ఇవాళ ధరిత్రీ దినోత్సవం. భూమిని రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అందరూ గుర్తించాలని ఏర్పడిన శుభదినం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నేలతల్లికి శుభం కలగాలని సంకల్పించుకునే సుముహూర్తం. భగవంతుడు ఆదివరాహావతారం ఎత్తడానికి సంకల్పించుకున్న శుభఘడియ అనుకోవచ్చు, అనుకోవాలి కూడా.
అవతారాలనేవి ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయే వన్-టైమ్ వండర్స్ కాదు. అవి వచ్చినప్పుడే మాస్టర్ ప్లాన్‌తో వస్తాయి. వచ్చినప్పుడు జనహృదయాల్లో అవి కలిగించిన స్ఫూర్తి, వెలిగించిన జ్ఞానదీప్తి అవసరమైనప్పుడల్లా మళ్ళీ మళ్ళీ, సంభవామి యుగే యుగే – అంటూ ఆ అవతారలక్ష్యాన్ని సాధిస్తూవుంటుంది.
హిరణ్యకశిపుడు ఏ వస్తువులో విష్ణువుని చూపించమని ప్రహ్లాదుడిని అడుగుతాడోనని నరసింహావతారం భూమ్మీద వున్న చరాచరాలన్నిట్లో నిండిపోయి, వేచి వుందిట. ఇప్పుడు పుడమిని కొత్తకొత్త రూపాల్లో కబళిస్తున్న హిరణ్యాక్షుల నుంచి రక్షించేందుకు ఆదివరాహమూర్తి మన తలపుల్లో, చేతల్లో ప్రవేశించే పవిత్రదినం ధరిత్రీదినం.
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని నిర్లక్ష్యం చేసి సొంత వాహనాలని అతిగా ప్రోత్సహిస్తున్న మన “ప్రో-బిజినెస్” విధానాలు, అక్రమ ఇసుక తవ్వకాలు, అడ్డూఆపూలేని గనుల లైసెన్సింగ్ & తవ్వకాలు, ఎర్రచందనం మాఫియా, పర్యావరణ సమతూకాన్ని దెబ్బతీసేలా జరుగుతున్నఅడవుల ఆక్రమణ, నదులు, సముద్రాలలో కాలుష్యాన్ని, మురుగునీ వదిలిపెట్టడం, ఇంకా ఎన్నెన్నో – ఇవన్నీ హిరణ్యాక్షుడి బాహ్యరూపాలు – స్థూల శరీరాలు.
ఆర్ధికాభివృద్ధి పేరుతో పెరిగిపోతున్న పదార్ధవాదం, హాయిగా బతకడానికి నిజంగా అవసరంలేని వస్తువులు, సంపదల పట్ల ఆరాటంతో మనిషిలో గూడు కట్టుకుంటున్న అసంతృప్తి, స్వార్ధం తప్ప అర్ధం కనిపించని రాజకీయాలవల్ల నానాటికీ పెరిగిపోయే అనవసర అవసరాలు – ఇవన్నీ హిరణ్యాక్షుడి అదృశ్యరూపాలు – సూక్ష్మశరీరాలు.
ఆనందానికి ఆర్భాటానికి తేడా తెలియకపోవడం; ఆత్మకి అహంకారానికి బేధం గ్రహించలేకపోవడం; సత్యం,ధర్మం – వీటి నిజస్వరూపం తెలుసుకోకుండా ఎవరికిష్టమైనట్టు వాళ్ళు వాటిని నిర్వచించేసి కన్ఫ్యూజన్ సృష్టించడం – ఇవన్నీ హిరణ్యాక్షుడి కారణ శరీరాలు.
భూమాతకి హిరణ్యాక్షుడి పీడ పూర్తిగా వదలాలంటే వాడి మూడు శరీరాలూ నశించాలి. అది సాధించేందుకు వచ్చేదే ఆదివరాహావతారం. అందుకు భూమిని ఎవరో మళ్ళీ చాపలా చుట్టేసేవరకూ వేచివుండక్కర్లేదు, చుట్టడం మొదలైంది ఆల్రెడీ. ప్రభుత్వాలూ, వ్యాపారవేత్తల తీరు మారేలా మన ఆలోచనలూ, అవసరాలూ మార్చుకుని, తరువాత తరాలకీ ఆ విలువలు అందిస్తే ధరణీధరుని అవతార కార్యక్రమం వూపందుకుంటుంది. అది ఇవాళే జరగొచ్చు. జరగాలి. జరుగుతోంది.
