చిన్నప్పుడెప్పుడో ఒక కొటేషన్ చదివాను. ఎంత చిన్నప్పుడంటే ఆ కొటేషన్ ఎవరిదో తెలుసుకోవాలనే ధ్యాస ఉండనంత చిన్నప్పుడు. కానీ మనకీ ఒక చిన్నప్పుడు వుండేది అనుకునేంత పెద్దయ్యాక్కూడా గుర్తుండిపోయింది ఆ కోట్. ఆ కొటేషన్ సారాంశం ఏంటంటే, ఇదీ – ప్రపంచానికి ఆప్టిమిస్టులూ, పెస్సిమిస్టులూ ఇద్దరి అవసరం ఉందిట. ఆప్టిమిస్టు విమానం కనిపెడితే, పెస్సిమిస్టు పారాచూట్ కనిపెడతాడుట.
చిన్నప్పుడు కదా ఇదేదో బానేవుందే అనిపించింది. కొంచెం పెద్దయ్యాక తట్టింది, పేరాచూట్ కనిపెట్టినవాడు పెస్సిమిస్ట్ ఎందుకౌతాడూ అని. విమానం కూలిపోయినా, పేలిపోయినా సరే నేను మాత్రం బతికి తీరాలి అనుకునేవాడు పెస్సిమిస్ట్ ఎలా అవుతాడసలూ? దీన్నిబట్టీ అర్ధమైనది ఏంటంటే ఆ కోట్ కోటిన వ్యక్తి పేరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదని. కానీ ఒకటి, కోట్ బాగా నచ్చెయ్యడంవల్ల దాని మీద మాటిమాటికీ ఆలోచించడంవల్ల చివరికి ఆప్టిమిజానికీ, పెస్సిమిజానికీ తేడా బాగా తెలిసింది, ఆ ఫలానా కోట్ కోటిన “కోటే”శ్వర్రావు కంటే బాగా!! ఇప్పుడింతకీ ఈ సోది ఎందుకనే ప్రశ్నకి జవాబు, ఇదిగో –
//బోస్టన్/చెన్నై, జూలై 27: లైంగిక వేధింపులకు గురైనప్పుడు సాయాన్ని అర్థించేవారి కోసం ఓ భారతీయ శాస్త్రవేత్త స్టిక్కర్ లాంటి ధరించే సెన్సర్‌ను అభివృద్ధి చేశారు. దీన్ని దుస్తులకు అతికిస్తే చాలు.. ఎవరైనా లైంగిక వేధింపులకు గురిచేస్తే సదరువ్యక్తి ఆపదలో ఉన్నారని ఆప్తులకు అలారం మోగిస్తూ సెన్సర్ హెచ్చరికలు పంపిస్తుందట. …..//
రెండుమూడ్రోజుల క్రితం ఒక తెలుగు పేపర్లో వచ్చిన వార్త ఇది. టెక్నాలజీ ఏం పెరిగిపోయింది అని ముక్కున వేలేసుకోవాల్సినంత గొప్ప విషయం అనుకోవాలా? ఇలాంటి సాధనాలు వాడితే కానీ కంట్రోల్ చెయ్యలేనంతగా మనుషులు దిగజారిపోయారనుకోవాలా? రెండూ అనుకోవాలి.
పైన చెప్పిన అ.ని.సా(అత్యాచార నిరోధక సాధనం) ఆ “కోటే”శ్వర్రావు దృష్టిలో పెస్సిమిజానికి చిహ్నం అయ్యేదే. కానీ ఆయన ఆలోచనా విధానం తప్పుకదా. అది ఆప్టిమిజానికే గుర్తు. గవర్న్మెంట్లు, పోలీసులు, సొసైటీ (ఇదే మొదటి ముద్దాయి నిజానికి) – అందరూ చేతులు ముడుచుకుని కూచుంటే టెక్నాలజీపైన ఆధారపడక తప్పదుగా మరి? ఆ రకంగా ఆప్టిమిజాన్నే సూచిస్తోంది ఇది, బాధితుల కోణంలో చూస్తే. కానీ నిరాశాజనక ఆశావాదం, pessimistic-optimism. ఎందుకు?
