గురువుగారు, కష్టేఫలి శర్మగారి బ్లాగ్ పోస్టుల్లో ఒక దానిపై నేచేసిన కామెంటు పై ఆయన వ్యాఖ్యానిస్తూ, “మత్త కోకిలలు,మత్తేభాలని,శార్దూలాలని జనం మీద వదిలేస్తున్నారు, ప్రమాదమేమో!,” అన్నారు. అది చూడగానే ఈ పిట్టకధని బ్లాగ్జనుల మీదకి ఎలావదలాలో ఐడియా వచ్చింది. అవును మత్తకోకిలలు, మత్తేభాలు, శార్దూలాలు వూళ్ళలోకి ప్రవేశించి జనం మీద పడిపోతున్న మాట నిజమే. అడవులు తగ్గిపోయి కొన్ని, డెవలప్మెంటు పెరిగిపోయి కొన్ని ఎక్కడుండాలో, ఎలావుండాలో తెలీక జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. అంతేకాదు –
సిటీల్లోకి వచ్చిన మత్తకోకిలలు మత్తుగా కూయాలంటే గున్నమామిడి కొమ్మలు, వాటి లాడ్జింగ్ & బోర్డింగ్ కోసం కాకిగూళ్ళు అవసరం. గొంతు శ్రుతి చేసుకోడానికి లేత మావిడి చిగుళ్ళు విరివిగా దొరకడం లేదు, చెట్టుచెట్టుకీ మధ్య దూరం రెక్కలకి భారం కావడం వల్ల. పెరిగిపోయిన పొల్యూషన్ వల్ల బొంగురుపోయిన గొంతుతో కూసినా బదులు పలకాల్సిన చెలియ ఎక్కడో కిలోమీటర్ల దూరంలో మరో మామిడికొమ్మ మీద ఉండడంతో ఆ కూత అంత దూరం వినబడడం లేదు. దాంతో మత్తకోకిలలకి మరో మంచి చోటు వెతుక్కోవాల్సిన అవసరం పడింది.
ఎంత మత్తకోయిలయినా అదో చిన్న పిట్ట. హాయిగా బతికెయ్యడానికి చిన్న తోట, పార్కులాంటివి చాలు. ఏనుగులకి అలా కాదు. దట్టమైన అడవి కావాలి. గజస్నానాలకి గలగల పారే సెలయేళ్ళు కావాలి. పులికైతే కాకులు దూరని కారడవి కానీ, చీమలు దూరని చిట్టడివి కానీ ఏదున్నా కావాల్సింది వేటాడి, తిని, ఏ గుహలోనో దర్జాగా గర్జిస్తూ గడిపేస్తుంది. అటు గజరాజుకీ, ఇటు మృగరాజుకి కూడా ఎక్కడా సరైన అడవి దొరకడంలేదు, మరో అడవికి వలస పోదామంటే దారికి అడ్డుగా రోడ్లు, వాహనాలు, జనాలు. అవి దాటాలని ప్రయత్నిస్తే ప్రాణాలైనా పోవచ్చు, మనుషులు పెట్టుకున్న జూపార్కుల్లో జీవితఖైదు పడినా పడచ్చు. దాంతో ఏం చెయ్యాలో దీర్ఘంగా, చార్మినార్ రేకుల రామయ్యలా ఆలోచించాలోలించాలోచించి …. చివరికి –
పేరుకి మృగరాజైనా ఒక మూగజీవిగా అభయారణ్యాల్లో వేటగాళ్ళ భయంతో, ఎప్పుడు ఏ చైనీస్ మందుల్లో భాగం అయ్యి సీసాల్లో, డబ్బాల్లో బందీ అవ్వాల్సివస్తుందో తెలీని అయోమయంలో బతకడం కంటే శార్దూల ఛందస్సుగా రాజుల, రారాజుల ఠీవిని చూపుతూ, రాచరికపు జిత్తులు, రణతంత్రపుటెత్తులలో మునిగి తేలుతూ; వీర, శృంగార, భయానక, రౌద్ర రసాలలో గర్జించడం మృగరాజుకి సముచితమని సొంచాయించి పులి శార్దూలపద్యంగా పరిణమించింది.
