నిర్భయ కేసు నిందితులకి పడ్డ ఉరిశిక్షల్ని సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేశాక ఒక సెలబ్రిటీ అభిప్రాయం ఇలా బైటపడింది –”నిర్భయ కేసు నిందితులకు ఉరిశిక్ష విధించడం తప్పు. వాళ్లకు స్త్రీ విలువేంటో అర్థమయ్యేలా చెప్పాలి తప్ప, ఉరిశిక్ష విధించడం కరెక్ట్ కాదు. తమ తప్పు తెలుసుకునే అవకాశం వారికివ్వాలి.”
బానేవుంది కదా!!
కాదు బ్రహ్మాండంగా వుంది.
ఎవరికీ?
మృగాళ్ళకి + మేధోశక్తి ఎక్కువైపోయి, ఓవర్-ఫ్లో ఐపోతున్నవాళ్ళక్కూడా.
నాకు జంతువులంటే ఇష్టం. వాటి మీద కరుణ, ప్రేమ చూపించడమన్నా, అలా చూపించేవాళ్ళన్నా కూడా చాలా ఇష్టం. అందుకే ఎవర్నైనా పిచ్చికుక్క కరిచి, వాళ్ళు దాన్ని చంపాలని చూస్తుంటే – “పిచ్చికుక్కల్ని చంపడం తప్పు. వాటికి మనుషుల విలువేంటో అర్ధమయ్యేలా చెప్పాలి కానీ కుక్కలబండిలో పడెయ్యకూడదు. వాటి పిచ్చిని అవి తెలుసుకునే అవకాశం వాటికివ్వాలి,” అంటే ఎలావుంటుందని ఆలోచిస్తున్నా ఆ సెలబ్రిటీ స్టేట్మెంట్ విన్నప్పట్నుంచీ. కాకపోతే పిచ్చెక్కింది కుక్కకా, నీకా అంటారేమో జనం అనే డౌటు పట్టుకు పీడిస్తోంది. ఆ సెలబ్రిటీ తప్ప ఈ డౌటు ఎవరూ తీర్చలేరేమో.
హలో! సెలబ్రిటీ! నిర్భయకేసు నిందితులకి ఉరిశిక్ష వేసింది పగ తీర్చుకోడానికనుకుంటున్నావా? అబ్బే! అదేం లేదు. ఓ నలుగుర్ని ఉరి తీస్తే దేశంలో ఎక్కడో ఎప్పుడో మరో నలుగురు మృగాళ్ళలోనైనా మానసికమృగత్వం భౌతికమృగత్వంగా మారకుండా ఆగుతుందని ఈ దేశానికి ఓ చిన్న ఆశ,అంతే. గాల్లో పెట్టిన దీపంలా మినుకు మినుకుమనే ఆశ, అంతే. ఖర్చు పెట్టిన ప్రతి పైసాకి, కార్చిన ప్రతి చెమటబొట్టుకి రాబట్టే ప్రతిఫలంలో క్వాలిటీని, వేల్యూని లెక్కపెట్టే మన జాతి – ఐ మీన్ మొత్తం మానవజాతి – నిముషానికి రెండొందలడెబ్భైఎనిమిదిమంది చొప్పున పుడుతున్న మనుషుల క్వాలిటీ (గుణగణాలు)ని, వేల్యూ(విలువలు)లని ప్రస్తుతం పట్టించుకోవట్లేదు, పెంచట్లేదు. అవి పెరిగేవరకూ మృగాళ్ళలో పరివర్తన (😂) తెచ్చే నీ మానవతావాదం, టెర్రరిస్టులకి అహింస (😂) నేర్పే నీ ఆశావాదం వెర్రిప్రజలకి ప్రమాదకరమే కానీ పనికొచ్చే వ్యవహారం కాదు. పిచ్చికుక్కలో ఎంత మార్పు తీసుకురాగలమో వాళ్లలోనూ అంతే మార్పు తేగలము. సో, కొన్నాళ్ళు ఆ స్టేట్మెంటు పక్కనపెట్టు. నీకో దణ్ణం. 🙏
కుక్క అరవడం దాని స్వతంత్రత దాని కాదంటే కుదరదు, పిచ్చి కుక్కలు అరుస్తుంటాయి, కరుస్తుంటాయి….ఇది తెలుసుకుని ప్రతిక్రియ చేసుకోవాల్సిన అవసరం మీదే
LikeLike
గురువుగారూ 🙏.
ముందుగా యాంటీరేబీస్ వాక్సిన్ ఇచ్చేస్తే కుక్క ఎంత అరిచినా ఫర్వాలేదు, కరుస్తుందనే భయమూ ఉండదు. 😊
LikeLike
ముళ్ళపూడి వెంకట రమణ గారి “నవ్వితే నవ్వండి” లోని ఓ జోక్ గుర్తొచ్చింది 🙂.
సినిమా హాల్లో సీట్లల్లో నల్లులు ఎక్కువయిపోయినాయి, వాటిని నిర్మూలించడానికి “వాటీజ్ ది గవర్నమెంట్ డూయింగ్” అని ఒకాయన పేపర్లో ఉత్తరం రాసాడట. వాటితో స్నేహం చెయ్యండి, వాటిని ప్రేమించడం నేర్చుకోండి, వాటిల్లో ప్రవహిస్తున్నదీ మన రక్తమే అని మరొకాయన జవాబిచ్చాడట 😀.
అలాగే ఉంది సూడో-మేధావుల / స్వయంప్రకటిత మానవతావాదుల ధోరణి. ఆ ముద్దాయిల్లో ఒకడు ఓ ఇంటర్వ్యూలో – తన నేరానికి పశ్చాత్తాపం చూపించకపోగా – అర్ధరాత్రి అలా తిరిగే ఆడవాళ్ళకి అదే శిక్ష లాంటి మాటలేవో మాట్లాడాడు. దీని మీద పుస్తకం రాసేసిందో విదేశీవనిత. ఇటువంటి విషయాలలో వివాదాస్పదమైన స్టేట్మెంట్లు ఇచ్చే “మేధావులకు” దీటైన జవాబు చెబుతుండాలి. ప్రతిదాన్నీ కాంట్రవర్సీ చేసే ప్రయత్నాలు ఎక్కువవుతున్నాయి ఈమధ్య కాలంలో, తద్వారా పేరు / మరింత పేరు తెచ్చుకుందామనే ఉద్దేశ్యమా??
LikeLike
VNRగారు 🙏.
నవ్వి, తేనయ్యేలా మంచి జోకుతో రమణగార్ని గుర్తు చేశారు. నెనరులు. మీరంటున్న ఆ “మేధావుల”చేత రమణగారి రచనలన్నీ జీవితాంతం చదివించడం మంచిదేమో 😊
LikeLike
వెర్రి వెయ్యి విధాలు అని, ఏమి మాట్లాడుతున్నారో కొందరికి వారికే అర్ధం కావట్లేదు. బాగా చెప్పారు.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike