బాహుబలికి కల్ట్ స్టేటస్ వచ్చేసింది. ఎంతంటే ఆ స్టేటస్ చూసి ముక్కున వేలేసుకుందామంటే ఒక ముక్కు , దానిపై ఒక వేలు సరిపోవట్లేదుట. పోనీ మొత్తం పదివేళ్ళూ ముక్కున వేసుకున్నా అదీ చాలట్లేదుట. పదిముక్కులు, రెండొందలవేళ్ళతో రావణాసురుడో; ఒక ముక్కు, పదివేల వేళ్ళు వున్న కార్తవీర్యార్జునుడో తప్ప మామూలు మనుషుల వల్ల కావట్లేదుట.
కలెక్షన్స్‌లో హాలీవుడ్ సినిమాల్ని తుంగలో తొక్కేసిన బాహుబలిని చూసి ‘అమెరికా’లకేయుడు ట్రంప్ జడుసుకుని తెలుగు సినిమాలు – అవి స్ట్రైట్ తెలుగు సినిమాలు కానీ, తెలుగు నుంచి ఇతర భాషల్లోకి డబ్బింగ్ / రీమేక్ ఐనవి కానీ – యూఎస్సేలో విడుదలవ్వడానికి లేకుండా మెక్సికో బోర్డర్ మీద కడుతున్నట్టు మరో గోడ కట్టేయ్యాలని డిసైడ్ చేసేశాడుట. ఇంకా పైగా దానికయ్యే ఖర్చు ఇండియానే భరించాలని కూడా అంటున్నాడుట. ఇది చూసి యూకే, ఆస్ట్రేలియా మొదలైన దేశాలు కూడా అదే ఆలోచనల్లో పడ్డాయిట.
పాకిస్తానీ గూఢచారులు బాహుబలి రెండు పార్ట్లు చూసి ప్రభుత్వానికి (అంటే మిలట్రీకి అని వేరేచెప్పక్కర్లేదు కదా?) టాప్ సీక్రెట్ నివేదిక ఇచ్చారుట. అందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే –
- పాక్-ఇండియా బోర్డర్ మీద , పాకిస్తాన్ వైపు అర్జెంటుగా తాటిచెట్లు పెంచితే తీవ్రవాదుల్ని చాలా ఈజీగా, తక్కువ ఖర్చుతో భారత్ భూభాగంలోకి పంపించవచ్చనీ,
- అదే టైములో ఇండియా పక్కనున్న తాటిచెట్లన్నిట్నీ ఏదోవిధంగా కూల్చేస్తే ఇండియా కొత్తరకం వ్యూహాత్మకదాడులు చెయ్యడం అస్సలు కుదరదనీ.
(ఈ తాటిచెట్ల వ్యవహారం ఏంటో తెలియాలంటే బాహుబలి-2 చూడాల్సిందే మరి.)
( గమనిక👉 పై వార్తలు చూసి ఎవరూ ఝడుసుకోవాల్సిన పన్లేదు, బాహుబలి స్టోరీ ఎంత రియల్‌లో ఈ వార్తలూ అంతే రియల్ కనక)
ఇంతేసంగతులు 🙂 బై4నౌ 🙏
super article
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
భలే పోలిక పెట్టేశారండి YVR గారు. బాగుంది పోస్ట్.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
నెనర్లు పవన్‌గారు. మీరన్న పోలిక ‘అమెరికా’లకేయుడి గురించేనా ..? 😆
LikeLike
‘అమెరికా’లకేయుడి గురించి అలాగే బోర్డర్ దగ్గర తాటి చెట్ల గురించి YVR గారు.
LikeLike
తాటిచెట్లు, ట్రంప్ భలే చెప్పారండీ 🙂
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike