మా మాటలు కానీ చేతలు కానీ ఎవర్నైనా నొప్పించి వుంటే దానికి విచారిస్తున్నాం (😢 భోరు..భోరు…భో😜రు)


పొరపాటుగా నోరు జారినా

లేక

కావాలనే నోరు జారినా

పోనీ

కావాలనే పొరపాటుగా నోరు జారినా  

నాయకులు, అధికార్లు, సెలబ్రిటీల నోళ్ళనుంచి జారే స్టాండర్డ్ స్టాక్ ఆణిముత్యాలు – “మా మాటలు కానీ చేతలు కానీ ఎవరి మనోభావాలనైనా గాయపరిస్తే అందుకు చింతిస్తున్నాం.” 

అర్ధం కాని సంగతేంటంటే –

ఆ మాత్రం టంగ్ కంట్రోల్ లేనివాళ్ళు,

ఆ మాత్రం ఆలోచనలేకుండా మాట్లాడేవాళ్ళు,

ఆవేశ పడి (బుర్ర)  పోయాగ్గానీ ఆలోచన పుట్టనివాళ్ళు  

నలుగురూ నాలుగు అక్షింతలు వేస్తే కానీ నోరుజారిన సంగతి తెలీనంత ఒళ్ళు తెలీనివాళ్ళు — నాయకులు, అధికార్లు, సెలబ్రిటీలుగా ఎలా చెలామణీ అవగలుగుతున్నారా అని. కాదు ఎలా చెలామణీ అవనిస్తున్నారా అని.

పొరపాటు వాళ్ళది కాదు, వాళ్ళని తయారుచేసిన సొసైటీది

నోరుజారేది వాళ్ళు కాదు, సొసైటీ పెంచిపోషిస్తున్న సంస్కృతి నోరుజారినట్టు.

కావాలని పొరపాటు చేసేది వాళ్ళు కాదు వాళ్ళ వృత్తి, వాళ్ళ వ్యాపారం, వృత్తివ్యాపారాలకి పెట్టుబడి అయిపోయిన వాళ్ళ ప్రవృత్తి అదే రాజకీయం (= రాజకీయ వ్యాపారం OR వ్యాపార రాజకీయం)

ఈ మధ్య కాలంలో నోరు జారి సిన్సియర్‌గా క్షమాపణ చెప్పింది దివంగతనటుడు ఓంపురీ ఒక్కరే అనుకుంటా 🙏. ట్రంప్ మేష్టార్ని కూడా ఈ కేటగిరీలో వేసేద్దామా అనిపించింది ఒక్క క్షణం పాటు. కానీ ఆయన మాటలేవీ నోరుజారడం కాదనీ అవి సహజసిద్ధమైన సూక్తిముక్తావళి అని గుర్తొచ్చి ఆయనక్కూడా ఒక 🙏 పెట్టేసి … 

అంతేసంగతులు. బై4నౌ.

teacup lo tufan