😇జీ(వి)తం=జీ(వితం)=(జీవి)తం😇 ; …..బలుసాకు🌿తినో, బాహుబలి-2 💪 చూసో……


ఇవాళెందుకో జీవితం అనే పదం మీద అనుకోకుండా దృష్టి పడింది. ఎంత అనుకోకుండా అంటే దానికి యాదృచ్చికం అనే మాంఛి బరువైన పదం వాడేయ్యచ్చు. నిజానికి కాకతాళీయం వంటి దృష్టాంతవిశేషాన్ని కూడా జతపరిచి మరీ వాడచ్చు. అంత యాదృచ్చిక-కాకతాళీయమంత అనుకోకుండా జీవితాన్ని, ఐ మీన్ ఆ పదాన్ని, మూడుముక్కలు చెయ్యాలనిపించింది. జీవి, వితం, జీతం.

ఏంటీ గోల? శంకరాభరణంలో దాసు మేష్టారు చేసే సంగీత ప్రయోగాల్లా ఈ భాషా ప్రయోగాలేంటి అనిపిస్తోందా? ఏమనిపించినా ఏం లాభం లేదు. ఈ లోకం డోసులు, దాసులు, బాసులతో నిండిపోయింది. [ప్రస్తుతం ఈ టాపిక్ మీద వివరించే టైములేదు. ఇప్పుడే ఇంటిబాసు భోజనాలకి రెడీ అవ్వమని అల్టిమేటం ఇచ్చి వెళ్ళింది. ముందీ పోస్టు పూర్తి చేసెయ్యాలి.]  

సరే, జీవితమ్మీద పరిశోధనలో భాగంగా విత అంటే ఏంటని ఆంధ్రభారతిలో చూశా. వితా యొక్క రూపాంతరం అని వుంది. ఇంకొంచెం కిందకెళ్తే విత=వ్యర్ధం అనుంది. వ్యర్ధం అంటేనే సున్నాకి పర్యాయపదం. దానికి ఇంకో సున్నా కలిపితే పోయేదేముంది? అంచేత విత కి సున్నా కలిపి వితం = వ్యర్ధం అని సరిపెట్టేయ్యచ్చు. సరిపెట్టేసుకోడం నచ్చకపోతే పొయెటిక్ లైసెన్స్/ఆర్టిస్టిక్ లైసెన్స్ అనీ కళాత్మక జస్టిఫికేషన్ ఎలాగో ఉంటుంది కదా.

జీవితంలో దాక్కున్న ఈ మీనింగ్ ఎంత……. అమ్మో, అనుకుంటేనే హడలుపుడుతోంది. జీతానికి జీతం అనే పేరు ఏ మహాత్ములు పెట్టారోకానీ లేకపోతే ఇంకేమన్నా ఉందా? అసలే జీవితం బుడగస్య బుడగః, దానికి తోడు జీతం లేకపోతే ఇంకెంత దుర్భరం? భీకరం? జీతం లేని జీవి బతుకు వితం. వర్క్ ఈజ్ వర్షిప్ అనేది ఇందుకేనా? కర్తవ్యం కర్మ కూడా ఇలాగే వచ్చిందా ఏంటీ? “ధనమేరా అన్నిటికీ మూలం” పాట ఇందుకే పుట్టిందని ఎలాగో తెలుసు.

పూర్వం కర్తవ్యం అంటే స్వధర్మం పాటించడం, పరధర్మం జోలికెళ్ళకుండా వుండడం, ఆధ్యాత్మికతలో బతుక్కి అర్ధం వెతుక్కోవడం, అందిన దానితో (అది ఏదైనా సరే 😉 ) తృప్తి చెందడం… ఇలాగే వుండేది(ట) జీవితం. 

