నాలాంటి ఎక్స్ట్రా ఆర్డినరీలీ-ఆర్డినరీ బీయింగ్ కి అస్సలేం _పనిలేక_పోతే, బోల్డన్ని (కాలక్షేపం) కబుర్లుకాకరకాయల_తో మధ్య మధ్య, for a change, ఓ _జిలేబి_ నోట్లో పడేసుకుంటూ గడిపెయ్యాలి అంతే, కానీ నేనూ రాస్తానంటూ ఓ బ్లాగు తెరవడం అందులో టపాలు వెయ్యడం అనే పుణ్యకార్యం మొదలెడితే?? అప్పుడుగానీ రాయడం ఎంత కష్టమో తెలీదు. ఊరికిముందు ఒకో రకం టపాకి ఒకో వర్గం – కేటగిరీలు- కేటాయించేసి – ఏదో రాసేస్తామని మహచెడ్డ కాన్ఫిడెన్సు – వాటికి మాంఛి పేర్లు, ఇంకా మాంఛి థీములు,… ఇలా ఈ హడావిడి ఎక్కువ. అలాంటి హడావిడిలో భాగంగానే కేటగిరీలకి మాంచి కాచీ టైటిల్ కోసం తెగ ఆలోచించడం మొదలెట్టాక అప్పుడు వెలిగింది ట్యూబులైటు – ఏం రాయలన్నా బుర్రలో కొంచెం సరుకు, లైఫులో కాస్త అనుభవం, అనుభవాలు నేర్పిన పాఠాలు, భాష మీద కొంచెం పట్టు, ఏదో ఒక సబ్జెక్ట్ మీద కమాండ్ – అంటే ఎట్ లీస్ట్, ఉగాది కవితల్లాంటివి, సినిమాల్లో శ్రీలక్ష్మి చెప్పే రెసిపీలు, రాసే తవికలు ఇలాంటివన్నమాట – అవేం కాకపోతే “పెళ్లి చేసి చూడు”లో ఎన్ఠీఆర్ తబలా కొట్టి మరీ చెప్పిన “భావకవుల వలె ఎవరికీ తెలియని ఏవో రాతలు” రాయడం, అవీ కాకపోతే రోజుకొకటి చొప్పున పోస్ట్ చెయ్యగలిగేలా సూక్తిముక్తావళి బట్టీ (or) కాపీ కొట్టి వుండడం, వగైరాల్లో ఏదో ఒక క్వాలిఫికేషనుండాలని ట్యూబులైటు ఉద్దేశం. ఐతే, ఉద్దేశం పక్కనే మనకవేం లేవనే క్లారిటీ తిష్ట వేసుక్కూచుంది. పోనీ పాలిటిక్స్, రెలిజియన్ మొదలైన బ్రహ్మపదార్ధాలతో డీల్ చేస్తూ ఎగస్పార్టీల్ని చాకిరేవు పెట్టేద్దామా అంటే ఆయుధం పట్టకుండా ఆలోచనాస్త్రాలు మాత్రం ప్రయోగిస్తే మనమీదే అసహనాస్త్రాలు పడతాయ్. అసలే ఎక్కడ చూసినా రోడ్ల మీద ఆవులు, మీడియాలో అసహనాలు. ఆవునేం అనకూడదంటే వచ్చే గొడవ… అదేం అల్లాటప్పా వ్యవహారం కాదుకదా? (ఒక రకంగా చూస్తే అల్లాటప్పా వ్యవహారమేనేమో🤔?!!?), పోనీకదాని ఆవునే ఏమైనా అందామంటే అనుపమ్‌ఖేర్ ఊరుకోడు, అసహనం అనిపిస్తే అమీర్‌ఖాన్ ఒప్పుకోడు. ఎక్కడ ఛస్తాం? ఆ బాధ మాత్రంలేదు. అసహనానికి ఆవుకి మధ్య ఇరుక్కుంటే ఎక్కడో ఒకచోట గారంటీగా….. 🙈🙉🙊 . దేర్ఫోర్ అటువైపెళ్ళే ఛాన్స్ లేదు. మరేం రాయాలి. పుట్టిన వెంటనే ఎంత వస పోశారో ఏమో, అది బుర్రలో ఏ మూల ఇన్నాళ్ళూ ఇరుక్కుపోయి ఇప్పుడు బయటపడుతోందోగానీ, అదోపక్కన వాగనైనా వాగు, బ్లాగనైనా బ్లాగమంటూ రొద పెడుతుంటే ఏం చెయ్యాలో తెలీక లోవోల్టేజిలో అల్లాడే ట్యూబులైటులా తయారైంది మైండు. సరిగ్గా ఆ అల్లాటలోనే–
మన సినిమా ఎడిక్షన్,
టీవీ యాంకర్ల తెలుగు డిక్షన్,
మీడియా ఓవరాక్షన్,
ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్
కంట్రీలో పొలిటికల్ డిస్ట్రాక్షన్,
తెలుగుభాష వెళ్తున్న డైరెక్షన్ ….
