(1)
టపా టైటిల్ ఇంట్రెస్టింగా ఉందా ? ఉండే వుంటుంది. కానీ ఏ పని చెయ్యాలన్నా గణపతిపూజ చెయ్యాలి కదా, అలాగే టైటిల్ టాపిక్ చదివేముందు ‘కృతయుగం’ నాటి ఓ చిన్న రసగుళిక –
ఆ మధ్య ఊరికే పాత పుస్తకాల కోసం గూగులిస్తుంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు అనీ బిసెంట్ గతించినప్పుడు రాసిన నివాళి ఒకటి దొరికింది అందులో చిన్న ముక్క ఇది –
దశాబ్దాల క్రితం – అంటే గోల్డ్ అని మనం అనుకునే ఓల్డ్ రోజుల్లోనే – ఆయనకి ఎర్ర అండర్లైన్ చేసిన ముక్కలు, పంచ్-లైన్స్ అనాలి నిజానికి, ఎందుకు తట్టాయో అనిపించింది. అనుభవాలూ-జ్ఞాపకాలూనూ మొత్తం త్వరగా చదివేయ్యాలి. వీలైతే, దొరికితే, ఆయన ఇతర రచనలు కూడాను. అప్పుడు కానీ ఆయన ఉద్దేశం అర్ధం కాదేమో.
(2)
👇👇👇ఇదందరికీ అర్ధం అవుతుందా 😉? ఏమో! కాకపోయినా నా పూచీలేదండోయ్ –
కధ : శూన్య / బోరు | స్క్రీన్ ప్లే : శూన్యస్య / బోరుస్య | దర్శకత్వం : శూన్యేభ్యః / బోరేభ్యః |
మాటలు : మసాలా | పాటలు : మసాలాస్య | ఫైటులు : మసాలేభ్యః |
పాత్రలు : మాస్ | పాత్రధారులు : మాస్స్య | నటన : మాస్భ్యః |
కాన్సెప్ట్ : అగ్రహారం | ట్విస్ట్లు : అల్పాహారం | క్లైమాక్స్ : ఫలహారం |
కామెడీ : ఫార్ములా | వెరైటీ : ఫార్ములాస్య | క్రియేటివిటీ : ఫార్ములాభ్యః |
సీన్స్ (కొన్ని) : అసభ్య | స్కిన్ షో : అసభ్యస్య | సందేశం : అసభ్యేభ్యః |
మెయిన్ విలన్ మాత్రం : సూపర్ 👌– సూపరుస్య 👌👌– సూపరేభ్యః👌👌👌 |
🙈 🙉 🙊
(3)
ఇంతే సంగతులు, బై4నౌ చెప్పేసేముందు కాస్త భగవన్నామ స్మరణం –
ఆపదమొక్కులవాడా! రామనాధా!! కోవిందా!!! కోవింద!!!!
సారీ, సారీ, అది 👆అచ్చుతప్పు … టైపో … పొద్దున్నే న్యూస్ పేపర్ చదివిన ఎఫెక్ట్ అనుకుంటా 🙈 🙉 🙊 ………..
ఇప్పుడు సరిగ్గా –
ఆపదమొక్కులవాడా ! అనాధనాధా!! గోవిందా!!! గోవింద!!!
🙏🙏🙏
ఇదేదో DJ effect లా వుంది 😀
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
effect కాదండి, మెసేజ్ ! సభ్య సమాజానికి. 😊
LikeLike
మీ “మెసేజ్” (హెచ్చరికా??) – అద్భుత, అద్భుతస్య, అద్భుతేభ్యః 👌
LikeLike
VNR sir, నెనరులు, నెనరులుస్య, నెనరులేభ్యః 🙏
LikeLike