ఆఁ! అలా అంటారంతే, నిజంగా వుందో లేదో ఎవరికి తెలుసు? అనిపిస్తే…

అదేం తప్పుకాదు, ఎందుకంటే నాక్కూడా అలాగే అనిపిస్తుంది. కానీ, ఒకళ్ళిద్దరైనా great soulsని చూడ్డం వల్లనేమో, అప్పుడప్పుడే అలా అనిపిస్తుంది. అనిపించడం తప్పు కాదు కానీ అనిపించినా దాన్ని ఎనలైజ్ చేసుకోకపోవడం తప్పే. మొన్నమొన్నటి వరకూ అలా జీవితాల్ని గడిపినవాళ్ళున్నారని తెలిసీ అటువైపు వెళ్ళలేని, వెళ్ళనివ్వని పరిస్థితి ఒక రకంగా దురదృష్టమే(నేమో?) ఎందుకంటే –

జీతం, ఎక్కువ జీతం, ఇంకా ఎక్కువ జీతం – ఇదే పరమధర్మం ఐపోయాక జీవితంలో మిగిలేదేఁవుందీ?? – బాంకులో జీతం – బతుకంతా వితం – జీతానికి, వితానికీ మధ్య తృప్తిలేని జీవి .. ప్చ్!ప్చ్!ప్చ్!

ఇంతవరకూ రాశాక, ఎందుకైనా మంచిదని ఆంధ్రభారతి మళ్ళీ తెరిచా … “తం” అంటే అర్ధం ఏమన్నా ఉందా అని. వుంది. ఇదీ 👉, తం = ధనధాన్యాలను సిద్ధింపజేసే శక్తి కలిగిన మోహకర బీజాక్షరం(ట) 😂ధనధాన్యాలు సిద్ధించే వరకూ ఓకే, కానీ ఆ “మోహకర” ఎందుకుట? పెర్వర్టెడ్ మోహం = వ్యామోహం (ఆబ్సెషన్) కాదూ? జీతం కోసం జీవితమా? జీవితం కోసం జీతమా? – ఇది తేల్చుకోలేని స్థితిలో ఉన్నామంటే అది ఒక రకమైన పెర్వర్షనే కదూ?!?! ఆఫ్ కోర్స్  అది ఏ ఒక్కరివల్లో కలిగిన పెర్వర్షన్ కాదు కానీ మానవజాతి మొత్తం తెలిసో తెలియకో సృష్టించుకున్న కలెక్టివ్ పెర్వర్షన్, అంతే🙈 🙉 🙊.

అయ్యబాబోయ్, జీవితాన్ని మధించిన కొద్దీ జీవితం అంటే కంప్లీట్లీ కమర్షియల్ ఎఫైర్, పూర్తిగా పదార్ధవాదం, టోటల్ మెటీరియలిజంలా వుందే అనిపించేస్తోంది. కలియుగాన్ని దృష్టిలో పెట్టుకునే జీవితాన్ని జీవితం అన్నారేమో అనికూడా అనిపించేస్తోంది. ఇంత అనిపించినా ఆశ చావక ఒక్కసారి జీవితం మొత్తానికి అర్ధం ఏంటో చూద్దామని మళ్ళీ ఆంధ్రభారతి ఓపెన్ చేశా –

జీవితం = 1. ప్రాణము 2. జీతము అనుంది.

హతోస్మి!! ప్రాణానికీ డబ్బుకీ ఏవిటీ అవినాభావసంబంధం?  ప్రాణానికి జీతం పర్యాయపదమా లేక జీతానికి ప్రాణమే దాసోహమా? చాలా బాలన్స్డ్‌గా నడుపుకోకపోతే జీవితం మీనింగ్‌లెస్ అని చెప్పటానికేనా ఈ అక్షరాలూ, పదాలూ ఇలా కూడబలుక్కుని ఒకటిగా జీవిస్తున్నాయ్?