ఇక్కడ వీటిని వెంటాడి వేటాడే వేటగాళ్ళతో బాధలస్సల్లేవు, ప్రేమగా పెంచిపోషించే కవిపుంగవుల లాలనలు, పాఠకోత్తముల వహవ్వాలు మాత్రం కొల్లలు. ఆ విధంగా ఆ వనచరులు మత్తకోకిలలు, మత్తేభాలు, శార్దూలాలు అనేపేర్లున్న పద్యాలుగా మారిపోయి, “మమ్మల్ని జనాల మీదకి వదిలినా ప్రమాదమేంలేదు అందరికీ ప్రమోదమే తప్ప,” అంటూ కూస్తున్నాయి, ఘీంకరిస్తున్నాయి, గర్జిస్తున్నాయి. బ్లాగ్వనాల్లో స్వేచ్చగా విహరిస్తున్నాయి.
ఏ సౌందర్యమాధుర్యాలు సంగ్రహించి పద్యాన్ని మత్తకోకిలగా మలచారో
ఏ మదగజగమన, గాంభీర్యాలు గమనించి పద్యపు నడకని మత్తేభమని పిలిచారో
ఎవరి ధైర్యశౌర్యపరాక్రమాల స్ఫూర్తితో పద్యాలను శార్దూల ఛందస్సులో నడిపించారో
అని నేననుకుంటున్నాను. ఇప్పుడో చిన్న బ్రేక్. నెక్స్ట్ పోస్ట్ వరకూ..
గురువుగారి కామెంట్ ఆధారంగా టపా అల్లడంలో అసలు మేటరు ఇంకా చెప్పనేలేదు. ఇంకా రాయాలంటే ఇంకాస్సేపు ఆఫీసులో కూర్చోవాలి. బాస్ కంటపడితే రోజూ ఇంతసేపు ఆఫీసులో ఉండొచ్చుగా అనేస్తాడేమో, లేదా తను కొన్నాళ్ళుగా పేరబెట్టిన వర్క్ షేర్ చేసుకోమంటాడెమో… ఎందుకొచ్చింది ? ఈ టపాకి ఒక సీక్వెల్ రాస్తా.
పద్యాలనడకని బట్టి,రాగ వరుసను బట్టి వాటికా పేర్లు పెట్టినట్టున్నారు. ఇవి కవులకలాలనుంచి దూకితే ప్రమోదం, జనావాసలలోకి దూకితే ప్రమాదం. సీక్వెల్ ఎప్పుడా అని వైట్ంగ్ 🙂
లలితగారు, మామూలుగా ఐతే శార్దూలం పులే, మృగరాజు సింహమేనండీ. కానీ మనదేశంలో సింహం ఇప్పుడు ఒక్క గుజరాత్లోని గిర్ ప్రాంతానికి పరిమితమైపోవడంతో కాస్త poetic license వాడి పులిని మకుటం(జూలు)లేని మృగరాజుని చేశాను. ఇంకో యాంగిల్ ఏంటంటే, సాధారణంగా పులీ సింహం వేరువేరు రకాల అడవుల్ని ప్రిఫర్ చేస్తాయి. పొరపాట్న ఒకే అడవిలో వుండాల్సివస్తే, జంగిల్ లా ప్రకారం రెండిట్లో ఏదో ఒకటే మిగుల్తుంది. అంచేత ఏది డామినేట్ చేస్తే అదే మృగరాజు. దేవుళ్ళుకూడా ఈ విషయంలో కాస్త ఫ్లెగ్జిబుల్గానే వున్నారు కదా! దశావతారాల్లో నరసింహుడు, నరశార్దూలుడు వున్నారు.సిహం,శార్దూలం రెండూ కనకదుర్గకి ఫేవరిట్ వెహికిల్సే.
