ఇది అర్ధం అవ్వాలంటే బాహుబలి సినిమా, కనీసం పార్ట్ టూ, చూసి వుండాలి. లేకపోతే దుర్గ్రాహ్యమైన ఈసాంకేతిక పరిజ్ఞానం అంటే కాంప్లికేటెడ్ టెక్నాలజీ పట్టుబడదు. దానికి తోడూ ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ ఎలక్ట్రానిక్ స్క్రీన్ మీద వ్రాయడం, ఆ సమయంలో ఫ్లైట్‌కి టర్బులెన్స్ ఎక్కువగా ఉండడంతో వేదాల్లో వున్న వైమానిక శాస్త్రంలా క్లిష్టంగా, అస్పష్టంగా తయారైంది. అందువల్ల సినిమా చూసి ఆపైన ఇది చూస్తే బెటరు.
ఫ్లైట్‌కి టర్బులెన్స్ రావడంలో వున్న రహస్యం ఏమిటో ఇప్పుడర్ధం ఔతోంది. అడుగున రాశాను. ముందు టపా చూసెయ్యండి…
ప్రాచీన సంక్లిష్ట సాంకేతిక దేవరహస్యాల్ని బయటపెట్టేప్పుడు భూమి కంపించడం, సముద్రాలు పొంగడం, … లాంటి విజువల్ ఎఫెక్ట్స్‌తో సహా ఈ ప్రపంచం సృష్టించబడిందని మనకి పాత సినిమాల ద్వారా తెలుస్తోంది. బహుశా అలాంటి ఎఫెక్టే ఆ టర్బులెన్స్ కూడాను, లోకకళ్యాణాన్ని సూచిస్తూ … ఒక సినిమా – మనకి నచ్చినా, నచ్చకపోయినా – రెండువేల కోట్ల కలెక్షన్ సాధించిందంటే దాన్నిలోకకల్యాణం కాక ఇంకేమనాలి? ఏమన్నా అందామన్నా బాహుబలి భక్తులు విరుచుకు పడిపోతుంటే ఇంకేమంటాం?
అంతే సంగతులు.
#”బాహుబలి సినిమా, కనీసం పార్ట్ టూ ..” .# అంటారేవిటి, ఇంకా పార్టులు ఉన్నాయా? భయపెట్టకండి స్వామీ 😳.
టర్బులెన్సుకి కారణం బాగుంది 😀. తాడిచెట్టు రహస్యం బట్టబయలవ్వడానికి అలాగే వేచి చూద్దాంలెండి గానీ 😀 ఈ లోగా ఓ మాట చెప్పుకుందాం. ఓ సినిమాలో బ్రహ్మానందం “ఈయన ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసుంటారు” అంటాడు చూసారా. అంత టర్బులెన్సులో వ్రాసినా మీ చేతివ్రాత ఇంత చక్కగా stylish గా ఉందంటే, కుదుపులు లేకుండా వ్రాస్తున్నప్పుడు ఇంకెంత అందంగా ఉంటుందో ! 👏
LikeLike
నమస్కారం VNR సర్.
// ….మీ చేతివ్రాత ఇంత చక్కగా…//
అంతా సామ్సంగ్ గెలాక్సీ నోట్ 5 ఫోను మహాత్మ్యం సర్. నేను కేవలం దాన్ని చేతిలో పెట్టుకున్న ఒక టూల్‌ని అంతే 😊
//తాడిచెట్టు రహస్యం బట్టబయలవ్వడానికి అలాగే వేచి చూద్దాంలెండి//
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న మిస్టరీ కంటే నాసా తాడిచెట్టు రహస్యం ఎక్కువ సెన్సేషన్ అవుతుందనుకుంటే మీరు అలా తీరిగ్గా వెయిట్ చేద్దామంటే ఎలా సార్?
