K_ _ _ _ V = Kaళాతపస్V = Kaళాతపస్Vశ్వనాధ్ = కళాతపస్విశ్వనాధ్
ఎందరో అభిమానులు, కళాభిమానులు, మహానుభావులు ఆ కాశీనాధుడి సొంతమనిషైన – కాశీనాధు”ని” విశ్వనాధ్ కదా మరి😊 – ఈ కళాతపస్వి గురించి చెబుతుంటే, ప్రశంసలు కురిపిస్తుంటే నేను ఏం చెయ్యలేదే అని నాకనిపిస్తుందని అలా అనిపించకూడదని ఏదో ఇలా స్వహస్తాలతో రాసుకున్న ఉడతాభక్తి –
వేదసారం శంకరాభరణరాగంలో సిరిసిరిమువ్వల నాదాలే శృతిలయలుగా సిరివెన్నెలలా సాగరసంగమ ప్రదేశాన వర్షించినపుడు ఆవిర్భవించిన అరుదైన స్వాతిముత్యం మన కాశీనాధుని విశ్వనాధుడిని ఈ దేశం దాదాసాహెబ్ ఫాల్కే పేరిట స్వర్ణకమలాలతో అభిషేకిస్తున్న శుభోదయంలో కాలం మారిందంటూ అందరి మనసుల్లో స్వాతికిరణాలు వెదజల్లి జీవన జ్యోతులు వెలిగించిన ఆ సూత్రధారుడికి సవినయ నమస్సుమాంజలి అర్పిస్తూ …
తెలుగు కళలకి, సాంప్రదాయాలకి ఆపద్బాంధవుడై మన సంస్కృతికి నాస్తి జరా మరణజం భయం అని తన స్వయంకృషితో అభయమిచ్చి కళామతల్లికి శుభలేఖ అందించిన ఈ కళాతపస్వితో నటసీమ సప్తపది నడవాలని ఆశిస్తూ ….
YVR’s అం’తరంగం’🙏
నాకు సినిమాలగురించి సినిమావాళ్ళ గురించి తెలిసింది తక్కువ 🙂
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
//సినిమాల
గురించి…. // సార్ సిరివెన్నెల శాస్త్రి గారి చేత ఈ మాట చెప్పిస్తే నమ్ముతాను 😃
LikeLiked by 1 person
దాదాసాహెబుఫాల్కే !
శ్రీద్రష్టృవు విశ్వనాధు సిరిసిరి మువ్వా !
వేదం అణువణువు తెలుగు
నాదం కలగలిపి నాడు నా జీవమనన్ !
జిలేబి
https://polldaddy.com/js/rating/rating.js
https://polldaddy.com/js/rating/rating.js
LikeLiked by 2 people
@Zilebi ji,
విశ్వనాధుడికి అవార్డుల అభిషేకం,
పద్యాలే నైవేద్యం 👌👌
LikeLiked by 1 person
—
కాశీనాథుని విశ్వనాథునికి మా కైమోడ్పు ! జేజేలు ! దా
దాసాహెబ్ బిరుదొందె! యాంధ్రులకు మోదంబయ్యె నమ్మా జిలే
బీ! శోభస్కరమయ్యె గాద సినిమా ఫీల్డున్ భళీ ! శ్రీకరం
బౌ!సంకల్పబలంబు మేలు బడసెన్ భావాటులన్దీర్చెనౌ !
జిలేబి
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
@Zilebi ji,
👌👌👌👏👏👏
LikeLike
బావుందండీ పద్యం
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
చంద్రిక గారు థాంక్యూ 😊
LikeLike
మీ స్వహస్తాలతో రాసి విశ్వనాథుడికి శుభసంకల్పంతో సమర్పించిన ఈ పదాంజలి శుభప్రదం!
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
లలితగారు థాంక్యూ 🙏
//మీ స్వహస్తాలతో రాసి విశ్వనాథుడికి…//
కె.విశ్వనాధార్పణం 😊
LikeLike