మాస్టారు 🙏, మీచేత అక్షింతలు వేయించుకోవాలి కానీ దణ్ణం పెట్టించుకోవడం నాకు తగదండి. అందుచేత అక్షింతలే వేసి రక్షించమని కాంక్షిస్తున్నాను 🙏 😊.
మీ ప్రశ్నకి జవాబు పద్యంతో కాదు గద్యంలోనైనా చెప్పేటంత పట్టు భాష మీద నాకు లేదండి. కానీ ఈ పోస్టు మూడో, నాలుగో పద్యాలకి కారణమై, నాచేత కూడా కాస్త భాషాసేవ చేయించినందుకు ఆనందంగా వుంది.
ఇది కొంచెం సరదాగా, అన్యధా భావించరనే ధైర్యంతోనే, అంటున్నాను –> మత్తకోకిలలు,మత్తేభాల్ని సృష్టించిప్రబంధాల్లో బంధించినవారు కవులే కానీ ఆ “జీవుల”కి తాము ‘మత్తు’లో ఉన్న పద్యాలమని తెలియదు కదా? అందువల్ల మీ సృష్టిని మీరే భరించక తప్పదు మరి😊.
Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-) Cancel reply
“మంచి” టైటిల్ పెట్టారు – అరణ్య రోదన 🙂
ఆ యడవి లోని జంతువు
లాయనకు సలాము జేసె లయయొప్ప యిట
న్నోయమ్మ మత్త కోకిల
సాయము మత్తేభము ఘన శార్దూలమ్ముల్ 🙂
జిలేబి
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
జిలేబిజీ అరణ్య రోదన పోస్ట్ టైటిల్ కాదండి. ఎన్విరాన్మెంట్ ఇష్యూలపై టపాల వర్గం పేరు మాత్రమే 😊 అరణ్యరోదన కి వివరణ సీక్వెల్లో వుంది
LikeLike
పద్యాలనడకని బట్టి,రాగ వరుసను బట్టి వాటికా పేర్లు పెట్టినట్టున్నారు. ఇవి కవులకలాలనుంచి దూకితే ప్రమోదం, జనావాసలలోకి దూకితే ప్రమాదం. సీక్వెల్ ఎప్పుడా అని వైట్ంగ్ 🙂
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
పద్యముల నడక కవనపు
విద్యయు వన్యమృగ రాగ వింజోవిగన
న్నాద్యంతమ్ము జిలేబీ
సాధ్యమ్ముగ జేసిరిగద సత్కవులిచటన్ !
జిలేబి
LikeLike
అవురా ! శార్దూలము మా
‘ కవికోకిల ‘ యౌ జిలేబి ఘంటము వెంటన్
అవిరళ పద్యావళులై
దవుడుకు లంఘించి తినవ ? తలకాయ లహో !
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
శ్రీరాజన్నా ! సుకవీ !
మీరెట్లా చెప్పన యటు మీ మాటే రై
టౌ ! రయ్యనవచ్చి జిలే
బీ, రవ్వంతగని పద్య బీటిల్సివవే 🙂
జిలేబి
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
జిలేబీటిల్స్ !! వావ్ !!😀
LikeLike
అవునండి, ‘జిలేబీటిల్స్’ పేరు నిజంగానే వావ్ 👌. George Harrison తరవాత వీరే 👍 🙂.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
విన్నకోట నరసింహారావు
వీరే 🙂 వీరే 🙂 లెస్స బలికితిరిగా
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
మత్తేభము శార్దూలము
క్రొత్తగ నిది యేదొ మత్తకోకిల యట , మా
నెత్తిన టపి టపి టపి యని
మొత్తెదరా జనము మీద , మోదంబగునా ?