ఎక్కడో, ఎందరి మనసుల్లోనో, ఎందరెందరి సంకల్పాల్లోనో, ఎన్నెన్ని విధాలైన కార్యక్రమాల్లోనో. అయినా చాలదు. ఇంకా ఇంకా కావాలి.
ధరణీ సహితుడైన వరాహమూర్తి ఆరాధనని గుడిలో, స్తోత్రాలతోనే సరిపెట్టడం సరికాదు –
మొక్కలు నాటి, అడవుల కొట్టివేతపై ఆధారపడడం తగ్గించుకుని – నైవేద్యం పెట్టాలి
సరస్సులు, నదులు, సముద్రాల్ని శుభ్రంచేసి, శుభ్రంగా వుంచి – అర్ఘ్యపాద్యాలివ్వాలి.
అవసరంలేని ఆర్భాటాలు బాగా తగ్గించుకుని – హారతివ్వాలి.
ముఖ్యంగా మన కన్జ్యూమరిస్ట్ లైఫ్ స్టైల్ మార్చుకుని – సాష్టాంగపడాలి.
– ఇలా కూడా పూజించవచ్చు. కాదు ఇలాకూడా పూజించాలి. కాదు కాదు ఇలాగే పూజించాలి. అప్పుడే భూదేవిపై భూజాని ప్రేమకి విలువ ఇచ్చినట్టు కదా? ఎంత ప్రేమ లేకపోతే ఆవిణ్ణి రక్షించుకోడానికి పందిరూపమైనా ధరించడానికి సిద్ధపడతాడు?
అంతేకాదు, తిరుపతి వెళ్ళినప్పుడు ముందుగా ఆదివరాహమూర్తి ఆలయానికి ఎందుకు వెళ్ళాలో తెలుసుకోవాలి. అదేంటంటే –
మన ఆపదలు పోగొట్టి, కోరికలు తీర్చమని దేవదేవుణ్ణి ప్రార్ధించేముందు భూమాత క్షేమాన్ని కోరుకుని అందుకు మేమూ పాటుపడతామని సంకల్పించుకునేందుకు, నేలతల్లి ఆరోగ్యం కోసం ఆ దేవుణ్ణి మొక్కుకునేందుకు.
🌿 🌾 🌏 🌊 🌄
సముద్రవసనే దేవీ పర్వతస్తనమండితే|విష్ణుపత్నీనమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే||
🌊 🌄 🌏 🌿 🌾
ప్రకృతిలో ఏది కనపడితే అదే తినేస్తున్నారు,డబ్బు రూపంలో. చివరికి రూపాయలు తింటారేమో
well said
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
//ప్రకృతిలో ఏది కనపడితే అదే తినేస్తున్నారు,డబ్బు రూపంలో. చివరికి రూపాయలు తింటారేమో// — హిరణ్యాక్షుడు = బంగారం (డబ్బు) మీదనుంచి కళ్ళు తిప్పుకోలేని(వాడు) వ్యవస్థ = మెటీరియలిస్టిక్ ఎకానమీ అనుకోవాలి సర్. “Earth has enough for our needs, but not for our greeds,” అన్న గాంధీజీ మాటలు ఏదోనాటికి పట్టించుకుంటుందీ ప్రపంచం.
LikeLike
హిరణ్యాక్షుడికి భూకబ్జాదారులకి మంచి పోలిక. వాళ్ళనుంచి సహజ వనరులనెలా కాపాడుకోవాలో బాగా చెప్పారు.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
అన్యగామిగారు ధన్యవాదాలు.
మోడర్న్ డే హిరణ్యాక్షులనుంచి కాపాడుకోవాలి అంటే అది అయ్యేపనిలా అనిపించడం లేదండి. జనం మారాలి, జీవన విధానాలు మారాలి, జనాభాలు స్టెబిలైజ్ అవ్వాలి……
ఏదో మన ఆక్రోశం మనది..
LikeLike
మండలే అని వుండాలండి, శ్లోకం లో మండితే కాదు.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
మహేష్ గారు, నెనరులు. నేనీ శ్లోకాన్ని మొదటిసారి చూసిన పుస్తకంలో ‘మండితే ‘ అనే ఉండేది. మండిత = అలంకరింపబడిన అనే అర్ధంలో చూస్తే కరెక్టే అనుకుంటాను.
LikeLike
🌏🌹🌾దేశమంటే🌷🌿ప్రకృతి🌊🌄చెట్లు,పక్షులు🐦🐒జంతువులూ, మనుషులోయ్🌾🌹🌏
🙂
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
🙏 thank you.
LikeLike