ఇలా ఎన్నెన్నో… క్షన్లు క్షణక్షణం మనచుట్టూ తిరుగుతున్నాయనే జ్ఞానం, చుట్టుపక్కల ఎక్కడా రావిచెట్టనే పదార్ధం లేకపోయినా కూడా, ఉదయించింది. మనకి టైముండాలే కానీ ఏదో ఒకటి రాసెయ్యచ్చంటూ ట్యూబులైటు కూడా సిద్ధపడింది. అయితే మరి పోస్టు పెట్టాల్సిన కేటగిరీకి పేరులేదు కదా అది లేకుండా ఎలా? సరే, పనిలేని xxx పిల్లితల xxx అని పెడితే? అనిపించింది. మళ్ళీ సామాజికవర్గాలు-వాటి మనోభావాలు గుర్తొచ్చి ఆ టైటిల్ వదిలేశా.
అసలీ సామాజికవర్గాలనేవి లేకపోతే మనోభావాలు గాయపడ్డం అనే సమస్య సగానికి సగం తగ్గేది కదా!?! నాకు మంచి టైటిల్ దొరికేది కదా? కులం అంటే పొలిటికల్లీ కరెక్ట్ కాదనేసి సామాజికవర్గం అనేస్తే కులనిర్మూలన అయిపోయినట్టా, కులవివక్ష పోయినట్టా? డిఫరెన్స్, డిస్క్రిమినేషన్ అనేవి మైండులో బతికున్నప్పుడు దానికెన్ని పేర్లెడితే ఏం లాభం? వోట్లు చీల్చడానికి తప్ప? నెవర్ మైండ్, ఈ పాయింట్ ఇక్కడితో వదిలేద్దాం. ఇప్పుడు మన తక్షణకర్తవ్యం పనిలేని xxx … అనే టైటిల్ మిస్సైనా ఇంచుమించు అలాంటిదే మీనింగొచ్చే పేరుని వెతికిపట్టడం. అప్పుడు తట్టినదే నోవాచేరా అనే పేరు. అదే ఫిక్సయిపోయింది.