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
శార్దూలము అంటే పులి కదాండీ? మృగరాజు సింహం కదా!
LikeLike
లలితగారు, మామూలుగా ఐతే శార్దూలం పులే, మృగరాజు సింహమేనండీ. కానీ మనదేశంలో సింహం ఇప్పుడు ఒక్క గుజరాత్లోని గిర్ ప్రాంతానికి పరిమితమైపోవడంతో కాస్త poetic license వాడి పులిని మకుటం(జూలు)లేని మృగరాజుని చేశాను. ఇంకో యాంగిల్ ఏంటంటే, సాధారణంగా పులీ సింహం వేరువేరు రకాల అడవుల్ని ప్రిఫర్ చేస్తాయి. పొరపాట్న ఒకే అడవిలో వుండాల్సివస్తే, జంగిల్ లా ప్రకారం రెండిట్లో ఏదో ఒకటే మిగుల్తుంది. అంచేత ఏది డామినేట్ చేస్తే అదే మృగరాజు. దేవుళ్ళుకూడా ఈ విషయంలో కాస్త ఫ్లెగ్జిబుల్గానే వున్నారు కదా! దశావతారాల్లో నరసింహుడు, నరశార్దూలుడు వున్నారు.సిహం,శార్దూలం రెండూ కనకదుర్గకి ఫేవరిట్ వెహికిల్సే.
LikeLike
ఆఁయ్, దశావతారాల్లో “నరశార్దూలుడు” ఎవరండీ? 🤔
– తెలుసుకొనగోరే “నరసింహుడు”
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
కౌసల్యా సుప్రజుడు, సర్ 🙏😊
LikeLike
ఓహో, ఆయనా? ఓకే ఓకే. Evolution లో తరవాత వారు 😉, మహానుభావుడు 🙏.
– “నరసింహుడు”
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
అన్నీ మత్తెక్కినవే !
మన్నింపుడు , వీట్ని వొదిలి మాబోంట్ల పయిన్
అన్నా ! వైవీయారూ !
దణ్ణము ! మా బుర్ర తినుట మరియాదగునా ?
LikeLike
మాస్టారు 🙏, మీచేత అక్షింతలు వేయించుకోవాలి కానీ దణ్ణం పెట్టించుకోవడం నాకు తగదండి. అందుచేత అక్షింతలే వేసి రక్షించమని కాంక్షిస్తున్నాను 🙏 😊.
మీ ప్రశ్నకి జవాబు పద్యంతో కాదు గద్యంలోనైనా చెప్పేటంత పట్టు భాష మీద నాకు లేదండి. కానీ ఈ పోస్టు మూడో, నాలుగో పద్యాలకి కారణమై, నాచేత కూడా కాస్త భాషాసేవ చేయించినందుకు ఆనందంగా వుంది.
ఇది కొంచెం సరదాగా, అన్యధా భావించరనే ధైర్యంతోనే, అంటున్నాను –> మత్తకోకిలలు,మత్తేభాల్ని సృష్టించిప్రబంధాల్లో బంధించినవారు కవులే కానీ ఆ “జీవుల”కి తాము ‘మత్తు’లో ఉన్న పద్యాలమని తెలియదు కదా? అందువల్ల మీ సృష్టిని మీరే భరించక తప్పదు మరి😊.
LikeLike
YVR గారు, ఇక్కడ వ్యాఖ్యల క్రింద ఈమధ్య తరచూ కనిపిస్తున్న polldaddy.com ఏమిటండి? దాని మీద నొక్కితే అది వ్రాయబడిన code మినహా మరేమీ చూపించడంలేదు 🙁.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
అది కామెంట్ లైక్స్ ఎన్ని
వచ్చాయో చూడ్డానికి అనుకుంటానండి. నాక్కూడా
కోడ్ తప్ప ఏమీ కనిపించలేదు.
ఈ ఆదివారం ఎలాగైనా తీసెయ్యాలి.
LikeLike