//..కనీసం పార్ట్ టూ ..” .# అంటారేవిటి..//
పార్ట్ వన్ కూడా ఇప్పటికీ చూడని జితేంద్రియుల🙏 కోసం అలా అన్నానండి 😊
LikeLike
మేటిబాహుబలీయమైనటి మేటరున్నటి పద్ధతిన్
తాటిచెట్టును గట్టిలాగగ తాడు ద్రెంచెను రాకెటౌ
సూటిగానటు రావడిన్ భళి సూత్రమై సడి జేయుచున్
కోటగట్టిరి గాధలన్నట కోట్ల దస్కము లాభమౌ 🙂
జిలేబి
LikeLike
జిలేబిగారు, మీరైనా నీల్ 💪ఆర్మ్‌స్ట్రాంగ్💪 వీపున కట్టుకున్న తాటిచెట్టు మిస్టరీని పద్యాలతో ఛేదిస్తారని ఆశించాను, ప్చ్!
LikeLike
అది తాటికల్లు మహాత్మ్యమని మాతృభూతం ఉవాచ 🙂
జిలేబి
LikeLike
ఓహ్! చంద్రలోకంలో తాటికల్లు తాగడానికా? హతవిధీ!!
శివగామి ఐడియానా? (మాతృభూతం=శివగామి. ఆవిణ్ణి మించిన మాతృభూతాలు ఎక్కడుంటారు?)
LikeLike
నోటుబుక్కున గీతగీసెను నోడ వచ్చిరి యెల్లరున్
నీటుగానటు నీలియార్ముడు నీరజారిని జేరగన్
తాటికల్లును త్రావినాడు సు తారమైయటు బోవనౌ !
మాటువేసి జిలేబివచ్చెను మత్త కోకిల గానమై !
జిలేబి
LikeLike
జిలేబిగారు,
నీలియార్ముడు – 👌👌👌👌 వీరతాడు 👍
నీరజారి – అంటే చంద్రుడని ఇప్పుడే తెలిసింది.మీ పద్యాల మూలంగా ఇప్పటికో పదో పదిహేనో కొత్త తెలుగు మాటలు తెలిసాయి. ఇది లేటెస్ట్. 👏👏👏
LikeLike
బలి-చక్రవర్తులు, బలి-పశువులు …. pun బహు-బాగు 😀
మీరేసిన బొమ్మలు మహా-బహు-బాగు 👏
LikeLike
థాంక్సండీ, లలితగారు. ఫ్లైట్‌లో ఏ punలూ(పనులు) లేక ఈ punలు ఇలా వర్కౌట్ అయిపోయాయి, అంతేనండి😊. ఇంక బొమ్మలంటారా, క్రెడిట్ గోస్ కంప్లీట్లీ టు సామ్సంగ్ నోట్5. మీ చప్పట్లు దానికే అంకితం చేస్తున్నా 🙏
LikeLike
మీ చేతివ్రాత VNR గారు చెప్పినట్టు భలే అందంగా ఉంది (మౌస్తో వ్రాసిన కూడా). బొమ్మలు కూడా. మిగిలిన పార్టులకి నేను రెడీ.
LikeLike
అన్యగామిగారు నెనరులు 🙏
మౌస్ కాదండి, స్టైలస్‌తో రాసినది. థాంక్స్ టు టెక్నాలజీ.
//మిగిలిన పార్టులకి నేను రెడీ//
😆 విధి బహుబలీయమైనది మరియు బాహుబలీయమైనదీను.😆
LikeLike
ఈ చేతివ్రాత ఎక్కడనో చూచియుంటినే! ఎక్కడైయుండనోపు?
బాహుబలి మొదటి దాని సీక్వెల్ చూడలేదు,మూడవది రాబోతోందష! అందులో తాడి చెట్టు వివరం దొరకచ్చు, కట్టప్ప బాహుబలిని ఎందుకుచంపేడో పార్ట్ రెండులో తెలిసినట్టుట 🙂
LikeLike
గురువుగారూ 🙏
//ఈ చేతివ్రాత ఎక్కడనో చూచియుంటినే! ఎక్కడైయుండనోపు?// మీరే చెప్పాలండి.