అలాగేవుండిపోయింది, విన్నకోటవారు వివరణ కోరేవరకూ. ఏ ముహూర్తంలో ఫిక్సయిందో, వివరణ అడిగిన విన్నకోటవారి ఉత్కంఠలో ఎంత పవరుందోగానీ నోవాచేరా కాస్తా ఒక తెలుగుపద్యంలో, అదీ జిలేబీగారి చాటువులలో భాగమైకూచుంది. కూచోడం కాదు జిలేబీగారి బ్లాగులో సెటిలైపోయింది. ఇదిగో ఇలా –
వైవీఆరెస్స్ చెప్పుడు
నోవాచేరా కథేమిటోయని యడిగెన్
రావు తెలుసుకొన! మాచన
రావుల పలుకుల రహస్య రాత తెలుసనెన్ ! – జిలేబి (Courtsey: Zilebiగారు)
ఆ పైన వివరణకోసం విన్నకోటవారు రెండు రిమైండర్స్ ఇచ్చి, గురువుగారు శర్మగారు నోవాచేరాని డీకోడ్ చేసేస్తామని క్రమబద్ధీకరణ నోటీస్ కూడా పంపించేసేప్పటికి –
పద్యాలకీ, పొలాల్లో
సేద్యాలకీ దూరమై,
గద్యమైనా కాస్తంత
హృద్యంగా రాయలేని వాడికి, వాడు ఎంచుకున్న టైటిల్‌కి ఇంతకంటే అదృష్టమా? అనుకుని, హాశ్చర్యపోయేసేసి –
ఏమి నీ భాగ్యమో ఓ నోవచేర
విన్నకోటవారు వినగోరినంతనే,
మాచనభాస్కరులు మహిమ చూపగనే
జిలేబికందమున జేరితివిగదర!! — అంటూ ఫ్రీస్టైల్ ఛందస్సులో “పద్యం” కూడా రాసేశా. ఐ మీన్, రాసేసుకున్నా. అయినా కూడా నోవాచేరా ఫుల్ఫార్మ్ ఎలా చెప్పాలో తెలీలేదు. అసలు దానికో అర్ధం ఉంటేగా చెప్పడానికి?!?
ఏపీ స్పెషల్ పాకేజీలాగా సాగదీసి సాగదీసి చివరికి స్పెషల్ స్టేటస్లాగా ఎగ్గొట్టేయ్యొచ్చని, అందుక్కావాల్సిన నో-హౌ కోసం అరుణ్ జైట్లీగార్ని కన్సల్ట్ చెయ్యడానికి ఫోన్ తీస్తుండగా విన్నకోటవారు మూడో రిమైండర్ ఇచ్చేయ్యడం, కందగర్భిత శార్దూల విక్రీడితాల (కగశావి)తో జిలేబీగారు ఇలా –
నోవాచేరన నేమి రంపు తెలియన్ ఓ వైవియార్ శ్రీనివా
సా! వా! వేడి దినమ్ములాయె వలయై సాగెన్ గదా వ్యాఖ్యలౌ !
సావంతుండట వేచెనౌత కథకై సామీ సవాలాయె రా
జా వేవెల్గుల చెప్పుమయ్య విదురా జాలున్ రహస్యంబులున్ ! (Courtsey: Zilebiగారు)
—
నోవాచేరన నేమిర?
వా! వేడి దినమ్ములాయె వలయై సాగెన్
సావంతుండట వేచెను
వేవెల్గుల చెప్పుమయ్య విదురా జాలున్ 😊 –జిలేబి (Courtsey: Zilebiగారు)
అంటూ పులుల్నీ, స్మైలీల్ని ఛందోబద్ధంగా కందంలో కూరి చేసిన బుల్లెట్లతో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో –
పవన్‌కళ్యాణ్ ఏ సమస్య గురించి ట్వీటినా మేమూ అదే అనుకుంటున్నాం, మా పాలసీ కూడా అదే అంటూ డామేజ్ కంట్రోల్ చేసేసే ఆం.ప్ర.ప్ర.ని ఆదర్శంగా తీసుకుని ఇంక వివరణ ఇచ్చెయ్యడానికి రెడీ అయ్యా. బట్, ఆ రంపు ఏవిటో, సావంతుండు ఎవరో, నేమిర?వా! అంటే ఎవరో / ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలో అలసి సొలసి కింకర్తవ్యతా విమూఢుడనైయ్యుండనంత –
కగశావి అన్నఅక్రోనిమ్పై దృష్టిపడి ఏదో లైఫ్‌లైన్ దొరికినట్టనిపించింది. అంతలోనే మళ్ళీ మనం భాషాsavvy కాదు, పోనీ ఛందోsavvyనా🤔 అంటే ఛాన్సేలేదు, కేవలం కందా-బచ్చలిsavvy కదా అన్న ఫాక్టు స్ఫురించి విషయం ఎలా ఎక్స్ప్లెయిన్ చెయ్యాల్రా భగవంతుడా అని మధనపడుతూపడుతూలేస్తూ ఇదిగో ఇక్కడదాకా రాసుకొచ్చా. ఇంకేం రాయాలి? ఎలా రాయాలి?
