06.30 pm – ఇప్పుడే న్యూస్ చూశా. పరిస్థితి ఆశాజనకంగా లేదు.
ఇంకోవైపు ఎంతోమంది సహృదయులు, సామాన్యులు పాప క్షేమం కోసం ప్రార్ధనలు, పూజలు చేస్తున్నారు.
అంతకంటే ఏం చెయ్యగలరు?
ముందు ఇలాంటి అన్యాయాలకి కారణమైనవాళ్ళవి, అన్యాయాలని ఆపాల్సినవాళ్ళవి మనసులు, బుద్ధులు మారాలనికూడా ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తే మంచిదేమో !?!
***
నిస్సందేహంగా “నిర్లజ్జ” – బోరుబావి తవ్వి దాన్ని cap చెయ్యకుండా వదిలేసినవారిది. వారి చేత ఆ పని చేయించకుండా వదిలేసే అధికారులది, దుర్ఘటన జరిగితే బోరుబావి వారికి కనీసం జన్మఖైదన్నా పడకుండా వదిలేసే అధికారులది – “అసమర్థత”, “అలసత్వం”. ఒకటా రెండా రెగ్యులర్ గా జరుగుతున్న బోరుబావి విషాదాలు! రెండు మూడు నెలలకొకటి వింటూనే ఉంటాం, ఛానెల్స్ హడావుడి చూస్తూనే ఉంటాం. మనిషిప్రాణాలంటే విలువ లేని వ్యక్తులు. దిగజారిపోయిన సమాజం, దారితప్పిన దేశం. రాజకీయ నాయకుల, సినిమావాళ్ళ భజన చేసుకోవడమే భారతీయులకి మోక్షమార్గం / nirvana🤘. మిగిలినదంతా కంఠశోష.
LikeLike
// నిస్సందేహంగా “నిర్లజ్జ” – బోరుబావి తవ్వి దాన్ని cap చెయ్యకుండా వదిలేసినవారిది……//
థాంక్యూ సర్, వీయెన్నార్ గారు. వోట్లు పోతాయనే భయం లేకపోతే లీడర్లు పట్టించుకోరు, ఉద్యోగాలు పోతాయనే భయం లేకపోతే అధికార్లు అటువైపు చూడరు. డబ్బులు పోతాయనే భయంలేకపోతే కాంట్రాక్టర్లు, బోర్వెల్ సొంతదార్లూ పట్టించుకోరు. సో, వాళ్ళేదో చేస్తారనే ఆశలేదండి. మీరన్న ‘కంఠశోష’ కూడా ఉండాల్సిన లెవెల్లో వినపడ్డం లేదు ప్రభుత్వాలకి అనిపిస్తోంది.
స్వచ్చందసంస్థలేవైనా పూనుకుని ఓపెన్ బోర్‌వెల్స్‌ని ఎప్పటికప్పుడు మీడియాలో హైలైట్ చేస్తూ వుంటే ఫలితం ఉంటుందేమో. లేదా గరుడపురాణంలో ఇలాంటి పాపాలకి శిక్షలేమైనా వున్నాయేమో చూసి ప్రవచనాలు హోరెత్తిస్తే లేదా సినీమహానుభావులు ట్వీట్-అస్త్రాలు సంధిస్తే కొంత మార్పు గారంటీ. నీతినియమాల కంటే నమ్మకాలు, సినిమాలు ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి కొన్నిసార్లు.
LikeLike
బోరుబావిలో పడిన చిన్నపిల్ల చనిపోయిందని ఇప్పుడే టీవీలో విన్నాను. RIP. మేరా భారత్ మహాన్
ఆ బోరుబావి తాలూకు వ్యక్తి మీద హత్యానేరం కింద కేసు పెట్టద్దూ ప్రభుత్వం?
LikeLike
అవును సార్. నిన్నటి సిట్యుయేషన్ చూశాక పొద్దున్నించీ పేపరు, న్యూస్ ఛానెల్స్ ఓపెన్ చెయ్య బుద్ధి కాలేదు.
LikeLike
ఈరోజు ‘ఈనాడు’ పత్రికలో ఒక వార్త వచ్చింది చూడండి. బోరుబావికి ముక్కుపచ్చలారని చంటిపిల్లను బలిచేసిన నిర్లక్ష్యపు నిర్వాకం గురించి ఈరూనాడా ఎంత గగ్గోలుపెట్టినా, ఇప్పటికీ నిర్లక్ష్యంగా వదిలిపెట్టిన ఓపెన్బోర్ ఒకదానిని ఎత్తిచూపుతూ బొమ్మకూడా వేసారు పత్రికలో. ఈ వార్తచూసి ఆ బోరు యజమానిపై కేసుపెడతుందా ప్రభుత్వయంత్రాంగ అన్నది చూడాలి – అలా జరిగితే, ఆశ్యర్యమే!
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
శ్యామలరావుగారు🙏,
మీరు చెప్పిన న్యూస్ ఐటం పట్టుకోలేకపోయాను. కానీ ఇది చూశాను 👇-
“…..వాల్టా చట్టం ప్రకారం ఎవరు బోరు వేయాలనుకున్నా ముందుగా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలని, బోరులో నీళ్లు రాని పక్షంలో వాటిని పూడ్చివేయాల్సిన బాధ్యత యజమానులదేనని అధికారులు తెలిపారు. జిల్లాలో పూడ్చకుండా ప్రమాదకరంగా ఉన్న బోర్లను గుర్తించి వాటిని పూడ్చివేసే బాధ్యత తీసుకోవాలని రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు….”
