ముందు🇧🇴జనగణ🇧🇴 ధ్వని, వెంటనే 💥రణగొణధ్వని💣// IAS officer spends Rs.500 on wedding // దేవుడు దిగొచ్చి ఎవర్నైనా పలకరిస్తే అది వార్త… // అమెరికా అధ్యక్షుడు రెండు🐔 సీమకోళ్లను🐓అధికారికంగా క్షమించి…


🌏న్యూస్🌏

The Supreme Court on Wednesday directed that cinema halls across the country must play the national anthem before the screening of a film and people should stand up as a mark of respect. The court also directed that the national flag should be shown on screen when the anthem is played. “People must feel this is my country and this is my motherland,” a bench of justices Dipak Misra and Amitava Roy said while stressing that it is the duty of every citizen of the country to show respect to the national anthem and the flag.

😎వ్యూస్😊

సుప్రీం కోర్టు తీర్పు బ్రహ్మాండం. మూడురంగుల జెండా మళ్ళీ సినిమాతెరల మీద జాతీయగీతానికి నాట్యం చేస్తుంటే దేశభక్తితో ఉప్పొంగనివాళ్ళెవరు? ఉద్వేగంతో గుండెలు నిండనివాళ్ళెవరు? కానీ……కానీ….కానీ..సినిమా చివర జనగణమన వినిపించడం డెబ్భైరెండు/మూడు ప్రాంతాల్లో ఆగిపోయినట్టుంది. ఐతే అప్పటివరకూ 90% సినిమాలకి ప్లాట్లు త్రేతాయుగంనుంచి దిగుమతి అయినవే. విలన్లు, వాంపులు కూడా కొమ్ములు, కోరలు మినహాయించి అన్ని విధాలా రాక్షసరాక్షసీమణుల్లాగే వుండేవారు. అందువల్ల సినిమా చివర ప్రేక్షకులు ప్రశాంతచిత్తంతో జనగణమన వినే ఛాన్సుండేది. తరవాత్తరవాత సినిమా రాక్షసరాక్షసీమణులంతా ధైర్యం చేసి జనసినీజీవనస్రవంతిలో కలిసిపోవడం మొదలుపెట్టారు. ఆ తరవాత….. the less we talk the better, సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సుప్రీం తీర్పు నేపధ్యంలో ఈ కాలపు మాస్‌మసాలా పాకేజ్ మూవీలకెళ్తే పరిస్థితేంటి? ముందు జనగణధ్వని, ఆ వెంటనే  ఐటండాన్సులు, మసాలాడైలాగుల రణగొణధ్వనులు వినాలి; సినిమా కధకి, స్క్రిప్ట్‌కి ‘అవసరం’ కాబట్టి నిజంగా అనవసరమైనా సరే చేసే ఎక్స్‌పోజింగులు, లిప్-లాకులు ఎంజాయ్ చెయ్యాలి; ఫాక్షన్‌లు, యాక్షన్ల పేరిట చూపించే రక్తపాతాన్ని కళ్ళారా చూసి తరించాలి; ధూమ/మద్యపానాలు ఆరోగ్యానికి హానికరం అంటూనే హీరోగారు ఆ పన్లన్నీ హీరాయిగ్గా  చేసేస్తుంటే చూసి బైటికెళ్ళాక ఆయనగార్ని ఇమిటేట్ చెయ్యాలనిపించచ్చు. నేరాలు చేసి చట్టం కళ్ళు కప్పి పెద్దమనుషుల్లా చెలామణీ అయిపోవడం ఎలాగో కొత్త ఐడియాలు వస్తాయి, వాటిని అమలు చేసేవాళ్ళుకూడా వుంటారు. ఒకపక్క జాతీయగీతానికి, జెండాకి గౌరవం మరో పక్క ఇలాంటి సినిమాలు చూసి ఆనందించాల్సిన అవసరం – రెండూ కల్సి ప్రజల “మనోభావాలు” ఎంత నలిగిపోతాయో ఏంటోనని  కోర్ట్లు ఆలోచించాలేమోనని ప్రజలు కాస్త ఆలోచించాలేమోనని……..

ఫైనల్‌గా కొశ్చనేంటంటే, జాతీయగీతం+జెండా కలిగించే స్ఫూర్తికి, మన కాంటెంపరరీ కమర్షియల్ సినిమా పుట్టించే భావోద్వేగాలకి పొసగుతుందా అని. మన జెండాకి సూటయ్యేలా సినిమాలుండాలేమో కదా!?! కాదా??అఖ్ఖర్లేదా???