ఇంకా రాయడవేంటి? నోవాచేరాకి ఎక్స్పాన్షన్ ఏంటో చెప్పెయ్యక..? చెప్పేస్తున్నా …. చెప్పేశా..అదుగో 👇
నోట్లోముక్కలేని వామనరావు, దేర్ఫోర్, రాయడం చేతకాని రామారావు (తెలుగు పరిజ్ఞానంలో మరుగుజ్జైనవాడికి రాయడం ఏం వస్తుందని కవి హృదయం. రామారావుని “రా” అక్షరం కోసం చారులో చింతపండులా వాడుకుందామనుకున్నా, కానీ నాకు చారు కంటే ఉప్మా ఎక్కువిష్టం అందువల్ల ఉప్మాలో కరివేపాకులా వాడుకోవడం జరిగింది, దీనివల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని అసహనం కలిగితే అందుకు క్షంతవ్యుడను 😉 )
ఇంతే సంగతులు.
ఈ టపా ఉనికికి ఈ విధంగా కారణమైన విన్నకోటవారికి, గురువుగారికి, జిలేబిగారికి టపాని అంకితమిస్తూ … బై4నౌ
🙏
ఆహా, ఎట్టకేలకు ! “ఎదో ఒక టాపిక్ లో ఇరికించి చెప్పడానికి” ప్రయత్నిస్తానన్న మీరు (స్పియెల్ బెర్గ్ టపా వ్యాఖ్యలలో) ఏకంగా ఓ మంచి టపానే దించేశారు, good job. మా మాట మీద బెట్టు చేయకుండా వివరించినందుకు ధన్యవాదాలు.
మీ వివరణ వచ్చేలోగా డీకోడింగ్ ఓ పట్టు పడదామని ప్రయత్నం చేశాను. నాకు తట్టినది – నోటి వాక్కు. / చేతి రాత. బాగానే కుదిరిందనుకుంటూ నాకు నేనే శభాష్ చెప్పుకుందామనుకుంటున్న టైములో మీ టపా వచ్చింది. థాంక్స్.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
విన్నకోటవారికి ధన్యోస్మి _/\_
LikeLike
@విన్నకోటవారు
//నోటి వాక్కు / చేతి రాత// — 👌👌👌
ఈ ఐడియా నాకు రాలేదు చూశారా?
LikeLike
🙏
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
“ఏం రాయలన్నా బుర్రలో కొంచెం సరుకు, లైఫులో కాస్త అనుభవం, అనుభవాలు నేర్పిన పాఠాలు, భాష మీద కొంచెం పట్టు, ఏదో ఒక సబ్జెక్ట్ మీద కమాండ్ – అంటే ఎట్ లీస్ట్, ఉగాది కవితల్లాంటివి, సినిమాల్లో శ్రీలక్ష్మి చెప్పే రెసిపీలు, రాసే తవికలు ఇలాంటివన్నమాట – అవేం కాకపోతే “పెళ్లి చేసి చూడు”లో ఎన్ఠీఆర్ తబలా కొట్టి మరీ చెప్పిన “భావకవుల వలె ఎవరికీ తెలియని ఏవో రాతలు” రాయడం, అవీ కాకపోతే రోజుకొకటి చొప్పున పోస్ట్ చెయ్యగలిగేలా సూక్తిముక్తావళి బట్టీ (or) కాపీ కొట్టి వుండడం, వగైరాల్లో ఏదో ఒక క్వాలిఫికేషనుండాలని ట్యూబులైటు ఉద్దేశం.”