యజమానిదే బాధ్యత అని ఆఫీసర్లు చెప్తుంటే, ఆఫీసర్లే ఆ బాధ్యత తీసుకోవాలని మంత్రి చెప్పడమేమిటో.
ఆ యాజమాన్లందరిపై కేసులు పెట్టమని చెప్తే ఎఫెక్టివ్‌గా ఉండేదికదా.
LikeLike
చట్టాలపై అవగాహనాలోపం విషయంలో మంత్రులూ అతీతులు కారన్నమాట వేరేచెప్పాలా?
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
కేసులు పెట్టినా కంటితుడుపు చర్యలలాగానే ఉంటుందని నా అనుమానం శ్యామలరావు గారూ, YVR గారూ. పార్టీలు, ప్రాంతాలు, కులాలు – ఎన్నెన్ని సమీకరణాలుంటాయో చూస్తున్నాంగా మనం. ఓపెన్ బోరుబావుల్ని ఇంకా తమంతటతామే మూసెయ్యలేదంటేనే వైఖరి తెలుస్తోంది.
పెట్రేగిపోతున్న విచ్చలవిడితనానికి మరో ఉదాహరణ – మొన్న ఉత్తర్ ప్రదేశ్ లో లైసెన్స్ లేకుండా బండి నడిపితే ఆపినందుకు పార్టీ కార్యకర్తలను సతాయిస్తావా అంటూ పోలీస్ ఆఫీసర్ శ్రేష్ఠా ఠాకూరు మీద విరుచుకు పడలేదా ఆ రాజకీయ పార్టీ కార్యకర్తలు. ఆ పోలీస్ అమ్మాయి వెనక్కి తగ్గకుండా ధైర్యంగా నిలబడింది, కానీ అలా తలొగ్గకుండా ఉండడం అరుదు.
బోరుబావి సంఘటనలకు బాధ్యులైన వారి నిర్లక్ష్యం హత్యకు తక్కువేమీ కాదు. మామూలు ఆరేడునెలల / ఏడాది శిక్ష సరిపోదు (అసలు అక్కడ దాకా వస్తే). హత్యానేరం క్రింద విచారించాలి. నాకు పేరు సరిగ్గా తెలియదు కానీ Culpable homicide not amounting to murder అంటారనుకుంటాను (🤔 !?) పోలీస్, కోర్ట్ భాషలో. దానికి తగిన శిక్ష విధించాలి.
LikeLike
థాంక్యూ సర్. డామేజ్ కంట్రోల్ (= కంట్రోల్ ఆఫ్ ఇమేజ్ డామేజ్) మీదున్న శ్రద్ధ రూట్ కాజ్ మీద లేదని మాత్రం అర్ధమౌతోంది.
LikeLike
ఈ విషయం మీద మన ఘోష చాలానే చెప్పుకున్నాం. ఆఖరుగా ఇది కూడా ఆలకించండి 👇.
—————
బావులలో చిన్నపిల్లలు పడిపోవడం విషయంలో మనకి తోడున్న దేశాలు ఉన్నాయండోయ్. (అంతమాత్రాన మన దేశ ప్రజలు రిలాక్స్ అయిపోనక్కర లేదు). అంతగా అభివృద్ధి చెందని ఓ పాశ్చాత్య దేశపు (యూరప్ లో) ఉదంతం ఒకటి దొరికింది. అయితే ఆ పిల్లని సజీవంగా బయటకు లాగిన విధానంలో ఆసక్తికరమైన తేడా ఉంది.
అఫ్ కోర్స్, బావి లోతు బాగా ఎక్కువగా ఉంటే ఈ పద్ధతి వీలుకాకపోవచ్చేమో !? ఏమయినా ఈ సంఘటనలో కనిపించే ధైర్యసాహసాలు మెచ్చుకోదగినవి.
—————
2001 జూన్ లో (అమ్మో June 😳) రొమేనియా దేశంలో రెండేళ్ళ వయసున్న ఓ చిన్నపిల్ల బావిలో పడిపోయిందట. ఆ పిల్లని ఎలా రక్షించారో ఈ క్రింది యూట్యూబ్ విడియోలో మీరే చూడండి.
https://m.youtube.com/watch?v=WcoOF8MdRnE
—————–
ఆ సంఘటన గురించి వివరంగా The Seattle Post-Intelligencer (Seattlepi) అనే online newspaper లో జూన్ 12, 2001 న వచ్చిన రిపోర్ట్ ఈ క్రింది లింకులో చూడవచ్చు.
http://www.seattlepi.com/national/article/Teen-saves-toddler-from-well-in-Romania-1057069.php
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
వీడియో చూసాను సర్. లోపలికి దిగిన అమ్మాయి సాహసాన్ని మెచ్చుకోవాలి. లోతు తక్కువ కనక కుదిరింది. మన బోర్ వెల్స్ అన్నీ లోతు ఎక్కువ, డయామీటర్ తక్కువా. ఇక్కడ కష్టమే.
LikeLike