ఇందుకు👉 – దీన్ని కనిపెట్టింది అమెరికన్ లాబ్లోనేనైనా, కనిపెట్టిన సైంటిస్ట్ ఇండియన్నేట**. అందులోనూ మహిళ. ఆశ్చర్యం ఏఁవుంది? ఇక్కడ అలాంటి సెన్సర్ (Sensor, సెన్సార్ అనుకోకూడదని) డివైజెస్‌కి మార్కెట్ బాగా పెరుగుతోంది కదా మరి? ఈ సాధనం తయారుచెయ్యాల్సిన అవసరం ఎత్తి చూపిస్తున్నది – సంఘం, ప్రభుత్వం, పోలీస్ – వీటన్నిటి పట్లా నిరాశనే కదూ? (** స్వదేశీ లాబ్స్కానీ, రీసెర్చర్లుకానీ కనిపెట్టివుంటే కొంత సంతోషంగా వుండేది. సమస్యని పట్టించుకునే వాళ్ళున్నారనే చిన్న పాజిటివ్ సైన్ కనబడి.)
సెన్సర్స్ మార్కెట్ బావుందని బిజినెస్సులు, లాభాలు లెక్కలేసే “ఆప్టిమిస్ట్”లకి ఇదో వ్యాపారవకాశం కావచ్చు. అంతకంటే ఇంకేమన్నా అవుతుందా/అవగలదా అనేదే ప్రశ్న. ఆన్సర్? తెలీదు. బట్, సంస్కృతిలో ఏర్పడుతున్న ఒక పెస్సిమిస్టిక్ ట్రెండ్‌కి ఇదొక సూచకం, ఇండికేటర్ అని మాత్రం తెలుసు. ఒకవేళ ఈ వ్యాపారం లాభసాటిగా మారిందంటే దేశానికి అంతకంటే దరిద్రం ఇంకోటి లేదనే(కదా?). మానవవిలువల దిగజారుడు ఆగుతుందో ఆగదో కానీ, వ్యాపారాలు, లాభాలు ఆగవు కదా? మరి, పెరుగుతున్న ఆ లాభాల గ్రాఫులు మరో రకంగా ఉపయోగపడతాయా? అవిచూసి గవర్న్మెంట్లు, పోలీసులు, సొసైటీ పడాల్సినంత సిగ్గు పడతారా? ఆ గ్రాఫులు ఎంత పైకి ఎక్కితే దానికి విలోమానుపాతం (inverse proportion)లో మనిషి విలువలు సంస్కారం దిగజారుతున్నాయని గ్రహిస్తారా? గ్రహించి తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారా? డౌటే. వాళ్లకివన్నీ తెలియని సంగతులైతే కదా?
ఫ్రాంక్లీ స్పీకింగ్, దేశంలో గోభక్షకుల్ని శిక్షించే గోరక్షకులున్నారు, పరువు హత్యలు చేస్తున్న పేరెంట్స్ వున్నారు, ఆడపిల్లలు పుట్టడమే అనవసరం అనుకునే అసురులు వున్నారు, మంత్రగత్తెలనీ/గాళ్ళనీ నిలువునా కాల్చేసే మహాధీరులున్నారు – కానీ అత్యాచారం చేసినా, అందుకు ప్రయత్నించినా –
ఆ
మెన్
ఆమెన్
చెరపట్టన్
మ్రోగెన్
నీగన్
నా
పెన్
ఆపెన్ (ఆ మెన్, ఆమెన్ చెరపట్టన్, మ్రోగెన్ నీ గన్, నా పెన్ ఆపెన్ )
– అని అత్యాచార పరాయణుల భరతం పట్టి, పుట్టగతుల్లేకుండా చెయ్యగల ప్రజలు మాత్రం కనిపించరు. ఎందుకో?
ఎందుకో తెలిసి ఏం లాభం? ఆ “ఎందుకో”లోంచి బయటపడే ఆలోచనా శక్తీ, సంస్కృతీ అలవడనప్పుడు? అంతే సంగతులు.
ఇంత సీరియస్ టాపిక్ తర్వాత చిన్న షార్ట్ బ్రేక్ లేకపోతే ఎలా? 😃, have it 👇
ట్రయల్/టెస్ట్ వెర్షన్ గాని మార్కెట్ లో విడుదల అవుతుందంటా రా ?
మెచ్చుకోండిమెచ్చుకోండి
Oh! Zilebi garu, what an observation👌!! న్యూస్‌లో ఆ విషయం రాయలేదు. ఒకవేళ ట్రయల్ వెర్షన్ విడుదలయిందే అనుకోండి అప్పుడొచ్చే రణగొణధ్వని తట్టుకోడం👀కష్టమేమో?!? 🙈 🙉 🙊
మెచ్చుకోండిమెచ్చుకోండి
అబ్బాయి చేస్తే దాన్ని రేప్ అన్నారు,అమ్మాయి చేస్తే దాన్ని forced penetration అంటారట. బ్రిటన్ లో చాలా జరుగుతున్నాయని యూనివర్సిటి వారి పరిశోధన, అక్కడ పనికొస్తుందా 🙂
మెచ్చుకోండిమెచ్చుకున్నవారు 1 వ్యక్తి
🙏 గురువుగారు.
మీ ప్రశ్నలో ఏదో చమత్కారం వుందండి 😊. అది నాకు కరెక్టుగా అర్ధమైవుంటే జవాబు ఇది – ఏ దేశమైనా, సమాజంలో అరిటాకు పరిస్థితి ఎవరిదైతే వాళ్లకి పనికొచ్చేలా మార్చుకోవచ్చు అనుకుంటున్నా, టెక్నాలజీయే కదా. కానీ ముళ్ళని సంస్కరించడం ఎలా అన్నదే అసలు సమస్య. మనదేశం వరకే అయితే ముళ్ళకంటే మృగాళ్ళే పెద్ద సమస్య అనికూడా అనుకుంటున్నాను.
మెచ్చుకోండిమెచ్చుకోండి
అమ్మాయి చేస్తే మగవాడిని ఆ అమ్మాయి forced TO penetrate అనచ్చు. అప్పుడు రెండు రకాల బలాత్కారాలకీ మధ్య తేడా మరి కొంచెం స్పష్టంగా తెలుస్తుందనుకుంటాను శర్మగారు.
ఏదయినా YVR గారన్నట్లు ఎవరికి నష్టం ఎక్కువగా ఉండచ్చో వారికి ఉపయోగపడే అవకాశం ఉండచ్చని ఆశిద్దాం (తయారీలో లోపాలేమీ లేకపోతే 🙂).
https://polldaddy.com/js/rating/rating.js
మెచ్చుకోండిమెచ్చుకోండి
విన్నకోట నరసింహారావుగారూ , అమ్మాయి ఇష్టానికి విరుద్ధంగా జరిగితే రేప్ అని గోల చేస్తున్నారు, అబ్బాయి ఇష్టానికి విరుద్ధంగా జరిగితే forced penetration అంటున్నారు, lucky boy అంటున్నారుట, న్యాయమా?:)
https://polldaddy.com/js/rating/rating.js
https://polldaddy.com/js/rating/rating.js
https://polldaddy.com/js/rating/rating.js
మెచ్చుకోండిమెచ్చుకోండి
నరసింహారావు గారని ఉండాలి పొరపాటున పడలేదు,మన్నించండి
https://polldaddy.com/js/rating/rating.js
మెచ్చుకోండిమెచ్చుకోండి