ఒక మెకానికల్ ఇంజినీర్ 👀 దృష్టిలో👀 బ్లాక్‌మనీ (🚅 A Mech.Engineer’s 🚗 idea of BlackMoney)


రెండువేల పదహారు, నవంబర్ ఎనిమిది వరకూ నల్లధనం అలియాస్ బ్లాక్ మనీ అంటే ఎలావుంటుందో, అదెలా తయారౌతుందో వగైరాల గురించి పెద్ద ఐడియా వుండేది కాదు. నల్ల కుబేరులు, స్విస్ బాంక్ అకౌంట్ల గురించి వినడం, నోరారా తిట్టుకోవడం, ఎవడు ఎన్ని లక్షలకోట్లు భక్షించాడో మీడియాకధలు వినడం, సీబీఐ సర్కస్ ఫీట్లు చూడ్డం తప్ప సామాన్యుడు అనే టైటిల్‌కి అర్హతవున్న ఏ ఒక్కరికైనా బ్లాక్‌మనీ అనేదో బ్రహ్మపదార్ధం, అంతరిక్షంలో వుండే కృష్ణబిలం (బ్లాక్‌హోల్). కానీ మోడీగారి పుణ్యమా అని అక్షరమ్ముక్క రాని వారిక్కూడా  ఆర్ధికశాస్త్రపరిజ్ఞానం అమాంతంగా వచ్చి పడిపోయింది. కదా!?!

అంతేనా?  బ్లాక్‌మనీకి కొత్తర్ధాలు, దానిపై కొత్తథియరీలు కూడా తయారౌతున్నాయ్. ఫరెగ్జాంపుల్, ఒక మెకానికల్ ఇంజనీర్‌‌ని నల్లధనం గురించి నీకేం తెలుసు చెప్పరా అంటే – వాడి పనంతా ఎనర్జీ (శక్తి), దాన్ని ఉత్పత్తి చెయ్యడం, దాని చేత పని చేయించుకోవడం.. ఇవే కనక – ఇలా చెప్తాడు – కాదు చెప్పాడు (ఎందుకంటే ఇది రాసింది వాడే కాబట్టి). ఇంక చదువుకోండి. అర్ధం కాదనే భయం అక్కర్లేదు, బ్లాక్‌మనీ అర్ధమైపోయినవాళ్లకి థర్మోడైనమిక్స్ (ఉష్ణగతికశాస్త్రం) అనే సబ్జెక్టు నథింగ్. So, go ahead and read but in a lighter vein. Don’t forget to give rating or a like or a comment, especially if you are a mechanical engineer 🙂 –

థర్మోడైనమిక్స్‌లో బోధించే ఒకానొక సూత్రం శక్తి నిత్యత్వ సూత్రం (Law of conservation of Energy) – Energy can neither be created nor destroyed. It can only change from one form to another (శక్తిని కొత్తగా సృష్టించడం, నాశనం చెయ్యడం అసాధ్యం. కేవలం ఒక రూపం నుంచి మరో రూపంలోకి మార్చడం మాత్రమే సాధ్యం.)

నల్లధనం కూడా అంతే –

Black money can neither be printed nor destroyed. It changes from WHITE MONEY to UN-ACCOUNTED MONEY to BLACK MONEY to WHITE MONEY to …… (the cycle repeats) అనగా, నల్లధనాన్ని ఎవరూ కొత్తగా ప్రింటు చెయ్యరు, నాశనం అస్సలే చెయ్యరు. అది మొదట తెల్లడబ్బుగాను, తరువాత అన్‌ఎక్కౌంటెడ్ మనీగాను ఆపైన నల్లధనంగాను, తిరిగి తెల్లగాను…అలా మార్పులు చెందుచుండును.

ఇప్పుడు మరో థర్మోడైనమిక్ లా –

Energy (Heat) cannot flow from a point at a lower temperature to a point at a higher temperature without the aid of an external agency.(ఏదో ఒక సాధనం లేక యంత్రపు సహాయం లేకుండా శక్తి (వేడి) తనంతట తానుగా తక్కువ ఉష్ణోగ్రత వున్న వస్తువు నుంచి ఎక్కువ ఉష్ణోగ్రత వున్న వస్తువుకి ప్రవహించలేదు.)

అదే నల్లడబ్బు విషయంలో అయితే –

Black money will never(be) convert(ed) into White money unless it is hit by a surgical strike called demonetization.(బ్లాక్‌మనీ తనంతట తానుగా వైట్‌మనీగా చచ్చినా మారదు, దాన్ని పోగేసుకున్న నల్లకుబేరుడు చచ్చినా సరే!, నోట్లరద్దు అనే ఆయుధం ప్రయోగిస్తే తప్ప. ఆయుధప్రయోగం కూడా పంజెయ్యదని ‘గిట్టనివాళ్ళు’ అంటూవుంటారు, అది వేరే విషయం. )

ఇంక మూడో సూత్రం, (ఈ కాన్సెప్ట్ చాలా కష్టం (నాకు), అందువల్ల ఎక్స్‌ప్లెయిన్ చేసే పనిపెట్టుకోలేదు), ఎంట్రోపీ గురించి చెప్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఎన్ట్రోపీ అనేది అన్‌ఎక్కౌంటబుల్ ఎనర్జీ అన్నమాట. కాంప్లెక్స్‌గా, క్లిష్టంగా చెప్పాలంటే –

the Universe evolves such that its total entropy always stays the same or increases (ఈ ఎన్ట్రోపీ అనేది ఉంటే స్థిరంగా ఉంటుంది లేకపోతే అలా పెరుగుతూనే వుంటుంది, శాశ్వతంగా. మానవనిర్మిత యంత్రాలలో జీరో ఎన్ట్రోపీ అసాధ్యం.)

ఎన్ట్రోపీలాంటిదే బ్లాక్‌మనీ కూడా. అంచేత –

డీమానిటైజేషన్‌ కంటే ముందుగా బంగారంగానో, స్థిరాస్తులుగానో, స్విస్‌బాంకుల్లో మూలిగే యూఎస్ డాలర్లుగానో మారిపోయిన నల్లడబ్బు తెల్లగా మారే ఛాన్సే లేదు. తెల్లగా కనిపించినా నిజంలో అది నల్లడబ్బే. ఒక్కొక్కప్పుడు బ్లాక్‌మనీ పెరుగుదల మందగిస్తుందేమోగానీ, ఆగదు. ఏదో రకంగా పెరుగుతానే వుంటది…..

మనిషి బుర్రలో వున్న నల్లబుద్ధి తెల్లబడితే తప్ప.  Bye4Now 👋