🌏న్యూస్🌏
– అని నేనట్లేదు. ఆర్థికవేత్త, బెంగళూరు ఐఐఎం రిటైర్డ్ ప్రొఫెసర్ భరత్ ఝన్ఝన్వాలా అంటున్నారు, ఆంధ్రజ్యోతిలో. 😎వ్యూస్😊 ఝన్ఝన్వాలాగారు సమస్యని ఎలా మానేజ్ చెయ్యాలో చెప్పారు కానీ, దాని మూలాలలోకి వెళ్లినట్టు లేదు. రెండు రకాల సర్జికల్ స్ట్రైకులు రెండు రకాల తీవ్రవాదుల మీద ఒక్క నెల రోజుల వ్యవధిలో జరిగి మాంఛి థ్రిల్లింగ్గా వున్న సమయమే సమస్య మూలాలెక్కడ వున్నాయో వేడికి వాటి మీదా సర్జికల్ దాడి చెయ్యడానికీ సరైన తరుణం. అంత తేలికకాదు కానీ పడక్కుర్చీలో కూచుని ఆలోచించడానికేముంది? చాలా ఈజీ. ఆలోచిద్దాం. ఇలా – ఏ దేశపు ప్రజలకైనా తీవ్రవాదం, ఉగ్రవాదం అనగానే ముసుగులేసుకున్న ముష్కరుల సూయిసైడ్ ఎటాక్స్, 11th సెప్టెంబర్ 2001 నాటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎటాక్ లేకపోతే తమిళ పులులు, ఐరిష్ గెరిల్లాలు వగైరాలే ముందుగా గుర్తుకొస్తాయి. విదేశీహస్తాల కుట్రలే ఎక్కువగా కనిపిస్తాయి. చాపకింద నీరులా వచ్చి ముంచేసే తీవ్రదురాశావాదాలు ఆర్ధిక రాజకీయ అవినీతిభాగోతాలు. మొదటిరకపు తీవ్రవాదం ఎయిడ్స్, జికా వైరస్ల్లాగా బయట నుంచి దాడి చేసేవైతే, రెండోరకంవి శరీరాన్ని లోపల్నుంచి తినేసే కేన్సర్స్. నిజానికి ఎకనామిక్ & పొలిటికల్ కరప్షన్ – తీవ్రదురాశావాదం – కొన్ని రకాల తీవ్రవాదాలు ప్రబలడానికి కారణం. వాటికి విరుగుడు కూడా రెండురకాలుగా వుండక తప్పదు. తుపాకులకి తుపాకులతో సమాధానం చెప్తూనే తుపాకుల యుద్ధం అవసరంలేని పరిస్థితులు సృష్టించాలి. పెద్దనోట్ల రద్దులాంటి చర్యలతోపాటూ అవినీతికి మనసొప్పని మనస్తత్వాన్ని మనిషికి అలవరచాలి. హింసని, అనైతికతని అంగీకరించలేని మనసొక్కటే అన్ని రకాల దురాశలకి, దుష్కృత్యాలకీ విరుగుడు. అలాంటి మనసుల్ని తయారుచేసే సర్జికల్ స్ట్రైక్స్ కావాలి. వేషభాష లెరిగి కాషాయవస్త్రముల్|| గట్టగానె ముక్తి గలుగబోదు తలలు బోడులైన తలపులు బోడులా ||విశ్వదాభిరామ! వినుర వేమ! – అని వేమనగారు ఊరికే అన్నాడా? తీవ్రవాద శిబిరాలపైనా, నల్లధనపు భోషాణంపెట్టెలపైనా చేసే సర్జికల్ స్ట్రైక్స్ గుండు కొట్టించుకుని, కాషాయం కట్టుకునే వస్త్ర సన్యాసానికి సమానం. తలపులకీ కాషాయం పట్టించి, వాటిలో నిండివుండే అహంకారాన్ని గొరిగించే మానసిక సన్యాసంలేనిదే తీవ్రవాదం, తీవ్రదురాశావాదం తగ్గుముఖం పట్టవు. 🙈 🙉 🙊 |
🌏న్యూస్🌏
😎వ్యూస్😊 ఎంత కరుడుగట్టినా కరిగించగల మార్దవం, కరుణ, ప్రేమ ఒక్క తల్లికి తప్ప దేనికి సాధ్యం? ప్రపంచం మొత్తం గ్రహించి గౌరవించాల్సిన మోస్ట్ ఎఫెక్టివ్ యాంటీ టెర్రరిస్ట్ వెపన్ – కులం, మతం, సంస్కృతి, ప్రాంతంతో పనిలేని తల్లిప్రేమ. ఆ ప్రేమకి పిల్లలు నోచుకోకుండా చేసే ఏ పరిణామమైనా – అది అభివృద్ది కావచ్చు, ఆధునికత కావచ్చు, అజ్ఞానం కావచ్చు, అసహనం కావచ్చు – అన్నీ తీవ్రవాద మనస్తత్వాన్ని పెంచి పోషించేవే. కొన్ని రకాల తీవ్రవాదం టెర్రరిస్టుల్ని తయారు చేస్తే మరికొన్ని రకాలు యూనివర్శిటీ షూటింగులకి, అత్యాచారాలకి, ఆర్ధిక నేరాలకి కారణం అవుతాయి. రూపంలోనే తేడా. మూలం ఒకటే. మనుషులకి విలువలతో కూడిన జీవితం అలవాటు కాకపోవడమే. ప్రపంచం అంతా కలిసి తల్లి ప్రేమ ఒక్కదాన్ని రక్షించుకుంటే, రాజాజీ చెప్పినట్టుగా తల్లికి ఇవ్వాల్సిన స్థానం ఇస్తే – ఇస్తోందా లేదా అనేది డిస్కస్ చెయ్యాలా? –భూమ్మీద చాలా సమస్యలు ఉండవేమో. మొత్తమ్మీద ఒక్క ఉగ్రవాదిలోనైనా అతని భావజాలం తన తల్లి గొంతుకి తలవంచిందంటే ఎంత హాయిగా, మలయమారుతంలా అనిపిస్తోందో!!! 🌿 💖 🌾 |