున రాజీవ్ గాంధి, పి వి నరసింహారావు గార్లు వచ్చి ప్రచారం చేసారు. జనతా తరపున కూడ చాలా పెద్దవాళ్ళు వచ్చి ప్రచారం చేసారు. నాకు పేర్లు గుర్తు లేవు. అందరూ జనతాపార్టీ నెగ్గుతుందనే అనుకున్నారు. కాని చివరకు కాళికాంబ గారు సుమారు 800 పైచిలుకు ఓట్లతో గెలిచారు.
LikeLike
బోనగిరివారూ, నెనరులు. “నరసాపురంలో విద్యాభ్యాసం” అని, చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి ఆత్మకధలో భాగం అనుకుంటాను, మాకు తెలుగుపాఠం వుండేది. ఆ తర్వాత మళ్ళీ నరసాపురం గురించి విన్నదీ, చదివిందీ ఏమీ లేదనే చెప్పాలి. ఈసారి టాపిక్ వస్తే మిమ్మల్ని తప్పక కన్సల్ట్ చేస్తాను. 😊
LikeLike
తెనుగింటి కోడలిని, వరకట్నంగా తెలుగువారికేం చేసేవని అడుగుతున్నారని వరకట్నం కేస్ పెట్టే సావకాశం ఉందేమో ! 🙂
దానికి తోడు తెనుగునాట నుండి ఎన్నికై ప్రధానులైనవాళ్ళే ఏం చెయ్యలేదు, అప్పుడే అడగలేదు, ఈజ్మెంట్ హక్కు కోల్పోయారు, తెనుగువాళ్ళు అనేసావకాశమూ ఉన్నట్టుందండీ 🙂
https://polldaddy.com/js/rating/rating.js
LikeLiked by 1 person
గురువుగారు _/\\_
//వరకట్నం కేస్ పెట్టే సావకాశం…// ఇంచుమించు సరిసాటియైనదేదో జరిగినట్టే వుందండి. 😊
LikeLike
తెనుగింటి కోడలౌ యిం
తి నిర్మలమ్మ వరకట్న తీపులనుకొనన్
మన తెలుగువారి పని బ
ట్టును వలదు వలదు పడతి పటుక్కున కొట్టున్ 🙂
జిలేబి
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
జిలేబిగారు, మీ పద్యం జాప్యాలస్యమైంది ఈసారి 😊
LikeLike
జాప్ ఆల్ సేమ్ 🙂
గోప్యంబగు జాడీ కథ
లాప్యాయనమయ్యె గాద లావుగ నెట్టున్!
జాప్యంబికవలదు సుమా
యాప్యాయతల గురిపించు యాంధ్రా పైనన్ 🙂
జిలేబి
LikeLiked by 1 person