🌏న్యూస్🌏

Andhra IAS officer spends Rs.500 on her wedding, returns to duty within 48 hours

😎వ్యూస్😊

నాకు తెల్సి చరిత్రలో అతి తక్కువ ఖర్చయ్యింది గుండమ్మకధలో ఎన్టీఆర్-సావిత్రిల పెళ్లికే. రూపాయి-ముప్పావలాతో రిక్షాలో ఊరేగింపుతో సహా శాస్త్రోక్తంగా పెళ్లి చేయించిన ఘనత రమణారెడ్డిది. ఆ తర్వాత, అంటే 1962 (గుండమ్మకధ రిలీజ్) తర్వాత యాభైనాలుగేళ్ళకి, పెళ్ళికి ఐదొందలంటే ఆనాటి రూపాయి ముప్పావలాకి సమానం అనుకోవచ్చేమో. ఐదొందలకోట్లు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్న రోజుల్లో దానికి కోటిరెట్ల తక్కువ ఖర్చుతో పెళ్లి తతంగం పూర్తి చెయ్యడం కుబేరులనుంచీ కుచేలుల వరకూ అందరికీ ఆదర్శప్రాయం.  

🌏న్యూస్🌏

ప్రధానమంత్రి _ _ _ సోదరుడు _ _ _  శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఏఈవో కృష్ణారెడ్డి వారికి స్వాగతం పలికారు. స్వామిఅమ్మవార్లకు _ _ _  ప్రత్యేక పూజలు నిర్వహించారు.

😎వ్యూస్😊

దేవుడు దిగొచ్చి ఎవర్నైనా పలకరిస్తే అది వార్త కానీ ప్రధాని బ్రదరుడైనా, రాష్ట్రపతి తాతగారైనా, చీఫ్‌మినిస్టర్ చెల్లెలైనా ఓ గుడికెళ్లి దేవుడికి దణ్ణం పెట్టుకుంటే అది న్యూస్ ఎలా అవుతుందో మన మీడియాకీ, ఆ దేవుడికీ తప్ప ఎవరికీ అర్ధంకాదు.

🌏న్యూస్🌏

వాషింగ్టన్‌: దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొనే కార్యక్రమం(థాంక్స్‌గివింగ్‌ రిచ్యువల్‌)లో భాగంగా అమెరికా అధ్యక్షుడు ఒబామా గురువారం రెండు సీమకోళ్లను అధికారికంగా క్షమించి విడిచిపెట్టారు. 18 వారాల వయసు, 40 పౌండ్ల బరువున్న ఈ సీమ కోళ్లకు ఐవా స్కూలు పిల్లలు సూచించిన పేర్లను ఒబామా పెట్టారు.

😎వ్యూస్😊

“ఒకపక్క రోజుకి లక్షలాది చొప్పున కోళ్ళని, మేకల్ని, దున్నల్ని… గుటుక్కుమనిపించేస్తూ మనమే ప్రతి రోజు ప్రతి క్షణం వీళ్ళని క్షమించాల్సింది పోయి వాళ్ళు మనకి  క్షమాభిక్ష పెట్టడమేంటో,” అని ఆ కోళ్ళకి తెలిసే/అడిగే ఛాన్సే లేదు. కోళ్ళకేనా క్షమాభిక్ష మాక్కూడా ఆ రాయితీ ఇవ్వచ్చు కదా అని అడిగే ఛాన్సు మేకలకి, దున్నలకి, పందులకీ లేదు. ఆఫ్ కోర్స్, వంకాయలకీ, ఉల్లిపాయలకి, తోటకూరకి, కాఫీపొడికి కూడా లేదు. కానీ మనం వారానికోసారో, ఏకాదశికో ఉపవాసం, శనివారం ఫలహారం, శాకాహారంలాంటివన్నీ పాటించి అమెరికన్ ప్రెసిడెంట్ పెట్టే క్షమాభిక్ష కంటే గొప్ప పని చేస్తున్నాం. అవి మనకి ప్రాణభిక్ష పెడుతుంటే మనం వాటికి క్షమాభిక్ష పెట్టడం ఏంటి అని అమెరికన్లకి అనిపించదో ఏంటో? కనీసం క్షమాభిక్ష అనే బదులు ప్రాణభిక్ష అంటే కొంత నయం.

