లాస్ట్‌వీక్ న్యూస్ పేపర్స్‌లో ఒక వార్తొచ్చింది. వార్తంటే హత్యలు, అక్రమసంబంధాల్లాంటి రెగ్యులర్ వార్తలు కాదు. (ఏం చేస్తాం? వీటిని వార్తలు అనాల్సిన ఖర్మ పట్టింది. న్యూస్ పేపర్ ఆన్లైన్ ఎడిషన్ చూస్తే వార్తలంటే ఇవే అన్నట్టు చూపిస్తున్నారు మరి. టీవీ ఛానెల్స్ ఐతే… నో కామెంట్స్.) ఇంతకీ ఇక్కడ డిస్కస్, ఐ మీన్, – ఛీ..ఛీ.. ఆంగ్లమ్ముక్కల్లేకుండా గట్టిగా ఒక వాక్యం రాయడం గగనమై పోతోంది, అహో! ఆంధ్రభోజా శ్రీకృష్ణదేవరాయా, ఏమి చేతునయా?
ఇంతకీ ఇక్కడ చర్చించబోయే అంశం ఏంటయ్యా అంటే –
Photo courtesy: Youtube
ఈమధ్య ఖగోళ శాస్త్రజ్ఞులకి కుజగ్రహం మీద వేలాది భవనాల్లాంటి నిర్మాణాలు కనిపించాయిట, టెలిస్కోపుల్లో. పై ఫోటో వాటిదే. కుజుడిపై బుద్ధిజీవులున్నారనే సంగతి ఇంకా ఊహక్కూడా అందని పరిస్థితిలో నిర్మాణం అనేమాట వాడడం కరెక్టు కాదు. నిర్మాత ఒకడుంటేనే కదా ఇళ్లయినా, సినిమాలైనా నిర్మాణం అయ్యేది? కుజుడి మీద జీవరాశి ఉండే అవకాశం లేదనుకుంటున్న ఆర్డినరీ మనిషి ఇలాగే అనుకుంటాడు. కానీ యూఎఫ్ఓలు, ఫ్లయింగ్ సాసర్లులాంటివి ఉన్నాయని నమ్మేవాళ్ళు అంత తేలిగ్గా కన్విన్స్ అవ్వరు. వాళ్ళు తెలుగువాళ్ళయితే కన్విన్స్ అవ్వరు అనేబదులు సమాధానపడరు అనేవాణ్ణే కానీ వాళ్ళు తెలుగేతరులు. ఈ దేశంవాళ్ళే కాదు. ఎందుచేతో మనదేశంలో, అందునా తెలుగురాష్ట్రాల్లో యూఎఫ్ఓల్లాంటి మిస్టరీల మీద దృష్టి పెట్టేవాళ్ళు తక్కువే అనుకుంటా.
కొత్తగా రిలీజయ్యే సినిమాలేంటి?
సంక్రాంతికి బాబాయ్-అబ్బాయ్‌ల సినిమాలకి క్లాష్ వస్తోందా?
View original post 691 more words