//బాహుబలి మొదటి దాని సీక్వెల్ చూడలేదు// అంటే బాహుబలి వన్ చూశారన్నమాట. మీ యాభైఆరవ వెడ్డింగ్ డే సందర్భంగానా? (సరదాగా అడిగానండి, ఏమీ అనుకోరనే అనుకుంటూ)
LikeLike
పొర’బడితి’రే వాక్యమును గమనింపుడు,”బాహుబలి మొదటి, దాని సీక్వెల్ చూడలేదు”
ఈ సమయాన్ని అలా ఉపయోగించుకోలేదండి
🙂
LikeLike
సర్, పన్ను(pun)పోటును పట్టలేకపోయాను.
LikeLike
బాహుబలి చూడక ఎంత మిస్సవుతున్నారో శర్మ గారు చూసాక అర్థమవుతుంది.
జిలేబి
LikeLike
ఓ! వైవీ ! యీ రాత
న్నే వోమారెక్కడో గనేనుగద? జిలే
బీ వోలెవున్నదే ! య
బ్బీ! వూరేదో ? విషయము బిగిబిగి తెలుపన్ 🙂
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
జిలేబిగారూ,
//ఓ! వైవీ ! యీ రాతన్నే వోమారెక్కడో గనేనుగద?//
గురువుగారి కామెంటుకి ఇంత బాగ్రౌండు ఉందా? బాపూ ఫాంట్‌కి, సామ్సంగ్ నోట్ రాతకి అంత పోలికుందా? పాపం బాపూగారు.
LikeLike
బాపూ గారిదో బాపాయమ్మ గారిదో కష్టే ఫలే వారు చెప్పేదాక తేలదండిఆయ్ 🙂
జిలేబి
LikeLike
@ జిలేబి, ఇప్పుడు బాపుగారా, బాపాయమ్మగారా అని కాదండి కొశ్చను, బాపు = బాపాయమ్మ = సామ్సంగ్ నోట్5 అని తేల్చేస్తే ఎలాగా అన్నది పాయింటు👀. సర్లెండి వెయిట్ చేద్దాం 😂
LikeLike
సమసంఘనోటు ఫైవున
జమగట్టి మనుజుడు చిత్ర చామర వీచన్
గమనింపవచ్చి గురుడొక
సమస్యను కెలికె జిలేబి సహచరుడుగదా 🙂
జిలేబి
LikeLike
//సమసంఘనోటు ఫైవున…// అంటే సోషలిస్ట్ సొసైటీలో ఐదు రూపాయలు జమకట్టిన ఒకడు బొమ్మలు వేయబడిన వింజామరతో విసరగా చూచి సమస్యను పూరించిన ఒక ఉపాధ్యాయుడు జిలేబికి కొలీగ్.
ఎంత కష్టపడి టీకాతాత్పర్యం రాసానో చూడండి. అక్కడ శంకరాభరణంలో సమస్యలకి పద్యాలు సృష్టించుట; తక్కిన బ్లాగులలో పద్యాలనే సమస్యలుగా ఇచ్చుట. ఏవఁన్నా భావ్యమా చెప్పండి?
LikeLike
చాలా ముచ్చట గా ఉందండీ మీ టీకా !