బతికుండి బాధ్యతగా జీతం అందుకుంటే బలుసాకు తినో, బాహుబలి-2 చూసో బతికెయ్యొచ్చు కానీ ఇలా పదాలు, పదార్ధాలమీద ఇలాంటి తిక్క రీసెర్చి ఇంకెప్పుడూ చెయ్యకూడదని రియలైజ్ అయ్యి, డిసైడ్ కూడాజేసేసుకుని ఇంతటితో ఈ టపా ముగిస్తున్నా…బై4నౌ

14 comments


 1. జీవితమును వెదికారోయ్
  సావీ ! యేమర్థమొచ్చె సంశోధనలో !
  ఓ వైవీరాశ్రీ! యివి
  గో వీరత్రాళ్ళు వేసు కోండి విత వితా 🙂
  జిలేబి


  https://polldaddy.com/js/rating/rating.js

  Like

  1. 🙏 గురువుగారు. //జీవితమంటే జీతమేనా?// కాదనే నమ్మకం, కాకూడదనే ఆశ. లిటరల్ అర్ధం చూస్తే మాత్రం 1912 నాటికే ఈ కాన్సెప్ట్ స్థిరపడిపోయినట్టుంది. ఆంధ్రభారతిలో జీవితము = 1.ప్రాణము; 2.జీతము. [శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912] అని ఉండడం, ప్రస్తుతకాలపు ఉరుకులుపరుగులకి సరిగ్గా సరిపోయేలా జీవితం అనే పదంలో ఇన్ని అర్ధాలు దాక్కుని ఉండడమే నా ఆశ్చర్యానికి, ఈ టపాకీ మూలం.

   Like

 2. జీవిత మంటే జీత
  మ్మే ?వై వీ చెప్పవయ్య మేష్టారకటా
  కోవిదడే యడిగె జిలే
  బీ! వివ రించెను నిఘంటు వేగములాడన్ !

  జిలేబి

  Like

  1. జిలేబిగారు మీ పద్యానికి జవాబు, రెండు హైకూలు 🙂 నిఘంటువు ప్రకారం –

   జీవితం
   =జీవం
   +జీతం

   ఈ రోజున్న వాస్తవం ప్రకారం –

   జీవితం
   -జీతం
   =వితం

   Like

 3. మీ ఈ జీవితం / జీతం / వితం టపాకు సంబంధంలేని వ్యాఖ్య. కానీ వ్రాయాలనిపించి, ఎక్కడ వ్రాయాలో తెలియక ఈ టపా క్రింద వ్రాసేస్తున్నాను.
  మీ బ్లాగ్ పేజ్ లో కుడిచేతివైపు ఓ పొడుగాటి కాలమ్ ఉంది (దానికి వ్యాఖ్యల సౌకర్యం ఉందా !?). అక్కడ మీరు వ్రాసిన “కోడియేటర్” (పదం బాగుంది 👌) ఫొటోక్రింద < " కోడిని చూసినప్పుడల్లా ఇలాంటివి గుర్తొచ్చి దానిమీద జాలేస్తూవుంటుంది " అన్నారు కదా.
  నేనీమధ్యనే మరోటి కూడా చూశాను. ఓ పదిహేను రోజుల క్రితం మా దగ్గరబంధువొకాయన పోయారు. అంత్యక్రియలు జరుగుతున్న టైములో (ఆ రోజు బుధవారం) మరొక పాడె వచ్చింది. దానిపై మృతశరీరంతో బాటు ఓ బతికున్న కోడిపుంజు కూడా కట్టేసుంది. మొత్తం నేలపై పెట్టి ఆ శరీరం వంతు కోసం వేచిచూస్తూ కూర్చున్నారు వారి తాలూకు మనుష్యులు. ఆ క్షణంలో నాపై కొంచెం గౌతమబుద్ధుడు ఆవహించినట్లనిపించి (🙂) వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆ కోడిని బలిస్తారా అనడిగాను. వాళ్ళల్లో ఓ వ్యక్తి అదేమీ చెప్పకుండా మంగళవారం చనిపోతే కోడిని కూడా తీసుకురావడం మాలో ఆచారం అండీ అన్నాడు. అనవసరంగా దాన్ని చంపడమెందుకండీ అన్నాను. చంపమండి, కాసేపాగి వదిలేస్తాం అన్నాడతను. అయితే సరే అని నేను మా వాళ్ళ దగ్గరకు వచ్చేసాను. మా కార్యక్రమాల హడావుడిలో పడిపోయాం. కానీ తరవాత తరవాత ఆలోచిస్తే అతను వెటకారమాడాడా అనే అనుమానం వస్తోంది – ఎందుకంటే, అక్కడ దాకా తీసుకొచ్చిన కోడిని ఊరికే వదిలేయడానికి తెచ్చామా వెర్రివాడా అని అతని భావమా అని ఇప్పుడనిపిస్తోంది. మీరు చెప్పిన ఆప్షన్సే కాక ఇటువంటి "సద్గతులు" (సజీవదహనమా??) కూడా సంప్రాప్తిస్తుంటాయా కోళ్ళకు పాపం ?
  మీరు చైనాలో ఉన్నట్లున్నారు – చైనీస్ కంపెనీ ఆవరణలో తిరుగుతున్న కోళ్ళని ఫొటో తీసారంటే.