ఒక మెకానికల్ ఇంజినీర్ 👀 దృష్టిలో👀 బ్లాక్‌మనీ (🚅 A Mech.Engineer’s 🚗 idea of BlackMoney)

🌏…ఇద్దరు ‘మోడర్న్’ దేవుళ్ళకి భక్తితో బిజినెస్ టైకూన్లు, పొలిటికల్ ఐకాన్లు సమర్పించిన…🌏

ఏడుపొస్తున్నా చచ్చినట్టు నవ్వక తప్పదు😂 – నవ్వాగక ఛస్తున్నా నోర్మూసుకు ఏడ్వక తప్పదు😷😉

4 thoughts on “ముందు🇧🇴జనగణ🇧🇴 ధ్వని, వెంటనే 💥రణగొణధ్వని💣// IAS officer spends Rs.500 on wedding // దేవుడు దిగొచ్చి ఎవర్నైనా పలకరిస్తే అది వార్త… // అమెరికా అధ్యక్షుడు రెండు🐔 సీమకోళ్లను🐓అధికారికంగా క్షమించి…”

  1. 😀 సినిమా వాళ్ళని ఎలాగూ మార్చలేం. సినిమాలకనుగుణంగా మన జాతీయగీతం వ్రాసుకోవడం బెటరా 🤔?అపచారం అపచారం, ఏమిటా ఓఘాయిత్యం మాటలు అంటారా 😀?
    ————–
    ఆదర్శ యువతి 👏. (తర్వాత రిసెప్షన్ అంటూ మరీ ఎక్కువ ఆర్భాటం చెయ్యకపోతే మరిన్ని చప్పట్లు)
    ————–
    భలేవారే మీరు, అంతటి ప్రముఖులు దేవుడిని ఏమని ప్రార్ధించారో మనకు తెలిసేది మీడియా వారి పుణ్యమే కదా. మీడియా వారు చేస్తున్న సేవ అర్ధం చేసుకోండి 👌.
    ————–
    ఆ రెండు టర్కీ పక్షులన్నా బతుకుజీవుడా అనుకునుంటాయి పాపం (థాంక్స్ గివింగ్).
    ————–

    Like

    1. 😃😃😃సర్జికల్ స్ట్రైకుల సీజన్ కదా, పన్లో పని చెత్త సినిమాల పైనా ఒక స్ట్రైకు పడేస్తారేమోనని ..

      Like

    2. విన్నకోటవారూ, సినిమాకు అనుగుణంగా మన సంగీతదర్శకుడు వందేమాతరం గీతాన్ని కొమ్ము విరిచి వందె…మాతరం. వందె…మా…. తరం చెసి సాధ్యమైనంతగ చిత్రవధచేసి వదిలితే ఆ వరసనే ఎంతో అపురూపంగా ప్రేమించుకొనే దురవస్థలోనికి మనసినిమాప్రియభరతజాతి జారిపోయిందిగా ఎన్నడో. ఇంక జనగణమన అంటారా, దానికీ‌ ఒక సమయం వస్తుంది. అప్పుడు దానిగతి ఏమి అవుతుందీ‌ అది ఎలా వినబడుతుంది అన్నది ఇప్పుడే చెప్పలేం. కాని జనగణమన అనే‌పాటకు అసలు యమన్ కళ్యాణ్ రాగంలో ఒక మంచి బాణీ ఉండాలీ‌ అని ఎవరన్నా (నాబోటి ముసలాడు) సణిగితే ఒక పిచ్చివాడిని చూసినట్లు మన భారతపౌరులు చూస్తారు.

      వ్యూస్ గారూ, అసలు క్షమించటానికి మనిషి ఎవడండీ? ప్రకృతిని ఇంతగా విధ్వంసంలో ముంచుతున్న వీడిని ఇంకా ఎంతకాలం‌ క్షమించాలీ‌ అని ఆ ప్రకృతి విసుక్కుంటోందని ఈమూర్ఖమానవజాతికి ఎప్పుడు అర్థం ఐ చచ్చేనూ అని?

      Like

      1. అబ్బెబ్బే, మొత్తానికే సరికొత్త గీతాన్ని తయారు చేసుకోవడం …. అని నా కవిహృదయం శ్యామలీయం గారూ. మునుపటి గీతంలో మార్పులు చేసి తిరగరాయాలని నేననలేదు, అటువంటి మాటే అపచారం కదా. నా మునుపటి వ్యాఖ్య పుర్తిగా jk మాత్రమే.

        వందేమాతరం మీద విరుపులు గతంలోనే వచ్చాయిగా …. సినిమాల నుండే అనుకుంటాను సరిగా గుర్తులేదు….. వంద ఏ మాత్రం, మందే మాత్రం ..అంటూ. కాదేదీ వాళ్ళకసాధ్యం.

        Like

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s