మీలాంటి టీ కాఫీ తాత్పర్యం వ్రాసే వాళ్లున్నంత దాకా మా లాంటి కవయిత్రులు/కవులు బతికి పోవచ్చు అజరామరమై 🙂
చీర్స్
జిలేబి
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
జిలేబిగారూ ,
//మా లాంటి కవయిత్రులు/కవులు బతికి పోవచ్చు//
ఆ రకంగా కవిపోషకుణ్ణయ్యాననమాట. పదిలక్షల నెనరులు ( = థాంక్స్ ఎ మిలియన్)😊🙏
LikeLike
YVR గారు, రెండవ బాండ్ – జేమ్స్ బాండ్ – Roger Moore మూడు నాలుగు రోజుల క్రితం కాలం చేసారు (89 ఏళ్ళ వయసులో). అటువంటి నటులు సినిమా రంగంలో (ఏ భాషైనా కూడా) “లెజెండ్”లు కదా (పైగా బాండ్ ఫైట్లు మన సినిమాలకు స్ఫూర్తి కూడానూ 😀). మీలాంటి చెయ్యితిరిగిన బ్లాగర్ ఆయనకో నివాళి టపా వ్రాస్తే బాగుంటుందని జనాభిలాష.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
వీఎన్నార్ సర్, రోజర్ మూర్ వెళ్ళిపోయాడా!! ప్చ్! R.I.P తప్ప ఏమనగలం? అతని బాండ్ రోల్స్ నాకూ ఇష్టమండి. షాన్ కానరీ స్టైలిష్ బాండ్ అయితే మూర్ ఫన్ లవింగ్ బాండ్ అనిపిస్తుంది. వాళ్ళిద్దరి తరవాత వచ్చిన బాండ్స్ ఒక్కడూ నచ్చలేదు.
//మీలాంటి చెయ్యితిరిగిన బ్లాగర్ ఆయనకో నివాళి టపా వ్రాస్తే ..// ఇది మీ ఆశీర్వాదంగా భావిస్తాను🙏. ఏదో పుర్రెలో పుట్టిన ఆలోచనల్ని అప్పటికప్పుడు సరదాగా రాసేయడమేగానీ సీరియస్ రైటింగ్ రాదండి .
LikeLike
YVR గారు, మీరు మాకు సమకాలీనులో కాదో తెలియదు. మా రోజుల్లో మా ఫ్రెండ్సెవరైనా చెప్పింది మాకు అర్థం కాకపోతే – టీకాతాత్పర్యాల కోసం ప్రయాస పడకుండా 🙂 – చింపుల్ గా “బాటారా, బాటా” అనేవాళ్ళం. అంటే నువ్వు అన్నది మాకర్థమయతే మమ్మల్ని బాటా (Bata) చెప్పుతో కొట్టరా అనన్నమాట భావం 😀. కొంతమంది కరోనా (Carona) చెప్పులిష్టపడేవారు 🙂. ఆ రోజుల్లో మనదేశంలో చెప్పుల తయారీ కంపెనీలు అవి రెండే లెండి. jk.
Disclaimer :- శర్మ గారు తన ఈరోజు టపాలో అన్నట్లు, ఇది ఎవరినీ ఉద్దేశ్యించి వ్రాసింది కాదు ☝️🙂.
LikeLike
ఆలస్యం గా కామింటుతున్నందుకు క్షమించాలి. చాలా బావున్నాయి బొమ్మలు. ఇంత సృజనాత్మకత పెట్టుకుని నాకేమి రాదు అని చెప్పటం నిజంగా మీ గొప్పతనం( ముందు టపాలలో ఈ మాట అన్నారు మీరు). ఇంక బాహుబలి వద్దండీ బాబు. ఎన్ని భాగాలూ చూస్తాము ?
LikeLike
చంద్రిక గారు నెనరులు. నిజంగానే ఏమీ రాదండి. అంటే, ఎక్కడో ఏదో విన్న/చూసినప్పుడు ఒకోసారి అసంకల్పిత ప్రతీకార చర్యలాగా రాయడమే తప్ప, ఫలానా టాపిక్ మీద రాయాలని మొదలెడితే అస్సలేం రాదు.
//బాహుబలి వద్దండీ బాబు. ఎన్ని భాగాలూ చూస్తాము//
బాహుబలి చూడకపోతే పాపం అన్నట్టు ఎవరైనా అన్నప్పుడల్లా, అది విన్నప్పుడల్లా ఇదో రియాక్షన్. ఇంకొక్క భాగం అనుకున్నాను కానీ … ,,,, ఇప్పుడు ఆలోచనలో పడ్డాను. 🙂
LikeLiked by 1 person