వ్రాయడానికి ఏమి లేదంటూనే చాలా వ్రాసేసారు. పైన వాక్యం నాకు బాగా నచ్చింది.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
థాంక్సండి అన్యగామిగారు. పలికింది నేనైనా పలికించినవారు వీఎన్నార్ గారు కదా, మీ మెచ్చుకోళ్ళు (లైకులు) ఆయనకే చెందుతాయి. 🙂
LikeLike
—
పలికినది వైవి యటనౌ
పలికించెను విన్నకోట ప్రశ్నలు సుమ్మీ
పలుకులు జిలేబు లూరగ
చిలుకల కొలికిగ పలికెను చినతమ్ముండౌ 🙂
జిలేబి
LikeLike
మధురం జిలేబి పదార్ధం,
రసాస్వాదనం యదార్ధం,
రెసిపీ ఎందుకు? సమయం వ్యర్ధం,
ఆనందం ఒకటే పరమార్ధం.
//చినతమ్ముడు// Wow….🙏 🙏 🙏
LikeLike
మధుర పదార్థంబు జిలే
బి!దురద తగిలె నిక వైవి విదురుడు మన దా
రి! దరువులిక సాగించును
పదనిస పదములన పద్య పాదము లలరన్ 🙂
జిలేబి
LikeLike
@ జిలేబి
//దురద తగిలె..// — కంద పద్యాలకా పేరెందుకొచ్చిందో ఇప్పుడు తెల్సింది :-))
మీ పద్యాల్లో విదురుడి ఎటెండెన్స్ ఎక్కువైపోయిందండి.
LikeLike
—
ఓయీ!వామనరావు!యేమి కతలన్పోకంతనౌ మాటకున్
సాయించేనయ వైవియారెసిట! మాచన్నా! గురో మీరు భా
జాయించన్ దగు మీ కథన్నిటన సజ్జల్గట్టి జూడంగనౌ!
మీ,యీ గాథల వేరుబాటు గన,సామీరమ్ము వేగమ్ము గన్ !
జిలేబి
LikeLike
జిలేబిగారూ, పద్యం నాకు సరిగ్గా అర్ధం అయిందోలేదో అర్ధం కావట్లేదు 😦
LikeLike
—
అర్థము పరమార్థంబుల
యర్థము తెలియన జిలేబి యగునా వైవీ
వ్యర్థము శుభాంగి పలుకుల
కర్థము జూడ గనుమయ్య కాకర వత్తీ 🙂
జిలేబి
LikeLike
బ్లాగాధ్యక్షా, ఏమీ అర్థం కాకపోయినా టపాలో నా బ్లాగు పేరు ప్రస్తావించినందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
బోనగిరి గారు,థాంక్యూ 🙏
ఈ పోస్ట్ అర్ధం కావాలంటే నా బ్లాగ్ లో విన్నకోట వారి కామెంట్స్ అన్నీ చూడాల్సిందే. 😊
మీ “ఆలోచనాస్త్రాలు” అనుకోకుండానే వాడినా విషయం గుర్తించాక బోల్డ్ ఫాంట్ లో పెట్టాను. అన్యధా భావించనందుకు మళ్ళీ థాంక్స్.
LikeLike
మొత్తానికి నోవచేరా ఏంటో చెప్పారు. విన్నకోట వారు అడిగినప్పుడల్లా ఏంటో తెలుసుకోవాలనే ఆత్రం మాలాంటి వారికి కలిగించారు. ఏమీ రాదు అంటూనే కబుర్లు చెప్పారండీ 🙂 రోజు కామెంటుదాం అనుకోవడం. ఈ రోజు కుదిరింది.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
థాంక్యూ చంద్రికగారు 🙏.
//నోవా చేరా // బాహుబలి సీజన్ కదండీ హైప్ క్రియేట్ చెయ్యడం పట్టుబడుతున్న ట్టుంది 😆
//తాటిచెట్లు, ట్రంప్// క్రెడిట్ గోస్ టు రాజమౌళి & ‘అమెరికా’లకేయుడు రెస్పెక్టివ్లీ 😃
LikeLike