  Like

  1. మీ కామెంటు ఎందుకో spam లోకి వెళ్లిపోయిందండీ. ఇప్పుడు ఓకే .
   మీరు చెప్పిన విషయం నాకు మెసొపొటేమియన్ నాగరికతని గుర్తుకు తెచ్చింది సర్ .
   చనిపోయిన ఫారోలని దాస దాసీజనం,గుర్రాలు,అతను తినే రకరకాల పక్షులు,జంతువులతో సహా సమాధి చేసేవారట. ఆ నాగరికత పోయినా అనాగరికత ఇంకా మిగిలే ఉందన్నమాట, అదీ మనదేశంలో. ప్చ్. దానిపై మీ అబ్జర్వేషన్స్ చాలా టచింగ్ గా వున్నాయి.🙏

   నరసింహుడు కాసేపు బుద్ధుడవటం చాలా సహజంగా ఉందండీ. ఇద్దరూ ఒకరే కదా 🙏
   మొన్ననే బుద్ధపూర్ణిమ వచ్చింది కూడా😊

   Like

   1. Thanks YVR గారు. మీరన్నది కరక్ట్. ఆ టైములో నాకు కూడా ఆ నాగరికతే గుర్తొచ్చింది. మనస్తత్వాల రీత్యా చూస్తే మనం వెనక్కు ప్రయాణిస్తున్నామా అనిపిస్తుంటుంది నాకు తరచూ.
    Thanks again. అలాగే అటుమొన్ననే నరసింహ జయంతి కూడా 😀 (jk). నేను సామాన్య మానవుడిని మాత్రమేనండి 🙏.


    https://polldaddy.com/js/rating/rating.js

    Like

 4. విన్నకోట నరసింహారావుగారు, YVR
  అక్కడ కామెంట్ కి ఇక్కడ జవాబు 🙂
  మంగళవారం నాడు చనిపోతే కూడా మరో ప్రాణిని బలి ఇవ్వడం ఆచారం ఉంది. దానికిగాను కోడిని పాడెకు కట్టే ఆచారం ఉంది. నేటి కాలంలో శాకాహారులైతే పిండి బొమ్మను పెట్టే ఆచారం కొనసాగుతోంది.
  మరోమాట ఈ ఆచారం రామాయణ కాలం నుంచీ ఉంది,వారంతో లెక్కలేక. రావణ కాష్టానికి నల్ల మేకపోతును బలిచ్చినట్టు వాల్మీకి మాట.
  ధన్యవాదాలు.


  https://polldaddy.com/js/rating/rating.js

  Like

 5. 1 .ఆచారాన్ని వదులుకోలేనప్పుడు అందరూ పిండిబొమ్మనే పెట్టుకునేలా మార్చుకుంటే బాగుణ్ణు.
  2 . ఇదేదో కేవలం మంగళవారానికి సంబంధించిన సెంటిమెంట్ లా వుంది. పంచాంగంలో పక్షాలదే ప్రాముఖ్యత కానీ, వారాలది కాదని ఒక ప్రవచనకర్త చెప్పినట్టు గుర్తు.

  Like

 6. శర్మ గారు, వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ ఒక ప్రాణి చనిపోతే మరో ప్రాణిని (నోరు లేనిదాన్ని) బలివ్వడం చాలా హేయమైన ఆటవిక ఆచారం అని నా గట్టి అభిప్రాయం. మరీ రాచపీనుగ సామెతలాగా. ఇటువంటి విషయాలలో మనిషి తన ప్రతాపమంతా తప్పించుకోలేని, ఎదురు తిరగలేని, కళ్ళెదురుగా తిరుగుతుండే కోళ్ళు, మేకలు, గొఱ్రెలు లాంటి జీవాల మీదనే చూపిస్తాడు.
  నా పాయింట్ ఏమిటంటే ఏ రకమైన ప్రాణినైనా చనిపోయిన మనిషికి బలివ్వడం (తిండి కోసం ఎలాగూ వందలు వేల సంఖ్యలో రోజూ చంపుతూనే ఉన్నారు, పైన ఇటువంటివి కూడానా!) ఏవో గుడ్డినమ్మకాల వలన మొదలయింది బహుశః – పరలోకంలో ఆహారం కోసమనో, లేదా అక్కడ కూడా సేవ చేస్తాయనో (YVR గారన్నట్లు – పురాతన ఈజిప్షియన్ నాగరికతలోలాగా). కానీ సైన్సు ఇంతగా అభివృద్ధి చెందిన తరవాత కూడా మనస్తత్వాలు మారడంలేదు. ఇది సభ్యసమాజం విచారించవలసిన సంగతి.
  అంతగా ఆచారాలు పట్టుకునే వేళ్ళాడాలంటే మీరు, YVR గారు అన్నట్లు శాకాహారులు మాంసాహారులు అనే తేడా లేకుండా అందరూ “పిండిబొమ్మ” ప్రత్యామ్నాయ పద్ధతే కానిస్తే ఈరకపు జీవహింస తగ్గుతుంది.
  ఏమైనా ఇదంతా మన “బ్లాగ్ శోష” మాత్రమేలెండి.
  (ఈ వ్యాఖ్య శర్మగారి “కష్టేఫలే” బ్లాగ్ లో కూడా పెట్టాను 🙏).

  https://polldaddy.com/js/rating/rating.js

  Like

  1. విన్నకోట నరసింహారావుగారు,
   మాంసాహార జీవులకు మాంసమే ఆహారం, మరొక ప్రత్యామ్నాయం లేదు, ఇది ప్రకృతి నియమం. ఒకప్పుడు మానవులందరూ మాంసాహారులే, నేటి శాకాహారులతో సహా! కారణాలేమైతేనేమి కొందరు శాకాహారులయ్యారు, కొన్ని నిబంధనలు మార్చుకున్నారు. జీవహింస ప్రకృతిలో మాట,దానిని దాటగలమా? మాంసం తినడం మానెయ్యమని భీష్ముడినుంచి బుద్ధుడి దాకా చెప్పేరు, ఎవరు విన్నారు? బుద్ధుడెలా చనిపోయాడు?
   ఇలా పాడెకు కట్టి బలి ఇచ్చినదానిని పారేయరు, ఆహారంగానే స్వీకరిస్తారు 🙂
   ఆచారాలు తప్పవు. ఇక ముందుకుపోను….
   ధన్యవాదాలు.


   https://polldaddy.com/js/rating/rating.js

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s